
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ్య పుణ్యక్షేత్రం తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆభరణాల మాయంపై విచారణ చేయించి టీడీపీ ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. బుధవారం ఢిల్లీలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం జవాబు చెప్పి, భక్తుల అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. టీటీడీ వ్యవహారంపై ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నెల 26న నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుందని, అదే రోజున ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని కన్నా తెలిపారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయమని అమిత్ షా తనను ఆదేశించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు వ్యూహాన్ని రూపొందించి ప్రభావవంతంగా పనిచేయాలని అమిత్ షా సూచించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment