
సాక్షి, అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ మరోసారి మండిపడ్డారు. ఏపీ బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పుపై కన్నా లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను నియమించిన వారినే తొలిగించారంటూ సోము వీర్రాజు వ్యవహార శైలిపై కన్నా నిప్పులు చెరిగారు.
కాగా, కన్నా లక్ష్మీనారాయణ వ్యవహార శైలీపై ఏపీ బీజేపీ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. కన్నా హయాంలో ఏనాడూ కేంద్ర కమిటీ నిర్ణయాలను పాటించలేదన్నారు. సోము వీర్రాజు కేంద్ర కమిటీ నిర్ణయాలనే అమలు చేస్తున్నారని ఏపీ బీజేపీ చెబుతోంది.
చదవండి: కేసీఆర్‌వి పగటి కలలు: సోము వీర్రాజు