![AP BJP Lok Sabha Candidates List Ready To Release - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/24/AP-BJP.jpg.webp?itok=s0-PIMiK)
సాక్షి, ఢిల్లీ/ విజయవాడ: పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ, జనసేనలతో పొత్తు ఒప్పందంలో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు సిద్ధంచేసిన జాబితాకు ఆమోదముద్ర పడింది.
ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో గత కొన్నిరోజులుగా రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేసి సిద్ధం చేసిన అభ్యర్థుల జాబితాపై కూలంకషంగా చర్చించారు. ఇక, నేడు మరోసారి పార్లమెంటరీ బోర్డు సమావేశమయ్యే అవకాశముంది. ఈరోజు సాయంత్రానికి ఫైనల్ జాబితాపై క్లారిటీ రానున్నట్టు సమాచారం. కాగా, మరో రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం, రాజంపేట, తిరుపతి పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్ధులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కాగా, బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించిన జీవీఎల్, పీవీఎన్ మాధవ్‌లకు నిరాశే ఎదురైనట్టు సమాచారం. మరోవైపు.. సోము వీర్రాజు విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తే సోము వీర్రాజుని అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అభ్యర్థుల అంచనా..
అనకాపల్లి- సీఎం రమేష్,
అరకు- కొత్తపల్లి గీత,
రాజమండ్రి- పురంధేశ్వరి,
నరసాపురం- మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు లేదా శ్రీనివాస వర్మ,
రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి,
తిరుపతి- మాజీ ఐఎఎస్ వరప్రసాద్ లేదా రత్నప్రభ పేర్లు ప్రచారం.
Comments
Please login to add a commentAdd a comment