పురందేశ్వరికి కొత్త ట్విస్ట్‌.. రూట్‌ మార్చిన జీవీఎల్‌! | GVL Narasimha Rao Plans To Get Visakha MP Seat | Sakshi
Sakshi News home page

పురందేశ్వరికి కొత్త ట్విస్ట్‌.. రూట్‌ మార్చిన జీవీఎల్‌!

Published Tue, Apr 16 2024 9:46 AM | Last Updated on Tue, Apr 16 2024 10:19 AM

GVL Narasimha Rao Plan To Get Visakha MP Seat - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలో కొత్త ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. టికెట్‌ దక్కని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమకు టికెట్‌ దక్కించుకునేందుకు వీలున్న మార్గాలన్నింటినీ వెతుకుతూ పార్టీలకు షాకిస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి బీజేపీ ఎంపీ, సీనియర్‌ నేత జీవీఎల్‌ నరసింహారావు కూడా చేరారు. 

కాగా, విశాఖ పార్లమెంట్‌ స్థానం విషయంలో జీవీఎల్ పట్టువిడవటం లేదు. ఎలాగైనా విశాఖ నుంచి పోటీ చేయాలని ఫిక్స్‌ అయ్యారు. అయితే, ఇప్పటికే విశాఖ సీటును టీడీపీ నేత భరత్‌కు ఇచ్చినప్పటికీ జీవీఎల్‌ మాత్రం ఇంకా ఆశలు వదులుకోలేదు. ఈ క్రమంలో తనకే టికెట్‌ దక్కేలా లాబీయింగ్‌కు దిగారు. తాజాగా, ఉత్తరాది నేతలో జీవీఎల్‌ మంతనాలు ప్రారంభించారు. అలాగే, ఉత్తరాది వ్యాపారులతో కూడా జీవీఎల్‌ సమావేశమయ్యారు. 

జీవీఎల్‌.. రూట్‌ మార్చి ఉత్తరాది నేతలతో చర్చించి బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. విశాఖ సీటు తనకే దక్కేలా వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు.. జీవీఎల్‌కు మద్దతుగా జన జాగరణ సమితి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో జీవీఎల్‌కు మద్దతుగా బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డాను కూడా కలవడంతో విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రచారంలో భాగంగా జీవీఎల్‌ షాకిలిస్తున్నారు. టీడీపీ నేత భరత్‌ ప్రచారానికి జీవీఎల్‌ దూరంగా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది. టీడీపీ కార్యక్రమాలకు కూడా జీవీఎల్‌ వెళ్లడం లేదు. అంతేకాకుండా పురంధేశ్వరి, చంద్రబాబు తీరుపై జీవీఎల్‌ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement