thungabadra
-
రాయలసీమ రైతుల ఆనందం.. కానీ చివరికి
-
అయ్యో తల్లీ.. ఎంత పని చేశావ్?
సాక్షి, బళ్లారి అర్బన్: తాలూకాలోని మోకా పోలీస్టేషన్ పరిధిలో సింధవాళ దగ్గర తుంగభద్ర ఎల్ఎల్సీ కాలువలోకి తల్లి ఇద్దరు బిడ్డలతో దూకింది. తల్లి గల్లంతు కాగా ఒక చిన్నారి చనిపోగా, మరో చిన్నారి సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. నగరంలోని గుగ్గరహట్టికి చెందిన లక్ష్మి(27)కి కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హత్తిబెళగల్ గ్రామానికి చెందిన వెంకటేష్‌తో పెళ్లయింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. రెండురోజుల కిందట భర్తతో గొడవపడి లక్ష్మి తన నలుగురు పిల్లల్లో ఇద్దరిని తీసుకుని గుగ్గరహట్టిలోని పుట్టింటికి వచ్చింది. తమ్ముడు సురేష్ బుజ్జిగించి భర్త ఇంటికి వెళ్లాలని ఆలూరు బస్సు ఎక్కించి పంపించాడు. భర్త వద్దకు వెళ్లడం ఇష్టం లేని ఆమె మధ్యలో దిగిపోయి సింధవాళ దగ్గర ఉన్న కాలువలోకి పిల్లలతో కలిసి దూకింది. సమీప పొలాల్లో పని చేస్తున్న రైతులు పరుగున వచ్చి కాపాడేందుకు యత్నించారు. ఇద్దరు పిల్లలు వారి చేతికి దొరకగా, తల్లి కాలువలో కొట్టుకుపోయింది. అయితే వారిలో శాంతి అనే చిన్నారి మృతి చెందింది. వెన్నెల అనే చిన్నారి బతికినట్లు మోకా ఎస్ఐ పరశురామ్ తెలిపారు. ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. (చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా?) -
జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం
-
3 రోజుల్లో శ్రీశైలం ఫుల్!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, దాని ఉప నదుల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమ యానికి జలాశయంలో నీటి నిల్వ 134.95 టీఎంసీలకు చేరింది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షా లు కురుస్తుండటంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో స్థిరంగా వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లతోపాటు తుంగభద్ర డ్యామ్ నుంచీ వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి 1.75 లక్షల క్యూసెక్కులు, తుంగభద్రపై ఉన్న సుంకేశుల బ్యారేజీ ద్వారా 1.60 లక్షల క్యూసెక్కులు కలిపి.. మూడు లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహంతో వేగంగా నిండుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండేందుకు ఇంకా 80 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి స్థిరంగా వరద వస్తుండటంతో మూడు రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండి, గేట్లెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 31వేలకు పైగా క్యూసెక్కులు దిగువకు వెళ్లిపోతున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా మరో 2,400 క్యూసెక్కులను మళ్లిస్తున్నారు. భద్రాచలం వద్ద తగ్గిన వరద ఎగువన వానలు నిలిచిపోయి, నీటి చేరిక తగ్గిపోవడంతో గోదావరి శాంతించింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి భద్రాచలం వద్ద ప్రవాహం 15,96,899 క్యూసెక్కులకు, నీటి మట్టం 56.1 అడుగులకు తగ్గింది. వరద 53 అడుగులకన్నా తగ్గే వరకు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. ఎగువన వర్షాలు లేకపోతే మరో మూడు రోజుల్లో వరద ఉధృతి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. గోదావరిలో ఎగువన శ్రీరాంసాగర్‌లోకి 96 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఎల్లంపల్లికి ప్రవాహం 69,487 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాణహిత, ఇంద్రావతి ఇతర నదుల్లో ఇంకా ప్రవాహం ఉండటంతో.. లక్ష్మి బ్యారేజీకి 6,06,240 క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజీకి 11,06,400 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ బ్యారేజీకి 15,48,608 క్యూసెక్కుల భారీ వరద కొనసాగుతోంది. వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ నుంచి వరద కాల్వ ద్వారా 15 వేల క్యూసెక్కులు, కాకతీయ కాల్వ ద్వారా 3,500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
బిరబిరా కదిలొస్తున్న కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది కూడా కృష్ణమ్మ ముందే కదిలింది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవా హం పెరిగింది. శనివారం ఆల్మట్టి జలాశయంలోకి 1.18 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. జూన్ మూడో వారంలో ఆల్మట్టి జలాశయంలోకి ఈ స్థాయి వరద రావడం గత పదేళ్లలో ఇదే ప్రథమం. కృష్ణా నది జన్మస్థానమైన మహాబలేశ్వర్ పర్వతాల్లో శనివారం 200 మి.మీ. భారీ వర్షం కురిసింది. కోయినా డ్యామ్ వద్ద 143, అగుంబే వద్ద 71.12, వర్ణ డ్యామ్ వద్ద 52 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఆల్మట్టిలోకి వచ్చే వరద ప్రవాహం 1.41 లక్షల క్యూసెక్కులకు పె రుగుతుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఆది, సోమవారాలు భారీ వర్షా లు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. తుంగభద్ర బేసిన్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం తుంగభద్ర డ్యామ్‌లోకి వచ్చే వరద ప్రవాహం 35 వేల క్యూసెక్కులకు పెరుగుతుందని సీడబ్ల్యూసీ పేర్కొంది. -
టీబీ డ్యామ్ సామర్థ్యంపై పేచీ
సాక్షి, అమరావతి: తుంగభద్ర (టీబీ) డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యంపై కర్ణాటక మడత పేచీ పెడుతోంది. డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలు కాదని, వాస్తవానికి అది 105.79 టీఎంసీలని ఆర్వీ అసోసియేట్స్ ఇటీవల నిర్వహించిన టోపోగ్రాఫికల్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో తేలిన అంశాల ఆధారంగా డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యాన్ని 105.79 టీఎంసీలుగా ఆమోదించాలని గతేడాది టీబీ బోర్డు నిర్వహించిన 216వ సమావేశంలో చేసిన ప్రతిపాదనను తెలుగు రాష్ట్రాలు ఆమోదించగా కర్ణాటక మాత్రం వ్యతిరేకించింది. దీంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, బోర్డు కార్యదర్శి నేతృత్వంలో జాయింట్ కమిటీని నియమించి సర్వేలో వెల్లడైన అంశాలపై అధ్యయనం జరపాలని బోర్డు ప్రతిపాదించింది. తొలుత దీన్ని అంగీకరించిన కర్ణాటక ఆ తర్వాత జాయింట్ కమిటీ అధ్యయనంపై దాటవేస్తూ వచ్చింది. తాజాగా డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యంపై రీ–సర్వే చేయాలని డిమాండ్ చేస్తోంది. నాడు 133.. నేడు 105.79 టీఎంసీలు కర్ణాటకలోని హోస్పేట్ వద్ద తుంగభద్రపై 133 టీఎంసీల సామర్థ్యంతో టీబీ డ్యామ్‌ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక 1953 నాటికి ఉమ్మడిగా పూర్తి చేశాయి. అప్పట్లో ఈ డ్యామ్‌లో గరిష్టంగా 132.47 టీఎంసీలను నిల్వ చేశారు. ఈ నిల్వ సామర్థ్యం ఆధారంగా తుంగభద్ర డ్యామ్ వద్ద 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ ప్రవాహ, ఆవిరి నష్టాలు 18 టీఎంసీలు పోనూ హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన ఛానళ్ల కింద కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు పది), ఆర్డీఎస్ కింద తెలంగాణకు 6.51 కలిపి మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేసింది. ఆ మేరకు మూడు రాష్ట్రాలకు 1953 నుంచి తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది. అయితే నదీ పరీవాహక ప్రాంతంలో అడవులను అడ్డగోలుగా నరికి వేయడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు భూమి కోతకు గురై తుంగభద్ర డ్యామ్‌లోకి పూడిక చేరుతోంది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు టీబీ బోర్డు డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యంపై సర్వేలు చేస్తుంది. డ్యామ్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసిన తర్వాత తొలిసారిగా 1963లో బోర్డు సర్వే చేసింది. ఆ సర్వేలో పూడిక వల్ల డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 114.66 టీఎంసీలకు తగ్గిందని బోర్డు తేల్చింది. పూడిక వల్ల నిల్వ సామర్థ్యం తగ్గడం, వరద రోజులు తగ్గడంతో డ్యామ్ వద్ద నీటి లభ్యత తగ్గిపోతోందని దామాషా పద్ధతిలో బోర్డు నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో 2008లో బోర్డు నిర్వహించిన సర్వేలో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలకు తగ్గినట్లు వెల్లడైంది. ఆ తర్వాత 2016లో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యంపై టోపోగ్రాఫికల్ సర్వే పనులను ఆర్వీ అసోసియేట్స్‌కు బోర్డు అప్పగించింది. ఈ సర్వేలో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలని తేల్చుతూ గతేడాది టీబీ బోర్డుకు నివేదిక ఇచ్చింది. 2008 సర్వేతో పోల్చితే తాజా సర్వేలో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 4.94 టీఎంసీల మేర పెరిగినట్లు తేలింది. మళ్లీ సర్వేకు కర్ణాటక పట్టు.. టీబీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని వాదిస్తూ వస్తున్న కర్ణాటక సర్కార్‌కు తాజా సర్వేలో నిల్వ సామర్థ్యం పెరిగిందని తేలడం మింగుడు పడడం లేదు. దీంతో దీన్ని ఆమోదించేందుకు నిరాకరిస్తోంది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఐదేళ్లకు ఒకసారి నీటి నిల్వ సామర్థ్యంపై అధ్యయనం చేయాలని, 2016లో సర్వే పనులు చేపట్టారని, ఇప్పుడు ఐదేళ్లు పూర్తయ్యాయని పేర్కొంటూ ఫిబ్రవరి 17న బోర్డుకు లేఖ రాసింది. మళ్లీ కొత్తగా సర్వే నిర్వహించాలని కర్ణాటక పట్టుబడుతోంది. అయితే నీటి నిల్వ సామర్థ్యాన్ని ఆమోదించకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాలకు నష్టం కలుగుతోంది. సర్వేలో వెల్లడైన సామర్థ్యం 105.79 టీఎంసీల ఆధారంగా నీటిని పంపిణీ చేస్తే ఏపీ, తెలంగాణకు వాటా అధికంగా వస్తుందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
అనూహ్యం తుంగభద్రలో 4.94 టీఎంసీల పెరుగుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన తుంగభద్ర డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలుగా తేలింది. 2008లో ఇది 100.85 టీఎంసీలు కాగా.. గడచిన పుష్కర కాలంలో వరద ప్రవాహం వల్ల డ్యామ్‌లో పూడిక తొలగడంతో నీటి నిల్వ సామర్థ్యం 4.94 టీఎంసీల మేర పెరిగింది. తుంగభద్ర బోర్డు ఇటీవల డ్యామ్‌లో పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని తేల్చేందుకు చేయించిన టోపోగ్రాఫిక్ (స్థలాకృతి), బ్యాథిమెట్రిక్ (నీటి లోతు) సర్వేల్లో ఈ విషయం స్పష్టమైంది. ఈ దృష్ట్యా వచ్చే బోర్డు సమావేశంలో సర్వే వివరాలను వెల్లడించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని ఖరారు చేయాలని తుంగభద్ర బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో తాజా నీటి నిల్వ సామర్థ్యం మేరకు.. మూడు రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేయాలని తుంగభద్ర బోర్డును ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కోరింది. తొలినాళ్లలో నీటి నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీలు 1944లో బ్రిటిష్ సర్కార్ పాలనలో మద్రాసు, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కర్ణాటకలో హోస్పేట్ వద్ద తుంగభద్రపై 133 టీఎంసీల సామర్థ్యంతో డ్యామ్ నిర్మాణం చేపట్టారు. 1953 నాటికి నిర్మాణం పూర్తికాగా.. అప్పట్లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ పూర్తి సామర్థ్యం132.47 టీఎంసీలని తేలింది. డ్యామ్ వద్ద 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు 10), తెలంగాణకు 6.51 చొప్పున మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేస్తూ వస్తోంది. ఏటా 0.57 టీఎంసీల తగ్గుదల ఏటా ప్రవాహంతో కలిసి డ్యామ్‌లోకి మట్టి చేరుతూ వస్తోంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు డ్యామ్‌లో నీటి నిల్వ ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు తొలిసారిగా 1963లో తుంగభద్ర బోర్డు సర్వే చేయించింది. డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం 114.66 టీఎంసీలకు తగ్గిందని అప్పట్లో బోర్డు తేల్చింది. పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం, అతివృష్టి, అనావృష్టి సమయాల్లో నదిలో వరద రోజులు తగ్గడంతో డ్యామ్ వద్ద నీటి లభ్యత తగ్గిపోతోందని గుర్తించిన బోర్డు నీరు లభించిన మేరకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో 2008లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలకు తగ్గినట్లు వెల్లడైంది. అంటే 1953 నుంచి 2008 వరకూ 55 ఏళ్లలో 21.62 టీఎంసీల మేర తగ్గింది. 1953 నుంచి 2008 వరకూ వివిధ సందర్భాల్లో నిర్వహించిన సర్వేలను పరిశీలిస్తే.. డ్యామ్‌లో పూడిక పేరుకుపోతుండటం వల్ల నీటి నిల్వ సామర్థ్యం ఏటా 0.57 టీఎంసీల మేర తగ్గుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదిలావుంటే.. 2008 తర్వాత వివిధ సందర్భాల్లో డ్యామ్‌కు భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరగా.. గేట్లు ఎత్తేసి వరదను దిగువకు విడుదల చేశారు. ఆ వరద ప్రవాహంలో డ్యామ్‌లోని పూడిక కొంతమేర తొలగిపోయినట్టు తాజా సర్వేల్లో వెల్లడైంది. దాంతో నీటి నిల్వ సామర్థ్యం 2008లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే తాజాగా 4.94 టీఎంసీల మేర పెరిగినట్టు తేలింది. వచ్చే సమావేశంలో మూడు రాష్ట్రాల అధికారులతో తుంగభద్ర బోర్డు చర్చించి నీటి నిల్వ సామర్థ్యాన్ని ఆమోదించనుంది. -
తుంగభద్ర పుష్కరాలు: మహానేత ఫొటో సైతం..
సాక్షి, అలంపూర్: మధురస్మృతులు.. జీవితంలో ఎప్పటికీ మర్చిపోని తీపి జ్ఞాపకాలు. తుంగభద్ర పుష్కరాల్లో అలాంటి మధుర జ్ఞాపకాలను పలువురు భక్తులు గుర్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కురుమూర్తి 2008లో భూత్పూర్ మండలంలో పంచాయతీరాజ్ ఏఈగా విధులు నిర్వహించేవారు. ఆయన అప్పటి పుష్కరాలకు భార్య రూపవాణి, ఏడాది వయస్సున్న కుమార్తె శ్రీసాయి చందనతో వచ్చి జోగుళాంబ ఘాట్‌లో పుష్కర స్నానాలు చేశారు. ఆ సమయంలో ‘సాక్షి’లో వారి ఫొటో ప్రముఖంగా ప్రచురణ అయ్యింది. తిరిగి 12ఏళ్ల తర్వాత వారి కుమార్తె శ్రీసాయి చందనతో కలిసి సోమవారం పుష్కర స్నానాలు ఆచరించారు. ఆ నాడు పత్రికలో వచ్చిన ప్రతులను వారు చూపిస్తూ తీపి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. నాడు తుంగభద్ర పుష్కరాల్లో పుష్కర స్నానం చేస్తున్న బాలిక శ్రీసాయి చందన, తల్లిదండ్రులు ఈ ఏడాది పుష్కరాల్లో.. మహానేత వైఎస్సార్ ఫొటో సైతం.. అలాగే, 2008 తుంగభద్ర పుష్కరాలకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి తుంగభద్ర పుష్కరాల ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ ఫొటో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దివంగత మహానేత వైఎస్సార్ అభిమానులు ఆ నాటి స్మృతులను ఇలా గుర్తు చేసుకుంటున్నారు. ఈ పుష్కరానికి పెద్దయి వచ్చా..! మానవపాడు: నారాయణపేట జిల్లా మరికల్ మండలం చెందిన సిద్ధిలింగమ తన మనవడు రామ్‌చరణతో కలిసిఅలంపూర్ తుంగభద్ర పుష్కరాలకు 2008లో వచ్చారు. అప్పుడు మళ్లీ కలుస్తామంటూ ఈ సారి తన అవ్వతో కలిసి పుష్కరాల్లో పాల్గొన్నారు. 2008లో పుష్కరాలకు వచ్చినప్పుడు.. ప్రస్తుతం పుష్కరాలకు అవ్వతో వచ్చిన రామ్‌చరణ్ -
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పుష్కరాలు
-
‘ఏటి’ కష్టాలు!
కర్నూలు, ఎమ్మిగనూరు: తుంగభద్ర నదిపై ‘నాగలదిన్నె బ్రిడ్జి’ నిర్మాణం కొనసా..గుతూనే ఉంది. గత పాలకుల వైఫల్యాలు ప్రజలకు శాపాలుగా మారాయి. ఎనిమిదేళ్లుగా అటు బ్రిడ్జి నిర్మాణం పూర్తికాక, ఇటు పుట్టి ప్రయాణాలకు అనుమతుల్లేక ప్రజలు నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయలసీమ – తెలంగాణ జిల్లాలను అనుసంధానం చేస్తూ నందవరం మండలం నాగలదిన్నె, తెలంగాణలోని అయిజ మధ్య తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మాణానికి 1993లో అంకురార్పణ చేశారు. 1992లో తుంగభద్రకు వరదలు రావటంతో బ్రిడ్జి ఆవశ్యకత ఏర్పడింది. 1993లో పనులు మొదలైనా..అధికారికంగా చేపట్టింది మాత్రం 2003లోనే. అయితే.. 2009 అక్టోబర్ 2నతుంగభద్ర వరద కారణంగా అప్పటివరకు కట్టిన బ్రిడ్జి పూర్తిగా నేల మట్టమైంది. మూడేళ్ల అనంతరం 2012లో బ్రిడ్జి పునర్నిర్మాణానికి మళ్లీ టెండర్లు పిలిచి.. పనులను ప్రారంభించారు. 2016 డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని గడువిచ్చారు. పనులు మొదలై ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇంతవరకు 80 శాతం కూడా పూర్తి కాలేదు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారుల మధ్య సమన్వయలోపం, చేసిన పనులకు గతంలో సరిగా బిల్లులు ఇవ్వకపోవడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. అడుగడుగునా అవరోధాలు రూ.41 కోట్లతో చేపట్టిన నాగలదిన్నె బ్రిడ్జి నిర్మాణానికి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటికీ తుంగభద్ర నది ఆవలి భాగం తెలంగాణలో ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరం. తుంగభద్ర నదికి అటువైపు భూసేకరణ సమస్యగా మారింది. పాత బ్రిడ్జి స్థానంలో కాకుండా స్వల్ప మార్పులు చేసి కొత్త డిజైన్‌తో నిర్మాణం చేపట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. భూ సేకరణ కోసం అక్కడి ప్రభుత్వం, రైతుల మధ్య సమన్వయం కుదరలేదు. ఇప్పటిదాకా మొత్తం 27 పిల్లర్ల నిర్మాణం పూర్తి చేశారు. వాటిపై ప్లాట్‌ఫారంగా 84 పీఎస్సీ (ప్రీజ్ స్ట్రక్చర్ కాంక్రీట్) స్లాబ్‌లను వేశారు. అయినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో భూసేకరణ సమస్యను పరిష్కరిస్తేనే నిర్మాణం పూర్తవుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇబ్బందుల్లో ప్రజలు నాగలదిన్నె బ్రిడ్జి పూర్తయితే రాయలసీమ – తెలంగాణ జిల్లాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి. నదిలో రెండేళ్లుగా పుట్టి ప్రయాణాలను కూడా నిషేధించారు. దీంతో తుంగభద్ర నది దాటాలంటే అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిపైనే నడక సాగించాల్సి వస్తోంది. వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. తెలంగాణ వైపు రోడ్డు నుంచి బ్రిడ్జి 40 అడుగుల ఎత్తులో ఉండటంతో ప్రయాణికులు ఇనుపరాడ్లతో కూడిన నిచ్చెన నుంచి దిగాల్సి వస్తోంది. ప్రమాదంతో కూడిన ప్రయాణాలు కావటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళుతున్నారు. -
ఆర్డీఎస్‌పై చిగురిస్తున్న ఆశలు
ఎమ్మిగనూరు: తుంగభద్ర జలాలతో పసిడి పంటలను పండించాలనే ఉద్దేశంతో దాదాపు 69 ఏళ్ల క్రితమే చేపట్టాల్సిన నిర్మాణం ఇది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వెరసి మరుగున పడిన ప్రతిపాదనకు 2006లో మహానేత వైఎస్ఆర్ జీవం పోసిన ఆర్డీఎస్ కుడి కాలువపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత పాలకులు చేపట్టిన లోపాయికారి టెండర్ విధానాలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం, సత్వర ప్రాధాన్యత ప్రాజెక్టు నిర్మాణాలపై నిపుణుల కమిటిని నియమించింది. నిపుణుల కమిటీ నివేదికపై ప్రాజెక్టుల ప్రాధాన్యతను బట్టి నిర్మాణాలు త్వరితగతినా చేపట్టేలా చర్యలు మొదలు కానున్నాయి. అందులో భాగంగా ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణంపై రైతాంగం ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను నీటిపారుదలశాఖ మంత్రి, ఆశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. జిల్లాకు చెందిన ఇరిగేషన్ ఇంజినీర్లతో కలసి ప్రాజెక్టువల్ల ఒనగూరే ప్రయోజనాలు, ఆయకట్టు సాగు విస్తీర్ణంపై వివరించారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నాలుగు టీఎంసీల నీటి వాటాను వినియోగించుకొనేందుకు ఇరిగేషన్‌శాఖ ప్రతిపాదించి నిర్మాణానికి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులు కూడా ఇచ్చింది. కానీ ఐదేళ్లుగా నిర్లక్ష్యం చూపిన అప్పటి ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనాల కోసం ఆర్డీఎస్ పనులకు రూ.1550.99 కోట్లతో టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఒప్పందాలు కుదుర్చుకొంది. అనంతరం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత పారదర్శకమైన పాలన అందించాలనే లక్ష్యంతో సార్వత్రిక ఎన్నికల నాటికి 25 శాతం కూడా పనులు జరగని ఒప్పందాలన్నింటిపై ఆంక్షలు విధించారు. పశ్చిమ పల్లెల్లో నీటి కష్టాలకు చెక్ 1950లో కోసిగి మండలంలోని అగసనూరు, కర్ణాటకలోని రాజోళి మధ్యన తుంగభద్రనదిపై ఆర్డీఎస్ ఆనకట్ట కట్టారు. ఈ ఆనకట్టకు ఇరువైపుల కుడి, ఎడమ కాలువలను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే మొదట్లో కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాల్లోని రైతాంగం కోసం ఆర్డీఎస్ ఎడమ కాలువ నిర్మాణం జరిగింది. అనంతరం కుడి కాలువ నిర్మాణాన్ని పాలకులు విస్మరించారు. ప్రాధాన్యత క్రమంలో యూఆర్‌ఆర్ (అప్పర్ రైపేరియన్ రైట్స్) ప్రకారం మొదటి నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుకు ఇబ్బందులు ఏర్పడితే అదే ప్రాంతంలో మరో ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేయాలి. దీంతో దశాబ్దాలుగా కుడికాలువ నిర్మాణానికి నోచుకోలేదు. అయితే ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి చేపట్టగానే సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత పెరగటంతో 2005లో ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం ప్రస్తావనలోకి వచ్చింది. అందుకు అనుగుణంగానే కృష్ణా ట్రిబ్యునల్‌కు అప్పటికే 12 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదిత ప్రాజెక్టుగా ఉన్న కుడికా>లువ నిర్మాణంను అంతరాష్ట్ర చీఫ్ ఇంజినీరు ట్రిబ్యునల్ ముందుంచారు. ఫలితంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్ కుడికాలువకు తుంగభద్రనది నుంచి 4టీఎంసీల నీటిని కేటాయిస్తూ తీర్పు వెలువరించింది. కోసిగి మండలం సాతనూరు నుంచి మంత్రాలయం, నాగలదిన్నె, పోలకల్, గూడూరు, నాగలాపురం మీదుగా పర్ల వరకు కుడికాలువ నిర్మాణం ప్రతిపాదించారు. ఈ కాలువ ద్వారా సుమారు 35వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనీ నిర్దేశించుకొన్నారు. డీపీఆర్‌కు మూడేళ్లు: రూ.3.09 కోట్లతో డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సర్వేకు మూడేళ్లు పట్టింది. 2019లో ఎన్నికల వేడి ముందే రూ.1550.99 కోట్లతో టెండర్లు పిలిచింది. ఎన్సీసీ వారు ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్ దక్కించుకొని అగ్రిమెంట్ కుదుర్చుకొన్నారు. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ రావటం, ఎన్నికల హడావుడిలో కాలం గడిచిపోయింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాల ఒప్పందాలు, ఆవశ్యకతలపై నిపుణుల కమిటీని నియమించింది. అయితే టెండర్ దక్కించుకొన్న ఎన్సీసీ స్వచ్ఛందంగా ఈ కాంట్రాక్టు ఒప్పందాల నుంచి తప్పుకొనే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారుల్లో చర్చ నడుస్తోంది. నిపుణుల కమిటీ నివేదిక అందగానే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకొనేలా చర్యలు ప్రారంభమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. కరువు రైతుకు సాగునీటి ఫలాలు చేరాలి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషి వల్లే కృష్ణాట్రిబ్యునల్కు 12 ఎంసీలు ప్రతిపాదిస్తే 4 ఎంసీలు కేటాయించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్లు గడిచిపోయాయి. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం సత్వరమే చేపట్టాలని, అందుకు ఉన్న అడ్డంకులన్నింటిని క్లియర్ చేయాలని సాగునీటిశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కలసి అధికారులతో ప్రజెంటేషన్ ఇప్పించాం. నిపుణుల కమిటీ నివేదిక అందగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకుపోతామని మంత్రి హామీ ఇచ్చారు. – వై.బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే -
తుంగభద్రకు వరద; హెచ్చరించిన కమీషనర్
సాక్షి, కర్నూల్ : ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా ఉండగా, సాయంత్రానికి లక్ష క్యూసెక్కులకు చేరే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కర్నూలు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలకు వరద నీరు వచ్చే అవకాశముందని, నదీ పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ఆ శాఖ కమీషనర్ సూచించారు. మరోవైపు గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా కమీషనర్ అధికారులను అప్రమత్తం చేశారు. -
తుంగభద్ర 33 గేట్లు ఎత్తివేత..
సాక్షి, కర్నూలు: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 7.37 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 7.79 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ స్థామర్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 193 టీఎంసీల నీరు డ్యామ్‌లో ఉంది. శ్రీశైలం డ్యామ్‌కు నీరు విడుదల.. తుంగభద్ర జలాశయానికి భారీ వరదల నేపథ్యంలో 33 గేట్లు ఎత్తి శ్రీశైలం జలాశయానికి నీరు విడుదల చేశారు. 2,24,539 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌కు చేరుతోంది. ఇన్ ఫ్లో 2,10,282 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,24,539 క్యూసెక్కులు గా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 100 టిఎంసిలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 88.661 టిఎంసిలుగా ఉంది. తుంగభద్ర నదీపరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భద్రాచలంలో వరద తగ్గుముఖం.. భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 34 .8 అడుగులుగా కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. బ్యారేజ్ వద్ద వరద నీటిమట్టం 11.7 అడుగులుగా నమోదైంది. కాటన్ బ్యారేజ్ నుండి 9 లక్షల 97 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. వరద తగ్గుముఖం పట్టడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. డెల్టా కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. -
మతం ఆ ప్రేమజంటను చంపేసింది..
కర్లపాలెం (బాపట్ల): గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెంలో మైనర్ ప్రేమజంట గురువారం తుంగభద్ర డ్రెయిన్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏట్రవారిపాలెంకి చెందిన అక్కల స్వామిరెడ్డి కుమారుడు తిరుపతిరెడ్డి (18), అదే గ్రామానికి చెందిన షేక్ రెహ్మాన్ చిన్న కుమార్తె షేక్ రిజ్వానా (16) ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. రిజ్వానా ఇటీవల పదోతరగతి పరీక్షలు రాసింది. బుధవారం గ్రామం నుంచి వెళ్లిపోయిన ప్రేమికులు గురువారం గ్రామ సమీపంలోని తుంగభద్ర డ్రెయిన్ వద్దకు చేరుకున్నారు. తాము ప్రేమించుకున్నామని, ఒకర్ని విడిచి ఒకరం ఉండలేమని, ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంటున్నామని కుటుంబీకులకు ఫోన్‌లోతెలిపారు. కుటుంబీకులు వారున్న చోటికి వెళ్లి చూడగా తిరుపతిరెడ్డి బైక్, సెల్‌ఫోన్, రిజ్వానా చున్నీ, తుంగభద్ర కట్టపై ఉన్నాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ గజ ఈతగాళ్లతో డ్రెయిన్‌లో వెతికించగా మృతదేహాలు లభ్యమయ్యాయి. -
తుంగభద్రలో ఇసుక తోడేళ్లు!
కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): తుంగభద్ర నదిలో ఇసుక తోడేళ్లు చొరబడ్డాయి. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ నదీగర్భం నుంచి ఇసుకను తోడేస్తుండటంతో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయే ప్రమాదం దాపురించింది. ఇప్పటికే ప్రమాద స్థాయికి భూగర్భజలాలు పడిపోయాయి. ఇసుక మాఫియా నిత్యం ఇసుకను తరలిస్తే నదీపరివాహకం పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికార, అనధికార రీచ్‌ల ద్వారా వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం విజిలెన్స్ దాడుల్లో 25 ట్రాక్టర్లు సీజ్ చేయడమే ఇందుకు నిదర్శనం. అంతా బ్లాక్‌లోనే.. అధికారికంగా ఉన్న పది రీచ్‌లలో 3.76 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నాయి. గత ఏడాది మార్చి నుంచి ఒక్క ప్రభుత్వ అభివృద్ధి పనులకే 2.36 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను వినియోగిస్తున్నట్లు శాండ్ లెవల్ కమిటీ అధికారులు చెబుతున్నారు. సాధారణ ప్రజలకు 50 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను వినియోగిస్తున్నట్లు పేర్కొంటున్నారు. అయితే వాగులు, వంకల ద్వారా అనధికారికంగా 5లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు ఇసుక నిల్వలను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. శాండ్ లెవల్ కమిటీ ప్రాంతాల దూరాన్ని, రవాణా ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఒక్కో ప్రాంతానికి ఒక్కో ధర నిర్ణయించింది. కర్నూలు టౌన్ ట్రాక్టర్ ధర రూ.1,800 – రూ.2,250. బ్లాక్ ధర రూ.2,500. ఆత్మకూరు ధర రూ.2500, బ్లాక్‌లో రూ.3,000. ఆదోని ధర రూ.2,000, బ్లాక్‌లో రూ.2,500. డోన్‌లో ధర రూ.3,000, బ్లాక్‌లో రూ.3,500. నంద్యాల ధర రూ.4,500, బ్లాక్‌లో రూ.5,000. ఇలా ట్రిప్పు ట్రిప్పునకు రూ.500 నుంచి రూ.1,000వరకు అదనంగా లాభం వస్తుండటంతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తరలిపోతున్న లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక.. జిల్లా వ్యాప్తంగా 10 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. కర్నూలు మండలంలో పూడూరు, పడిదెంపాడు, సి.బెళగల్ మండలంలో ఈర్లదిన్నె, గుండ్రేవుల, గోనెగండ్ల మండలంలోని వేముగోడు, దేవనకొండ మండలంలోని లక్కందిన్నె, నందికొట్కూరు మండలంలోని శాతనకోట, బిజనవేముల, హొళగుంద మండలంలోని ముద్దటిమాగి రీచ్‌లు ఉండగా, అనధికారికంగా హాలహర్వి, మంత్రాలయం, కౌతాళం, పెద్దకడుబూరు, నందవరం, వెల్దుర్తి, కోడుమూరు, సి.బెళగళ్ తదితర మండలాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలను లక్ష్యంగా చేసుకొని తెలుగు తమ్ముళ్లు బరి తెగించిపోతున్నారు. నదీగర్భాలు, వంకల్లో లోతట్టు నేల కన్పించేలా మరీ ఇసుకను తవ్వి వంకలను మాయం చేస్తున్నారు. వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లె–నార్లాపురం గ్రామాల మధ్య వంకలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఉండటంతో ఈ ప్రాంతంపై కన్నెసిన తెలుగు తమ్ముళ్లు వేల క్యూబిక్‌మీటర్ల ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. -
తుంగ.. తీరనున్న బెంగ
అనంతపురం సెంట్రల్: తుంగభద్ర జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతోంది. జలాశయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 76,527 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లోతో వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రస్తుతం జలాశయం 72 టీఎంసీల నీటిమట్టానికి చేరుకుంది. ఈక్రమంలోనే కాలువలకు నీళ్లు వదిలేందుకు ముహూర్తం ఖరారు చేసేందుకు సోమవారం తుంగభద్ర జలాశయం బోర్డు అధికారులు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేటి సాయంత్రంలోపు నీటి విడుదల విషయంపై తీపి కబురు జిల్లా రైతాంగానికి అందనుంది. నాలుగేళ్ల తర్వాత రైతాంగానికి వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయంలో నాలుగేళ్ల నుంచి ఆశించిన స్థాయిలో నీళ్లు చేరకపోవడంతో మాగాణి భూములు బీళ్లుగా మారాయి. ఈసారి జిల్లాలో రైతులు ఆకాశం వైపు చూస్తుంటే.. కర్ణాటకలో మాత్రం వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో తుంగభద్ర జలాశయానికి Výæతంలోఎన్నడూ లేని విధంగా 76, 527 క్యూసెక్కుల మేరవరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం మట్టం ఆదివారం నాటికి 72 టీఎంసీలకు ఎగబాకింది. మూడురోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం 140 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన తుంగభద్ర జలాశయంలో భారీగా పూడిక చేరింది. దీంతో జలాశయం సామర్థ్యం 100 టీఎంసీలకు పడిపోయింది. ఆదివారం నాటికి జలాశయంలోకి 72 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. అయితే భారీ ఇన్‌ఫ్లో ఉండడంతో బుధు, గురువారం నాటికి 100 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకునే అవకాశముందని హెచ్చెల్సీ అధికారులు భావిస్తున్నారు. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేసే అవకాశముందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం కీలక సమావేశాన్ని టీబీబోర్డు నిర్వహిస్తోంది. -
ఆల్మట్టి @ లక్ష క్యూసెక్కులు
సాక్షి, హైదరాబాద్: ఆల్మట్టికి వరద పోటెత్తుతోంది. రోజురోజుకీ ప్రాజెక్టులోకి ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టులో నిల్వలు గణనీయంగా పెరుగుతున్నాయి. మరోపక్క తుంగభద్రలోనూ అదే రీతిలో ప్రవాహాలు కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నిండేందుకు సిద్ధమవు తోంది. ఇక నారాయణపూర్‌లోనూ ఇప్పటికే చెప్పుకోదగ్గస్థాయిలో ప్రవాహాలు న్నాయి. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌లు నిండేందుకు మరో 50 టీఎంసీలు అవసరముంది. శ్రీశైలానికి కనీసం 40 టీఎంసీలు చేరినా దిగువ జూరాలకు నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. గతం కంటే 48 టీఎంసీలు ఎక్కువ.. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షా లతో ప్రాజెక్టుల్లోకి భారీ ప్రవాహాలు వస్తున్నాయి. కృష్ణానది విశ్వరూపం చూపిస్తోంది. అక్కడి ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో కర్ణాటకకు భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో 4 రోజులుగా 40 వేల నుంచి 50 వేల క్యూసెక్కుల మేర ఆల్మట్టిలోకి ప్రవాహాలుండగా, అవి ఆదివారం ఉదయానికి లక్ష క్యూసెక్కులకు చేరింది. రోజుకు ఏకంగా 9 టీఎంసీలు వస్తుండ డంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. నీటినిల్వ 129.72 టీఎంసీలకుగాను 93 టీఎంసీలకు చేరింది. 36.72 టీఎంసీ లు చేరితే ప్రాజెక్టు నిండుకుండలా మారనుంది. గతేడాది ఇదే సమయానికి ఆల్మట్టి లో 48 టీఎంసీలే ఉండగా ఈసారి రెట్టిం పునిల్వలుండటం ఊరటనిస్తున్నాయి. -
ఆల్మట్టికి కృష్ణమ్మ పరవళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకల్లో గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. చిన్న తరహా ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద ఉధృతి మరింత పెరిగింది. ఆల్మట్టిలోకి శనివారం ఉదయం 90,886 క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరగా, అది సాయంత్రానికి మరింత పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో గత 4 రోజులుగా 40 వేల నుంచి 50 వేల క్యూసెక్కుల మేర ఆల్మట్టిలోకి ప్రవాహముండగా, అది శనివారానికి 90 వేల క్యూసెక్కులకు చేరింది. రోజుకు 9 టీఎంసీల మేర నీరు వచ్చి చేరుతుండటంతో వేగంగా ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం నీటినిల్వ 129.72 టీఎంసీలకుగానూ 83.78 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర లో రెండ్రోజుల కిందటి వరకు 20 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదు కాగా, ప్రస్తుతం 76,527 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో 100 టీఎంసీల నీరు నిల్వకుగానూ 66.02 టీఎంసీల నిల్వలున్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టులో 37.64 టీఎంసీ ల నిల్వకుగాను 23.81 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్, తుంగభద్రలో మరో 50 టీఎంసీల మేర నిల్వలు చేరితే దిగువనున్న జూరాలకు నీటి ప్రవాహాలు మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ వరదే మరిన్ని రోజులు కొనసాగితే 10 రోజుల్లోనే ఎగువ ప్రాజెక్టులు నిండి, దిగువకు నీటి ప్రవాహం మొదలయ్యే అవకాశముంది. ఆత్రుతగా దిగువ ప్రాజెక్టులు.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రవాహాలకు నోచుకోని రాష్ట్ర ప్రాజెక్టులు నీటి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా యి. ప్రస్తుతం రాష్ట్ర ప్రాజెక్టులకు కేవలం 10 టీఎంసీల మేర మాత్రమే నీరు రావడం, మరో 390 టీఎంసీ ల మేర నీరు వస్తే కానీ ప్రాజెక్టులు నిండే అవకాశం లేకపోవడంతో అవన్నీ ఎగువ ప్రవాహాలపైనే ఆధారపడ్డాయి. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీల నిల్వకుగానూ 20 టీఎంసీల నీరే ఉండగా, నాగార్జున సాగర్‌లో 312 టీఎంసీలకుగానూ లభ్యతగా ఉన్నది 133 టీఎంసీలు మాత్రమే. ఈ ప్రాజెక్టుల్లో ఉన్న నిల్వ ల్లో వినియోగార్హమైనది 10 టీఎంసీలకు మించి ఉండదు. జూరాలలో 9.6 టీఎంసీలకుగానూ 5.68 టీ ఎంసీ నీరు నిల్వ ఉండగా, ఈ నీటిని సాగు అవసరాలకు విడుదల చేయాలని డిమాండ్లు పెరిగాయి. -
తుంగభద్రకు పెరిగిన ఇన్‌ఫ్లో
బళ్లారి : ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఉమ్మడి జలాశయమైన తుంగభద్ర డ్యాంలోకి ఇన్‌ఫ్లో మరింత పెరిగింది. మంగళవారం డ్యాంలోకి దాదాపు 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో ఒకే రోజు దాదాపు రెండు టీఎంసీల మేర నీటి నిల్వ పెరిగింది. ప్రస్తుతం డ్యాంలో 37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పెద్దఎత్తున వస్తోంది. దీంతో డ్యాంలో నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతోంది. డ్యాంలోకి 40 టీఎంసీల నీరు నిల్వ చేరితే కాలువలకు వదలుతారు. గత ఏడాది ఇదే సమాయనికి డ్యాంలో నీటిమట్టం 1,595.97 అడుగులు, 14.498 టీఎంసీలుగా ఉండేది. ఇన్‌ఫ్లో 939 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 150 క్యూసెక్కులుగా ఉండేది. ప్రస్తుతం నీటిమట్టం 1,610.88 అడుగులు, నీటి నిల్వ 37 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 19,912 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1.360 క్యూసెక్కులు.