
అలంపూర్‌లో పుష్కరాలను ప్రారంభిస్తున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ (ఫైల్)
సాక్షి, అలంపూర్: మధురస్మృతులు.. జీవితంలో ఎప్పటికీ మర్చిపోని తీపి జ్ఞాపకాలు. తుంగభద్ర పుష్కరాల్లో అలాంటి మధుర జ్ఞాపకాలను పలువురు భక్తులు గుర్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కురుమూర్తి 2008లో భూత్పూర్ మండలంలో పంచాయతీరాజ్ ఏఈగా విధులు నిర్వహించేవారు. ఆయన అప్పటి పుష్కరాలకు భార్య రూపవాణి, ఏడాది వయస్సున్న కుమార్తె శ్రీసాయి చందనతో వచ్చి జోగుళాంబ ఘాట్‌లో పుష్కర స్నానాలు చేశారు. ఆ సమయంలో ‘సాక్షి’లో వారి ఫొటో ప్రముఖంగా ప్రచురణ అయ్యింది. తిరిగి 12ఏళ్ల తర్వాత వారి కుమార్తె శ్రీసాయి చందనతో కలిసి సోమవారం పుష్కర స్నానాలు ఆచరించారు. ఆ నాడు పత్రికలో వచ్చిన ప్రతులను వారు చూపిస్తూ తీపి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
నాడు తుంగభద్ర పుష్కరాల్లో పుష్కర స్నానం చేస్తున్న బాలిక శ్రీసాయి చందన, తల్లిదండ్రులు
ఈ ఏడాది పుష్కరాల్లో..
మహానేత వైఎస్సార్ ఫొటో సైతం..
అలాగే, 2008 తుంగభద్ర పుష్కరాలకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి తుంగభద్ర పుష్కరాల ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ ఫొటో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దివంగత మహానేత వైఎస్సార్ అభిమానులు ఆ నాటి స్మృతులను ఇలా గుర్తు చేసుకుంటున్నారు.
ఈ పుష్కరానికి పెద్దయి వచ్చా..!
మానవపాడు: నారాయణపేట జిల్లా మరికల్ మండలం చెందిన సిద్ధిలింగమ తన మనవడు రామ్‌చరణతో కలిసిఅలంపూర్ తుంగభద్ర పుష్కరాలకు 2008లో వచ్చారు. అప్పుడు మళ్లీ కలుస్తామంటూ ఈ సారి తన అవ్వతో కలిసి పుష్కరాల్లో పాల్గొన్నారు.
2008లో పుష్కరాలకు వచ్చినప్పుడు.. ప్రస్తుతం పుష్కరాలకు అవ్వతో వచ్చిన రామ్‌చరణ్
Comments
Please login to add a commentAdd a comment