puskaralu
-
గంగమ్మకు కుంభాభిషేకం.. మహాద్భుతం!
సాక్షి, తిరుపతి: ‘గంగా పుష్కర కాలంలో గంగమ్మ తల్లికే మహాకుంభాభిషేకం నిర్వహించడం మహాద్భుతం. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించడం శుభ సూచకం’ అని కంచికామకోటి పీఠాధిపతి శ్రీవిజయేంద్ర సరస్వతి ఉద్ఘాటించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ మహా కుంభాభిషేకంలో చివరి రోజైన శుక్రవారం నాడు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో యాగ యజ్ఞపూజలు నిర్వహించారు. యాగశాల నుంచి గంగమ్మ తల్లి మూలవిరాట్‌ను తీసుకువచ్చి నూతనంగా నిర్మించిన గర్భాలయంలో విజయేంద్ర సరస్వతి..అమ్మవారిని ప్రతిష్టించి అభిషేకం నిర్వహించారు. గర్భాలయం విమాన గోపుర శిఖరంపై శాస్త్రోక్తంగా బంగారు తాపడంతో తయారు చేసిన కలశాన్ని స్థాపన చేశారు. భక్తులనుద్దేశించి విజయేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం చేస్తూ గంగమ్మ తల్లి నామస్మరణ ఎంతో పుణ్యఫలమని పేర్కొన్నారు. నదులను కాలుష్యం చేయకుండా కాపాడాలని కోరారు. కుంభాభిషేకంతో సకల జనులకు సంతోషం కలుగుతుందని 18వ శతాబ్దంలో శాసనంలో పొందుపరచారని, ఈ శాసనం కంచి ఆలయంలో ఉందని చెప్పారు. హిందూధర్మం చాలా గొప్పదని వ్యాఖ్యానించారు. దేవుడు అందరివాడు: స్వరూపానందేంద్ర గంగమ్మ తల్లి తొలి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అన్నారు. తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ మహా కుంభాభిషేక కార్యక్రమంలో పీఠాధిపతితో పాటు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర పాల్గొన్నారు. స్వరూపానందేంద్ర అనుగ్రహభాషణం చేస్తూ..దేవుడు ఒక కులానికి చెందిన వాడు కాదని, అన్ని కులాల వాడని అన్నారు. నాడు టీటీడీ చైర్మన్‌గా భూమ న చేపట్టిన దళిత గోవిందం కా ర్యక్రమం అద్భుతమైనదని కొనియాడారు. మంత్రి రోజా మా ట్లాడుతూ..రాజుల కాలం మాదిరిగా సీఎం జగన్ పాలనలో అద్భుతమైన రాతి నిర్మాణాలతో రాష్ట్రంలో ఆలయాలు నిర్మిస్తున్నా రని చెప్పారు. ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ మహాకుంభాభిషేకంలో పీఠాధిపతులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. డిప్యూ టీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: నయనానందం.. నృసింహుని కల్యాణం) -
తుంగభద్ర పుష్కరాలు: మహానేత ఫొటో సైతం..
సాక్షి, అలంపూర్: మధురస్మృతులు.. జీవితంలో ఎప్పటికీ మర్చిపోని తీపి జ్ఞాపకాలు. తుంగభద్ర పుష్కరాల్లో అలాంటి మధుర జ్ఞాపకాలను పలువురు భక్తులు గుర్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కురుమూర్తి 2008లో భూత్పూర్ మండలంలో పంచాయతీరాజ్ ఏఈగా విధులు నిర్వహించేవారు. ఆయన అప్పటి పుష్కరాలకు భార్య రూపవాణి, ఏడాది వయస్సున్న కుమార్తె శ్రీసాయి చందనతో వచ్చి జోగుళాంబ ఘాట్‌లో పుష్కర స్నానాలు చేశారు. ఆ సమయంలో ‘సాక్షి’లో వారి ఫొటో ప్రముఖంగా ప్రచురణ అయ్యింది. తిరిగి 12ఏళ్ల తర్వాత వారి కుమార్తె శ్రీసాయి చందనతో కలిసి సోమవారం పుష్కర స్నానాలు ఆచరించారు. ఆ నాడు పత్రికలో వచ్చిన ప్రతులను వారు చూపిస్తూ తీపి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. నాడు తుంగభద్ర పుష్కరాల్లో పుష్కర స్నానం చేస్తున్న బాలిక శ్రీసాయి చందన, తల్లిదండ్రులు ఈ ఏడాది పుష్కరాల్లో.. మహానేత వైఎస్సార్ ఫొటో సైతం.. అలాగే, 2008 తుంగభద్ర పుష్కరాలకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి తుంగభద్ర పుష్కరాల ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ ఫొటో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దివంగత మహానేత వైఎస్సార్ అభిమానులు ఆ నాటి స్మృతులను ఇలా గుర్తు చేసుకుంటున్నారు. ఈ పుష్కరానికి పెద్దయి వచ్చా..! మానవపాడు: నారాయణపేట జిల్లా మరికల్ మండలం చెందిన సిద్ధిలింగమ తన మనవడు రామ్‌చరణతో కలిసిఅలంపూర్ తుంగభద్ర పుష్కరాలకు 2008లో వచ్చారు. అప్పుడు మళ్లీ కలుస్తామంటూ ఈ సారి తన అవ్వతో కలిసి పుష్కరాల్లో పాల్గొన్నారు. 2008లో పుష్కరాలకు వచ్చినప్పుడు.. ప్రస్తుతం పుష్కరాలకు అవ్వతో వచ్చిన రామ్‌చరణ్ -
పుష్కరతుంగ... భద్రగంగ
జలాన్ని దేవతా రూపంలో తల్లిగా భావించి పూజించడం హిందువుల సంప్రదాయం. నదీస్నానాలు, కోనేటి స్నానాలు, మంగళ స్నానాలు, సముద్ర స్నానాలు... అలాగే తీర్థ యాత్రలు, పుణ్య క్షేత్రాలు దర్శనం... సమస్తం నీటితో ముడిపడి వున్నాయి. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్య ప్రదమని హిందువుల విశ్వాసం. సకల జీవరాశులకు ప్రధానమైన జలస్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు. ‘తుంగే పానీ.. గంగే స్నానే’ అన్నది ఆర్యోక్తి. గంగానదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం వస్తుందని దీనికి అర్థం! అసలు తుంగభద్ర నది ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం... హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి సముద్రంలో వేయగా శ్రీ మహావిష్ణువు వరాహావతారమెత్తి తన కోరలతో భూమిని సాగరం నుండి పైకెత్తి సర్వజీవులనూ రక్షించాడు. తుంగ (ఎత్తు) నుండి రావడం వల్ల తుంగానదిగానూ, హిరణ్యాక్షుని సంహరించే సమయంలో వరాహరూపుడైన విష్ణువు కుడి కోర నుండి కారిన లాలాజలం భద్రానదిగానూ ఉద్భవించాయి. పుష్కరాలు జరిగే 12 నదులలో తుంగభద్ర ఒకటి. రాష్ట్రంలో చివరి తుంగభద్ర పుష్కరాలు 2008 లో జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి తుంగభద్ర పుష్కరాలు ఇవే. నవగ్రహాల్లో ఒకటైన గురు గ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో పరిభ్రమిస్తుంటుంది. బృహస్పతి మకరరాశిలో ప్రవేశించే సమయంలో తుంగభద్ర నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ముక్కోటి దేవతలు ఆ నదిలో కొలువై ఉంటారని, ఈ సమయంలో ఆ నదిలో స్నానమాచరించిన వారి పాపాలు తొలిగి.. పుణ్యం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రముఖ దేవాలయాలను తాకుతూ వెళుతున్న తుంగభద్ర.. కర్ణాటక: శృంగేరి (చిక్మగుళూరు), పంపావతి దేవాలయం(కంప్లి), హరిహరేశ్వర దేవాలయం(హంపి). ఆంధ్రప్రదేశ్: రాఘవేంద్రస్వామి ఆలయం, (మంత్రాలయం), శివరామాలయం (గుండ్రేవుల). తెలంగాణ: సంతాన వేణుగోపాలస్వామి ఆలయం (వేణిసోంపురం), వైకుంఠ నారాయణ స్వామి ఆలయం (రాజోళి), సూర్యనారాయణ స్వామి ఆలయం (పుల్లూరు), జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు (అలంపూర్), సంగమేశ్వరాలయం. తుంగ, భద్ర నదులు కలసి కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తాయి. ఈ రెండు నదులు కలిసి తుంగభద్ర నదిగా మారి.. కర్ణాటకలో కృష్ణా పరివాహక ప్రాంతం మీదుగా ప్రవహిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేళగనూరు వద్ద ప్రవేశిస్తుంది. తెలంగాణలో జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కుట్కనూరు వద్ద తుంగభద్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం పులికల్, రాజోళి, పుల్లూరు మీదుగా సాగుతూ నదీతీరంలో కొలువైన దేవతల పాదాలను అభిషేకిస్తూ.. సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. తుంగభద్ర నది రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత సుమారు 90 కిలోమీటర్ల మేర ప్రవహించి సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో సంగమం అవుతున్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో తుంగభద్ర నది జలకళను సంతరించుకుంది. పుష్కరాల సందర్భంగా పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు మొత్తం 443 మంది పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేసింది. పిండ ప్రదానం తదితర కార్యక్రమాలకు రేట్లను ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ నిర్ధారించి, ఆ వివరాలను వీటి కోసం కేటాయించిన షెడ్ల వద్ద ప్రదర్శించనుంది. పుష్కర ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా దేవదాయ శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. కాగా నేటి మధ్యాహ్నం కర్నూలు జిల్లాలోని సంకల్బాగ్ పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహనరెడ్డి పాల్గొంటారు. – ఇన్పుట్స్: అంబటి తిరుమలేష్ సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజమ్ -
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఏపీ
-
సమష్టిగా పుష్కర వైద్య సేవలు
డీఎంహెచ్‌వో డా.నాగమల్లేశ్వరి లబ్బీపేట: లక్షలాది మంది పుష్కరాలకు తరలివచ్చినా ఎలాంటి అవాంతరాలు కలగకుండా వైద్యశాఖ సిబ్బంది అంతా సమష్టిగా పనిచేసి అనారోగ్యానికి గురైన వారికి సేవలు అందించారని ఆ శాఖ నోడల్ ఆఫీసర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ ఆర్ నాగమల్లేశ్వరి అన్నారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బందితో పాటు, పలు కార్పొరేట్ ఆస్పత్రులు సైతం పుష్కరాల్లో సేవలు అందించాయని అన్నారు. ప్రభుత్వ, ప్రవేటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో యాత్రికులకు మంచి సేవలు అందించగలిగాం. 4.11 లక్షల మందికి వైద్య పరీక్షలు పుష్కర ఘాట్లలోని వైద్య శిబిరాల్లో 4,11,283 మంది ఓపీ పరీక్షలు చేయగా, 2672 మందికి ఇన్ పేషెంట్స్‌గా సేవలు అందించినట్లు ఆమె తెలిపారు. 959 మందిని రిఫరల్ కేసులుగా మెరుగైన వైద్యం కోసం వివిధ ఆస్పత్రిలకు తరలించినట్లు చెప్పారు. -
పుష్కర ప్రచారం
-
శాటిలైట్ స్టేషన్లలోనే పుష్కర స్పెషల్స్ ఫుల్
ఇంద్రకీలాద్రి : శాటిలైట్ స్టేషన్ల నుంచి నడుపుతున్న పుష్కర స్పెషల్ బస్సులన్నీ ఆదివారం కిటకిటలాడాయి. రికార్డు స్థాయిలో యాత్రికులు విజయవాడకు చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించారు. నగర శివారులో ఆర్టీసీ ఏర్పాటు చేసిన శాటిలైట్ స్టేషన్ల నుంచి నడుపుతున్న పుష్కర స్పెషల్ బస్సులలో యాత్రికులు స్నాన ఘాట్లకు చేరుకున్నారు. శాటిలైట్ స్టేషన్లలోనే పుష్కర స్పెషల్ బస్సులు నిండిపోవడంతో యాత్రికులు ఫుట్‌బోర్డులపై ప్రయాణించారు. ఫుట్‌బోర్డు ప్రయాణం వద్దని ఆర్టీసి సిబ్బంది వారించినా యాత్రికులు పట్టించుకోలేదు. మరో వైపు జక్కంపూడి వైవీ.రావు ఎస్టేట్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీసీ శాటిలైట్ స్టేషన్ ఆదివారం పుష్కర యాత్రికులతో నిండిపోయింది. మరో వైపున భవానీపురం స్నాన ఘాట్లు యాత్రికులతో నిండిపోవడంతో పుష్కర స్పెషల్ బస్సులను గొల్లపూడి వైపు మళ్లించారు. బస్సులను నైనవరం ఫ్లైవోవర్ మీద నుంచి కాకుండా జక్కంపూడి మీదగా గొల్లపూడి స్నాన ఘాట్లకు తరలించారు. అయితే పుష్కర యాత్రికులకు సరైన సమాచారం లేకపోవడంతో కొంత మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చంకలో చంటి పిల్లలతో చేతిలో లగేజీలో ఎటు వెళ్లాలో తెలియన అనేక మంది యాత్రికులు తీవ్ర ఆగచాట్లకు గురయ్యారు. -
నిర్లక్ష్యం తగదు : జేసీ
విజయవాడ (వన్‌టౌన్) : పుష్కర విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని జేసీ గంధం చంద్రుడు అధికారులకు సూచించారు. దుర్గాఘాట్‌ను ఆయన శనివారం పరిశీలించారు. తరువాత మెడికల్ సెంటర్‌ను, పిండ ప్రదానాల చేస్తున్న పరిసరాలను పరిశీలించి వివిధ స్థాయిల అధికారులతో పలు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. చివరి మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు స్పందిస్తూ పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. -
చంద్రబాబు ప్రచార పిచ్చితో ప్రజలకు నష్టం
వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి వేదాద్రి (పెనుగంచిప్రోలు) : ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార పిచ్చి ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. కృష్ణా పుష్కరాలు తొమ్మిదో రోజు శనివారం వేదాద్రి పుష్కర ఘాట్‌లో ఆయన స్నాన మాచరించి పిండ ప్రదానాలు చేశారు. శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పుష్కర నిధులు చాలా వరకు దుర్వినియోగమయ్యాయన్నారు. రూ.80 కోట్ల పనులు నామినేషన్‌పై ఇచ్చారన్నారు. హై సెక్యూరిటీ పేరుతో భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. పుష్కరాల్లో అందరికీ దానాలు చేయడం సంప్రదాయమని, అలాంటిది ఎక్కడా బిచ్చగాళ్లు ఉండకూడదని ముఖ్యమంత్రి వారిని విజయవాడలో లేకుండా పంపించడం దారుణమన్నారు. ఆయన వెంట జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ఉన్నారు. -
పుష్కరాలలో సాంకేతిక విప్లవం భేష్
20 విశ్వవిద్యాలయాల వీసీల ప్రశంస విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కృష్ణా పుష్కరాల నిర్వహణలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం గొప్పగా ఉందని రాష్ట్రంలోని 20 విశ్వవిద్యాలయాలకు చెందిన ఉప కులపతులు, ఆచార్యుల బృందం ప్రశంసించింది. పుష్కరాల్లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని విశ్లేషించి విద్యార్థులకు భోధించేందుకు శుక్రవారం దుర్గాఘాట్‌లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు బృందం సభ్యులు విచ్చేశారు. పుష్కర స్నానఘాట్లలో ఏర్పాట్లు, పర్యవేక్షణ, సూచనలు, యాత్రికుల గణాంక వివరాల నమోదును సాంకేతికంగా పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ బాబు.ఏ వివరించారు. కృష్ణా పుష్కరాల నిర్వహణలో నిశ్శబ్ధ సాంకేతిక విప్లవం తమకు కనిపించిందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి. ఉదయలక్ష్మి అన్నారు. పద్మావతి విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ఉమ, ఏపీఎస్సీహెచ్ఈ ప్రొఫెసర్ విజయప్రకాష్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్, కృష్ణా యూనివర్సిటీ ప్రొఫెసర్ రామకృష్ణారావు, రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ వై. నరసింహులు, విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రొఫెసర్ వీరయ్య, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆవుల దామోదరం, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజగోపాల్, ద్రవిడియస్ యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీనివాసకుమార్ పాల్గొన్నారు. -
చూడాలంటే ఎన్నో కష్టాలు
హారతి చూసేందుకు 2 కి.మీ. నడవాల్సిందే రకరకాల ఆంక్షలు భక్తులకు తీవ్ర ఇబ్బందులు ప్రాంగణమంతా ప్రభుత్వ సిబ్బందే పవిత్ర పుష్కరాల్లో చూసి తరించాల్సిందేనంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగమం హారతి కార్యక్రమం అధికారులకు, వీవీఐపీలకే పరిమితమా?, సామాన్య భక్తులను ఆంక్షల పేరుతో అనుమతివ్వడమే గగనమైంది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతోంది. విజయవాడ: పవిత్ర సంగమం వద్ద నిత్యహారతి కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. నగరంలో పలు ప్రాంతాలనుంచి భక్తులను సాయంత్రం బస్సులో ఇబ్రహీంపట్నం తరలిస్తున్నారు. సాయంత్రం హారతి సమయానికి ఒక గంట ముందు ఇబ్రహీంపట్నం రింగ్ వరకు మాత్రమే బస్సులను అనుమతిస్తున్నారు. అక్కడికి చేరుకున్న భక్తులను బస్సుల్లోంచి దించి కాలినడకన ఘాట్‌వద్దకు వెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నారు. మొదటి ఐదు రోజులు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఉచిత బస్సులపై ఆంక్షలు విధించారు. బస్సులను సాయంత్రం వేళల్లో అనుమతించకుండా శాటిలైట్ బస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. బుడమేరు కట్టపై వేసిన రోడ్డుద్వారా ముఖ్యమంత్రి ఘాట్ వద్దకు చేరకుంటున్నారు. ఆ సమయంలో భక్తులను రింగ్ సెంటర్‌నుంచి కాలినడకన ఫెర్రీ రోడ్డులోకి పంపుతున్నారు. నవహారతులు చూడాలని వచ్చే భక్తులు ఘాట్ వద్దకు 2కి. మీ నడిచివెళ్లాల్సి వస్తోంది. దీంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. హారతి కార్యక్రమానికి చేరుకోలేక కొందరు ఉసూరంటూ వెనుదిరుగుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చారా.. మరింత కష్టం ముఖ్యమంత్రి ఘాట్ వద్ద ఉన్న సమయంలో అయితే పరిస్థితి ఇంకా కష్టం. రకరకాల ఆంక్షలు విధించడంతో పాటు పోలీసు, పారిశుధ్య, వైద్య సిబ్బందితోనే ప్రాంగణం కిక్కిరిసి పోతోంది. ఇక సమయానికి చేరుకోవడం దుర్లభమే. హారతి కోసం వచ్చే భక్తులు దూరం నుంచి చూసి వెనుదిరగాల్సి వస్తోంది. గత ఐదు రోజుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ముఖ్యమంత్రి వావానాలు నిలిపి ఉంచే చోట హారతి వీక్షించేందుకు వీలుగా చిన్న డిస్ప్లే ఏర్పాటు చేశారు. అయినా ప్రత్యక్షంగా చూడడానికి వస్తే టీవీ తెరపై చూసి తిరిగి వెళ్లాల్సి వస్తోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. -
బిడ్డా...ఒక్కసారి కళ్లుతెరూ..
కన్నపేగుల ఆక్రందన ఆ విద్యార్థులకు తుది వీడ్కోలు కన్నీటి సాగరంలో తల్లిదండ్రులు నందిగామ రూరల్ : ‘ఒక్కసారి కళ్లుతెరిచి చూడు బిడ్డా. మీరే లేకపోతేం మేం ఎవరికోసం బతకాలి. ఒక్కసారి మీ అమ్మను చూడు తండ్రీ...’ అని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తుంటే అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పుష్కర స్నానాలకు వెళ్లి అకాల మృత్యువాత పడిన విద్యార్థులకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. స్థానిక చైతన్య కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న నందిగామ పట్టణానికి చెందిన కొమ్మవరపు హరిగోపి, కూచి లోకేష్, చెర్వుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన పాశం గోపిరెడ్డి, వీరులపాడు మండలం, జయంతి గ్రామానికి చెందిన నందిగామ నగేష్, చందర్లపాడు మండలం, తోటరావులపాడు గ్రామానికి చెందిన ములకలపల్లి హరీష్ గుంటూరు జిల్లా, అమరావతి మండలం, గిడుగు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం కృష్ణా నదిలో మునిగి మరణించడం తెలిసిందే. వీరిలో హరీష్ మృతదేహానికి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలోనే అంత్య క్రియలు పూర్తి కాగా, మిగిలిన నాలుగు మృతదేహాలకు బుధవారం జరిపారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల కన్నీరు మున్నీరవుతూ మృతులకు కడసారి వీడ్కోలు పలికారు. కడసారి తమ మిత్రులను చూసుకునేందుకు సహచర విద్యార్థులు విలపిస్తూ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మేమింక ఎవరి కోసం బతకాలి...! చేతికందిన బిడ్డలను కోల్పోయి తామెందుకు బతకాలంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న తీరుతో అందరూ కంటతడిపెడుతున్నారు. తమ బిడ్డలు తమలా కష్టపడకూడదన్న తలంపుతో ఎంత కష్టమైనా తామే భరిస్తూ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని, తమ ఆశలన్నీ వారి పైనే పెట్టుకున్నామని, 20 ఏళ్లు కూడా నిండకుండానే వాళ్లకు నూరేళ్లు నిండిపోయాయంటూ బోరున విలపిస్తున్నారు. తమ బిడ్డలు లేని లోటు ఎవరు పూడుస్తారని, వారిని కోల్పోయి తమ జీవితాలు పూర్తిగా అంధకారమైపోయాయంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘బిడ్డా ఒక్కసారి మా కోసం కళ్లు తెరువు నాయనా’ అంటూ దీనంగా రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న వారి హృదయాలనే కాకుండా వాతావరణాన్ని సైతం బరువెక్కించింది. -
యాత్రికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు
విజయవాడ (రైల్వే స్టేషన్) : రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీని డీఆర్ఎం అశోక్‌కుమార్ బుధవారం పరిశీలించారు. పుష్కరాలకు విచ్చేస్తున్న ప్రయాణికుల రద్దీ క్రమేణా పెరుగుతున్న దృష్ట్యా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 1,6,7 ప్లాట్‌ఫాంలు, తారాపేట , పార్శిల్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన పుష్కర నగర్లను, బుకింగ్ కౌంటర్లను ఆయన పరిశీలించారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఆర్పీఎఫ్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఎస్.ఆర్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఏటీవీఎం కేంద్రాల వద్ద రద్దీ ఏటీవీఎం కేంద్రాల వద్ద ప్రయాణికులు, యాత్రికుల రద్దీ పెరిగింది. సత్వరం టికెట్లు పొందటంతోపాటు స్మార్ట్ కార్డు కలిగిన వారికి 5 శాతం డిస్కౌంట్‌ను కూడా రైల్వే శాఖ ఇస్తుండడంతో ఇటీవలి కాలంలో వీటి వినియోగం బాగా పెరిగింది. వీటి వినియోగం వల్ల సాధారణ బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ కాస్త తగ్గింది. ఎలక్ట్రానిక్ టికెట్ల జారీని సీసీఎం మార్కెటింగ్ ఎం.సజ్జనరావు బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సాధారణ టికెట్ల సత్వర జారీకి వీటిని ఏర్పాటు చేశామన్నారు. రైల్వేస్టేçÙన్లో రిజర్వుడు టికెట్లను బ్లాక్‌లో విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పుష్కర యాత్రికులకు రైల్వే స్టేడియం వద్ద ఏర్పాటుచేసిన పుష్కర్ నగర్లో బుధవారం యూనియన్ బ్యాంకు సిబ్బంది తాగునీటి ప్యాకెట్లను అందించారు. -
పుష్కర సేవల్లో ‘యూపీ’ యువకులు
సాక్షి, అమరావతి : కృష్ణాపుష్కరాల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకులు సేవలు అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్‌కు చెందిన 300 వందల మంది యువకులు టాయిలñ ట్స్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుని వచ్చారు. అదే రాష్ట్రానికి చెందిన లల్లూజీ కంపెనీ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. ప్రతి ఘాట్లోయాత్రికుల రద్దీ బట్టి మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. అవసరమైనప్పుడు వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలి. దీని కోసం ఆ యువకులు ఘాట్ల వద్దే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. టాయిలెట్స్ విడిభాగాలు తీసుకొచ్చి ఎక్కడ ఏర్పాటు చేయోలో అక్కడ తాత్కాలికంగా ఫిటింగ్ చేస్తారు. పుష్కరాల సందడి బావుందనీ , పుష్కరస్నానం చేశామని వారు తెలిపారు. -
ఆకట్టుకుంటున్న బసవన్నలు
పూర్ణానందంపేట : పుష్కర యాత్రికులను భవానీ ఘాట్ వద్ద డూడూ... బసవన్నలు ఆకట్టుకుంటున్నాయి. స్నానాలు ఆచరించి వచ్చే భక్తులు బసవన్నల వద్ద తమ పిత్రుదేవతలను పొగిడించుకుని వాటికి కానుకలు సమర్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంత యాత్రికులకు పెద్దగా ఆకట్టుకోకపోయినా నగరాల నుంచి వచ్చే భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పిండప్రధానాలు చేసిన తరువాత బసవన్నలతో పొగిడిస్తే తమ తాతముత్తతాలు సంతోషిస్తారని భక్తులు విశ్వసిస్తారు. బసవన్నలను వాటి యజమానులు అందంగా ముస్తాబుచేసి ఘాట్ల వద్ద భక్తులను ఆకట్టుకునేలా ప్రయత్నం చేస్తున్నారు. -
ఇష్టానుసారంగా యాత్రికుల లగేజీ
విజయవాడ(ఇంద్రకీలాద్రి): క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్లలో భద్రత డొల్లేనని మరోమారు రుజువైంది. యాత్రికుల రద్దీ ఎక్కువ కావడంతో రెండు రోజులుగా చెప్పులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. దుర్గగుడి అధికారులు యాత్రికుల లగేజీ, చెప్పులను భద్రపరుచుకుందుకు చైనావాల్ వద్ద మంగళవారం నుంచి క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేశారు. ఆయా స్టాండ్లలో సిబ్బందిని నియమించడం మరిచారు. రాక్లు అందుబాటులో ఉండటంతో యాత్రికులు తమ లగేజీని అక్కడే పెట్టి అమ్మవారి దర్శనానికి Ðð ళ్లారు. తిరిగి వచ్చే సరికి లగేజీ పెట్టిన ప్రాంతం అంతా చిందర వందరగా పడి ఉంది. బ్యాగులలో సామగ్రి ఎలా ఉన్నాయనే దానిపై ఆందోళన వ్యక్తం చేశారు. యాత్రికులకు సరైన సదుపాయాలు కల్పించడంలో దుర్గగుడి అధికారులు వైఫల్యం చెందారని పలువురు భక్తులు విమర్శించారు. ఇక యాత్రికుల చెప్పులు వందల సంఖ్యలోనే కనిపించలేదని వాలంటర్లు, పోలీసులు సిబ్బంది పేర్కొన్నారు. -
రైల్వేస్టేషన్లో పుష్కర రద్దీ
విజయవాడ (రైల్వేస్టేషన్): రైల్వేస్టేషన్ పుష్కర యాత్రికులతో రద్దీగా మారింది. సికింద్రాబాద్, తిరుపతి, విశాఖపట్నం వైపు నుంచి వచ్చిన పలు రైళ్లు కిటకిటలాడాయి. సోమవారం రైల్వేస్టేషన్లో రద్దీని సీనియర్ డీసీఎం షిఫాలి పరిశీలించారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాం, తారాపేట పుష్కర్‌నగర్, ఆరో నంబరు ప్లాట్‌ఫాంలపై ప్రయాణికుల రద్దీని పరిశీలించారు. రద్దీకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. -
అందరికీ కావాలి.. ఎవరికీ పట్టదు
హోర్డింగ్సే ఆసరాగా మీడియా తిప్పలు మొగల్రాజపురం : పుష్కర సందోహాన్ని ప్రజానీకానికి అందించే మీడియా కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదు. వారి ప్రచారానికి మీడియా కావాలి, సౌకర్యాలను మాత్రం కల్పించరు.. ఇదీ పుష్కరాల్లో అధికారులు, పాలకుల వైఖరి అని మీడియా వర్గాలు విమర్శిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణవేణి ఘాట్‌లోని శనేశ్వరస్వామి గుడి దగ్గర ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నీడ కోసం హోర్డింగ్స్‌ను చిన్న కుటీరంగా మాదిరిగా ఏర్పాటు చేసుకుని అందులోనే సేద తీరుతున్నారు. రెండు రోజుల నుంచి ఎండ తీవ్రత పెరిగింది. ఎవరైనా ప్రముఖులు, మంత్రులు, అ«ధికారులు వచ్చినప్పుడు విధులు నిర్వహించి మిగిలిన సమయంలో వీరుS కూర్చొడానికి నిలువ నీడ కూడా లేకపోవడంతో గుడి ఆవరణలో కుటీరంలా ఏర్పాటు చేసుకున్నారు. కెమెరాలకు వస్త్రాలను కప్పి రక్షణ కల్పించుకునే ప్రయత్నం చేశారు. కుర్చోడానికి కుర్చీలు కూడా లేక నేలపైనే కూర్చుంటున్నారు. షామియనాలతో పాటుగా కుర్చీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. జిల్లా, నగర సమాచార శాఖ అధికారులకు ఇదేమీ పట్టడం లేదని మీడియా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద కార్యక్రమంలో కనీసం మీడియా పాయింట్లు కూడా పెట్టకపోవడం శోచనీయమని వాపోయారు. -
పోలీసుల ఓవరాక్షన్‌తో ఇక్కట్లు
విజయవాడ(భవానీపురం) : పోలీసుల ఓవరాక్షన్‌తో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. భవానీపురం స్వాతి సెంటర్ దగ్గర బస్సు దిగిన యాత్రికులు ఎదురుగా కనించే భవానీఘాట్కు చేరుకోగానే పోలీసులు వారిని నేరుగా ఘాట్‌లోకి అనుమతించకుండా అటు పొమ్మని పంపించేస్తున్నారు. దీంతో భక్తులు కొంచెం దూరం నడిచివెళ్లి అడ్డదారిలో ఘాట్‌కు చేరుకుంటున్నారు. ఈ అడ్డదారంతా మట్టి, చెత్తాచెదారంతో ఉండటంతో పడుతూ లేస్తూ ఘాట్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. పున్నమి ఘాట్‌లో సజావుగా రాకపోకలు సాగిస్తున్న భక్తులకు పోలీసులు బారికేడ్లు అడ్డంపెట్టి ఇబ్బందులకు గురిచేశారు. ప్లాట్‌ఫాంపై బారికేడ్లు పెట్టి పక్కన చిన్న దారి వదిలి అందులోనించి వెళ్లమని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. పోలీసుల ఓవరాక్షన్‌కు కొందరు ఎదురు తిరగడంతో ముందు వారితో వాగ్వాదానికి దిగిన పోలీసులు తరువాత దూకుడు తగ్గించి అడ్డంగా పెట్టిన బారికేడ్లను తొలగించారు. -
భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి
డీజీపీ సాంబశివరావు విజయవాడ (భవానీపురం) : పుష్కరాలకు వచ్చే భక్తులతో స్నేహపూర్వక వాతావరణంలో పనిచేయాలి తప్ప, వారితో అమర్యాదగా వ్యవహరించవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని డీజీపీ ఎన్.సాంబశివరావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం పున్నమిఘాట్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజులతో పోలిస్తే ఆదివారం భక్తులు రెట్టింపుగా రావడంతో పుస్కరఘాట్లు కళకళలాడుతున్నాయన్నారు. దుర్గగుడి, పున్నమి, భవానీ ఘాట్లవైపు ఉచిత బస్సు సౌకర్యాని ఆదివారం నుంచి కల్పించామని, అయితే భక్తుల రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో దుర్గాఘాట్ వద్ద కొంతసేపు ట్రాఫిక్‌ను నియంత్రించామని చెప్పారు. పరిస్థితినిబట్టి అవసరమైతే మళ్లీ ఉచిత బస్సులను పునరుద్దరిస్తామని తెలిపారు. -
ఆటో వర్కర్ల నిరసన
విజయవాడ (రైల్వేస్టేషన్) : పుష్కరాల భద్రత పేరిట తమ పొట్టకొట్టవద్దని సీఐటీయూ రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ దుర్గావలి వేడుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆటో కార్మికులు ఆదివారం రైల్వేఇనిస్టిట్యూట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. దుర్గావలి మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికుల రద్దీ దృష్ట్యా తూర్పు ముఖద్వారం వద్ద ఉన్న ఆటోస్టాండ్‌ను రైల్వేఇనిస్టిట్యూట్కు మార్చాలని రైల్వే అధికారులు, పోలీస్ అధికారులు కోరగా తాము అంగీకరించామని గుర్తుచేశారు. ట్రాఫిక్ పేరిట ట్రాఫిక్ పోలీసులు ఆదివారం తమ ఆటోస్టాండ్‌ను తక్షణమే తరలించాలని ఆదేశించారని, ఇప్పటికే అంతమాత్రంగా ఉన్న తమ ఉపాధికి గండి పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. సెంట్రల్ ఏసీపీ సౌమ్యలత నుంచి ఇప్పటికే ఇనిస్టిట్యూట్ వద్ద ఆటోలు నిలుపుటకు అనుమతి తీసుకున్నామని, అయినా ట్రాఫిక్ పోలీసులు ఆటోస్టాండు తరలించమనడం దారుణమని పేర్కొన్నారు. -
జనసంద్రంగా కృష్ణమ్మ
-
ప్రతిపక్షనేతకు ఇదేనా గౌరవం.?
వైస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఉదయభాను జగ్గయ్యపేట అర్బన్: ప్రతిపక్ష నేత, ప్రజాప్రతి నిధులను ప్రభుత్వం పుష్కరాల సందర్భంగా అవమానించిందని వైస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అన్నారు. శనివారం ఆయన గృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానిం చేందుకు పుష్కరాల ప్రారంభం రోజున ఆయన ఊర్లో లేని సమయంలో మంత్రి రావెల కిషోర్‌బాబు వెళ్లటం బాధాకరమన్నారు. పైగా తమకు అవమానం జరిగిందని ఆరోపణలు చేయటం తగదన్నారు. ముందుగా పిలవకుండా పుష్కరాలు ప్రారంభమైన తరువాత ఆహ్వానించటం పద్ధతేనా అని ప్రశ్నించారు. ఘాట్ల వద్ద కనీస వసతులు లేవని, మంచినీరు, టెంట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేయకపోవటంతో భక్తులు, యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పుష్కర భక్తులను కిలోమీటర్ల దూరం నుంచి నడిపిస్తున్నారని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు తన్నీరు నాగేశ్వరరావు, ఎండీ అక్బర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్(చిన్నా), జిల్లా అధికార ప్రతినిధి మదార్‌సాహెబ్, పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రభాకర్, కౌన్సిలర్ నరసింహారావు పాల్గొన్నారు. -
పరిమళించిన సేవాభావం
కృష్ణలంక : పుష్కరాల భక్తులకు వాలంటీర్లు చేస్తున్న సేవలను యాత్రికులు కొనియాడుతున్నారు. నాగార్జున యూనివర్సిటీ బీఈడీ విద్యార్థులు పద్మావతి ఘాట్‌లో పుణ్నస్నానాలు ఆచరించేందుకు వస్తున వికలాంగులు, వృద్ధులకు చేయూతనందిస్తున్నారు. పలు బస్టాప్‌ల నుంచి ఘాట్ల వరకు వృద్ధులు, వికలాంగులను చేరవేయటంతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చిన పుష్కర యాత్రికులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారు. పుష్కర స్నానాలకు వచ్చి అస్వస్థకు గురైన యాత్రికులను ఘాట్లలో ఏర్పాటు చేసిన వైద్యకేంద్రాలలో ప్రాథమిక చికిత్సను చేయించి వారికి సపర్యలు చేస్తు యాత్రికుల మన్నలను అందుకుంటున్నారు. -
డబుల్ ఆనందం
మరోసారి విశాఖ వాసులను పలకరించిన డబుల్ డెక్కర్ l 800 మంది ప్రయాణికులతో విజయవాడకు పయనం తాటిచెట్లపాలెం : విశాఖవాసులను మరోసారి డబుల్ డెక్కర్ రైలు పలకరించింది. ట్రయిల్‌రన్ సమయంలో చుట్టం చూపుగా వచ్చిన ఈ రైలు.. ఇప్పుడు పుష్కర సేవలో విశాఖ వాసులను పునీతుల్ని చేసేందుకు శనివారం ఉదయం 10.15 గంటలకు ఇక్కడకు చేరుకుంది. ఎనిమిదో నంబరు ప్లాట్ఫారంకి చేరుకున్న ఈ రైలును పలువురు ప్రయాణికులు తమ సెల్ఫోన్లలో బంధించారు. మరికొందరు ప్లాట్ఫారం టికెట్ తీసుకొని మరీ రైలెక్కి ఫొటోలు తీసుకున్నారు. 1200కి 800 ఫుల్ ఈ రైలులోని 10 బోగీల్లో 1200 సీట్లుండగా.. అందులో 800 సీట్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ఇక్కడ నుంచి 07763 నంబరుతో బయలుదేరిన ఈ రైలు.. విజయవాడ నుంచి 07764 నంబరుతో ఈనెల 16 ఉదయం 10.25 గంటలకు బయలుదేరి అదేlరోజు సాయంత్రం 04.45 గంటలకు విశాఖ చేరుకుంటుంది. టికెట్ ధర తగ్గిస్తే బాగున్ను... ఈ రైలు వచ్చిన నేపథ్యంలో డీఆర్ఎం చంద్రలేఖముఖర్జీ పరిస్థితిని సమీక్షించి రద్దీని అంచనా వేసేందుకు రైల్వే స్టేషకుచేరుకొని ప్రయాణికులతో ముచ్చటించారు. టికెట్ ధర తగ్గిస్తే బాగుంటుందని పలువురు ప్రయాణికులు పేర్కొన్నారు. ఏసీ చెయిర్కార్తో పోలిస్తే టికెట్ ధర సంతప్తిదాయకంగా ఉందని పలువురు తెలిపారు. పూర్తి స్థాయిలో ఈ రైలును విశాఖ నుంచి నడపాలని ఇంకొందరు కోరారు. దసరా సమయంలో ఈ రైలును నడిపితే మరింత ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. పెరిగిన ప్రయాణికుల రాకపోకలు ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈస్ట్ కోస్టు రైల్వే వాలే్తరు డివిజన్ నుంచి 36, దక్షిణ మధ్య రైల్వే నుంచి 20 ట్రిప్పులతోపాటు డబుల్ డెక్కర్‌ను తాత్కాలికంగా 10 ట్రిప్పులు నడుపుతున్నామన్నారు. శుక్రవారంతో పోలిస్తే ప్రయాణికుల రాకపోకల సంఖ్య 60 శాతం పెరిగినట్టు తెలిపారు. ఇప్పటికే హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేశామని, స్టేషన్లో పలుచోట్ల ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంప్‌ల ద్వారా 500 మందికి వైద్యసేవలు అందించామన్నారు. -
ఇంద్రకీలాద్రికి పుష్కరశోభ
రెండో రోజు పెరిగిన రద్దీ 60 వేల మందికి అమ్మవారి దర్శనం విజయవాడ(ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై పుష్కర శోభ వెల్లివిరిసింది. కృష్ణా పుష్కరాల రెండో రోజైన శనివారం పుష్కర స్నానానికి యాత్రికులు తరలివచ్చారు. పుష్కర స్నానం పూర్తి చేసుకున్న తర్వాత క్యూలైన్ మార్గం ద్వారా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఒంటి గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. పుష్కరాలను పురష్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కొనసాగింది. రెండో రోజు శనివారం మొత్తం 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్నాం మహా నివేదన అనంతరం రద్దీ మరింతగా పెరగడంతో అమ్మవారి దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మహా మండపంలోని ప్రసాదాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారి మహా ప్రసాదం లడ్డూతో పాటు భవానీ ప్రసాదాలను భక్తులు విరివిగా కొనుగోలు చేశారు. టోల్గేట్ వద్ద వివాదం... తొలి రోజున సినీ నటుడు బాలకృష్ణను ప్రయివేటు వాహనంపై కొండపైకి అనుమతించడంతో పోలీసు రెవెన్యూ అధికారులపై ఈవో సూర్యకుమారి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆలయ ఈవో వ్యవహారంపై గుర్రుగా ఉన్న ఈ రెండు శాఖల అధికారులు ఉత్సవాలలో తాము ఖఠినంగా వ్యవహరిస్తే ఏలా ఉంటుందో దేవస్థాన అధికారులకు తెలిసేలా చేశారు. పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్‌తో పాటు దుర్గగుడి అధికారుల వాహనాలను కొండపైకి అనుమతించలేదు. దీంతో సూర్యకుమారి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. లిఫ్టు సదుపాయం పోలీసు, వీఐపీలకేనా... మహామండపం వైపు నుంచి కొండపైకి ఎవరిని అనుమతించేది లేదని చెప్పిన ఈవో సూర్యకుమారి మాటలు పట్టించుకోవడం లేదు. పోలీసు సిబ్బందితో పాటు వారి బంధువులు, వీఐపీల పేరిట అనేక మంది లిఫ్టు ద్వారా కొండపైకి చేరుకుంటున్నారు. నమూనా ఆలయంలో కల్యాణోత్సవం సంగమం సమీపంలోని నమూనా ఆలయానికి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లు తరలివెళ్లారు. సంగమం వద్ద ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో శనివారం కల్యాణోత్సవం నిర్వహించారు. రెండో రోజు ఆదాయం రూ.9.06 లక్షలు.. పుష్కరాలలో రెండో రోజు దుర్గగుడికి రూ.9.06 లక్షల ఆదాయం వచ్చింది. రూ.500 వీఐపీ టికెట్ల విక్రయం ద్వారా రూ.2.08 లక్షలు, 60,900 లడ్డూ విక్రయాల ద్వారా రూ.6.09 లక్షలు, భవానీ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 67,350లు, కేశకండన ద్వారా రూ. 20,850ల ఆదాయం సమకూరింది. -
ఓ పనైపోయింది
విజయవాడ (ఇంద్రకీలాద్రి): పుష్కరాల భక్తులకు సహకరించడం బాధ్యత. విధులతో పాటు భక్తిబావం చాటు కోవడం మరో వైపు. పుష్కరాల రాష్ట్ర నలుమూలల నుంచి అనేక ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగులు వేలాది మంది విజయవాడకు తరలివచ్చారు. తొలి రోజున విధులను ముగించుకుని తిరిగి తమ వసతి గృహాలకు వెళ్లుతూ పుష్కర స్నానం పూర్తి చేసుకున్నారు. పోలీసులు కొందరు శుక్రవారం మధ్యాహ్నం డ్యూటీ ముగియగానే దుర్గాఘాట్‌లో స్నానం ఆచరించారు. -
హారతి గైకోనుమా..
-
పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్ మంకమ్మతోట : తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కృష్ణ పుష్కరాలకు కరీంనగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీచుపల్లికి రోజూ ఐదు బస్సులు – ఉదయం 8:30 నుంచి 10:30 వరకు అరగంటకో బస్సు నాగార్జునసాగర్‌కు రెండు బస్సులు – ఉదయం 8 గంటలు, 10 గంటలకు విజయవాడకు రెండు బస్సులు – ఉదయం 7 గంటలు, 11 గంటలకు వడపల్లికి రెండు బస్సులు – ఉదయం 8:30, 10: 30 గంటలకు ఈ సర్వీస్‌లకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం ఉందని పేర్కొన్నారు. 36 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వెళ్తే ప్రత్యేక బస్సు వేయనున్నట్లు తెలిపారు. వివరాల కోసం 9959225931 నెంబరులో సంప్రదించాలని కోరారు. -
‘కృష్ణా పుష్కర సౌరభం’ పుస్తకావిష్కరణ
గుంటూరు ఈస్ట్ : రచయితలు డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు, డాక్టర్ చింతపల్లి సత్యనారాయణ రచించిన కృష్ణా పుష్కర సౌరభం అనే పుస్తకాన్ని గురువారం కలెక్టర్ కాంతిలాల్ దండే ఆవిష్కరించారు. కలెక్టర్ బంగ్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన జీవన నది కృష్ణవేణి విశిష్టతను తెలియచెబుతూ నూతన రాజధాని ప్రాంత గ్రామాల చరిత్రను విశ్లేషించి చెబుతున్న గ్రంధం కృష్ణా పుష్కర సౌరభం అని అన్నారు. కృష్ణానది పుట్టుక నుంచి సాగర సంగమం దాకా విశేషాలు, నదుల పవిత్రత, పుష్కర ఆవిర్భావం, పుష్కర నది స్నాన విధులు, పరీవాహక ప్రాంత క్షేత్రాల ప్రాధాన్యతను కళ్లకు కట్టినట్లు రచించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, భారతీయ విద్యా భవన్ కార్యదర్శి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర పునీతం
-
భక్తజన హారతి
మహిళల సామూహిక పూజలు మంథని/ కాళేశ్వరం: అంత్యపుష్కరాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంథని వద్ద గల గోదావరికి భక్తులు పోటెత్తారు. శ్రావణ సోమవారం కావడంతో భారీగా తరలివచ్చి పుష్కరస్నానం చేశారు. మహిళలు సామూహిక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులతోపాటు వస్త్రాలను చాటలో పెట్టి సమర్పించారు. లింగదానం చేసుకున్న మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పిండప్రదానాలు, పితృతర్పణాలు జరిగాయి. నదీ తీరంలోని సంగమేశ్వరుడు, హనుమాన్, గౌతమేశ్వర స్వామితోపాటు అనుబంధ ఆలయాలు కిక్కిరిసిపోయాయి. కాళేశ్వరంలో గోదావరి నదికి ఆలయ అధికారులు, అర్చకులు గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలతో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామివార్ల ఆలయం నుంచి వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో గోదావరి న దికి వెళ్లి అక్కడ గోదావరిమాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి పంచహారతులను ఇచ్చారు. సర్పంచ్ మెంగాని మాధవి, ఎంపీపీ వెన్నపురెడ్డి వసంత, జెడ్పీటీసీ హసీన భాను, ఆలయ ఈవో డి.హరిప్రకాశ్‌రావు, మాజీధర్మకర్త అశోక్, అర్చకులు కృష్ణమూర్తిశర్మ, లక్ష్మీనారాయణశర్మ, ప్రశాంత్‌శర్మ, రామన్నశర్మ, రామాచార్యులు పాల్గొన్నారు. -
పుష్కరాలను అపవిత్రం చేయొద్దు..
భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దు.. నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ జరపాలి ఎమ్మెల్యే పీఆర్కే సత్రశాల (రెంటచింతల): ‘పవిత్ర కృష్ణాపుష్కరాలకు పార్టీ రంగు పులమడం ఎందుకు... భక్తుల మనోభావాలను గౌరవించాలనే జ్ఞానం లేదా.. నేను పచ్చరంగు వేసిన ఘాట్లలో పుష్కరస్నానం చేయను.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి’ అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పీఆర్కే సోమవారం సత్రశాలలో పుష్కరఘాట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలను సైతం టీడీపీ వారు పసుపుమయం చేసి అపవిత్రం చేశారని మండిపడ్డారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం కూడా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తోందని, కాని వారి పార్టీ రంగు వేసుకోలేదన్నారు. అడిగేవారు లేరని ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పుష్కరపనులలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. పుష్కరాల ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాలను సైతం అధికారపార్టీ నాయకులు ఇష్టానుసారం కబ్జా చేశారన్నారు. అనంతరం ఎమ్మెల్యే పీఆర్కేకు దేవస్థానం చైర్మన్ గోవర్ధన్,ఈవో అనిత పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థానంలో ప్రత్యేకపూజలు చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు పూజల రామయ్య, ఏరువ శౌరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి శొంఠిరెడ్డి నల్ల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జన శోభితం
ధర్మపురి/కాళేశ్వరం: అంత్య పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి. ఆదివారం జిల్లాలోని ధర్మపురి, కాళేశ్వరం, మంథనిలో వేలాదిమంది పుణ్య స్నానాలు ఆచరించారు. ధర్మపురిలో సుమారు 60 వేల మంది స్నానాలు ఆచరించారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో సుమారు 30 వేల మంది, మంథనిలో సుమారు 6 వేల మంది స్నానాలు ఆచరించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా వచ్చారు. గోదావరి తీరంలో పితృదేవలతకు పిండప్రదానాలు, పితృతర్పనాలు గావించారు. మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. గోదావరి మాతకు మహిళలు దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. పూలు, పండ్లు, వస్త్రాలు, ఓడిబియ్యం సమర్పించారు. సాయంత్రం ధర్మపురి, కాళేశ్వరం, మంథనిలో మహాహారతి కార్యక్రమం వైభంగా నిర్వహించారు. ధర్మపురిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు నంబి రఘునాథాచార్యులు, వేదపండితులు బొజ్జ రమేష్శర్, శ్రీనివాసచారి, శ్రీధరాచారి సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, కిరణ్,అలువాలు శ్రీనివాస్ మహిళలు మురికి భాగ్యలక్ష్మి, గందె పద్మ తరదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో మండల ఎంపీపీ వెన్నపురెడ్డి వసంత, ఆలయ ఈవో డి.హరిప్రకాశ్‌రావు, ఆలయ సీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు మోహన్‌రెడ్డి, అర్చకులు కృష్ణమూర్తిశర్మ, లక్ష్మీనారాయణశర్మ, ప్రశాంత్‌శర్మ, రామన్నశర్మ, రామాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మకు టీటీడీ సారె
మహానంది: ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాల సందర్భంగా కష్ణమ్మకు టీటీడీ నుంచి పట్టుచీర, పసుపు, కుంకుమతో పాటు సకల సౌభాగ్య ద్రవ్యాలను తీసుకుని వెళ్తున్నట్లు తిరుమలకు చెందిన డాలర్ శేషాద్రి తెలిపారు. కష్ణా పుష్కరాల సందర్భంగా తిరుమల నుంచి బుధవారం బయలుదేరిన శ్రీవారి కల్యాణ రథం గురువారం మహానందికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మహానంది దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఆలయ వేదపండితులు రవిశంకర అవధాని.. తదితరులు వారికి స్వాగతం పలికారు. అనంతరం డాలర్ శేషాద్రి మాట్లాడుతూ.. తిరుచానూరు, అహోబిలం, మహానంది, శ్రీశైలం, మంగళగిరి, అమరావతి, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ దేవాలయాల నుంచి పసుపు కుంకుమలు తీసుకుని వెళ్తామన్నారు. అనంతరం పుష్కరాల ప్రారంభం రోజున ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు కష్ణానదిలో వీటిని సమర్పిస్తారన్నారు. ఒంటిమిట్ట మీదుగా ఇక్కడికి వచ్చామని.. 7వ తేదీకి విజయవాడకు చేరతామన్నారు. విజయవాడలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నమూనా ఏర్పాటు చేశామన్నారు. ఏఈఓ రాజశేఖర్, ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పులకించిన గోదారమ్మ
పుష్కర స్నానానికి తరలివచ్చిన జనం మూడో రోజు 12500 మంది పుణ్యస్నానాలు ధర్మపురి/మంథని/ కాళేశ్వరం: గోదారమ్మ పులకించింది. అంత్యపుష్కరాల మూడో రోజు మంగళవారం వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అమావాస్య సందర్భంగా భక్తుల రద్దీ తగ్గిందని పండితులు పేర్కొంటున్నారు. ధర్మపురిలో సుమారు 10 వేల మంది స్నానాలు ఆచరించారు. సంతోషిమాతా ఘాట్ వద్ద 2500 మంది, మంగలిగడ్డ ఘాట్ వద్ద 3000, సోమవిహార్ ఘాట్ వద్ద 4500 మంది స్నానాలు చేశారు. పితృదేవతలకు పిండప్రదానం చేశారు. మహిళలు గోదారమ్మకు వాయినాలు సమర్పించారు. పోలీసులు భక్తులు ఇబ్బంది పడకుండా బందోబస్తు చర్యలు తీసుకున్నారు. మంథని గోదావరి వెలవెలబోయింది. అమవాస్య కారణంగా తక్కువమంది స్నానాలు ఆచరించారు. సుమారు వేయి మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు పండితులు వెల్లడించారు. అమవాస్య కలిసి రావడంతో చాలామంది పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. తర్పణాలు సమర్పించుకున్నారు. బుధవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. కాళేశ్వరంలోని గోదావరి పుష్కరఘాట్లు వెలవెలబోయాయి. మూడో ఇక్కడ సుమారు 15 వందల మంది పుణ్యస్నానాలు ఆచరించారని పండితులు వివరించారు. సాయంత్రం గోదావరికి మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి.హరిప్రకాశ్‌రావు, డీఎల్పీవో శ్రీనివాస్, ఆలయ మాజీ ధర్మకర్త మెంగాని అశోక్, అర్చకులు కృష్ణమూర్తిశర్మ, లక్ష్మీనారాయణశర్మ, ఫణీంద్రశర్మ, ప్రశాంత్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. అంత్యపుష్కరాల సందర్భంగా కాళేశ్వరాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జానపద, తెలంగాణ పాటలు పలువురిని ఉర్రూతలూగించాయి. సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందని ఈవో డి.హరిప్రకాశ్‌రావు వెల్లడించారు. -
గోదారి తీరంలో మళ్లీ పుష్కర సందడి
-
నేటినుంచి అంత్యపుష్కరాలు
ధర్మపురిలో మూడు, కాళేశ్వరంలో 15 ఘాట్లు నిధులివ్వని సర్కారు.. కానరాని కనీస ఏర్పాట్లు కృష్ణా పుష్కరాలపైనే అందరి దృష్టి కాళేశ్వరం/ధర్మపురి : గోదావరి అంత్యపుష్కరాలపై సర్కారు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆది పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించిన సర్కారు అంత్య పుష్కరాలను పూర్తిగా విస్మరించింది. ఆది పుష్కరాల్లో కోట్లాది రూపాయల నిధులతో వివిధ పనులు చేపట్టగా, అంత్య పుష్కరాల్లో భక్తులకు కనీస వసతులు కరువయ్యాయి. త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాలపై దృష్టి సారించిన సర్కారు గోదావరి అంత్య పుష్కరాలపై శీతకన్ను వేసినట్టు తెలుస్తోంది. అంత్య పుష్కరాలపై ఇంతవరకు అధికారికంగా ప్రకటన కూడా చేయకపోడం గమనార్హం. జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఇటీవల రెండుసార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. గతేడాది జూలై 14 నుంచి 25 వరకు గోదావరి నది ఆది పుష్కరాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహించింది. జిల్లాలోని ధర్మపురి, రాయపట్నం, గోదావరిఖని, మంథని, కాళేశ్వరం తదితర ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. అయితే సరిగా ఏడాది తర్వాత అంత్య పుష్కరాలను నిర్వహించడం ఆనవాయితీ కాగా.. ఆదివారం నుంచి ఆగస్టు 11 వరకు వీటిని నిర్వహించనున్నారు. అంత్య పుష్కరాల్లో స్నానమాచరించనా ఆది పుష్కరాల్లో స్నానమాచరించినంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. జిల్లాలో ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరంలో అంత్య పుష్కరాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌లో కోటిలింగాలలోని పుష్కఘాట్లతో మెట్లు కూడా మునిగిపోవడంతో అక్కడ రద్దు చేశారు. ఇక ధర్మపురిలోని మూడు ఘాట్లు, కాళేశ్వరంలోని 15 ఘాట్ల వద్ద మాత్రమే అంత్య పుష్కరాలు నిర్వహిస్తున్నారు. వీటితో ఆది పుష్కరాలు నిర్వహించిన పలు ప్రాంతాల్లో సైతం అంత్య పుష్కరాల కోసం స్థానిక అధికారులు నామమాత్రంగా ఏర్పాటు చేశారు ధర్మపురి, కాళేశ్వరం ఆలయాల్లో, గోదావరినది వద్ద వేదపండితులు ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి అంత్య పుష్కరాలను ప్రారంభిస్తారు. గోదావరి మాతకు పూలు, వస్త్రాలు, సుగంధ ధ్రవ్యాలు సమర్పిస్తారు. ప్రతి రోజు సాయంత్రం 5–6 గంటలకు గోదావరి నదికి హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు రద్దు ఆదివారం నుంచి అంత్య పుష్కరాలు పూర్తయ్యే వరకు కాళేశ్వరం ఆలయంలో నిత్యపూజలు రద్దు చేసినట్లు ఈవో డి.హరిప్రకాశ్‌రావు తెలిపారు. ఆగస్టు 3 నుంచి శ్రావణమాసం ఆరంభమవుతుండటంతో అభిషేక పూజలు యథావిధిగా కొనసాగిస్తామన్నారు. రూ.50 ప్రత్యేక దర్శనానికి టిక్కెట్లు ఉన్నట్లు తెలిపారు. కాళేశ్వరానికి చెందిన స్థానికులకు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు రెండు గంటలపాటు ఉచిత దర్శనాలు కల్పిస్తామన్నారు. ధర్మపురిలో నిత్యపూజలు యథావిధంగా నిర్వహిస్తారు. రోజుకో దానం.. 1 వెండి, భూమి, బంగారం, ధాన్యం తోచినంత సమర్పించి హిరణ్య శ్రాద్ధం చేయాలి. 2 గోవులు, లవణము, మణులు, వస్త్రములు 3 అశ్వము, గడము, ఫలము, శాకములు 4 తైలము, ఆజ్యము, క్షీరము, తేనే, పానకము 5 ధాన్యము, నాగలి, వృషభము, మహిషము 6 ఘనసారము, కస్తూరి చందనము, ఔషధము 7 గృహము, శయ్య, పీట, ఊయల 8 శ్రీచందనము, కందమూలములు, పుష్పములు 9 దాసీ జనము, కంబలము 10 ముత్యాలహారము, వెండి పుష్పములు 11 పుస్తకము, తాంబూలము, యజ్ఞోపవీతము 12 షోడష మహాదానములు, అమశ్రాద్ధము చేయవలయును. అంత్య పుష్కరాల వసతులు అంతంత మాత్రమే గోదావరి తీరంలోని సంతోషిమాతా ఆలయం వద్ద వీఐపీ ఘాట్‌ను ఏర్పాటు చేశారు. మంగలిగడ్డ, సోమవిహార్ ఘాట్ల వద్ద భక్తుల స్నానాలకు షవర్లు ఏర్పాటు చేశారు. డీఎల్పీవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ఘాట్ల వద పిచ్చిమొక్కలు తొలగింపు పనులు చేపట్టారు. భక్తులు దుస్తులు మార్చుకొనుటకు డ్రెస్సింగ్ రూంలు, పది వరకు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఘాట్ల వద్ద విద్యుత్‌లైట్లు, సౌండ్ సిస్టంను ఏర్పాటు చేశారు. దేవస్థానంలో గతంలో ఏర్పాటు చేసిన క్యూలైన్లే దర్శనమిస్తున్నాయి. కొత్తగా ఇసుక స్తంభం నుంచి దేవాలయం వరకు క్యూలైన్లను ఏర్పాటుకు ఇనుప స్తంభాలు ఏర్పాటు చేసినా, జాలీలు అమర్చలేదు. కాళేశ్వరంలో ఎలాంటి ఏర్పాట్లు చేపట్టలేదు. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులు గానీ, తాత్కాలిక మరుగుదొడ్లు గానీ, తాగునీటి వసతితోపాటు వైద్యశిబిరం తదితర ఏర్పాట్లు కనిపించడం లేదు. -
కష్ణా పుష్కరాలకు పాడేరు నుంచి సర్వీసులు
పాడేరు రూరల్ :వచ్చే నెల 12వ తేదీ నుంచి 23 వరకు జరుగనున్న కష్ణా పుష్కరాల కోసం పాడేరుడిపో నుంచి బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రామకష్ణ చెప్పారు. శుక్రవారం ఆయన పాడేరు ఆర్టీసీyì ´ù¯]l$ సందర్శించారు. గ్యారేజీలో కార్మికులతో మాట్లాడి బస్సుల కండిషన్ అడిగి తెలుసుకున్నారు. బస్సుడిపో ఆవరణలో మొక్కలనాటారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పాడేరు నుంచి విజయవాడ వైవీరామ్ ఎస్టేట్ వరకు బస్సులు నడుపుతామని అక్కడి నుంచి పుష్కర ఘాట్‌కు సిటీ బస్సుల్లో వెళ్లాలన్నారు. ప్రతి రోజు మూడేసి సర్వీసులు నడుపుతామన్నారు. టికెట్ ధర రూ.520 గా నిర్ణయించామన్నారు. పుష్కరాల కోసం విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం రీజియన్ల నుంచి ప్రతి రోజు 200 బస్సులు ప్రత్యేకంగా నడపనున్నట్లు చెప్పారు. ఇవి కాకుండా రోజు వారి సర్వీసులు యథాతథంగా నడుస్తాయన్నారు. అలాగే పాడేరు ఆర్టీసీ డిపోకు కొత్తగా 10 పల్లె వెలుగు, రెండు ఎక్స్‌ప్రెస్ బస్సులు మంజూరయ్యాయన్నారు. వీటిలో ఇప్పటికే మూడు బస్సులు పాడేరు చేరుకున్నాయని, మిగిలిన బస్సులు త్వరలో వస్తాయన్నారు. ఆయన వెంట ఆర్టీసీరీజినల్ మేనేజర్ సుదీష్‌బాబు, డిపో మేనేజర్ మల్లికార్జున రాజు ఉన్నారు. -
అంత్యపుష్కరాలకు 85 బస్సులు
ఈనెల 31నుంచి ఆగస్టు 11వరకు రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్ మంకమ్మతోట : జిల్లాలో జరగనున్న అంత్య పుష్కరాలకు 85 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎం కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 31నుంచి ఆగస్టు 11వరకు భక్తుల సౌకర్యం కోసం బస్సులు నడుపుతామన్నారు. జిల్లాలో ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల, మంథని స్నానఘట్టాల ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 2015లో జరిగిన ఆది పుష్కరాలకు 450 బస్సులతో 22లక్షల మంది భక్తులను చేరవేశామని, అంత్యపుష్కరాలకు 12 రోజులపాటు 85 బస్సులతో 4లక్షల 40వేల మందికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరం ఉన్నంతవరకు మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అన్ని బస్సులకు ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తామన్నారు. కృష్ణ పుష్కరాలకు 15 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఒకరికి రాకపోకలకు రూ.900 చార్జీ అవుతుందని, గ్రూపుగా ఉండి బస్ ఏంగేజ్ చేసుకున్నట్లయితే ఒకరి దాదాపుగా రూ.300 తక్కువ అవుతుందని పేర్కొన్నారు. ఈ పుష్కరాల సందర్భంగా కరీంనగర్ రీజియన్ నుంచి హైదరాబాద్, వనపర్తికి 50 బస్సులు పంపించామన్నారు. ప్రజలు సురక్షితమై ప్రయాణానికి ఆర్టీసీ బస్‌లోనే ప్రయాణించి సంస్థను ఆదరించాలని కోరారు. రూట్ వేసిన బస్సులు చార్జీలు(రూ.లలో) కరీంనగర్– ధర్మపురి 10 62 జగిత్యాల – ధర్మపురి 10 28 కోరుట్ల – ధర్మపురి 10 48 మెట్పల్లి –ధర్మపురి 5 5 మంథని – కాళేశ్వరం S 10 60 కరీంనగర్– కాళేశ్వరం 10 124 గోదావరిఖని– కాళేశ్వరం 5 81 హుస్నాబాద్– ధర్మపురి 5 97 సిరిసిల్లా – ధర్మపురికి 5 82 వేములవాడ– ధర్మపురికి 5 71 కరీంనగర్– కోటిలింగాల 5 49 -
పదోరోజు కొనసాగుతున్న పుష్కరాలు
-
పుష్కరాల్లో పాలొన్న కోటిన్నర భక్తులు
-
పుష్కరాల్లో పాల్గొన్న ప్రవీణ్‌తొగాడియా
-
పుష్కరస్నానం చేస్తే తరతరాల పాపాలుపోతాయి
-
ధర్మపురికి గోదావరి పుష్కరశోభ
-
పుష్కర సంబరాలు-భాసర
-
పుష్కరాలు ఎందుకు..?
-
తెలుగు రాష్ట్రాలపై స్వరూపానందేంద్ర వ్యాఖ్యలు !
-
పుష్కరాల నాటికి చక్కని రాజమండ్రి!
రాజమండ్రి సిటీ : పుష్కరాల నాటికి రాజమండ్రిని పచ్చదనాల సుందర నగరంగా తీర్చిదిద్ది, దేశం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులకు క న్నుల పండువ చేయగలమని ముంబాయికి చెందిన ప్రసిద్ద ఆర్కిటెక్ట్స్ సంజయ్ పురి, కువల్ సనమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపుతో శుక్రవారం ఈ బృందం ఉభయ గోదావరి జిల్లాల పుష్కర ప్రత్యేక అధికారి జె.మురళి తదితర అధికారులతో కలసి నగరంలో పలు ప్రాంతాలను సందర్శించింది. నగరంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, ప్రజల భద్రత ప్రధానంగా అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసేందుకు తమ బృందం సిద్ధంగా ఉందని ఆర్కిటెక్ట్ సంజయ్‌పురి పేర్కోన్నారు. లాలాచెరువు సెంటర్, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, ఏవీ అప్పారావు రోడ్ జంక్షన్, కోరుకొండ రోడ్ జంక్షన్, సెంట్రల్ జైల్ రోడ్, శానిటోరియం, పుష్కరఘాట్, కోటిలింగాలరేవు, మధురపూడి విమానాశ్రయం రోడ్, ఆర్యాపురం ట్యాంక్ తదితర ప్రాంతాలను ఈ బృందం పరిశీలించింది. సుందరమైన ఘాట్‌గా పుష్కరాలరేవు నగరంలో అత్యంత ప్రాధాన్యం గల పుష్కరాలరేవును సుందరమైన ఘాట్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. ఘాట్‌లో ఎటు చూసినా పచ్చదనం కనిపించేలా చూడనున్నారు. ఘాట్‌ను మరో 150 మీటర్లు విస్తరించి, రాత్రులు కూడా పగటిని తలపించే విధంగా లైటింగ్ వ్యవస్థ, అత్యాధునిక ఫ్లోరింగ్ ఏర్పాటు చేయనున్నారు. కోటిలింగాలరేవు ఆధునికీకరణ.... కోటిలింగాలరేవు పుష్కరాల సమయానికి మరో 373 మీటర్ల మేర అభివృద్ధి చెందనుంది. కోటిలింగాల రేవు నుంచి దుర్గా ఘాట్ వరకూ ఘాట్లను అనుసంధానం చేసి, ఆ ప్రక్రియ పూర్తికాగానే అత్యాధునిక లైటింగ్ వ్యవస్ధతో పాటు సుందరీకరణ చర్యలు చేపట్టనున్నారు. ప్రతి ఘాట్లోనూ గార్డెనింగ్ ఏర్పాటు చేయనున్నారు. కంబాలచెరువుకు మహర్దశ.. పుష్కరాలకు కంబాలచెరువుకు మహర్దశ పట్టనుంది. చెరువులో యాత్రికుల మనసు దోచే అద్భుతమైన కళాఖండాలు ఏర్పాటు చేసేందుకు ఈ బృందం సిద్ధమౌతోంది. వెలుగుల ఫౌంటెన్‌తో పాటు సంగీతాన్ని మేళవించి యాత్రికులకు వీనుల విందు చేయనున్నారు. అద్భుతమైన లైటింగ్ వ్యవస్థతో నిరంతర వెలుగులు , స్పీడ్ బోట్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. కార్పొరేషన్ కార్యాలయం హరితమయం.. కార్పోరేషన్ కార్యాలయం ఇక పచ్చదనాలతో అలరించనుంది. నగర పాలక సంస్థ పాత భవనం ఎదురుగా ఉన్న స్థలంలో పరిమళాలు వెదజల్లే పూలమొక్కలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు విదేశాల నుంచీ మొక్కలు రప్పించనున్నారు. అత్యాధునిక హైమాస్ట్ లైటింగ్ క్యారీ సెంటర్ నుంచి లాలాచెరువు వెళ్లే రోడ్‌ను ఆధునికీకరించి డివైడర్‌పై లైటింగ్ వ్యవస్థతో పాటు గార్డెనింగ్‌కు చర్యలు తీసుకుంటారు. లాలాచెరువు సెంటర్, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, ఏవీ అప్పారావు రోడ్ జంక్షన్, కోరుకొండ రోడ్ జంక్షన్, సెంట్రల్ జైల్ రోడ్, శానిటోరియం జంక్షన్లో అత్యాధునికమైన హైమాస్ట్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు ముఖ్యకూడళ్ళలో ల్యాండ్ స్కేపింగ్ చేయనున్నారు. నగరంలో అవసరమైనప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి సుందరీకరించనున్నారు. పార్కులకూ కొత్త శోభ నగరంలో అన్ని పార్కులనూ అభివృద్ధి చేయనున్నారు. పార్కుల్లో లైటింగ్‌తో పాటు బెంచీలు, సీసీ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. వాటర్ ఫౌంటెన్స్, పిల్లలు సేదదీరేందుకు అవసరమైన అత్యాధునిక ఉపకరణాలు ఏర్పాటు చేయనున్నారు. ఆర్యాపురం స్టోరేజ్ ట్యాంక్ ఆవరణకు కొత్త రూపు ఆర్యాపురం స్టోరేజ్ ట్యాంక్ ఆవరణను ల్యాండ్ స్కేపింగ్ ద్వారా సుందరీకరించనున్నారు. సాయంసంధ్యవేళలో యాత్రికులు సేద దీరేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయనున్నారు. ఇక్కడ లైటింగ్ వ్యవస్థతో పాటు ఆధునిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. కాగా పర్యటనలో గుర్తించిన అంశాలను పరిశీలించి, మార్చి 12 నాటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నామని ఆర్కిటెక్ట్ సంజయ్‌పురి వెల్లడించారు. ఆయన వెంట నగర పాలక సంస్థ కమిషనర్ మురళి, ఆర్కిటెక్ట్స్ శివకుమార్, నేహా డేనియా తదితరులు ఉన్నారు.