సమష్టిగా పుష్కర వైద్య సేవలు
డీఎంహెచ్‌వో డా.నాగమల్లేశ్వరి
లబ్బీపేట:
లక్షలాది మంది పుష్కరాలకు తరలివచ్చినా ఎలాంటి అవాంతరాలు కలగకుండా వైద్యశాఖ సిబ్బంది అంతా సమష్టిగా పనిచేసి అనారోగ్యానికి గురైన వారికి సేవలు అందించారని ఆ శాఖ నోడల్ ఆఫీసర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ ఆర్ నాగమల్లేశ్వరి అన్నారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బందితో పాటు, పలు కార్పొరేట్ ఆస్పత్రులు సైతం పుష్కరాల్లో సేవలు అందించాయని అన్నారు. ప్రభుత్వ, ప్రవేటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో యాత్రికులకు మంచి సేవలు అందించగలిగాం.
4.11 లక్షల మందికి వైద్య పరీక్షలు
పుష్కర ఘాట్లలోని వైద్య శిబిరాల్లో 4,11,283 మంది ఓపీ పరీక్షలు చేయగా, 2672 మందికి ఇన్ పేషెంట్స్‌గా సేవలు అందించినట్లు ఆమె తెలిపారు. 959 మందిని రిఫరల్ కేసులుగా మెరుగైన వైద్యం కోసం వివిధ ఆస్పత్రిలకు తరలించినట్లు చెప్పారు.