డబుల్ ఆనందం
-
మరోసారి విశాఖ వాసులను పలకరించిన డబుల్ డెక్కర్
-
l 800 మంది ప్రయాణికులతో విజయవాడకు పయనం
తాటిచెట్లపాలెం :
విశాఖవాసులను మరోసారి డబుల్ డెక్కర్ రైలు పలకరించింది. ట్రయిల్‌రన్ సమయంలో చుట్టం చూపుగా వచ్చిన ఈ రైలు.. ఇప్పుడు పుష్కర సేవలో విశాఖ వాసులను పునీతుల్ని చేసేందుకు శనివారం ఉదయం 10.15 గంటలకు ఇక్కడకు చేరుకుంది. ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫారంకి చేరుకున్న ఈ రైలును పలువురు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. మరికొందరు ప్లాట్‌ఫారం టికెట్ తీసుకొని మరీ రైలెక్కి ఫొటోలు తీసుకున్నారు.
1200కి 800 ఫుల్
ఈ రైలులోని 10 బోగీల్లో 1200 సీట్లుండగా.. అందులో 800 సీట్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ఇక్కడ నుంచి 07763 నంబరుతో బయలుదేరిన ఈ రైలు.. విజయవాడ నుంచి 07764 నంబరుతో ఈనెల 16 ఉదయం 10.25 గంటలకు బయలుదేరి అదేlరోజు సాయంత్రం 04.45 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
టికెట్ ధర తగ్గిస్తే బాగున్ను...
ఈ రైలు వచ్చిన నేపథ్యంలో డీఆర్‌ఎం చంద్రలేఖముఖర్జీ పరిస్థితిని సమీక్షించి రద్దీని అంచనా వేసేందుకు రైల్వే స్టేషకుచేరుకొని ప్రయాణికులతో ముచ్చటించారు. టికెట్ ధర తగ్గిస్తే బాగుంటుందని పలువురు ప్రయాణికులు పేర్కొన్నారు. ఏసీ చెయిర్‌కార్‌తో పోలిస్తే టికెట్ ధర సంతప్తిదాయకంగా ఉందని పలువురు తెలిపారు. పూర్తి స్థాయిలో ఈ రైలును విశాఖ నుంచి నడపాలని ఇంకొందరు కోరారు. దసరా సమయంలో ఈ రైలును నడిపితే మరింత ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.
పెరిగిన ప్రయాణికుల రాకపోకలు
ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈస్ట్ కోస్టు రైల్వే వాలే్తరు డివిజన్ నుంచి 36, దక్షిణ మధ్య రైల్వే నుంచి 20 ట్రిప్పులతోపాటు డబుల్ డెక్కర్‌ను తాత్కాలికంగా 10 ట్రిప్పులు నడుపుతున్నామన్నారు. శుక్రవారంతో పోలిస్తే ప్రయాణికుల రాకపోకల సంఖ్య 60 శాతం పెరిగినట్టు తెలిపారు. ఇప్పటికే హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేశామని, స్టేషన్లో పలుచోట్ల ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంప్‌ల ద్వారా 500 మందికి వైద్యసేవలు అందించామన్నారు.