జన శోభితం
ధర్మపురి/కాళేశ్వరం: అంత్య పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి. ఆదివారం జిల్లాలోని ధర్మపురి, కాళేశ్వరం, మంథనిలో వేలాదిమంది పుణ్య స్నానాలు ఆచరించారు. ధర్మపురిలో సుమారు 60 వేల మంది స్నానాలు ఆచరించారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో సుమారు 30 వేల మంది, మంథనిలో సుమారు 6 వేల మంది స్నానాలు ఆచరించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా వచ్చారు. గోదావరి తీరంలో పితృదేవలతకు పిండప్రదానాలు, పితృతర్పనాలు గావించారు. మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. గోదావరి మాతకు మహిళలు దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. పూలు, పండ్లు, వస్త్రాలు, ఓడిబియ్యం సమర్పించారు. సాయంత్రం ధర్మపురి, కాళేశ్వరం, మంథనిలో మహాహారతి కార్యక్రమం వైభంగా నిర్వహించారు. ధర్మపురిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు నంబి రఘునాథాచార్యులు, వేదపండితులు బొజ్జ రమేష్‌శర్, శ్రీనివాసచారి, శ్రీధరాచారి సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, కిరణ్,అలువాలు శ్రీనివాస్ మహిళలు మురికి భాగ్యలక్ష్మి, గందె పద్మ తరదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో మండల ఎంపీపీ వెన్నపురెడ్డి వసంత, ఆలయ ఈవో డి.హరిప్రకాశ్‌రావు, ఆలయ సీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్, టీఆర్‌ఎస్ నాయకులు మోహన్‌రెడ్డి, అర్చకులు కృష్ణమూర్తిశర్మ, లక్ష్మీనారాయణశర్మ, ప్రశాంత్‌శర్మ, రామన్నశర్మ, రామాచార్యులు తదితరులు పాల్గొన్నారు.