సాక్షి, తిరుపతి: ‘గంగా పుష్కర కాలంలో గంగమ్మ తల్లికే మహాకుంభాభిషేకం నిర్వహించడం మహాద్భుతం. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించడం శుభ సూచకం’ అని కంచికామకోటి పీఠాధిపతి శ్రీవిజయేంద్ర సరస్వతి ఉద్ఘాటించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ మహా కుంభాభిషేకంలో చివరి రోజైన శుక్రవారం నాడు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో యాగ యజ్ఞపూజలు నిర్వహించారు. యాగశాల నుంచి గంగమ్మ తల్లి మూలవిరాట్‌ను తీసుకువచ్చి నూతనంగా నిర్మించిన గర్భాలయంలో విజయేంద్ర సరస్వతి..అమ్మవారిని ప్రతిష్టించి అభిషేకం నిర్వహించారు.
గర్భాలయం విమాన గోపుర శిఖరంపై శాస్త్రోక్తంగా బంగారు తాపడంతో తయారు చేసిన కలశాన్ని స్థాపన చేశారు. భక్తులనుద్దేశించి విజయేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం చేస్తూ గంగమ్మ తల్లి నామస్మరణ ఎంతో పుణ్యఫలమని పేర్కొన్నారు. నదులను కాలుష్యం చేయకుండా కాపాడాలని కోరారు. కుంభాభిషేకంతో సకల జనులకు సంతోషం కలుగుతుందని 18వ శతాబ్దంలో శాసనంలో పొందుపరచారని, ఈ శాసనం కంచి ఆలయంలో ఉందని చెప్పారు.
హిందూధర్మం చాలా గొప్పదని వ్యాఖ్యానించారు. దేవుడు అందరివాడు: స్వరూపానందేంద్ర గంగమ్మ తల్లి తొలి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అన్నారు. తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ మహా కుంభాభిషేక కార్యక్రమంలో పీఠాధిపతితో పాటు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర పాల్గొన్నారు. స్వరూపానందేంద్ర అనుగ్రహభాషణం చేస్తూ..దేవుడు ఒక కులానికి చెందిన వాడు కాదని, అన్ని కులాల వాడని అన్నారు.
నాడు టీటీడీ చైర్మన్‌గా భూమ న చేపట్టిన దళిత గోవిందం కా ర్యక్రమం అద్భుతమైనదని కొనియాడారు. మంత్రి రోజా మా ట్లాడుతూ..రాజుల కాలం మాదిరిగా సీఎం జగన్ పాలనలో అద్భుతమైన రాతి నిర్మాణాలతో రాష్ట్రంలో ఆలయాలు నిర్మిస్తున్నా రని చెప్పారు. ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ మహాకుంభాభిషేకంలో పీఠాధిపతులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. డిప్యూ టీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(చదవండి: నయనానందం.. నృసింహుని కల్యాణం)
Comments
Please login to add a commentAdd a comment