పుష్కరాలలో సాంకేతిక విప్లవం భేష్
పుష్కరాలలో సాంకేతిక విప్లవం భేష్
Published Fri, Aug 19 2016 8:00 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
20 విశ్వవిద్యాలయాల వీసీల ప్రశంస
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
కృష్ణా పుష్కరాల నిర్వహణలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం గొప్పగా ఉందని రాష్ట్రంలోని 20 విశ్వవిద్యాలయాలకు చెందిన ఉప కులపతులు, ఆచార్యుల బృందం ప్రశంసించింది. పుష్కరాల్లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని విశ్లేషించి విద్యార్థులకు భోధించేందుకు శుక్రవారం దుర్గాఘాట్‌లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు బృందం సభ్యులు విచ్చేశారు. పుష్కర స్నానఘాట్లలో ఏర్పాట్లు, పర్యవేక్షణ, సూచనలు, యాత్రికుల గణాంక వివరాల నమోదును సాంకేతికంగా పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ బాబు.ఏ వివరించారు. కృష్ణా పుష్కరాల నిర్వహణలో నిశ్శబ్ధ సాంకేతిక విప్లవం తమకు కనిపించిందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి. ఉదయలక్ష్మి అన్నారు. పద్మావతి విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ఉమ, ఏపీఎస్‌సీహెచ్‌ఈ ప్రొఫెసర్ విజయప్రకాష్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్, కృష్ణా యూనివర్సిటీ ప్రొఫెసర్ రామకృష్ణారావు, రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ వై. నరసింహులు, విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రొఫెసర్ వీరయ్య, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆవుల దామోదరం, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజగోపాల్, ద్రవిడియస్ యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీనివాసకుమార్ పాల్గొన్నారు.
Advertisement