సాక్షి, కర్నూలు: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 7.37 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 7.79 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ స్థామర్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 193 టీఎంసీల నీరు డ్యామ్‌లో ఉంది.
శ్రీశైలం డ్యామ్‌కు నీరు విడుదల..
తుంగభద్ర జలాశయానికి భారీ వరదల నేపథ్యంలో 33 గేట్లు ఎత్తి శ్రీశైలం జలాశయానికి నీరు విడుదల చేశారు. 2,24,539 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌కు చేరుతోంది. ఇన్ ఫ్లో 2,10,282 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,24,539 క్యూసెక్కులు గా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 100 టిఎంసిలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 88.661 టిఎంసిలుగా ఉంది. తుంగభద్ర నదీపరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
భద్రాచలంలో వరద తగ్గుముఖం..
భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 34 .8 అడుగులుగా కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. బ్యారేజ్ వద్ద వరద నీటిమట్టం 11.7 అడుగులుగా నమోదైంది. కాటన్ బ్యారేజ్ నుండి 9 లక్షల 97 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. వరద తగ్గుముఖం పట్టడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. డెల్టా కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment