సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరోనాపై పోరాడుతుంటే.. టీడీపీ, బీజేపీలోని ఓ వర్గం వైఎస్సార్‌సీపీపై రాజకీయాలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు, కన్నా ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఐసిఎంఆర్ అనుమతి ఉన్న కొరియాకి చెందిన కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒక ర్యాపిడ్ టెస్ట్ కిట్ కొనుగోలుకి 730కి ఒప్పందం చేసుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అదే కిట్‌ను 790 రూపాయిలకి కొనుగోలు చేసిందని చెప్పారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారా.. లేక సొంత పార్టీపైనే చేస్తున్నారా’’ అని అమర్‌నాథ్ ప్రశ్నించారు.
(కరోనా జంతువుల నుంచే పుట్టింది: డబ్ల్యూహెచ్‌ఓ)
పర్మిషన్ ఇప్పిస్తాం.. కాణిపాకం రావొచ్చు..
20 కోట్లకు అమ్ముడుపోయిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ లైన్‌లో మాట్లాడుతున్నారని అమర్‌నాథ్ ఆరోపించారు. 790కి కొనుగోలు చేసిన కేంద్రాన్ని కన్నా నిలదీయాలని.. ఏపీ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసిన ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు. కన్నాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీరు చేసిన సవాల్‌ను ఎంపీ విజయసాయి రెడ్డి స్వీకరించారు. కాణిపాకం రావడానికి సిద్ధమని ఆయన తెలిపారు. మీరు కరోనా తర్వాత అంటున్నారు. మేము పర్మిషన్ ఇప్పిస్తాం. మీరు కాణిపాకంలో ప్రమాణం చేయడానికి ఒక్కరే రావచ్చు. చంద్రబాబు డైరక్షన్ లో మీరు పని చేస్తున్నారా లేదా ప్రమాణం చేయాలని’’ అమర్‌నాథ్ రెడ్డి అన్నారు. కన్నాకి రాత్రికి రాత్రే గుండెపోటు ఎలా వచ్చింది. వైఎస్సార్‌సీపీలోకి చేరాలని కన్నా ప్రయత్నించలేదా.. ఇంటి ముందు బ్యానర్లు కట్టుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆయన జేబు, సూటుకేసుల నిండా టీడీపీ డబ్బు నింపితే.. బీజేపీలో చేరి మాపై ఆరోపణలు చేయలేదా అని ఆయన ధ్వజమెత్తారు.
(‘కన్నా.. బీజేపీకి కన్నం వేయొద్దు)
చంద్రబాబు..కన్నా.. కరోనా ఇవన్నీ ఒకటే తెగ..
‘‘కన్నా లక్ష్మీ నారాయణ 20 కోట్లకు అమ్ముడుపోలేదా..? గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఒకరికి 20 కోట్లు ఇవ్వలేదా.. ఎన్నికల ముందు రాజధాని ప్రాంత రైతులకి భూములు వెనక్కి ఇప్పిస్తామని బీజేపీ తరపున చెప్పలేదా. ఆయన కాణిపాకం ముందు చేయాల్సిన ప్రమాణాలు చాలా ఉన్నాయని అమర్‌నాథ్ తెలిపారు. శని పట్టుకుంటే ఏడు సంవత్సరాల వరకు వదలదంటారు.. కానీ చంద్రబాబును పట్టుకుంటే శని జీవితామంతా వదలదని ఆయన ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు..కన్నా.. కరోనా ఇవన్నీ ఒకటే తెగకి చెందిన వైరస్‌లన్నారు. నారా..కన్నా ఇద్దరూ కరోనా బద్రర్స్ అని ఎద్దేవా చేశారు. కరోనా జీవితాలను నాశనం చేస్తే వీరు రాజకీయాలను నాశనం చేసే వ్యక్తులని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment