
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యు దుత్పత్తితో పాటు కృష్ణాలో మిగులు జలాల వినియోగంపై చర్చించడానికి జూలై 1న జలసౌధలో రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఆర్‌ఎంసీ) సమావేశం జరగనుంది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తాజాగా లేఖ రాసింది. ఇప్పటికే రెండుసార్లు ఆర్‌ఎంసీ సమావేశం జరగగా, తెలంగాణ అధికారులు హాజరు కాలేదు.
అయినా రిజర్వాయర్ల నిర్వహణకు సంబం ధించిన ముసాయిదా రూల్‌కర్వ్ (విధివిధానాలు)పై ఈ సమావేశాల్లో కృష్ణాబోర్డు అధికారులు చర్చించారు. 1న జరగనున్న సమావేశంలో రూల్‌కర్వ్‌కు తుదిరూపమిచ్చి తదుపరి నిర్వహించే భేటీలో ఆమో దించాలని కృష్ణాబోర్డు యోచిస్తోంది. శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటిని విడుదల చేసే అంశంపై బోర్డు శుక్ర వారం నిర్ణయం తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment