krishana river
-
సాగర్‌ను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్లు
సాక్షి,పెద్దవూర(నల్లగొండ): తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ (గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు) పరిధిలోకి తీసుకువచ్చే చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. అందులో భాగంగా గెజిట్‌ను అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గాను ఒక్కో రివర్ బోర్డునుంచి ఇద్దరు చొప్పున కేంద్రం నలుగురు చీఫ్ ఇంజనీర్లను నియమించింది. కాగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఇంజనీర్లు టీకే శివరాజన్, అనుపం ప్రసాద్ బుధవారం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. సాగర్ ప్రధాన డ్యాం, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, రేడియల్ క్రస్ట్‌గేట్లను, గ్యాలరీలను, టెలీమెట్రీలతోపాటు స్పిల్‌వేను పరిశీలించారు. ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో తదితర విషయాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసు కున్నారు. బుధవారం రాత్రి సాగర్ హిల్‌కాలనీలోని అతిథిగృహంలో బసచేసి గురువారం ఉదయం పుట్టంగండి ప్రాజెక్టును, అక్కడ నుంచి ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సందర్శనకు వెళ్లనున్నారు. వీరివెంట సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ ధర్మానాయక్, ఈఈ సత్యనారాయణ, డీఈలు సుదర్శన్‌రావు, పరమేశ్, శ్రీనివాస్‌రావు, ఏఈలు సత్యనారాయణ, రవి, కృష్ణయ్య, జైల్‌సింగ్ ఉన్నారు. టెయిల్ పాండ్ పరిశీలన: నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండంలోని టెయిల్‌పాండ్‌ను బుధవారం కేఆర్ఎంబీ ఇంజనీర్లు సందర్శించారు. టెయిల్ పాండ్ డ్యాంను, డ్యాం గేట్లు, పవర్ హౌస్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. చదవండి: NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు -
కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం
సాక్షి,హైదరాబాద్: గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ సోమవారం సమావేశమైంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ ఇరిగేషన్ అధికారులు హాజరు కాగా, తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలపై చర్చించారు. రెండో సమావేశానికి కూడా తెలంగాణ అధికారులు హాజరుకాలేదు. అక్టోబర్ 14 నుంచి బోర్డులకు పూర్తి అధికారం ఇస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నదులపై చేపట్టిన ప్రాజెక్ట్‌ల వివరాలపై గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఈనెల 3న మొదటి సమావేశం నిర్వహించగా.. రెండో సమావేశానికి కూడా హాజరుకాబోమని తెలంగాణ లేఖ రాసింది. బోర్డు చైర్మన్లకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. మరొక రోజు ఈ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. -
రేపు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గవాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. రూ.125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రేపు(బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను మంత్రులు పేర్నినాని, కొడాలి నాని పరిశీలించారు. మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు రిటైనింగ్‌వాల్ నిర్మాణం మరో నిదర్శనమని పేర్కొన్నారు. నిర్వాసితులను ఇబ్బందిపెట్టకుండా రిటైనింగ్‌వాల్ నిర్మాణం జరగబోతోందన్నారు. కృష్ణలంకకు ఇక వరద కష్టం ఉండకూడదన్నదే సీఎం జగన్ ఉద్దేశమని పేర్ని నాని పేర్కొన్నారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన మాజీ సీఎస్ నీలం సాహ్ని కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్ -
మరింత అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిల్
సాక్షి, అమరావతి: కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సూచించారు. ఆయన ఆదివారం కృష్ణా,గుంటూరు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడారు. రాత్రికి ప్రకాశం బ్యారేజీకి వరద 6 లక్షల క్యూసెక్కులు దాకా వచ్చే అవకాశం ఉండటంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు,దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన పునరావాస చర్యలు తీసుకోవాలని మంత్రి అనిల్ ఆదేశించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఆయా జిల్లాలో ఇరిగేషన్ సీఈలతో మంత్రి అనిల్ ఫోన్లో మాట్లాడారు. మూడు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేవిధంగా చర్యలు చేపట్టాలని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. -
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు..
సాక్షి, విజయవాడ: పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇన్ ఫ్లో 4లక్షల 2 వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3లక్షల 97వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. 70 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రనికి 6 లక్షల క్యూసెక్కులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. -
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ..
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి కృష్ణమ్మ పోటెత్తుతోంది. పరవళ్లు తొక్కుతూ కేసరి, పట్టిసీమల నుంచి పది వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో బ్యారేజీలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. తూర్పు, పశ్చిమ కాల్వలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేయగా, బ్యారేజ్ నాలుగు గేట్లు ఎత్తివేసి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అర్ధరాత్రికి 15వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి విడుదల సామర్థాన్ని అధికారులు అంచలంచెలుగా పెంచనున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల తహశీల్ధార్లతో కలెక్టర్ ఇంతియాజ్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యారేజీకి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. -
ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ: ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా జిల్లాలోని మున్నేరు, పాలేరు, కీసర వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వీరులపాడు-దోమలూరు మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కంచికచెర్ల మండలంలో నల్లవాగు, సద్దవాగు ఉధృతి కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల నీటి ప్రవాహంతో ప్రకాశం బ్యారేజ్‌కి సుమారు 21 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. ప్రస్తుతం బ్యారేజ్‌లోని నీటిమట్టం సాధారణ స్థాయి కంటే పెరిగింది. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అదేశాలతో అధికారులు అలారం మోగించి.. ప్రకాశం బ్యారేజ్‌లోని 10 గేట్లు ఎత్తి దాదాపు 7,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పరీవాహక ప్రాంత అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. ఒడిస్సాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలలో శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార, మహేంద్రతనయ నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో నదుల్లో నీటి మట్టం బాగా పెరిగింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. -
ప్రకాశం వద్ద వరద ఉధృతి.. అధికారుల అప్రమత్తం
సాక్షి, విజయవాడ: పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌ను వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ప్రకాశంలోని 72 గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో అధికారులు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత ప్రాజెక్టును పరిశీలించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 4లక్షల 40వేల క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ప్లో ఆరులక్షల క్యూసెక్కులకు మించితే లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాసాలను సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశామని, మత్యకారులు వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. వరద మరింత పెరిగినా.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, రెస్క్యూ టీంలు కూడా సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద గంటగంటకూ పెరుగుతుండటంతో దిగువకు విడుదల చేస్తున్న వరద పరిమాణాన్ని అధికారులు పెంచుతూ పోతున్నారు. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల్లో సర్కార్ హైఅలర్ట్‌ను ప్రకటించింది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 164కు చేరింది. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ఈరోజు సాయంత్ర వరకు వరద ఇదే విధంగా కొనసాగితే ప్రాజెక్టు నిండుకుండాల మారనుంది. ఎగువన శ్రీశైలం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో నాగార్జున సాగర్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 312 టీఎంసీలుగా.. ప్రస్తుతం 281టీఎంసీలు నీటినిల్వ ఉంది. దీంతో ప్రాజెక్టులోని పూర్తి26 గేట్ల ద్వారా నీటికి దిగువకు వదలుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మూడు నదుల ముప్పు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. భీమా దూకుడు ప్రదర్శిస్తోంది. వీటికి తుంగభద్ర కూడా తోడయ్యింది. ఈ మూడు ఒక్కటై ఉమ్మడి పాలమూరు జిల్లాపై ముప్పేట దాడికి దిగాయి. ఇప్పటికే నారాయణపేట, జోగులాంబ–గద్వాల, వనపర్తి జిల్లాల్లో కృష్ణానది బీభత్సం సృష్టించింది. వరద ముప్పు 10 వేలకు పైగా ఎకరాలను ముంచెత్తింది. 16 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కృష్ణ మండల కేంద్రానికి బాహ్యప్రపంచంతో సంబం ధాలు తెగిపోయాయి. అధికారులు 38 గ్రామాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రాంపూర్ శివారులోని చేపల చెరువుకు కృష్ణమ్మ పోటెత్తడంతో చెరువు నిర్వాహకుడు వర దలో చిక్కుకుపోయాడు. అధికారులు నాటుపడవ మీద అతన్ని ఒడ్డుకు చేర్చారు. పరీవాహక గ్రామాల్లో ముం పును ఎదుర్కొనేందుకు.. ఆయా జిల్లాల కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని పల్లెల్లో మోహరించారు. వీరు గ్రామాల్లో తిరుగుతూ వరద ఉధృతిపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇటు మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తమ పరిధిలో ఉన్న కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో తిరిగి నీటమునిగిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మక్తల్ మండలం పస్పుల వద్ద దత్త క్షేత్రంలోకి వచ్చిన వరద నీరు పదేళ్ల క్రితం పరిస్థితి పునరావృతం! పదేళ్ల తర్వాత నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు ఇంత భారీమొత్తంలో ఇన్‌ఫ్లో వచ్చింది. 2009 అక్టోబర్ 3న 10.19 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ 8.54 లక్షల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టులో ఉన్న 63 క్రస్టు గేట్లలో 62 గేట్లను ఎత్తేశారు. 11 గ్రామాలకు ముప్పు.. అలంపూర్ గొందిమల్లంలో ఉన్న కృష్ణ, తుంగభద్ర సంగమం వద్ద రెండు నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాలైన ఉండవెల్లి మండలం పుల్లూరు, కలకోట్ల, మిన్నిపాడు, అలంపూర్ మండలంలో అలంపూర్, సింగవరం, మానవపాడు మండలం కొరివిపాడు, మద్దూరు, రాజోలి మండలంలో రాజోలి, తూర్పుగార్లపాడు, పడమటి గార్లపాడు, అయిజ మండల పరిధిలోని పుట్కనూరు, రాజాపురం, వేణిసోంపూర్ గ్రామాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పంట నీటమునక.. గద్వాల మండలం రేకులపల్లి గ్రామశివారులో లోయర్ జూరాల కారణంగా 200 ఎకరాల పండ్ల తోటలు, పత్తి, వరి తదితర పంటలు నీట మునిగాయి. ధరూరు మండలం భీంపురానికి చెందిన 150 ఎకరాలలో వరి, పత్తి పంటలు మునిగాయి. ఇటిక్యాల మండలం వీరాపురం, కార్పాకుల, తిమ్మాపురం గ్రామాల్లో 850 ఎకరాల్లో వరి, చెరకు, పత్తి, మిరప, ఉల్లి పంటలు మునిగాయి. పెబ్బేరు మండలం రాంపురం, రంగాపూర్, మునగమాన్‌దిన్నె, పెంచికల పాడు, ఈర్లదిన్నె గ్రామాల్లో వరి, కంది, వేరుశనగ, పంటలతో పాటు వరినారుమడులు నీట మునిగాయి. అమరచింత మండలం నందిమల్లలో 50 ఎకరాల వరి పంట నీట ముని గింది. ఆత్మకూరు మండలంలోని రేచింతల, ఆరేపల్లి, మాలమల్ల, కత్తెపల్లి, తూంపల్లి, జూరాలలో 200 ఎకరాల్లో వరిపంట నీట మునిగినట్లు అధికారుల ప్రాథమిక అంచనా. నారాయణపేట జిల్లా కృష్ణా పరీవాహక మండలాల్లో 4 వేలకు పైగా వరి, పత్తి పంటలు నీటమునిగాయి. కృష్ణ, మాగనూరు మండలాల పరిధిలోని వాసునగర్, హిందూపూర్, మొరహరిదొడ్ది, ముడుమాలు, తంగిడి, పుంజనూరు, మందిపల్లి, కొల్పూరు, గుడెబల్లూరులో 5 వేల ఎకరాల్లో పంట మునిగింది. స్తంభించిన రవాణా.. కృష్ణ మండల కేంద్రంతో పాటు, వాసునగర్ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కృష్ణ, హిందూపూర్ మధ్యనున్న వంతెన మునిగిపోవడంతో మండల కేంద్రానికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. హిందూపూర్‌లోని పలు కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. జోగులాంబ–గద్వాల జిల్లా ధరూరు మండలంలో చింతరేవుల–భీంపురం అదే మండలం బీరోలు, గుర్రంగడ్డ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. ఆత్మకూరు మండలంలోని రేచింతలకు రాకపోకలు నిలిచాయి. కృష్ణ మండలం తంగిడిలోని శ్రీదత్తభీమేశ్వర ఆలయాన్ని నీరు చుట్టు ముట్టింది. ఇటిక్యాల మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద శివాలయం, రామాలయంలోకి వరద చేరింది. మక్తల్ మండలంలోని పంచదేవ్‌పహాడ్ వద్ద ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలోకి వరద వచ్చింది. వరద ముప్పుతో నారాయణపేట, జోగులాంబ–గద్వాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సహాయక చర్యలు చేపడుతున్నారు. హెల్ప్‌లైన్ సెంటర్లు.. గద్వాల కలెక్టరేట్లో 08546–274007, నారాయణపేట కలెక్టరేట్లో 08506–283444 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. -
తుంగభద్ర 33 గేట్లు ఎత్తివేత..
సాక్షి, కర్నూలు: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 7.37 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 7.79 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ స్థామర్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 193 టీఎంసీల నీరు డ్యామ్‌లో ఉంది. శ్రీశైలం డ్యామ్‌కు నీరు విడుదల.. తుంగభద్ర జలాశయానికి భారీ వరదల నేపథ్యంలో 33 గేట్లు ఎత్తి శ్రీశైలం జలాశయానికి నీరు విడుదల చేశారు. 2,24,539 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌కు చేరుతోంది. ఇన్ ఫ్లో 2,10,282 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,24,539 క్యూసెక్కులు గా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 100 టిఎంసిలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 88.661 టిఎంసిలుగా ఉంది. తుంగభద్ర నదీపరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భద్రాచలంలో వరద తగ్గుముఖం.. భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 34 .8 అడుగులుగా కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. బ్యారేజ్ వద్ద వరద నీటిమట్టం 11.7 అడుగులుగా నమోదైంది. కాటన్ బ్యారేజ్ నుండి 9 లక్షల 97 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. వరద తగ్గుముఖం పట్టడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. డెల్టా కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. -
నేడు కృష్ణా బోర్డు సమావేశం
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో నీటి లభ్యత, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అవసరాలపై చర్చించి.. కేటాయింపులు చేయడానికి శుక్రవారం హైదరాబాద్‌లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశమవుతోంది. కృష్ణా బోర్డు ఛైర్మన్ డాక్టర్ ఆర్కే గుప్తా, సభ్య కార్యదర్శి పరమేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కృష్ణా బోర్డు సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) సమావేశం ఛైర్మన్ ఆర్కే జైన్ అధ్యక్షతన జరగనుంది. -
బిరబిరా కృష్ణమ్మ
దేవరకద్ర (మహబూబ్‌నగర్): ఎప్పడెప్పుడా అంటూ అన్నదాతలు ఎదురుచూసిన కోయిల్‌సాగర్ నీళ్ల కాల్వల్లో పరుగెత్తాయి! కృష్ణా జలాలు గలగలా ముందుకు సాగుతుంటే రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పూజలు చేసి నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఖరీ ఫ్ సాగుకు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీరు విడుదల చేశామని తెలిపారు. నీటిని వృథా చేయకుండా పంటలకు వాడుకోవాలన్నారు. జూరాల నుంచి ఇన్‌ఫ్లో ఉన్నంత వరకు కోయిల్‌సాగర్‌లో సరిపడా నీరు ఉంచి మిగతాది వదులుతామని తెలిపారు. ఈ నీటితో గొలుసు కట్టు చెరువులను నింపుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోత్తల పథకం పనులు పూర్తయితే మొదట కర్వెన రిజర్వాయర్ ద్వారా 20 టీఎంసీల నీరు పాలమూరు వదలనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని.. వారి సంక్షేమానికి రైతుబందు, రైతుబీమా పథకలను అమలు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మళ్లీ వచ్చే సారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపాల్, మార్కెట్ చైర్మన్ ఆంజనేయులుతో పాటు శ్రీకాంత్, కొండ శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేష్, బాలస్వామి, ఉమామాహేశ్వర్రెడ్డి, జెట్టి నర్సింహ్మరెడ్డి, రాము, కొండారెడ్డి, భాస్కర్‌రెడ్డి, కర్జన్రాజు, కర్వు శ్రీను పాల్గన్నారు. -
శ్రీశైలం ప్రాజెక్టుకి భారీ వరద
సాక్షి, కర్నూలు : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతికి కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.40 అడుగులకు చేరింది. 2,17,627 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా.. 2,14,642 క్కూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు గాను, ప్రస్తుతం నీటి నిల్వ 207 టీఎంసీలకు చేరింది. మరో కొన్ని గంటల పాటు ఇదే వరద కొనసాగితే ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుతుందని అధికారులు తెలిపారు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బుధవారం అధికారులు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువన ఉన్న సాగర్‌కు నీటి ప్రవాహం చేరుతోంది. అటు గోదావరి పరివాహాక ప్రాంతాల్లోను కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ప్రాజెక్టులు నిండుకుండలా మారిన విషయం తెలిసిందే. దీంతో ఖరీఫ్ పంటకు నీటి కొరత ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మదనాపురం (కొత్తకోట): రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ పంట అవసరాల కోసం ఎమ్మెల్యే బుధవారం నీరు విడుదల చేశారు. అంతకు ముందు కృష్ణాజలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు చేయూతనిస్తూ వారిని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యాన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే మార్కెట్ యార్డు స్థలంలో నిర్మిస్తున్న 160 ఇళ్ల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు రెండు నెలల్లోగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం మండలంలోని కొన్నూరు, నర్సింగపురం, గోపన్‌పేట గ్రామాలకు చెందిన 14 మంది ఎస్టీ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ మౌనిక, సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీటీసీ సభ్యులు వెంకటనారాయణ, జయంతి, రైతు సమన్వ సమితి అధ్యక్షుడు హనుమాన్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, నాయకులు రవీందర్‌రెడ్డి, గోపాలకృష్ణ, రాములు, బాలకృష్ణ, సాయిలుయాదవ్, చాంద్‌పాషా, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మహదేవన్‌గౌడ్, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ముంపు ఆగేదెన్నడు?
చీరాల, న్యూస్‌లైన్ : కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని కొమ్మమూరు రైతాంగం ముంపు బారి నుంచి బయటపడటం గగనంగా మారింది. ఏటా వ్యవసాయ సీజన్లో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా వ్యయ ప్రయాసలతో వేసిన పంటలు ముంపునకు గురై రైతులు నష్టాలపాలవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు నోటిదాకా వచ్చేలోగా నీళ్లపాలవుతున్నాయి. డెల్టా రైతాంగానికి ఇటువంటి కన్నీటి కష్టాలు ఏటా మామూలే. ముంపు నుంచి బయట పడేందుకు చేపట్టిన కృష్ణా పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులు ప్రహసనంగా మారాయి. ఎప్పుడో పూర్తికావాల్సిన పనులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనత కారణంగా మందకొడిగా సాగుతున్నాయి. రొంపేరు కుడి, ఎడమ కాలువలతో పాటు అనేక మేజర్, మైనర్ మురుగునీటి కాలువులను ఆధునికీకరించాల్సి ఉంది. ప్రధానంగా రొంపేరు కుడి, ఎడమ కాలువలను ఇప్పటి కంటే మరో 25శాతం వెడల్పు చేయాల్సి ఉంది. ఇది పూర్తయితే భారీగా వచ్చే వరదనీరు నేరుగా సముద్రంలో కలుస్తుంది. లేకుంటే వరదనీరు పంట పొలాలను ముంచెత్తుతుంది. 2006 నుంచి మొదలు.. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని వ్యవసాయ మురుగునీటి కాలువల ఆధునికీకరణకు 2006లో ప్రభుత్వం రూ. 130 కోట్లు కేటాయించింది. మూడు సార్లు టెండర్లు పిలిచినా ఆ ప్రక్రియ కొలిక్కిరాలేదు. చివరకు రెండేళ్ల క్రితం టెండర్లు ఆహ్వానించగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు మాత్రం నత్తతో పోటీపడుతున్నారు. వ్యవసాయ మురుగునీటి కాలువలు బ్రిటీష్ హయాంలో నిర్మించారు. అవి ప్రస్తుతం పూర్తిగా పాడయ్యాయి. వర్షాలు, తుపాన్ల సమయంలో కురిసే భారీ వర్షాలకు పంటలను ముంపు నుంచి కాపాడేందుకు ఈ మురుగునీటి కాలువలే దిక్కు. ఎగువ ప్రాంతాల నుంచి పంట పొలాలకు అనుసంధానమవుతూ చివరకు సముద్రంలో కలుస్తుంటాయి. కొన్నేళ్లుగా మురుగునీటి కాలువలు పనికి రాకుండా ఉన్నాయి. దీంతో చిన్నపాటి వర్షాలకే పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. జరిగింది రూ. 40 కోట్ల పనులే ఆధునికీకరణ పనుల్లో భాగంగా ప్రస్తుతం రూ. 40 కోట్ల మేర పనులు మాత్రమే పూర్తయయ్యాయి. రొంపేరు, కుడి, ఎడమ కాలువులు, మరికొన్ని మేజర్, మైనర్ కాలువలను మాత్రమే కొంత మేర తవ్వారు. ఇంకా కాలువల వెడల్పు చేయాల్సి ఉంది. వ్యవసాయ సీజన్ ముగిసిన తర్వాత అంటే.. వేసవి కాలంలోనే ఆధునికీకరణ పనులు చేయాల్సి ఉంది. మరో ఏడాదిన్నరతో కాంట్రాక్టర్లకు కాలపరిమితి ముగియనుంది. ఆధునికీకరించాల్సిన కాలువలు ఇవే.. రొంపేరు రైట్ ఆర్మ్, లెఫ్ట్ ఆర్మ్, వేటపాలెం, ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ కాలువలు, కుందేరు డ్రెయిన్, పర్చూరు వాగు, ముప్పాళ్ల వాగు, మద్దిరాల వాగు, సాకి డ్రెయిన్, పర్చూరు సబ్‌ప్లస్, నక్కలవాగు, ఆలేరు, అప్పేరు వాగులు, ఈదుమూడి, మట్టిగుంట, నాగండ్ల వాగులతో పాటు మొత్తం 27 డ్రెయినేజీ కాలువలను ఆధునికీకరించాల్సి ఉంది. డ్రైయినేజీ కాలువల వ్యవస్థ సక్రమంగా ఉంటే ముంపు నుంచి పంటలు దెబ్బతినే పరిస్థితి ఉండదు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షం నీరు డ్రైయినేజీ కాలువల ద్వారా నేరుగా సముద్రంలో కలుస్తాయి. దీంతో పంటలు ముంపు నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం కాలువలు అధ్వానస్థితికి చేరటంతో కొద్దిపాటి వర్షాలకే పంటపొలాలు మునుగుతున్నాయి. -
20 టీఎంసీల మట్టానికి సోమశిల
సోమశిల, న్యూస్‌లైన్: సోమశిల జలాశయం నీటి నిల్వ 20 టీఎంసీలకు చేరుతోంది. పైతట్టు ప్రాంతాల నుంచి ఆదివారం సాయంత్రానికి జలాశయానికి 6,700 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. పెన్నా పరీవాహక ప్రాంతాలైన చెన్నూరు గేజీ వద్ద సాయంత్రానికి 6,500 క్యూసెక్కుల వరద నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 19.78 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ ప్రవాహం కొనసాగితే సోమవారానికి 20 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంటుంది. జూలైలో డెడ్ స్టోరేజీ 7.4 టీఎంసీల నీటి నిల్వ ఉన్న సోమశిల జలాశయానికి కృష్ణా నదీ జలాల వల్ల 20 టీఎంసీలకు చేరువైంది. ప్రవాహం మరికొద్ది రోజులు కొనసాగవచ్చని అధికారుల అంచనా ప్రస్తుతం జలాశయంలో 89.20 మీటర్లు, 289.37 అడుగుల మట్టం నమోదైంది. సగటున 139 క్యూసెక్కులు నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది.