April 10th AP Elections 2024 News Political Updates
10:25 AM, April 10th 2024
వైఎస్సార్‌సీపీలోకి పోతిన మహేష్
- వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు
- జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాములు రాజేశ్వరి, రమేష్ రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు.
- సీఎం జగన్ సమక్షంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైఎస్సార్‌సీపీలో చేరిక.
- వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.
- పోతిన మహేష్ ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన ఆరోపణలు
10:10 AM, April 10th 2024
జనసేన, టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు..
- పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీలోకి చేరికలు..
- నరసాపురం మండలం చామకూరి పాలెం గ్రామంలో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు
- జనసేన, తెలుగుదేశం పార్టీ నుండి సుమారు వందమంది వైఎస్సార్‌సీపీలో చేరిక
- పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు
9:51 AM, April 10th 2024
టీడీపీకి మరో సీటు అమ్మేసిన పవన్ కల్యాణ్
- పాలకొండలోనూ టీడీపీ అభ్యర్థే
- నిమ్మక జయకృష్ణను జనసేన అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కల్యాణ్
- వారం కిందటే టీడీపీ నుండి జనసేనలో చేరిన జయకృష్ణ
- జనసేన కోసం పనిచేసిన గిరిజనులను ముంచేసిన పవన్ కల్యాణ్
- అవనిగడ్డ, పాలకొండ రెండు సీట్లు టీడీపీ అభ్యర్థులకే ఇచ్చిన పవన్ కల్యాణ్
- మొత్తం 21 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్
- చంద్రబాబు పంపిన మనుసులకే సీట్లిచ్చిన పవన్ కల్యాణ్
- భీమవరం, అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కోడూరు, అనకాపల్లి, పి గన్నవరం, పోలవరం సీట్లు చంద్రబాబు మనుషులకే కేటాయింపు
- వైసీపీ నుండి వెళ్లినవారికి విశాఖ సౌత్, తిరుపతి, పెందుర్తి, మచిలీపట్నం ఎంపీ సీట్లు కేటాయింపు
- నాదెండ్ల మనోహర్ ఆశీస్సులు ఉన్నవారికి తాడేపల్లిగూడెం,యలమంచిలి, నెల్లిమర్ల, నిడదవోలు, రాజోలు, నరసాపురం, కాకినాడ రూరల్ సీట్లు కేటాయింపు
- జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీరని ద్రోహం చేసిన పవన్ కల్యాణ్
- జనసేన ను వరుసగా వీడుతున్న బీసీ నేతలు
- సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ కల్యాణ్
- జనసేన జెండా మోసిన వారిని నిండా ముంచేసిన పవన్ కల్యాణ్
- పక్క పార్టీ నేతల ప్యాకేజీ ముందు అభాసుపాలైన జనసేన విధేయత
9:31 AM, April 10th 2024
మహిళా కానిస్టేబుల్‌పై టీడీపీ నేత దాడి.. కేసు
- బుచ్చెయ్యపేట మండలంలోని మంగళాపురంలో విధి నిర్వహణలో ఉన్న సచివాలయ మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై దాడిచేసిన టీడీపీ నాయకురాలు
- మాజీ ఎంపీటీసీ సభ్యురాలు అల్లంకి ఉమాదేవిపై బుచ్చెయ్యపేట పోలీసులు కేసు నమోదు
- ఈ నెల 6న పింఛన్ నగదు తీసుకునేందుకు సచివాలయానికి వెళ్లిన టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి
- పింఛన్ నగదు తన వద్దకు వచ్చి ఇవ్వాలని మహిళా పోలీస్ జంపా మహాలక్ష్మితో గొడవ
- విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్‌పై పరుష పదజాలంతో తిడుతూ, ఆమె మెడపై గోర్లతో గాట్లు పెట్టి మెడలో ఉన్న చైన్‌ను లాగి తెంచేసిన వైనం
- అక్కడే విధి నిర్వహణలో ఉన్న తోటి సచివాలయ సిబ్బంది వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టి, తమ ఊరిలో ఎలా ఉద్యోగం చేస్తారో? చూస్తానంటూ బెదిరింపులు ఉమాదేవిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత మహిళా పోలీస్ మహాలక్ష్మి బుచ్చెయ్యపేట పోలీస్‌లకు ఫిర్యాదు
- కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బుచ్చెయ్యపేట పోలీసులు వెల్లడి
9:20 AM, April 10th 2024
షర్మిలకు షాకిచ్చిన సామాన్యుడు.
- సీఎం జగన్‌కు ఎందుకు ఓటెయ్యాలో చెప్పిన సామాన్యుడు.
- షర్మిల, కాంగ్రెస్‌కు ట్విస్ట్ ఇచ్చిన వ్యక్తి.
- ప్రతిపక్షాలు కుట్రలు చేసినా సీఎంగా మళ్లీ జగనే ఉండాలని ఆకాంక్షించాడు.
జనం గుండెల్లో గుడి కొట్టుకోవడం ఇదే.. వైఎస్ జగన్ గారికి, వైఎస్సార్ సీపీకి ప్రజలు మళ్లీ ఎందుకు ఓటేయాలో వారే చెబుతున్నారు వినండి.. ఈ యువకుడే కాదు.. రాష్ట్రంలోని ఎవరినీ అడిగినా ఇలాగే చెప్తారు.. ప్రతిపక్షాల కుట్రలు ప్రజల దగ్గర సాగవు. pic.twitter.com/r1poaJ0ZnH
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024
9:00 AM, April 10th 2024
కూటమి కార్యకర్తల తన్నులాట..
- రాజమండ్రిలో పురంధేశ్వరి సమక్షంలో ఆత్మీయ సమావేశం
- ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించివేత
- తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య బాహాబాహీ.
రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించుకున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు. తిలకించండి. pic.twitter.com/v79dbCahn9
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024
8:45 AM, April 10th 2024
సీఎం రమేష్, అయ్యన్నకు ఈసీ నోటీసులు..
- సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడికి ఎన్నికల కమిషన్ నోటీసులు.
- ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఇద్దరు నేతలు సంజాయిషీ ఇవ్వాలని కోరిన రిటర్నింగ్ అధికారి.
- ఈనెల ఆరో తేదీన నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చీర, రూ.2 వేలు పంచిన సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడు.
- డబ్బులు పంపిణీ చేస్తున్న సమయంలో ప్రశ్నించిన ఫ్లైయింగ్ స్క్వాడ్‌పై చిందులేసిన సీఎం రమేష్.
- అదే సందర్భంలో చీఫ్ సెక్రటరీపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ కోరిన రిటర్నింగ్ అధికారి జైరాం.
8:15 AM, April 10th 2024
మేమంతా సిద్ధం డే 12.. షెడ్యూల్ ఇలా..
- ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర.
- సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ
- ధూళిపాళ్ల వద్ద రాత్రి బస చేయనున్న సీఎం జగన్
Memantha Siddham Yatra, Day -12.
— YSR Congress Party (@YSRCParty) April 10, 2024
ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం
సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ
ధూళిపాళ్ల వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/YjhvEpKLEX
7:45 AM, April 10th 2024
పాలకొండ అభ్యర్థిని ప్రకటించిన పవన్..
- పాలకొండ జనసేన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణ
- ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణ
- జనసేన నుంచి విశాఖ సౌత్ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్
7:15 AM, April 10th 2024
పురందేశ్వరికి షాకిచ్చిన టీడీపీ నేతలు
- రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి నిరసన సెగ
- మిత్రపక్షాల సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతల ఆందోళన
- ఫ్లెక్సీలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ఫొటో లేదని ఆగ్రహం
- ఫ్లెక్సీ చించి రోడ్డుపై బైఠాయింపు.. స్తంభించిన ట్రాఫిక్
- పురందేశ్వరి మౌనంపై బీజేపీ నేతల ఆగ్రహం ∙
- ఇప్పటికే సోము వీర్రాజు వర్గం దూరం
- నూజివీడులో టీడీపీ అభ్యర్థి పార్థసారథికి గుబులు
- రెబల్ అభ్యర్థి ముద్దరబోయినకు జై కొట్టిన తెలుగుదేశం శ్రేణులు
- ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి
- సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేనని స్పష్టీకరణ
7:00 AM, April 10th 2024
పవన్‌కు షాకిస్తున్న జనసైనికులు..
- చంద్రబాబు చట్రంలో చిక్కుకున్న జనసేన అధినేత పవన్
- పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్న చంద్రబాబు
- గెలవని స్థానాలు జనసేనకు కట్టబెట్టిన టీడీపీ అధినేత.. ఇచ్చిన స్థానాల్లోనూ తన మనుషులే ఉండేలా కుట్రలు
- అన్నింటికీ తల ఊపుతున్న పవన్
- పవన్‌పై అసంతృప్తితో జనసేన నేతలు, అభిమానులు
- పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారణ.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు
- పార్టీకి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే పలువురు బయటకు
- వీరిలో అనేక మంది గత ఎన్నికల్లో పోటీ చేసి, గట్టి పోటీ ఇచ్చిన వారే
6:45 AM, April 10th 2024
బీసీ నేతలకు పవన్ కల్యాణ్ వెన్నుపోటు
- జనసేనలో బీసీ నేతలకు నో టిక్కెట్
- అర్థబలం ఉన్న నేతల కోసం బలహీన వర్గాల నేతలకు పవన్ హ్యాండ్
- పవన్ మోసం చేయడంతో పార్టీని వీడుతున్న బీసీ నేతలు
- క్రిష్ణా జిల్లాలో ఒకేరోజు ఇద్దరు బీసీ నేతలు జనసేనకి గుడ్ బాయ్
- విజయవాడ పశ్చిమ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా
- కైకలూరు జనసేన ఇన్ ఛార్జ్ బీవీ రావు రాజీనామా
- నగరాలు, యాదవ సామాజికవర్గాల నేతలు కావడంతో సీటివ్వని పవన్ కల్యాణ్
- సుజనా చౌదరి కోసం నగరాల నేత పోతిన మహేష్ కి హ్యాండ్ ఇచ్చిన పవన్
- కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం యాదవ నేత బీవీరావుకి హ్యాండ్ ఇచ్చిన పవన్
- మరోవైపు గోదావరి జిల్లాల్లోనూ వరుసగా బీసీ నేతలు రాజీనామా
- ఇప్పటికే శెట్టిబలిజ నేతలు పితాని బాలక్రిష్ణ, మాజీ మేయర్ సరోజ లు రాజీనామా
- ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క శెట్టిబలిజ, గౌడ వర్గ నేతలకు సీటివ్వని జనసేన
- గుంటూరులో నాదెండ్ల మనోహర్ కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్
6:30 AM, April 10th 2024
చంద్రబాబు, రఘురామరాజుకి బీజేపీ ఝలక్
- సీట్ల మార్పునకు అంగీకరించని బీజేపీ
- బీజేపీ ప్రకటించిన జాబితాలో మార్పులకు ససేమిరా
- నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కే మద్దతు
- అధికారికంగా ప్రకటించిన బిజెపి ఏపీ ఇన్ ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్
- నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లు మార్చాలని చంద్రబాబు ప్రతిపాదన
- చంద్రబాబు ప్రతిపాదనకు ససేమిరా అన్న బిజెపి
- రఘురామకృష్ణం రాజుకి నర్సాపురం సీటుపై ఆశలు గల్లంతు
- మోదీ నియమించిన శ్రీనివాస వర్మను మార్చేది లేదన్న సిద్ధార్థనాథ్ సింగ్
- ఎమ్మెల్యే సీట్ల మార్పుపైనా క్లారిటీ ఇవ్వని బిజెపి
- అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత
Comments
Please login to add a commentAdd a comment