సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ రచన సమావేశం మూడు గంటల పాటు సుదీర్ఘగా సాగింది. కాగా భారీ చేరికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ సంతరించుకుంది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలతో పాటు ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ తదితరలు ఈ ఎన్నికల వ్యూహ భేటీకి హాజరయ్యారు.
భేటీ అనంతరం టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల కార్యచరణ మొదలైందని, రాబోయే 120 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు. ‘‘మేనిఫెస్టో రూపకల్పన త్వరగా పూర్తి చేయాలని చర్చ జరిపాం. అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. ఎన్నికల సన్నాహక సమావేశం సుదీర్ఘంగా చర్చ జరిగింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించాం. అక్కడ అనుసరించిన మౌలిక అంశాలు ఇక్కడ కూడా అమలు చేయాలని డిసైడ్ అయింది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, అందరం ఐక్యంగా ఉండాలని అధిష్టానం కోరిందని, అభ్యర్థులను త్వరగా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్న పదవులు భర్తీ చేయాలి. కర్ణాటక తరహాలోనే వ్యూహం అమలు చేయాలని నిర్ణయం’’ జరిగిందని ఆయన పేర్కొన్నారు.
చదవండి: తెలంగాణలో మతతత్వం పెరుగుతోంది: అసదుద్దీన్ ఓవైసీ
మాజీ ఎంపీ మధు యాష్కీ మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉండదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారన్నారు. జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమి లో బీఆర్‌ఎస్‌కు చోటు ఉండబోదు. తెలంగాణలో ప్రజలు త్యాగం చేస్తే, కేసీఆర్ ఫ్యామిలీ భోగం అనుభవిస్తుందని మధు యాషి అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మానిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. అందరి సూచనలను రాహుల్ గాంధీ విన్నారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యూహాల గురించి చర్చించామన్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని విమర్శించారు.
చదవండి: ఈటల భార్య జమున సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment