
సాక్షి, విజయవాడ: ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని గత టీడీపీ ప్రభుత్వం కప్పి పుచ్చిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్ర్రవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు,కార్యకర్తలు బీజేపీలోకి చేరుతున్నారన్నారు.మళ్లీ మోదీ అధికారంలోకి వచ్చాక వాస్తవాలు గ్రహించి పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. కశ్మీర్ సమస్యను రెండు రోజుల్లోనే అతి సులువుగా పరిష్కరించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. దేశ చరిత్రలో ఆగస్టు 15 ఎంత ముఖ్యమో..ఆగస్టు 5,6 తేదీలకు కూడా అంతే ప్రత్యేకత ఉందన్నారు.370 ఏ,35ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నిర్ణయించామని తెలిపారు. ఈ నెల 20 వరుకు బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ కొనసాగుతుందని పార్టీ శ్రేణులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి మురళీధరణ్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, సిఎం రమేష్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment