kanna lakshminaraana
-
సోముపై కన్నా మరోసారి ఫైర్.. ఏపీ బీజేపీ రియాక్షన్ ఇదే
సాక్షి, అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ మరోసారి మండిపడ్డారు. ఏపీ బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పుపై కన్నా లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను నియమించిన వారినే తొలిగించారంటూ సోము వీర్రాజు వ్యవహార శైలిపై కన్నా నిప్పులు చెరిగారు. కాగా, కన్నా లక్ష్మీనారాయణ వ్యవహార శైలీపై ఏపీ బీజేపీ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. కన్నా హయాంలో ఏనాడూ కేంద్ర కమిటీ నిర్ణయాలను పాటించలేదన్నారు. సోము వీర్రాజు కేంద్ర కమిటీ నిర్ణయాలనే అమలు చేస్తున్నారని ఏపీ బీజేపీ చెబుతోంది. చదవండి: కేసీఆర్‌వి పగటి కలలు: సోము వీర్రాజు -
ఆ.. ఇద్దరూ కరోనా బ్రదర్స్: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనాపై పోరాడుతుంటే.. టీడీపీ, బీజేపీలోని ఓ వర్గం వైఎస్సార్సీపీపై రాజకీయాలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు, కన్నా ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఐసిఎంఆర్ అనుమతి ఉన్న కొరియాకి చెందిన కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒక ర్యాపిడ్ టెస్ట్ కిట్ కొనుగోలుకి 730కి ఒప్పందం చేసుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అదే కిట్‌ను 790 రూపాయిలకి కొనుగోలు చేసిందని చెప్పారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారా.. లేక సొంత పార్టీపైనే చేస్తున్నారా’’ అని అమర్నాథ్ ప్రశ్నించారు. (కరోనా జంతువుల నుంచే పుట్టింది: డబ్ల్యూహెచ్ఓ) పర్మిషన్ ఇప్పిస్తాం.. కాణిపాకం రావొచ్చు.. 20 కోట్లకు అమ్ముడుపోయిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ లైన్లో మాట్లాడుతున్నారని అమర్నాథ్ ఆరోపించారు. 790కి కొనుగోలు చేసిన కేంద్రాన్ని కన్నా నిలదీయాలని.. ఏపీ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసిన ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు. కన్నాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీరు చేసిన సవాల్‌ను ఎంపీ విజయసాయి రెడ్డి స్వీకరించారు. కాణిపాకం రావడానికి సిద్ధమని ఆయన తెలిపారు. మీరు కరోనా తర్వాత అంటున్నారు. మేము పర్మిషన్ ఇప్పిస్తాం. మీరు కాణిపాకంలో ప్రమాణం చేయడానికి ఒక్కరే రావచ్చు. చంద్రబాబు డైరక్షన్ లో మీరు పని చేస్తున్నారా లేదా ప్రమాణం చేయాలని’’ అమర్నాథ్ రెడ్డి అన్నారు. కన్నాకి రాత్రికి రాత్రే గుండెపోటు ఎలా వచ్చింది. వైఎస్సార్సీపీలోకి చేరాలని కన్నా ప్రయత్నించలేదా.. ఇంటి ముందు బ్యానర్లు కట్టుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆయన జేబు, సూటుకేసుల నిండా టీడీపీ డబ్బు నింపితే.. బీజేపీలో చేరి మాపై ఆరోపణలు చేయలేదా అని ఆయన ధ్వజమెత్తారు. (‘కన్నా.. బీజేపీకి కన్నం వేయొద్దు) చంద్రబాబు..కన్నా.. కరోనా ఇవన్నీ ఒకటే తెగ.. ‘‘కన్నా లక్ష్మీ నారాయణ 20 కోట్లకు అమ్ముడుపోలేదా..? గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఒకరికి 20 కోట్లు ఇవ్వలేదా.. ఎన్నికల ముందు రాజధాని ప్రాంత రైతులకి భూములు వెనక్కి ఇప్పిస్తామని బీజేపీ తరపున చెప్పలేదా. ఆయన కాణిపాకం ముందు చేయాల్సిన ప్రమాణాలు చాలా ఉన్నాయని అమర్నాథ్ తెలిపారు. శని పట్టుకుంటే ఏడు సంవత్సరాల వరకు వదలదంటారు.. కానీ చంద్రబాబును పట్టుకుంటే శని జీవితామంతా వదలదని ఆయన ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు..కన్నా.. కరోనా ఇవన్నీ ఒకటే తెగకి చెందిన వైరస్‌లన్నారు. నారా..కన్నా ఇద్దరూ కరోనా బద్రర్స్ అని ఎద్దేవా చేశారు. కరోనా జీవితాలను నాశనం చేస్తే వీరు రాజకీయాలను నాశనం చేసే వ్యక్తులని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు. -
‘కన్నా.. బీజేపీకి కన్నం వేయొద్దు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పెరగాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు భావిస్తున్నారని.. హైదరాబాద్‌లో కూర్చోని పైశాచిక ఆనందం పొందుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ నీతి కబుర్లు చెబుతున్నారని.. ఆయన శాశ్వతంగా రాజకీయ సమాధిలోనే ఉంటారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి లక్ష కిట్లు తెప్పించిందని వివరించారు. (కన్నా.. ఆ ఐదు ప్రశ్నలకు సమాధానం ఉందా..?) ఆ హక్కు వారికి లేదు.. కిట్లు కొనుగోలులో అవినీతి జరిగిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. బాధ్యత గల ప్రతిపక్ష నేత దిగజారి వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. కిట్లు వ్యవహారంలో కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కర్ణాటక రాష్ట్రం ఏపీ కంటే ఎక్కువ ధరకు కిట్లు కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. బీజేపీకి కన్నం వేయొద్దని.. చంద్రబాబుకు తొత్తుగా మారొద్దని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీ నారాయణకు జోగి రమేష్ హితవు పలికారు. వంద పార్టీలు, కొంతమంది గుంట నక్కలు కలిసిన.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏమి చేయలేవన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి గురించి మాట్లాడే హక్కు కన్నా, సుజనా చౌదరికి లేదన్నారు. సుజనా లాంటి దొంగలను నమ్మొద్దన్నారు. ('ఆ నాలుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించండి') బుద్ధి, జ్ఞానం లేనివారంతా అందులోనే.. దేశమంత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలో నడుస్తోందని జోగి రమేష్ అన్నారు. కేంద్రం కొనుగోలు చేసిన ధర కంటే..తక్కువ ధరకు ఏపీ ప్రభుత్వం కిట్లు కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాపై పోరాడుతున్నారని.. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. బుద్ధి, జ్ఞానం లేనివారంతా టీడీపీలోనే ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు నీతులు చెబుతుంటే.. ఆయన కుమారుడు లోకేష్ .. సైకిల్ వేసుకుని రోడ్లపై తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు. -
ఆంగ్ల బోధనపై ‘కన్నా’ వ్యాఖ్యలను ఖండించిన సీపీఐ
సాక్షి, అమరావతి: ఆంగ్లభాషలో బోధన..మత మార్పిడిలను ప్రోత్సహించేదిగా ఉందన్న బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మత మార్పిడిలను ప్రోత్సహించేదైతే మీ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివించారని ప్రశ్నించారు. తెలుగుతో సమాంతరంగా ఆంగ్లభాషలో బోధనను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ కోరారు. చదవండి: అదే మనం వారికిచ్చే ఆస్తి: సీఎం జగన్ -
‘మోదీ అభివృద్ధిని టీడీపీ కప్పిపుచ్చింది’
సాక్షి, విజయవాడ: ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని గత టీడీపీ ప్రభుత్వం కప్పి పుచ్చిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్ర్రవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు,కార్యకర్తలు బీజేపీలోకి చేరుతున్నారన్నారు.మళ్లీ మోదీ అధికారంలోకి వచ్చాక వాస్తవాలు గ్రహించి పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. కశ్మీర్ సమస్యను రెండు రోజుల్లోనే అతి సులువుగా పరిష్కరించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. దేశ చరిత్రలో ఆగస్టు 15 ఎంత ముఖ్యమో..ఆగస్టు 5,6 తేదీలకు కూడా అంతే ప్రత్యేకత ఉందన్నారు.370 ఏ,35ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నిర్ణయించామని తెలిపారు. ఈ నెల 20 వరుకు బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ కొనసాగుతుందని పార్టీ శ్రేణులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి మురళీధరణ్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, సిఎం రమేష్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. -
మోడీ పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకున్నారు
నందనవనం (సింగరాయకొండ): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పేరు కున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. జరుగుమల్లి మండలం నందనవనం గ్రామ ఎస్సీ కాలనీలో మంగళవారం సాయంత్రం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోడీ పీఎం జీవనజ్యోతి యోజన అనే పథకాన్ని ప్రవేశపెడితే చంద్రబాబు దానికి పేరు మార్చి చంద్రన్న బీమా అని పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రకటించిన ఎన్నో ప్రజా ప్రయోజన పథకాలకు తన పేరు పెట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఎమ్‌జీఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో పేదలకు ఉపాధి కల్పించడమే కాక, సిమెంటు రోడ్లు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, శ్మశాన వాటికలకు ప్రహరీలు నిర్మిస్తే చంద్రబాబు మాత్రం గత ఐదేళ్లలో మోడీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విషప్రచారం చేశారని ఆరోపించారు. సమాజంలో ప్రతి పేదవాడిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యమని ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు లో పాల్గొని పార్టీ రాష్ట్రంలో బలపడటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు సింగరాయకొండ మండలంలోని పాతసింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.వి. కృష్ణారెడ్డి, దారా సాంబయ్య, రమణారావు, కనుమల రాఘవులు, ఇత్తడి అక్కయ్య, కొణిజేటి మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. -
నరసారావుపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కన్నా నామినేషన్
-
2019 ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం అవ్వాలి: కన్నా
-
‘తిరుమల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ్య పుణ్యక్షేత్రం తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆభరణాల మాయంపై విచారణ చేయించి టీడీపీ ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. బుధవారం ఢిల్లీలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం జవాబు చెప్పి, భక్తుల అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. టీటీడీ వ్యవహారంపై ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నెల 26న నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుందని, అదే రోజున ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని కన్నా తెలిపారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయమని అమిత్ షా తనను ఆదేశించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు వ్యూహాన్ని రూపొందించి ప్రభావవంతంగా పనిచేయాలని అమిత్ షా సూచించారని చెప్పారు. -
'కన్నా' తండ్రి సైకిళ్లకు పంక్చర్లు వేసుకునేవారు
హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు గురివింద గింజ తరహాలో ఉన్నాయని మంత్రి రావెల కిషోర్‌బాబు విమర్శించారు. బీజేపీ నేతలు సోము వీర్రాజు, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు చేస్తున్న విమర్శలను వారి వ్యక్తిగతమైనవిగానే చూస్తాము తప్ప బీజేపీ అభిప్రాయంగా చూడలేమన్నారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తండ్రి సైకిళ్లకు పంక్చర్లు వేసుకునేవారని, సైకిల్ దుకాణానికి యజమాని కొడుకు ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి, సంక్షేమాల దిశగా దూసుకుపోతుంటే పనిలేని పార్టీలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులోనూ రాష్ట్రంలో సింగిల్ పార్టీ.. అదీ సింగపూర్ తరహా పాలన కొనసాగుతుందని మంత్రి జోస్యం చెప్పారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై ప్రశ్నించగా ప్రజల అభీష్టం మేరకే ఏపనైనా చేస్తామని.. బాక్సైట్ తవ్వకాల విషయంలో కూడా గిరిజనులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టబోమని మంత్రి అన్నారు.