
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో నీటి లభ్యత, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అవసరాలపై చర్చించి.. కేటాయింపులు చేయడానికి శుక్రవారం హైదరాబాద్‌లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశమవుతోంది. కృష్ణా బోర్డు ఛైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా, సభ్య కార్యదర్శి పరమేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కృష్ణా బోర్డు సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) సమావేశం ఛైర్మన్ ఆర్కే జైన్ అధ్యక్షతన జరగనుంది.