April 10th: ఏపీ ఎన్నికల సమాచారం
April 10th AP Elections 2024 News Political Updates
10:25 AM, April 10th 2024
వైఎస్సార్సీపీలోకి పోతిన మహేష్
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాములు రాజేశ్వరి, రమేష్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు.
సీఎం జగన్ సమక్షంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైఎస్సార్సీపీలో చేరిక.
వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.
పోతిన మహేష్ ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన ఆరోపణలు
10:10 AM, April 10th 2024
జనసేన, టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరికలు..
పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీలోకి చేరికలు..
నరసాపురం మండలం చామకూరి పాలెం గ్రామంలో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు
జనసేన, తెలుగుదేశం పార్టీ నుండి సుమారు వందమంది వైఎస్సార్సీపీలో చేరిక
పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు
9:51 AM, April 10th 2024
టీడీపీకి మరో సీటు అమ్మేసిన పవన్ కల్యాణ్
పాలకొండలోనూ టీడీపీ అభ్యర్థే
నిమ్మక జయకృష్ణను జనసేన అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కల్యాణ్
వారం కిందటే టీడీపీ నుండి జనసేనలో చేరిన జయకృష్ణ
జనసేన కోసం పనిచేసిన గిరిజనులను ముంచేసిన పవన్ కల్యాణ్
అవనిగడ్డ, పాలకొండ రెండు సీట్లు టీడీపీ అభ్యర్థులకే ఇచ్చిన పవన్ కల్యాణ్
మొత్తం 21 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్
చంద్రబాబు పంపిన మనుసులకే సీట్లిచ్చిన పవన్ కల్యాణ్
భీమవరం, అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కోడూరు, అనకాపల్లి, పి గన్నవరం, పోలవరం సీట్లు చంద్రబాబు మనుషులకే కేటాయింపు
వైసీపీ నుండి వెళ్లినవారికి విశాఖ సౌత్, తిరుపతి, పెందుర్తి, మచిలీపట్నం ఎంపీ సీట్లు కేటాయింపు
నాదెండ్ల మనోహర్ ఆశీస్సులు ఉన్నవారికి తాడేపల్లిగూడెం,యలమంచిలి, నెల్లిమర్ల, నిడదవోలు, రాజోలు, నరసాపురం, కాకినాడ రూరల్ సీట్లు కేటాయింపు
జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీరని ద్రోహం చేసిన పవన్ కల్యాణ్
జనసేన ను వరుసగా వీడుతున్న బీసీ నేతలు
సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ కల్యాణ్
జనసేన జెండా మోసిన వారిని నిండా ముంచేసిన పవన్ కల్యాణ్
పక్క పార్టీ నేతల ప్యాకేజీ ముందు అభాసుపాలైన జనసేన విధేయత
9:31 AM, April 10th 2024
మహిళా కానిస్టేబుల్‌పై టీడీపీ నేత దాడి.. కేసు
బుచ్చెయ్యపేట మండలంలోని మంగళాపురంలో విధి నిర్వహణలో ఉన్న సచివాలయ మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై దాడిచేసిన టీడీపీ నాయకురాలు
మాజీ ఎంపీటీసీ సభ్యురాలు అల్లంకి ఉమాదేవిపై బుచ్చెయ్యపేట పోలీసులు కేసు నమోదు
ఈ నెల 6న పింఛన్ నగదు తీసుకునేందుకు సచివాలయానికి వెళ్లిన టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి
పింఛన్ నగదు తన వద్దకు వచ్చి ఇవ్వాలని మహిళా పోలీస్ జంపా మహాలక్ష్మితో గొడవ
విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్‌పై పరుష పదజాలంతో తిడుతూ, ఆమె మెడపై గోర్లతో గాట్లు పెట్టి మెడలో ఉన్న చైన్‌ను లాగి తెంచేసిన వైనం
అక్కడే విధి నిర్వహణలో ఉన్న తోటి సచివాలయ సిబ్బంది వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టి, తమ ఊరిలో ఎలా ఉద్యోగం చేస్తారో? చూస్తానంటూ బెదిరింపులు ఉమాదేవిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత మహిళా పోలీస్ మహాలక్ష్మి బుచ్చెయ్యపేట పోలీస్‌లకు ఫిర్యాదు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బుచ్చెయ్యపేట పోలీసులు వెల్లడి
9:20 AM, April 10th 2024
షర్మిలకు షాకిచ్చిన సామాన్యుడు.
సీఎం జగన్‌కు ఎందుకు ఓటెయ్యాలో చెప్పిన సామాన్యుడు.
షర్మిల, కాంగ్రెస్‌కు ట్విస్ట్ ఇచ్చిన వ్యక్తి.
ప్రతిపక్షాలు కుట్రలు చేసినా సీఎంగా మళ్లీ జగనే ఉండాలని ఆకాంక్షించాడు.
జనం గుండెల్లో గుడి కొట్టుకోవడం ఇదే.. వైఎస్ జగన్ గారికి, వైఎస్సార్ సీపీకి ప్రజలు మళ్లీ ఎందుకు ఓటేయాలో వారే చెబుతున్నారు వినండి.. ఈ యువకుడే కాదు.. రాష్ట్రంలోని ఎవరినీ అడిగినా ఇలాగే చెప్తారు.. ప్రతిపక్షాల కుట్రలు ప్రజల దగ్గర సాగవు. pic.twitter.com/r1poaJ0ZnH
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024
9:00 AM, April 10th 2024
కూటమి కార్యకర్తల తన్నులాట..
రాజమండ్రిలో పురంధేశ్వరి సమక్షంలో ఆత్మీయ సమావేశం
ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించివేత
తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య బాహాబాహీ.
రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించుకున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు. తిలకించండి. pic.twitter.com/v79dbCahn9
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024
8:45 AM, April 10th 2024
సీఎం రమేష్, అయ్యన్నకు ఈసీ నోటీసులు..
సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడికి ఎన్నికల కమిషన్ నోటీసులు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఇద్దరు నేతలు సంజాయిషీ ఇవ్వాలని కోరిన రిటర్నింగ్ అధికారి.
ఈనెల ఆరో తేదీన నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చీర, రూ.2 వేలు పంచిన సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడు.
డబ్బులు పంపిణీ చేస్తున్న సమయంలో ప్రశ్నించిన ఫ్లైయింగ్ స్క్వాడ్‌పై చిందులేసిన సీఎం రమేష్.
అదే సందర్భంలో చీఫ్ సెక్రటరీపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ కోరిన రిటర్నింగ్ అధికారి జైరాం.
8:15 AM, April 10th 2024
మేమంతా సిద్ధం డే 12.. షెడ్యూల్ ఇలా..
ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర.
సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ
ధూళిపాళ్ల వద్ద రాత్రి బస చేయనున్న సీఎం జగన్
Memantha Siddham Yatra, Day -12.
ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం
సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ
ధూళిపాళ్ల వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/YjhvEpKLEX
— YSR Congress Party (@YSRCParty) April 10, 2024
7:45 AM, April 10th 2024
పాలకొండ అభ్యర్థిని ప్రకటించిన పవన్..
పాలకొండ జనసేన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణ
ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణ
జనసేన నుంచి విశాఖ సౌత్ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్
7:15 AM, April 10th 2024
పురందేశ్వరికి షాకిచ్చిన టీడీపీ నేతలు
రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి నిరసన సెగ
మిత్రపక్షాల సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతల ఆందోళన
ఫ్లెక్సీలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ఫొటో లేదని ఆగ్రహం
ఫ్లెక్సీ చించి రోడ్డుపై బైఠాయింపు.. స్తంభించిన ట్రాఫిక్
పురందేశ్వరి మౌనంపై బీజేపీ నేతల ఆగ్రహం ∙
ఇప్పటికే సోము వీర్రాజు వర్గం దూరం
నూజివీడులో టీడీపీ అభ్యర్థి పార్థసారథికి గుబులు
రెబల్ అభ్యర్థి ముద్దరబోయినకు జై కొట్టిన తెలుగుదేశం శ్రేణులు
ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి
సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేనని స్పష్టీకరణ
7:00 AM, April 10th 2024
పవన్‌కు షాకిస్తున్న జనసైనికులు..
చంద్రబాబు చట్రంలో చిక్కుకున్న జనసేన అధినేత పవన్
పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్న చంద్రబాబు
గెలవని స్థానాలు జనసేనకు కట్టబెట్టిన టీడీపీ అధినేత.. ఇచ్చిన స్థానాల్లోనూ తన మనుషులే ఉండేలా కుట్రలు
అన్నింటికీ తల ఊపుతున్న పవన్
పవన్‌పై అసంతృప్తితో జనసేన నేతలు, అభిమానులు
పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారణ.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు
పార్టీకి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే పలువురు బయటకు
వీరిలో అనేక మంది గత ఎన్నికల్లో పోటీ చేసి, గట్టి పోటీ ఇచ్చిన వారే
6:45 AM, April 10th 2024
బీసీ నేతలకు పవన్ కల్యాణ్ వెన్నుపోటు
జనసేనలో బీసీ నేతలకు నో టిక్కెట్
అర్థబలం ఉన్న నేతల కోసం బలహీన వర్గాల నేతలకు పవన్ హ్యాండ్
పవన్ మోసం చేయడంతో పార్టీని వీడుతున్న బీసీ నేతలు
క్రిష్ణా జిల్లాలో ఒకేరోజు ఇద్దరు బీసీ నేతలు జనసేనకి గుడ్ బాయ్
విజయవాడ పశ్చిమ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా
కైకలూరు జనసేన ఇన్ ఛార్జ్ బీవీ రావు రాజీనామా
నగరాలు, యాదవ సామాజికవర్గాల నేతలు కావడంతో సీటివ్వని పవన్ కల్యాణ్
సుజనా చౌదరి కోసం నగరాల నేత పోతిన మహేష్ కి హ్యాండ్ ఇచ్చిన పవన్
కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం యాదవ నేత బీవీరావుకి హ్యాండ్ ఇచ్చిన పవన్
మరోవైపు గోదావరి జిల్లాల్లోనూ వరుసగా బీసీ నేతలు రాజీనామా
ఇప్పటికే శెట్టిబలిజ నేతలు పితాని బాలక్రిష్ణ, మాజీ మేయర్ సరోజ లు రాజీనామా
ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క శెట్టిబలిజ, గౌడ వర్గ నేతలకు సీటివ్వని జనసేన
గుంటూరులో నాదెండ్ల మనోహర్ కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్
6:30 AM, April 10th 2024
చంద్రబాబు, రఘురామరాజుకి బీజేపీ ఝలక్
సీట్ల మార్పునకు అంగీకరించని బీజేపీ
బీజేపీ ప్రకటించిన జాబితాలో మార్పులకు ససేమిరా
నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కే మద్దతు
అధికారికంగా ప్రకటించిన బిజెపి ఏపీ ఇన్ ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్
నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లు మార్చాలని చంద్రబాబు ప్రతిపాదన
చంద్రబాబు ప్రతిపాదనకు ససేమిరా అన్న బిజెపి
రఘురామకృష్ణం రాజుకి నర్సాపురం సీటుపై ఆశలు గల్లంతు
మోదీ నియమించిన శ్రీనివాస వర్మను మార్చేది లేదన్న సిద్ధార్థనాథ్ సింగ్
ఎమ్మెల్యే సీట్ల మార్పుపైనా క్లారిటీ ఇవ్వని బిజెపి
అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత