metting
-
కమలంలో కలకలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. మరో రెండు వారాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడొవచ్చనే అంచనాల నేపథ్యంలో...పార్టీలో ఏర్పడుతున్న పరిస్థితులు కమలనాథుల్లో కలవరం పుట్టిస్తున్నాయి. ఇటీవల జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి నివాసంలో పలువురు అసంతృప్త నేతలు భేటీ అయ్యారు. ఇతర జాతీయ కార్యవర్గసభ్యులు విజయశాంతి, గరికపాటి మోహన్‌రావుతో పాటు మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చాడ సురేష్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావు, ఎం.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్న ఈ సమావేశం పార్టీలో కలకలం సృష్టించింది. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న ఈ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి గుడ్‌బై చెప్పే అవకాశం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఉన్న సీనియర్ నేత, నగర పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ బి.వెంకటరెడ్డి, ఆయన భార్య బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్ పద్మలు.. తాము పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసినా, తగిన గుర్తింపు లేదని పేర్కొంటూ బీజేపీకి రాజీనామా చేశారు. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నందున తమకు అంబర్‌పేట అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరితే నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల భేటీ అయిన నేతల అసంతృప్తికి కారణాలు తెలుసుకుని వారిని బుజ్జగించే బాధ్యతను రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్‌కు నాయకత్వం అప్పగించినట్టు పార్టీవర్గాల సమాచారం. మాకేదీ గుర్తింపు..? రాష్ట్ర పార్టీలో ముఖ్య నేతలుగా, జాతీయ కార్యవర్గ సభ్యులు, సీనియర్లుగా ఉన్నా తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదనేది అసంతృప్త నేతల ప్రధాన ఫిర్యాదుగా ఉన్నట్టు సమాచారం. అలాగే పార్టీ తీరు, నాయకత్వం వ్యవహారశైలి పైనా వారు ఆగ్రహంతో ఉన్నారని, అధిష్టానం వైఖరి, ముఖ్యంగా పార్టీ అగ్రనేత అమిత్ షా అనుసరిస్తున్న తీరు సైతం సమావేశంలో చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా.. కేవలం రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్లతోనే అమిత్ షా సమావేశం కావడం, తమను దూరం పెట్టడంపై వీరంతా కినుక వహించినట్టు తెలుస్తోంది. మోదీ, అమిత్‌షా, నడ్డాలు రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు సైతం ఆయనకే గుర్తింపునివ్వడం, వేదికపైనా తమ పక్కన అవకాశం కలి్పంచడం వంటి వాటిపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈటల తీరుపై అసహనం! గతంలో పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌గా, ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల వ్యవహరిస్తున్న తీరుపై పలువురు నేతలు అసహనంతో ఉన్నట్టు చెబుతున్నారు. తమకు తెలియకుండా, కనీసం సంప్రదించకుండా తమ ప్రాబల్య ప్రాంతాలు, నియోజకవర్గాల్లో చేరికలను ఈటల ప్రోత్సహించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమను సంప్రదించకుండా సంగారెడ్డి, ములుగు జిల్లాల్లో కొందరిని చేర్చుకోవడంపై వారు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. వారు నిత్య అసంతృప్త వాదులే..! మరోవైపు అసంతృప్త నేతల తీరుపై ఇతర నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీరు నిత్య అసంతృప్తులంటూ మండిపడుతున్నారు. తాము అనుకున్న స్థాయిలో సమన్వయంతో పని చేయడం లేదని, ఇలాగైతే తామే ఢిల్లీ నుంచి ఎన్నికల కార్యాచరణను అమలు చేయాల్సి ఉంటుందంటూ క్లాస్ తీసుకునేందుకే.. కిషన్‌రెడ్డి, సంజయ్, ఈటలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారని వారు వివరిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను కూడా అమిత్‌షా పిలవలేదంటూ వారు గుర్తు చేస్తున్నారు. అధినేతల తీరుతో తప్పుడు సంకేతాలు! కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని, ఇది కేసీఆర్ సర్కార్‌కు, బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందంటూ విమర్శలు గుప్పించిన అమిత్ షా, నడ్డాలు.. ఇదిగో విచారణ, అదిగో విచారణ అంటూ తాత్సారం చేయడమే తప్ప ఎలాంటి చర్య తీసుకోకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇంకా అరెస్టు చేయకపోవడం వంటివి ప్రజల్లో తప్పుడు సంకేతాలకు కారణమౌతున్నాయని అసంతృప్త నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. కీలక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని జరుగుతున్న ప్రచారాన్ని ఈ కారణంగా గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నామని వారు పేర్కొంటున్నట్లు సమాచారం. -
జీ20 నిర్వహణకు రూ.4,100 కోట్లా
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర భేటీని కేంద్ర ప్రభుత్వం విజయవతంగా నిర్వహించింది. అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచదేశాలు భారత్‌పై ప్రశంసలు కురిపించాయి. ప్రపంచ స్థాయి నేతగా ప్రధాని మోదీ మరోమారు తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇదే సమయంలో, జీ20 భేటీ కోసం బడ్జెట్ కేటాయింపులకు ఏకంగా 300 శాతం ఎక్కువగా రూ.4,100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయడంపై కాంగ్రెస్, టీఎంసీ వంటి ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇంత డబ్బు ఎక్కడికి పోయింది? మోదీ వ్యక్తిగత ప్రచారం కోసమే ప్రభుత్వం ఇన్ని కోట్లను ఖర్చుచేసింది. ఈ సొమ్మును బీజేపీ ఎందుకు చెల్లించకూడదు? అని పేర్కొన్నాయి. జీ20 భేటీ నిర్వహణ ఖర్చుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఈ నెల 4న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కొన్ని వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఉంచారు. జీ20 సదస్సు జరిగిన ప్రాంతంలో అభివృద్ధి పనులకు రూ.4,110.75 కోట్లు ఖర్చయినట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా రూ.3,600 కోట్లను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీవో) పేరుతో ఖర్చయ్యాయి. మొత్తం ఖర్చులో ఇది 88 శాతం. ప్రగతి మైదాన్‌లోని ఐటీపీవో సముదాయం నిర్మాణానికైన వాస్తవ వ్యయం రూ.3,600 కోట్లు. దీనికే జీ20 శిఖరాగ్రం సందర్భంగా భారత్ మండపం అనే పేరు పెట్టారు. ఇది శాశ్వత నిర్మాణం, జీ20 బడ్జెట్‌తో దీనికి సంబంధం లేదు. 2017లో ఈ భవనం నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులు రూ.2,254 కోట్లు కాగా, రహదారులు, టన్నెళ్ల నిర్మాణానికి మరో వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా.ఈ రెండింటిని కలుపుకుంటే భారత్ మండపం అభివృద్ధి వ్యయం రూ.3,200 కోట్లు దాటింది. రహదారులు, టన్నెళ్లు పోను భారత్ మండపం కాంప్లెక్స్ అభివృద్ధికి రూ.2,700 కోట్లు వెచ్చించినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) జూలై 26న ప్రకటించింది. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటూ జీ20 నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.4,100 కోట్లు దుబారా ఖర్చు చేసిందంటూ ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఈ విమర్శలపై చార్టెర్డ్ అకౌంటెంట్ గోపాల్ కేడియా ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ శాశ్వత మౌలిక వసతుల కల్పనకైన ఖర్చును జీ20 నిర్వహణ వ్యయంతో కలిపి చెప్పడం సరికాదన్నారు. ఈ నిర్మాణాలు భవిష్యత్తులో జరిగే మరెన్నో కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు వీలుందన్నారు. జీ20 షెర్పా అమితాబ్ కాంత్ ప్రతిపక్షాల విమర్శలకు స్పందిస్తూ.. బడ్జెట్లో కేటాయించిన రూ.990 కోట్ల కంటే చాలా తక్కువగా జీ20 శిఖరాగ్రానికి ఖర్చు చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందన్నారు. -
పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్.. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..
హస్తినలో జనసేనాని పవన్ టూర్ తుస్ మందా.. పొత్తులపై ముందడుగు వేయాలనుకున్న పవన్‌కి ఆశాభంగమే ఎదురైందా.. ఎన్డీఏ సమావేశంలో అసలు రాష్ట్ర రాజకీయాలే చర్చకి రాకపోవడం.. మోదీ, అమిత్ షా లాంటి అగ్రనేతలని కలిసే అవకాశం రాకపోవడంతో పవన్ నిరాశతో తిరుగుముఖం పట్టారా.. ఇపుడు పవన్ దారెటు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనపై ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి నిరాశే ఎదురైంది. బీజేపీతో కలవడానికి వేసిన ఎత్తుగడ ఫలించలేదు. ఇక టీడీపీని బీజేపీకి దగ్గర చేసేందుకు ఎన్డీఏ సమావేశాన్ని ఉపయోగించుకోవాలన్న పవన్ ఆశలు కూడా నెరవేరలేదు.. ఫలితంగా పవన్ ఢిల్లీ టూర్ మొత్తానికి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాని కలవటం.. ఆ కొద్ది రోజులకి ఎన్డీఏ సమావేశం ప్రకటన రావడంపై ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చే సాగింది. ఒకానొక దశలో ఎన్డీఏ సమావేశానికి బీజేపీ నుంచి టీడీపీకి ఆహ్వానమందిందనే లీకులని తెలుగుదేశం పార్టీ మీడియాకి అందించింది. ఒకట్రెండు పచ్చపత్రికలు అడుగు ముందుకు వేసి ఎన్డీఏ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందిందంటూ ఊదరగొట్టాయి. అసలు టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కానప్పుడు ఎలా పిలుస్తామని టీడీపీకి ఆహ్వానం లేదని ఆ తర్చాత బీజేపీ నేతలు కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టం చేశారు.. దీంతో కంగుతిన్న టీడీపీ నేతలు దత్తపుత్రుడిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక గత దశాబ్దకాలంలో ఏనాడూ ఎన్డీఏ భాగస్వామ్య పక్ష సమావేశానికి పిలవని బీజేపీ తొలిసారి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి ఆహ్వానం పంపారు. ఇంకేం.. తమకి ఆహ్వానం అందకపోయినా తమ దత్తపుత్రుడికి ఆహ్వానం అందిందని టీడీపీ నేతలు సంకలు గుద్దుకున్నారు.. ఎలాగైనా పవన్ ఢిల్లీ టూర్లో పొత్తుల ప్రస్తావన వస్తుందని కూడా ఆశలు పెట్టుకున్నారు.. మరో వైపు ఎలాగైనా ఢిల్లీ టూర్‌ని తమపొత్తులకి అనుకూలంగా మార్చుకోవాలని పవన్ భావించారు.. తీరా చూస్తే అంతా తుస్ మంది. ఎన్డీఎ సమావేశంలో ఏపీ రాజకీయాలపై చర్చకి వస్తాయని భావించిన పవన్ కళ్యాణకి ఆశాభంగమే ఎదురైంది. ఏపీలో వైఎస్సార్సీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్లాలని సమావేశంలో చెప్పాలనుకున్న పవన్‌కి ఆ అవకాశమే రాలేదు.. దేశ రాజకీయాలపైనే చర్చ జరగడంతో పవన్ ఆశలపై నీళ్లు జల్లినట్లైంది...ఇక టీడీపీని ఎలాగైనా బీజేపీతో కలపాలని పవన్ ఢిల్లీలో పిల్లి మొగ్గలు వేసినా ఫలితం దక్కలేదు.. ఇక ఎన్డిఏ సమావేశం తర్వాతైనా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా లాంటి అగ్రనేతలతో భేటీ ఉంటుందనుకున్నా అదీ జరగలేదు...కానీ ఈ రోజు ఉదయం ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి మురళీధరన్ ఇంటికి వెళ్లి కలిసే అవకాశం మాత్రమే దక్కింది. ఇక ఇతర బీజేపీ అగ్రనేతలతోనైనా భేటికి అవకాశం దక్కుతుందేమో అనుకున్నప్పటికీ అదీ నెరవేరలేదు. ఎన్డిఏ భేటీకి ముందు.. తర్వాత కూడా పవన్ మీడియాతో మాట్లాడి తన మనసులో మాట మరోసారి బయటపెట్టారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్తాయని చెప్పడం ద్వారా బీజేపీ నాయకత్వానికి తన ఆలోచనని మరోసారి స్పష్టం చేసినట్లైంది.. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ అజ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. సమావేశంలో దేశ రాజకీయాలు గురించి తప్పితే ఎక్కడా రాష్డ్ర రాజకీయాల గురింవి ప్రస్తావనే రాలేదని స్వయంగా పవన్ కళ్యాణే మీడియాకి తేల్చి చెప్పేశారు. అదే చంద్రబాబు లాంటి నేత అయితే రెండు, మూడు రోజుల పాటు హైడ్రామానే నడిపించేవారని.. పవన్ కల్యాణ్‌కి రాజకీయ పరిపక్వత లేకే ఈ విధంగా మాట్లాడారని జనసేన నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.. మరో వైపు పవన్ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం పొత్తులపై ఎక్కడా స్పందించలేదు.. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్తాయన్న పవన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు స్పందించారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం ద్వారా తమ చేతులలో ఏమీ ఉండదని చెప్పకనే చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూరు అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. అన్నట్లుగా జరిగింది. -వినాయక్, ఛీఫ్ రిపోర్టర్, సాక్షి టివి, విజయవాడ -
టీ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం.. హైకమాండ్ ఏం చెప్పింది?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ రచన సమావేశం మూడు గంటల పాటు సుదీర్ఘగా సాగింది. కాగా భారీ చేరికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ సంతరించుకుంది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలతో పాటు ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ తదితరలు ఈ ఎన్నికల వ్యూహ భేటీకి హాజరయ్యారు. భేటీ అనంతరం టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల కార్యచరణ మొదలైందని, రాబోయే 120 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు. ‘‘మేనిఫెస్టో రూపకల్పన త్వరగా పూర్తి చేయాలని చర్చ జరిపాం. అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. ఎన్నికల సన్నాహక సమావేశం సుదీర్ఘంగా చర్చ జరిగింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించాం. అక్కడ అనుసరించిన మౌలిక అంశాలు ఇక్కడ కూడా అమలు చేయాలని డిసైడ్ అయింది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, అందరం ఐక్యంగా ఉండాలని అధిష్టానం కోరిందని, అభ్యర్థులను త్వరగా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్న పదవులు భర్తీ చేయాలి. కర్ణాటక తరహాలోనే వ్యూహం అమలు చేయాలని నిర్ణయం’’ జరిగిందని ఆయన పేర్కొన్నారు. చదవండి: తెలంగాణలో మతతత్వం పెరుగుతోంది: అసదుద్దీన్ ఓవైసీ మాజీ ఎంపీ మధు యాష్కీ మాట్లాడుతూ, బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు ఉండదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారన్నారు. జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమి లో బీఆర్ఎస్కు చోటు ఉండబోదు. తెలంగాణలో ప్రజలు త్యాగం చేస్తే, కేసీఆర్ ఫ్యామిలీ భోగం అనుభవిస్తుందని మధు యాషి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మానిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. అందరి సూచనలను రాహుల్ గాంధీ విన్నారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యూహాల గురించి చర్చించామన్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని విమర్శించారు. చదవండి: ఈటల భార్య జమున సంచలన ఆరోపణలు -
చంద్రబాబు అందుకే మాట్లాడకుండా వెళ్లిపోయారా?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసిన తర్వాత మీడియాతో ఎందుకు మాట్లాడలేదు!చంద్రబాబు ఎప్పుడైనా ఇలా మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారా?. తదుపరి పార్టీ నేతలతో పొత్తుల గురించి మాట్లాడవద్దని చంద్రబాబు అన్నారంటే ఏమిటి దాని అర్దం? పని జరగలేదనా?. అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు భేటీ అవడం సహజంగానే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. గత నాలుగేళ్లుగా బీజేపీ పెద్దలను కలవాలన్న ప్రయత్నం ఇప్పటికి సఫలం అయినందుకు చంద్రబాబు టీమ్‌లో ఆనందం తాండవించి ఉండవచ్చు. కానీ, అది తాత్కాలికమే అన్న వార్తలు వస్తున్నాయి. అవి నిజమే అయితే టీడీపీ రెండు విధాల చెడినట్లు అనుకోవచ్చు. ✍ తిట్టిన వారు.. ఇప్పుడు తెగ పొగిడేస్తున్నారు.. ప్రధాని నరేంద్ర మోదీని, హోం మంత్రి అమిత్ షాను బండబూతులు తిట్టిన టీడీపీ వారు, ఇప్పుడు తెగ పొగిడేస్తున్నారు. చంద్రబాబుకు ఆత్మగౌరవం అన్నది సమస్య కాదు. అవసరమైతే అధికారం వస్తుందనుకుంటే ఆయన ఎంతకైనా దిగజారతారన్న విమర్శలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మాట మార్చేయగలరు. కాని ఇప్పుడు పరీక్ష బీజేపీ వారికే. మోదీకి 2019లో చంద్రబాబు నల్లబెలూన్లు చూపి నిరసన చెప్పారు. కనీసం విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం చెప్పలేదు. మోదీని దేశద్రోహిగా, దేశాన్ని నాశనం చేసిన వ్యక్తిగా చంద్రబాబు ప్రచారం చేసి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో రాజకీయ స్నేహం చేశారు. అయినా తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం దక్కకపోవడంతో వారిని గాలికి వదలివేశారు. ✍ అది నిజమే అయితే.. మళ్లీ మోదీ, అమిత్ షాల వైపు చూడడం ఆరంభించారు. చకోరపక్షులు మాదిరి ఎదురుచూస్తూ ఉన్నారు. ఎలాగైతేనేం అమిత్ షా అప్పాయింట్ మెంట్ దొరికింది. దాంతో ఎగిరి గంతేసినంత పనిచేశారు. బీజేపీ తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ మధ్యవర్తిత్వంతో ఈ భేటీ జరిగిందని చెబుతున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు బీజేపీకి పనిచేస్తాయని చెప్పడానికి వెళ్లారని కధనాలు వచ్చాయి. అది నిజమే అయితే బిజెపి తన గోయి తాను తవ్వుకున్నట్లే అవ్వవచ్చు. ఎందుకంటే గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తీరును పరిశీలిస్తే , టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. ✍ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా? అంతకుముందు ఎన్నికలలో 21 సీట్లు వస్తే , 2018లో అవి 19 కి పడిపోయాయి. అంతేకాక చంద్రబాబుతో కలిసి పరువు పోగొట్టుకుంది. తదుపరి చంద్రబాబు యధాప్రకారం కాంగ్రెస్ ను నట్టేట వదలివేశారు.ఎపి ఎన్నికలలో కాంగ్రెస్ ఊసే ఎత్తలేదు. బిజెపి ఇన్ చార్జీ సునీల్ ధియోధర్ అన్నట్లు కాంగ్రెస్ తో పొత్తును తెగతెంపులు చేసుకున్నామని చంద్రబాబు ఇంతవరకు ప్రకటించలేదు. అయినా బిజెపి పెద్దలు టిడిపితో పొత్తు పెట్టుకుంటారా? దానివల్ల ప్రయోజనం ఉంటుందా? అన్నది చర్చగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ డిల్లీలో మోడీని, అమిత్ షా ను కలిస్తే చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు కేసుల గురించి వెళ్లారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. ఆయనకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి,టివి 5 వంటివైతే ఆ గదులలో నక్కి కూర్చుని సమాచారం సేకరించిన చందంగా ఊహాగానాలు ఇచ్చేవి. కాని చంద్రబాబు కలిస్తే మాత్రం బిజెపి స్నేహ హస్తం అంటూ అందంగా చిత్రించారు. చదవండి: బాబు ముంచేశాడు.. ‘కోడెల’ మరణం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా? ✍ అలా ఎందుకు రాయలేదు? చంద్రబాబు పిఎస్ వద్ద పట్టుబడ్డ 2 వేల కోట్ల ఐటి స్కామ్ ముందుకు వెళ్లకుండా జాగ్రత్తపడి ఉండవచ్చని రాయలేదు. ఎపి ప్రభుత్వం అమ రావతి భూముల విషయంలోను, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లోను చంద్రబాబుపై కేసులు పెట్టినందున, వాటిపై తదుపరి చర్య లేకుండా ఉండడానికి అమిత్ షాను కాకాపట్టడానికి వెళ్లారని రాయలేదు. ఈనాడు అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఆర్దిక అవకతవకల కేసులో సాయం చేయడానికి చంద్రబాబు వెళ్లి ఉండవచ్చని ఈ పత్రికలు రాయలేదు. చంద్రబాబు కోసమే అమిత్ షా ఎదురు చూశారన్నంత చందంగా కధనాలు ఇచ్చాయి. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తున్న తీరుపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారని కొన్ని మీడియాలలో వార్తలు వచ్చాయి. అదన్నమాట. ఏపీపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ. ఇక తెలంగాణలో ఎన్నికల కోసం చంద్రబాబుతో మాట్లాడి ఉంటారా?. అంటే ఏమైనా కావచ్చు. కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీకి దక్షిణాదిలో ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒకవేళ టీడీపీ మద్దతు ఇస్తే కొంత ఉపయోగం ఉంటుందేమోనని బిజెపి నేతలు కొంతమంది ఎవరైనా భావించారేమో తెలియదు. కాని తెలంగాణలో టిడిపి ఇప్పటికే దాదాపు అడుగంటింది. ఏదో నామమాత్రంగా నడుపుతున్నారు. ✍ నమ్మించే యత్నం.. ఇలాంటి బేరసారాలు చేయడానికి వీలుగా కాసాని జ్ఞానేశ్వర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారీ, చిన్న రాజకీయ వేత్తను అధ్యక్షుడుగా పెట్టుకుని కథ నడుపుతున్నారు. టీడీపీతో పాటు జనసేన కూడా కలిస్తే తెలంగాణలో కొంత ప్రభావం ఉండవచ్చని చంద్రబాబు నమ్మించే యత్నంచేసి ఉండవచ్చు. అయినా సర్వేలు చేయించుకోకుండా అమిత్ షా దీనిపై ముందుకు వెళతారా? బీజేపీలో తెలుగుదేశం వ్యక్తులను ప్రవేశపెట్టిన చంద్రబాబు వారి ద్వారా నాలుగేళ్లపాటు సాగించిన రాయబారాలకు బీజేపీ పెద్దలు సంప్రదింపులకు సిద్దం అయి ఉండాలి. తెలంగాణలో మద్దతు ఇస్తే ఏపీలో జగన్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఉండాలని, ఆ ప్రభుత్వానికి సహకరించరాదని చంద్రబాబు కండిషన్ పెట్టే అవకాశం ఉంటుంది. ✍ చంద్రబాబుకు మైండ్ బ్లాక్.. కేంద్రం ఇటీవల పదివేల కోట్ల ఆర్ధిక సాయం ఇచ్చిన తీరుకు చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయిఉండాలి. అలాగైతే జగన్‌కు ఏపీలో తిరుగు ఉండదని ఆయన భయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కూడా అలాగే నిధులు ఇస్తే రాజకీయంగా తమకు నష్టం అని చంద్రబాబు భావిస్తుండవచ్చు. ఎపిలో బిజెపికి పెద్దగా బలం లేదు. అయినా వారి మద్దతు కోసం ఎందుకు పాకులాడుతున్నారంటే కారణం ఇదే. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎపిలో జగన్ ప్రభుత్వాన్ని ఎదో విధంగా ఇబ్బంది పెట్టాలంటే వారితో పొత్తులోకి వెళ్లడమే మార్గమని టిడిపి భావిస్తోంది. జగన్ ఎప్పుడూ కేంద్రంలోని బిజెపిపై నోరుపారేసుకోలేదు. ✍ వ్యూహాత్మక తప్పిదమా? అవసరమైన సందర్భాలలో మద్దతు ఇస్తున్నారు. అందువల్ల జగన్ తో పొత్తు లేకపోయినా, ఆయనను ఇబ్బంది పెట్టవలసిన అవసరం బిజెపికి ఉండదు. కాకపోతే బిజెపిలోని తెలుగుదేశం నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. బిజెపికి పది లోక్ సభ సీట్లు ఇస్తామని టిడిపి ఆఫర్ ఇస్తోందని ప్రచారం జరుగుతోంది. అది నిజమో కాదో తెలియదు. ఏది ఏమైనా అమిత్ షాను వ్యక్తిగత అవసరాల కోసం కలిశారా? రాజకీయ ప్రయోజనాల కోసం కలిశారా? అన్నదానిపై వారు వివరణ ఇవ్వవలసి ఉంటుంది. సాధారణంగా ఒక రాజకీయనేతను కలవడం తప్పు కాదు. కాని తమను అవమానించిన చంద్రబాబు వంటి నేతతో మళ్లీ పొత్తు పెట్టుకోవడానికి బిజెపి ఆలోచన చేస్తుంటే మాత్రం అది వ్యూహాత్మక తప్పిదమే కావచ్చు. ✍ అది శరాఘాతమే.. మోదీని, అమిత్ షా లను తీవ్రంగా చంద్రబాబుకాని, ఆయన పార్టీ నేతలు కాని దూషించినప్పుడు బాధపడ్డ అభిమానులకు మాత్రం అది శరాఘాతమే అవుతుంది. టిడిపిని కుటుంబ పార్టీ అని, అవినీతి పార్టీ అని నిన్నటిదాక ఒరిజినల్ బిజెపి నేతలు విమర్శిస్తుండేవారు. నిజంగానే బీజేపీ కనుక టీడీపీతో స్నేహం కోసం అర్రులు చాస్తే అలాంటివారికి ఎంతో చిన్నతనం అవుతుంది. అన్నిటికి మించి మోదీ, అమిత్ షా లు కూడా తమ ఆత్మ గౌరవాన్ని రాజకీయం కోసం వదలివేసుకుంటారా? అన్న ప్రశ్న వస్తుంది. ✍ కొసమెరుపు ఏమిటంటే.. ఈ చర్చ జరుగుతున్న తరుణంలోనే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ టిడిపితో పొత్తు ఊహాగానమేననితేల్చేశారు. తెలంగాణతో పాటు ఎపిలో కూడా పొత్తు ఆలోచన లేదన్నారు. దీంతో టిడిపి శ్రేణులు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ఒక్కసారిగా డీలాపడ్డాయి. అంటే దీని అర్దం చంద్రబాబు తనపై, రామోజీ పైన ఉన్న కేసుల విషయంలో సాయం చేయాలని కోరడానికే వెళ్లినట్లయిందా! కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్‌లో మాట్లాడుతూ పొత్తులపై ఇప్పుడు ఎవరూ మాట్లాడవద్దని, ఎన్నికల సమయంలో చూద్దామని అన్నారట. అంటే అర్ధం అయింది కదా! అమిత్ షా వద్దకు వెళ్లినా రాజకీయంగా పెద్ద ప్రయోజనం లేకపోయిఉండవచ్చు. మరి కేసులలో అయినా ఏమైనా హామీ లభించి ఉంటుందా!అన్నది చెప్పలేం. తెలంగాణలో బిఆర్ఎస్ కు ఈనాడు బాకా ఊదుతోందన్న భావన బిజెపిలో ఉందని అంటున్నారు. ఈ నేపద్యంలో బిజెపి వద్దకు వెళ్లి చంద్రబాబు మరో సారి విశ్వసనీయత కోల్పోతే, పని జరగక పరువు పొగొట్టుకుని రెండిందాల చెడ్డట్లు అయిందన్న అభిప్రాయం కలుగుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
జగనన్న భూహక్కు-భూరక్షపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన బుధవారం భేటీ అయింది. సబ్ కమిటీలోని సభ్యులుగా ఉన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో కలిసి జగన్న భూరక్ష-భూహక్కు పథకం ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ... దేశంలో సమగ్ర సర్వే ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రమే ముందంజలో ఉందని, ఈ ఏడాది చివరి నాటికి సర్వే ప్రక్రియ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. జగనన్న భూహక్కు-భూరక్ష కార్యక్రమంలో భాగంగా 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని మొత్తం 17,461 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కోరారు. బ్రిటీష్ పాలన తరువాత రాష్ట్రం అంతా కూడా ఒకేసారి నిర్థిష్టమైన విధానంతో జరుగుతున్న ఈ సర్వేలో ఎటువంటి అలసత్వం సహించేది లేదని అన్నారు. సీఎం వైస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేసి, శాశ్వత భూహక్కు పత్రాలను కూడా ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ఇప్పటి వరకు 4.3 లక్షల సబ్ డివిజన్ లలో సుమారు 2 లక్షల మ్యూటేషన్ లను పరిష్కరించామని తెలిపారు. ఈ ఏడాది మే నెల నాటికి 6వేల గ్రామాలు, ఆగస్టు నెల నాటికి 9వేల గ్రామాలు, అక్టోబర్ నాటికి 13వేల గ్రామాలు, డిసెంబర్ నాటికి మొత్తం 17,461 గ్రామాలకు భూహక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటి వరకు 5264 గ్రామాల్లో డ్రోన్ ద్వారా చిత్రాలను రికార్డు చేయడం జరిగిందని, జూన్ 2023 నాటికి 4006 గ్రామాలకు ఓఆర్ఐ మ్యాప్‌లను సిద్దం చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే 3191 గ్రామాలకు గ్రౌండ్ ట్రూతింగ్, 2464 గ్రామాలకు గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తి చేశారని, మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటికే సమగ్ర సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామకంఠం భూముల్లో నివాసితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. అలాగే భూ యజమానుల నుంచి వచ్చే ఫిర్యాదులపై కూడా మొబైల్ మేజిస్ట్రేట్ కోర్ట్‌లో విచారించి, ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీల్లో కూడా సమగ్ర సర్వేను ప్రారంభించాలని సూచించారు. చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే ఇప్పటికే సర్వే కోసం 30 అత్యాధునిక డ్రోన్లు, 70 బేస్ స్టేషన్లు, 1330 జిఎన్ఎస్ఎస్ రోవర్లను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. డ్రోన్ సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్, మ్యాప్ లను సిద్దం చేయడం, వెరిఫికేషన్, నోటీసుల జారీ చేయడం, వివాదాలను పరిష్కరించడం, సర్వే రాళ్లను నాటడం దశలవారీగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. సమావేశంలో సీపీఎల్ఎ జి.సాయిప్రసాద్, సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్పోరేషన్ చైర్మన్ సౌరబ్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్
India Vs Australia 2022 3rd T20 Uppal Stadium Tickets- HCA: జింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హెచ్‌సీఏ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులతో సమావేశమయ్యారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు. చదవండి: హెచ్‌సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి? సమావేశానికి ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా జరగలేదన్నారు. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినచర్యలు తప్పవన్నారు. తెలంగాణ ప్రతిష్టను దిగజారిస్తే ఊరుకునేదిలేదన్నారు.హెచ్‌సీఐ పూర్తిగా వైఫల్యం చెందిందని మంత్రి అన్నారు. కాగా, ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్‌సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. -
కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు పెద్ద రిస్కే తీసుకుంటున్నారు. ఆయన దేశ ప్రధానిని ఉద్దేశించి వికారాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీనే శత్రువు అని ప్రకటించడం ఆషామాషీ విషయం కాదు. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఆయా అంశాలలో భిన్నాభిప్రాయాలు ఏర్పడుతుండడం సహజంగానే జరుగుతుంటుంది. కేంద్రంలోను, రాష్ట్రాలలోను ఒకే పార్టీ అధికారంలో ఉన్నా, కొన్ని సందర్భాలలో విధానపరంగా తేడా రావచ్చు. అయితే , పార్టీ అధిష్టానం పెద్దలు సంప్రదింపుల ద్వారా వివాదాన్ని చల్లబరుస్తుంటారు. చదవండి: కాంగ్రెస్‌లో ట్విస్ట్.. రేవంత్ రెడ్డికి ఊహించని షాకిచ్చిన మర్రి శశిధర్ రెడ్డి కానీ కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ ఉన్నప్పుడు విబేధాలు వస్తే అవి క్రమేపి సీరియస్ రూపం దాల్చుతాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్న పోరాటం అలాగే రూపాంతరం చెందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో పవర్లో ఉన్న టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్దం హద్దులు దాటిపోయింది. ఎవరైనా ఎన్నికల రాజకీయాలలో ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు నరేంద్ర మోదీ, కేసీఆర్‌లు స్నేహభావంతోనే ఉండేవారు. ఈ ఎనిమిదేళ్ల మోదీ పాలనలో చేసింది ఏమీ లేదని, దుర్మార్గపు పాలన చేస్తున్నారని విమర్శిస్తున్న కేసీఆర్ గతంలో పలు చట్ట సవరణలకు కాని, కేంద్రం చేసిన నిర్ణయాలకు కాని మద్దతు ఇచ్చారు. ఉదాహరణకు మోదీ నోట్ల రద్దు ప్రకటించిన్పుడు కేసీఆర్ అసెంబ్లీ సమావేశంలోనే ప్రశంసించారు. జీఎస్టీ వంటివాటికి మద్దతు ఇచ్చారు. రెండో టరమ్ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి ఇద్దరి మధ్య తేడా వచ్చింది. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు ఆరంభించడం, దానిని టీఆర్ఎస్ తిప్పికొట్టడానికి పూనుకోవడం సాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తో పోల్చితే అంతగా బలం లేని బీజేపీ కొంత పుంజుకుంటే విపక్ష ఓట్లు చీలి తమ గెలుపు సునాయాసం అవుతుందని కేసీఆర్ భావించారు. అందుకే ఆయన తొలుత కాంగ్రెస్‌పై కన్నా, బీజెపిపైనే అధిక విమర్శలు ఎక్కపెట్టడం ఆరంభించారు. కానీ అవి నానాటికి పెరిగిపోయి రెండు పార్టీల మధ్య నువ్వా?నేనా అన్న చందంగా పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ఈ స్థాయిలో పుంజుకుంటుందని టీఆర్ఎస్ మొదట ఊహించలేదు. కాలం ఎప్పుడూ ఒకేమాదిరిగా ఉండదు. అందులోను రాజకీయాలు హాట్‌గా మారుతున్నప్పుడు ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటారు. ఎంతకాదన్నా కేంద్రానికి విశేష అధికారాలు ఉంటాయి. అలాగని రాష్ట్రాలకు ఏమీ ఉండవని కాదు. కాని కేంద్రం కావాలనుకుంటే ఏదైనా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడం పెద్ద సమస్య కాదు. దానిని ఎండగట్టడానికి కేసీఆర్ ఈ మధ్యన ఎక్కడా వెనుకాడడం లేదు. దానికి కారణం దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో అనూహ్యంగా టీఆర్ఎస్ ఓటమిపాలై, బీజేపీ గెలవడం, హైదరాబాద్ కార్పొరేషన్లో బీజేపీ 48 డివిజన్లు గెలుచుకోవడం, దాంతో బీజేపీ ఇక తమదే అధికారం అన్నంతగా సవాళ్లు విసురుతుండడంతో టీఆర్ఎస్ అప్రమత్తమవుతోంది. ఈ లోగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామాతో రాబోతున్న ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం కాబోతోంది. ఈ ఫలితం వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ బీజేపీపైన, నేరుగా ప్రధాని మోదీపైన విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. దేశ స్థాయిలో ఒక రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్న కేసిఆర్‌కు పరిస్థితులు కలసి రావడం లేదు. ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో జత కట్టడం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఇంట గెలిచి, రచ్చ గెలవాలన్న సూత్రానికి కేసిఆర్ వచ్చేసినట్లుగా ఉంది. అందుకే ఆయన మోదీపైన మాటల ఘాటు పెంచారు. మోదీని ఏకంగా తెలంగాణకు శత్రువు అని ప్రకటించి పెద్ద రిస్క్ చేశారు. ఈ వ్యాఖ్య సహజంగానే బీజేపీకి మరింత కోపం తెప్పిస్తుంది. టిఆర్ఎస్ పైన బీజేపీ దాడి మోతాదు పెంచుతుంది. ప్రభుత్వపరంగా కూడా మరిన్ని వైరుధ్యాలు ఏర్పడవచ్చు. కేసీఆర్‌పై కాళేశ్వరం అవినీతి అని, కుటుంబ పాలన అని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్తో కాస్త సంబందాలు ఉన్న రాజకీయేతర వ్యక్తులపై ఐటి, ఈడి వంటి సంస్థలు దాడులు చేస్తున్నాయన్న వార్తలు వచ్చాయి. అప్పులకు సంబంధించి కూడా ఆర్బిఐ పలు ఆంక్షలు పెట్టింది. వీటన్నిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రం పనితీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ, అదే సమయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి కేసీఆర్ సంకల్పించారు. తెలంగాణకు నిధులు సరిగా ఇవ్వడం లేదని, పాలమూరు-రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల జాప్యానికి కేంద్రమే కారణమని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను అన్యాయం చేస్తోందని తదితర విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టుల ఆలస్యానికి కేంద్రం ఎలా కారణం అవుతుందో తెలియదు. కృష్ణా జలాల వాటా తేల్చలేదని ఆయన అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చి వెంటనే తేల్చాలని అంటోంది. అలాగే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, సబ్సిడీ చెల్లించవలసింది రాష్ట్ర ప్రభుత్వమే అయినప్పుడు రైతులకు ఏ రకంగా నష్టం అవుతుందో అర్థం కాదు. ఉచిత స్కీములను వ్యతిరేకిస్తూ మోదీ కాని, కేంద్రం కాని వ్యక్తపరిచిన అభిప్రాయాలను కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తున్నారు. అయితే అప్పుల విషయంలో కేంద్రం రాష్ట్రాన్ని కొంత బిగించినట్లే కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల తదితర అంశాల ఆధారంగా కేసీఆర్ విమర్శలు చేశారు. కేంద్రంపై ఈ తరహా దాడి చేసిన ప్రాంతీయ పార్టీల నేతల పట్ల బీజేపీ సావధానంగా ఉంటుందని అనుకోవడానికి వీలు లేదు. మున్ముందు టీఆర్ఎస్ ప్రముఖులపై కేంద్ర ఏజెన్సీలు దాడులు అధికంగా చేయవచ్చని భావిస్తున్నారు. కేసీఆర్ జోలికి నేరుగా వెళ్లకుండా, ఆయన చుట్టూ ఉన్న ప్రముఖులను ఈ సంస్థలు ఇబ్బంది పెట్టవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసి, ఓటమి తర్వాత పూర్తిగా సరెండర్ అయ్యారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్రంపైన హోరాహోరీ పోరాడినా, ఆమె మంత్రివర్గ సభ్యుడు పార్ధ చటర్జీపై ఈడీ జరిపిన దాడిలో ఏభై కోట్ల నగదు పట్టుబడడం ఆమెకు ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాలకు హాజరు కావడం గమనించదగిన అంశం. ప్రస్తుతం కేసీఆర్ కేంద్రంలో మోదీ ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరు కావడంలేదు. రాష్ట్రానికి మోదీ వచ్చినా స్వయంగా స్వాగతం పలకడం లేదు. మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ప్రత్యర్థిగా చూస్తున్నా, ఢిల్లీ స్థాయిలో మాత్రం కాంగ్రెస్‌తో పాటు ఆయా వేదికలను పంచుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికారం సాధించాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీని దెబ్బకొట్టడానికి, బీజేపీ భవిష్యత్తులో కేంద్ర ఏజెన్సీలను వినియోగించినా, ప్రజలలో ఆ పార్టీపై వ్యతిరేకత పెంచడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా ఉంది. అల్టిమేట్‌గా మునుగోడులో విజయం సాధించడం, తద్వారా వచ్చే శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్కు ఎదురు లేదన్న భావన కల్పించడం కోసం కేసీఆర్ ఈ రిస్క్ తీసుకున్నట్లుగా ఉంది. ఇది కాలిక్యులేటెడ్ రిస్కు అవుతుందా?లేక డేంజరస్ రిస్క్ అవుతుందా అన్నది చెప్పడానికి మరికొంత సమయం పడుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
జూలై 1న ఆర్ఎంసీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యు దుత్పత్తితో పాటు కృష్ణాలో మిగులు జలాల వినియోగంపై చర్చించడానికి జూలై 1న జలసౌధలో రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సమావేశం జరగనుంది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. ఇప్పటికే రెండుసార్లు ఆర్ఎంసీ సమావేశం జరగగా, తెలంగాణ అధికారులు హాజరు కాలేదు. అయినా రిజర్వాయర్ల నిర్వహణకు సంబం ధించిన ముసాయిదా రూల్‌కర్వ్ (విధివిధానాలు)పై ఈ సమావేశాల్లో కృష్ణాబోర్డు అధికారులు చర్చించారు. 1న జరగనున్న సమావేశంలో రూల్‌కర్వ్‌కు తుదిరూపమిచ్చి తదుపరి నిర్వహించే భేటీలో ఆమో దించాలని కృష్ణాబోర్డు యోచిస్తోంది. శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటిని విడుదల చేసే అంశంపై బోర్డు శుక్ర వారం నిర్ణయం తీసుకోనుంది. -
సంక్షోభంలో బొమ్మై ప్రభుత్వం?.. రంగంలోకి అమిత్ షా
సాక్షి, బెంగళూరు: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలో ఆకస్మిక పర్యటన సొంత పార్టీతో పాటు అంతటా చర్చనీయాంశమైంది. అమిత్‌షా నేడు మంగళవారం జరిగే బసవ జయంతి ఉత్సవంలో పాల్గొంటారు. ఇందులో సీఎం బొమ్మై, పార్టీ అగ్రనేతలు, మంత్రులు కూడా ఉంటారు. అనంతరం అమిత్ షా ఆర్టీ నగరలోని సీఎం బొమ్మై ఇంటికి వెళ్తారు. మధ్యాహ్నం సీఎం నివాసంలోనే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. వరుస సమస్యల నేపథ్యంలో గత నెల రోజుల్లో రెండుసార్లు సీఎం బొమ్మై ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితితో పాటు సర్కారు సమస్యలను కూడా ఏకరువు పెట్టినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కూడా బొమ్మై ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడంతో పాటు సర్కారులోని లుకలుకలను పరిష్కరించడానికి ఏకంగా అమిత్ షా రంగంలోకి దిగినట్లు సమాచారం. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పేరుతో ఆయన ఆకస్మిక పర్యటనకు నాంది పలికినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వరుసగా ఏదో ఒక కుంభకోణం బొమ్మై ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది. కొన్నినెలల కిందట బిట్‌కాయిన్ స్కాం, తాజా ఎస్ఐ పరీక్షల కుంభకోణం, ఆ మొన్న కాంట్రాక్టరు ఆత్మహత్య వల్ల సీనియర్ మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయడం తదితరాలు పార్టీ హైకమాండ్‌ను ఆలోచనలో పడేశాయి. దీంతో మొదట ఇంటిని చక్కదిద్దుకోవాలని నిశ్చయించింది. పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్యమైన మార్పులు, కొత్తగా చేరికలు, ప్రచార కార్యక్రమాలపై అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నారు. ఫలితంగా పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. పాలనలో మార్పులు తెస్తాం : సీఎం రానున్న రోజుల్లో పరిపాలనలో పెనుమార్పులు తీసుకొస్తామని సీఎం బసవరాజ బొమ్మై చెప్పారు. సోమవారం విధానసౌధలో జరిగిన సాంఘిక సంక్షేమ శాఖ సామర్థ్య అభివృద్ధి సెమినార్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో అట్టడుగులో ఉన్న వ్యక్తికి పథకాలు చేరాలి, అప్పుడే ప్రజాప్రభుత్వ ఆశయాలు నెరవేరుతాయన్నారు. కాగా, కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలోకి చేర్చుకొంటామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెప్పడం అవివేకమని విమర్శించారు. మహారాష్ట్రలో కన్నడభాషను అధికంగా మాట్లాడే ప్రాంతాలను గుర్తించి వాటిని కర్ణాటకలోకి చేర్చుకోవడంపై తాము కూడా సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు బొమ్మై చెప్పారు. (చదవండి: కర్ణాటక సీఎంను మళ్లీ మార్చబోతున్నారా?) -
భారత్–చైనా మధ్య 15వ దఫా చర్చలకు రంగం సిద్ధం
బీజింగ్/న్యూఢిల్లీ: భారత్–చైనా మధ్య ఈ నెల 11న జరగబోయే 15వ దఫా చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలకు ముగింపు పలకడమే ఈ ఉన్నత స్థాయి సైనిక చర్చల లక్ష్యమని అన్నారు. శుక్రవారం లద్దాఖ్‌లోని చుషూల్ మాల్డో మీటింగ్ పాయింట్ వద్ద ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. భారత్–చైనా మధ్య పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాలంటే సరిహద్దుల్లో శాంతి తప్పనిసరిగా నెలకొనాలని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా చెప్పారు. (చదవండి: దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ) -
నేడు ఆర్థికమంత్రితో బ్యాంకింగ్ సీఈఓల భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీ, సీఈఓలు (పీఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు) సమావేశం కానున్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పనితీరు, రుణ వృద్ధి, మహమ్మారిని ఎదుర్కొనడంలో బ్యాంకింగ్ మద్దతు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనితో పాటు మొండిబకాయిలు (ఎన్పీఏ), వాటి రికవరీ ప్రక్రియపై కూడా ఆర్థికమంత్రి సమీక్ష జరిపే అవకాశం ఉంది. 2019 మార్చి 31న రూ.7,39,541 కోట్లుగా ఉన్న మొండిబకాయిలు, 2020 మార్చి 31 నాటికి రూ.6,78,317 కోట్లకు, 2021 మార్చి నాటికి రూ.6,16,616 కోట్లకు దిగివచ్చినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. ముంబైలో జరుగుతుందని భావిస్తున్న ఈ సమావేశంలో భాగంగా ఆర్థికమంత్రి 2020–21కి ‘ఈఏఎస్‌ఈ 3.0 ఇండెక్స్’ ఫలితాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. -
బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం
సాక్షి, విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీల సంక్రాంతి సభ ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈ నెల 11న ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు.బీసీల సంక్రాంతి పేరుతో ఈ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. (చదవండి: ఏలూరు: వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా) మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత పాలకులు బీసీలను వెనుకబడిన తరగతులగానే చూశారని.. బీసీలను వెన్నెముకగా సీఎం వైఎస్ జగన్ భావించారని తెలిపారు. చైర్మన్లు, డైరెక్టర్లలో మహిళలకు పెద్దపీట వేశారని, బీసీ హృదయాల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఆ రాతలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్) -
అభివృద్ధిలో ఉపాధి హామీ నిధులు కీలకం: పెద్దిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేదలకు ఇచ్చే స్థలాలకు సంబంధించి పదివేల లేఅవుట్లను గుర్తించామని, ఈ లేఅవుట్లలో ఉపాధి హామీ కింద అవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన గురువారం ఉపాధి హామీ మండలి సమావేశం నిర్వహించారు. పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ గిరిజా శంకర్, డైరెక్టర్ (ఇజీఎస్) చిన్నతాతయ్య, వాటర్‌షెడ్ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఉపాధి హామీ మండలి (ఎస్ఇజిసి) సభ్యులు హాజరయ్యారు. (చదవండి: ‘ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి’) రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ నిధులు కీలకమని, ఇతర రాష్ట్రాల్లో ఉపాధి హామీ ఏ రకంగా జరుగుతుందో మండలి సభ్యులు పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు నియోజకవర్గానికి రూ.10 కోట్లు కేటాయించబోతున్నాం. నూరు శాతం ఉపాధి హామీ నిధులతోనే పనులు చేపట్టేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. వైఎస్సార్ క్లినిక్, ఆర్బీకే, నాడు-నేడు, సచివాలయ భవనాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని’’ అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో ఉపాధి హామీ కింద ఈ నాలుగు రకాల పనులను అక్టోబర్ నెల నాటికి పూర్తి చేస్తే నియోజకవర్గానికి ఇంకా అదనంగా మరో రూ.5 కోట్లు ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. (చదవండి: చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతారు..) -
గిరిజన హక్కుల రక్షణకు కొత్త చట్టం..
సాక్షి, తాడేపల్లి: డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అధ్యక్షతన గిరిజన సలహా మండలి సమావేశం గురువారం జరిగింది. గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జీవో 3 పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశామని పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు కాపాడేందుకు కొత్త చట్టాన్ని తేవాలని తీర్మానం చేశామన్నారు. గిరిజనుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తూ తీర్మానం చేశామని వెల్లడించారు. జీవో 3పై తెలంగాణ అధికారులతో కూడా చర్చించామని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. -
‘గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేస్తాం’
సాక్షి, తాడేపల్లి: సోషల్ మీడియా వలంటీర్ల కృషి మరువలేనిదని..వారిపై గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేస్తామని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వలంటీర్ల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇప్పటికే డీజీపీకి వినతి ప్రతాలు ఇచ్చామని..రాష్ట్ర్రంలో ఎక్కడైనా కేసులు నమోదయితే కేంద్ర పార్టీ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. సోషల్ మీడియా వలంటీర్ల సమస్యల పరిష్కారానికి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. వలంటీర్ల శ్రమను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నటికీ మరవరన్నారు. పార్టీకి ఎన్ని వింగ్‌లు వున్నా తొలిసారి మీతోనే సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా మీ ప్రాధాన్యత ఏమిటో గుర్తించామని తెలిపారు. ఎన్నికల ముందు ఎలా పనిచేశారో ఇప్పుడు కూడా అంతకు రెట్టింపుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరారు. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. అవినీతి రహిత పాలన కోసం జగన్ అన్న చేస్తున్న కృషిని ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సోషల్ మీడియా ఇంచార్జ్ దేవేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మోదీ అభివృద్ధిని టీడీపీ కప్పిపుచ్చింది’
సాక్షి, విజయవాడ: ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని గత టీడీపీ ప్రభుత్వం కప్పి పుచ్చిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్ర్రవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు,కార్యకర్తలు బీజేపీలోకి చేరుతున్నారన్నారు.మళ్లీ మోదీ అధికారంలోకి వచ్చాక వాస్తవాలు గ్రహించి పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. కశ్మీర్ సమస్యను రెండు రోజుల్లోనే అతి సులువుగా పరిష్కరించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. దేశ చరిత్రలో ఆగస్టు 15 ఎంత ముఖ్యమో..ఆగస్టు 5,6 తేదీలకు కూడా అంతే ప్రత్యేకత ఉందన్నారు.370 ఏ,35ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నిర్ణయించామని తెలిపారు. ఈ నెల 20 వరుకు బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ కొనసాగుతుందని పార్టీ శ్రేణులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి మురళీధరణ్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, సిఎం రమేష్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. -
నేడు కృష్ణా బోర్డు సమావేశం
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో నీటి లభ్యత, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అవసరాలపై చర్చించి.. కేటాయింపులు చేయడానికి శుక్రవారం హైదరాబాద్‌లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశమవుతోంది. కృష్ణా బోర్డు ఛైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా, సభ్య కార్యదర్శి పరమేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కృష్ణా బోర్డు సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) సమావేశం ఛైర్మన్ ఆర్కే జైన్ అధ్యక్షతన జరగనుంది. -
చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
-
భారతీయతకు ప్రతిబింబం సాహిత్యసదస్సులు
ఆధునిక తమిళ–తెలుగుకవితల సారూప్యతా సదస్సులో వక్తలు యానాం : మనుషులు రోబోలుగా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో సాహిత్యసదస్సులు మానవత్వాన్ని ప్రేరేపిస్తాయని, ప్రాంతీయబేధాలు తొలగి భారతీయత ప్రతిఫలిస్తుందని కేంద్రసాహిత్యఅకాడమీ చెన్నై అధికారి ఇళంగోవన్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక డాక్టర్ సర్వేపల్లిరాధాకృష్ణన్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాలులో ఆధునిక తమిళ–తెలుగు కవితల సారూప్యతా సదస్సు సాహిత్య అకాడమీ సాధారణ మండలి సభ్యులు ఆర్ సంపత్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఇళంగోవన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సాహిత్య సదస్సులు ప్రజల మ«ధ్య సహృద్భావాన్ని పెంచడానికి తోడ్పడతాయన్నారు. పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ నేటి యువత సాహిత్యంపై దృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సాహిత్యం చదవడం ద్వారా భాషపైపట్టు సాధించడంతో పాటు దేశంలోని వివిధ రచయితల సాహిత్యాన్ని చదివి దేశసంస్కృతిని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రముఖ సాహిత్య విమర్శకులు దాట్ల దేవదానం రాజు కీలకోపన్యాసం చేశారు. అనంతరం జరిగిన మొదటి సమావేశానికి తమిళ తెలుగు పాటల ఒక సారూప్యత అనే అంశానికి అవ్వై నిర్మల అధ్యక్షత వహించారు. అదేవిధంగా తమిళ–తెలుగు దళితపాటలపై ఎన్ వజ్రవేలు మాట్లాడుతూ తమిళ తెలుగు దళితసాహిత్యం తదితర అంశాల గురించి వివరించారు. తెలుగు–తమిళ కవిత్వంలో గాంధీ ప్రభావం అనేఅంశంపై పి అమ్ముదేవి ప్రసంగించారు. అనంతరం జరిగిన రెండో సమావేశంలో ప్రముఖ తమిళకవి సుబ్రహ్మణ్యభారతి, జాషువాల కవిత్వాల్లో జాతీయవాద అంశాలు గురించి ప్రముఖకవి, తెలుగువిశ్వ విద్యాలయం విశ్రాంత ఆచార్యులు కె సంజీవరావు మాట్లాడారు. మహాకవి భారతి, గురజాడ అప్పారావు గురించి ధనుంజయన్ వివరించారు. మూడో సమావేశానికి కవి దాట్ల దేవదానంరాజు అధ్యక్షత వహించగా తెలుగుకవుల కవితాపఠనం సాగింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జయరాజ్ డేనియల్, తెలుగుశాఖ అధ్యక్షులు వి భాస్కరరెడ్డి, ముమ్మిడి శ్రీవీరనాగప్రసాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటలు
సాక్షి, తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 40,320 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 22 గంటలు, అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాట మార్గాల్లో నడిచి వచ్చిన భక్తులకు 10 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. రద్దీ పెరగటంతో రూ.300 టికెట్ల దర్శనం మధ్యాహ్నం 2 గంటలకు నిలిపివే శారు. గదుల కోసం అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. లాకర్లు పొందేందుకూ భక్తులు వేచి ఉన్నారు. కల్యాణకట్టల వద్ద భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కనీసం మూడు గంటల సమయం పట్టింది. నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం టీటీడీ ధర్మకర్తల మండలి సోమవారం సమావేశం కానుంది. చైర్మన్ బాపిరాజు, ఈవో గోపాల్ నేతృత్వంలో ఉదయం 11 గంటలకు అన్నమయ్య భవన్ అతిథిగృహంలో భేటీ కానున్నారు. ఎన్నికల కోడ్, రాష్ట్రపతి పాలన నేపథ్యంలో జరిగే ఈ సమావేశంలో కేవలం పరిపాలన సంబంధిత అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 16న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో పాత ప్రభుత్వాలకు సంబంధించిన జీవోల రద్దుతో టీటీడీ ధర్మకర్తల మండలి కూడా రద్దు అయ్యే అవకాశం కనిపిస్తోంది.