gangamma Temple
-
గుడి కూల్చేసిన టీడీపీ నేత
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కుందేటివారి వీ«ధి ఎస్టీ కాలనీలో నిర్మాణంలో ఉన్న గంగమ్మ గుడిని శనివారం రాత్రి తెలుగుదేశం నేత వెంకటేష్ శెట్టి కూల్చేశారు. ఆలయం రెండడుగులు తన స్థలంలోకి వచ్చిందని ఆలయం మొత్తాన్ని జేసీబీతో కూల్చేయడమేగాక అడ్డుకున్న కాలనీవాసుల్ని బెదిరించారు. కాలనీలో నివసిస్తున్న యానాదులు పాత గంగమ్మ గుడిని తొలగించి నాలుగు నెలల కిందట ఆరడుగుల స్థలంలో కొత్త ఆలయ నిర్మాణం చేపట్టారు.ఈ కాలనీకి ఆనుకుని వ్యాపారి అయిన టీడీపీ నేత వెంకటేష్ శెట్టికి స్థలం ఉంది. ఆ స్థలంలో గుడి కడితే తన స్థలాన్ని ఎవరూ కొనరని, అందువల్ల గుడి కట్టవద్దని అతడు ఆ కాలనీవాసులతో గొడవ పడేవారు. శనివారం మండల సర్వేయర్ హరి సర్వే చేసి, కడుతున్న ఆలయం వ్యాపారి స్థలంలో రెండడుగుల మేర ఉందని మార్క్ వేశారు. ఆ రెండడుగుల స్థలానికి డబ్బు ఇస్తామని, లేదంటే సమయం ఇస్తే ఆ మేర ఆలయం తొలగిస్తామని కాలనీవాసులు వెంకటేష్ శెట్టికి, మండల సర్వేయర్‌కు చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వెంకటేష్‌శెట్టి జేసీబీతో నిర్మాణంలో ఉన్న గంగమ్మ ఆలయాన్ని కూల్చేశారు.అడ్డుకున్న కాలనీవాసులతో మీ నివాసాలు కూడా కూల్చేస్తానంటూ బెదిరించారు. దాతల సాయంతో గుడి నిర్మించుకుంటున్నామని, ఇప్పటికే రూ.2.5 లక్షలు ఖర్చయిందని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఆలయాన్ని కూల్చేసిన వెంకటేష్ శెట్టి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సర్వేయర్ హరిని అడగగా.. వెంకటేష్ స్థలంలో రెండడుగుల మేర ఆలయ నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఈ విషయమై చర్చించుకుని సామరస్యంగా సర్దుకునే వెసులుబాటు ఉన్నా గుడి మొత్తాన్ని కూల్చేయడం సమంజసం కాదని చెప్పారు. ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు కుందేటివారి వీధి ఎస్టీకాలనీ వాసులు రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు. ఇక్కడ అందరూ రోజువారీ కూలీలే. పైసాపైసా కూడబెట్టి గ్రామదేవత గంగమ్మ ఆలయ నిర్మాణానికి వెచ్చించారు. ఆపై దాతల సాయంతో కొంత మొత్తాన్ని సేకరించారు. తర్వాత వారే కూలీలుగా ఆలయాన్ని నిరి్మస్తున్నారు. టీడీపీకి చెందిన వ్యాపారి వెంకటేష్ శెట్టి తన స్థలానికి బేరం కుదరడంలేదన్న సాకుతో ఆలయం మొత్తాన్ని కూల్చేసేందుకు స్కెచ్ వేశారు.సర్వేలో ఆలయం తన స్థలంలోకి రెండడుగుల మేర వచ్చిందన్న సాకుతో మరింత రెచ్చిపోయారు. ఆలయం మొత్తాన్ని రాత్రికిరాత్రే జేసీబీతో కూల్చేశారు. శిథిలాలను ట్రాక్టర్ల ద్వారా రాత్రికిరాత్రే తరలించారు. అడొచ్చినవారిపై చిందులేస్తూ.. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో గిరిజనులు చేసేదిలేక ఆలయాన్ని కూల్చేస్తున్నా ఆవేదనగా చూస్తూ ఉండిపోయారు. వెంకటేష్ శెట్టికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉండడం వల్లే ఎస్టీలమైన తమపై ప్రతాపం చూపుతున్నాడని వారు మండిపడుతున్నారు. -
తిరుపతి : గంగమ్మకు మరుపొంగళ్లతో భక్తుల మొక్కులు (ఫొటోలు)
-
గంగమ్మను దర్శించుకున్న సీఎం జగన్
-
తిరుపతి గంగమ్మ ఆలయంలో సీఎం జగన్
-
తిరుపతి : ఘనంగా గంగమ్మ జాతర మహోత్సవాలు (ఫొటోలు)
-
తిరుపతి గంగమ్మను దర్శించుకున్న మంత్రి అంబటి రాంబాబు
-
తాత్యాగుంట గంగమ్మ జాతర వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర
-
గంగమ్మకు కుంభాభిషేకం.. మహాద్భుతం!
సాక్షి, తిరుపతి: ‘గంగా పుష్కర కాలంలో గంగమ్మ తల్లికే మహాకుంభాభిషేకం నిర్వహించడం మహాద్భుతం. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించడం శుభ సూచకం’ అని కంచికామకోటి పీఠాధిపతి శ్రీవిజయేంద్ర సరస్వతి ఉద్ఘాటించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ మహా కుంభాభిషేకంలో చివరి రోజైన శుక్రవారం నాడు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో యాగ యజ్ఞపూజలు నిర్వహించారు. యాగశాల నుంచి గంగమ్మ తల్లి మూలవిరాట్‌ను తీసుకువచ్చి నూతనంగా నిర్మించిన గర్భాలయంలో విజయేంద్ర సరస్వతి..అమ్మవారిని ప్రతిష్టించి అభిషేకం నిర్వహించారు. గర్భాలయం విమాన గోపుర శిఖరంపై శాస్త్రోక్తంగా బంగారు తాపడంతో తయారు చేసిన కలశాన్ని స్థాపన చేశారు. భక్తులనుద్దేశించి విజయేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం చేస్తూ గంగమ్మ తల్లి నామస్మరణ ఎంతో పుణ్యఫలమని పేర్కొన్నారు. నదులను కాలుష్యం చేయకుండా కాపాడాలని కోరారు. కుంభాభిషేకంతో సకల జనులకు సంతోషం కలుగుతుందని 18వ శతాబ్దంలో శాసనంలో పొందుపరచారని, ఈ శాసనం కంచి ఆలయంలో ఉందని చెప్పారు. హిందూధర్మం చాలా గొప్పదని వ్యాఖ్యానించారు. దేవుడు అందరివాడు: స్వరూపానందేంద్ర గంగమ్మ తల్లి తొలి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అన్నారు. తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయ మహా కుంభాభిషేక కార్యక్రమంలో పీఠాధిపతితో పాటు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర పాల్గొన్నారు. స్వరూపానందేంద్ర అనుగ్రహభాషణం చేస్తూ..దేవుడు ఒక కులానికి చెందిన వాడు కాదని, అన్ని కులాల వాడని అన్నారు. నాడు టీటీడీ చైర్మన్‌గా భూమ న చేపట్టిన దళిత గోవిందం కా ర్యక్రమం అద్భుతమైనదని కొనియాడారు. మంత్రి రోజా మా ట్లాడుతూ..రాజుల కాలం మాదిరిగా సీఎం జగన్ పాలనలో అద్భుతమైన రాతి నిర్మాణాలతో రాష్ట్రంలో ఆలయాలు నిర్మిస్తున్నా రని చెప్పారు. ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ మహాకుంభాభిషేకంలో పీఠాధిపతులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. డిప్యూ టీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: నయనానందం.. నృసింహుని కల్యాణం) -
తిరుపతిలో వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ దేవతా విగ్రహ ప్రతిష్ట (ఫోటోలు)
-
వెయ్యేళ్ల చరిత్రకు పూర్వ వైభవం.. నాడు రాజుల నేతృత్వంలో.. నేడు సీఎం హోదాలో!
ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఆధ్యాత్మిక విషయాల్లో భక్తుల మనోభావాలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ఆలయాలు కూల్చి, పుష్కరాలపేరుతో భక్తులను పొట్టనబెట్టుకున్న చరిత్ర టీడీపీది అయితే.. పురాతన గుళ్లనూ పునరుద్ధరిస్తూ రాయలనాటి వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్సీపీది. ఈనేపథ్యంలోనే తిరుమల శ్రీవారి చెల్లెలు అయిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి పూర్వవైభవం తెచ్చేందుకు సంకల్పించింది. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సూచనలతో ప్రథమ పూజ గంగమ్మకు నిర్వహించి, తర్వాత భక్తులు తిరుమల కొండకు వెళ్లడం ఆచారమని, పురాతన కాలంలోనూ ఈ విధానం కొనసాగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించిన నేపథ్యంలో ఆయన మంగళవారం ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆపై గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రీకృష్ణదేవరాయలు, తదనంతరం అచ్యుతరాయులు, తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గంగమ్మ ఆలయాన్ని సందర్శించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గంగమ్మ ఆలయ విశిష్టత, ఆలయ చరిత్ర, సంప్రదాయం తదితర అంశాలపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. సాక్షి, తిరుపతి: తిరుపతి పుట్టినప్పటి నుంచీ అంటే దాదాపు 900 ఏళ్ల నుంచే గంగజాతర జరిగేదని కొందరు చెబుతారు. శ్రీవారి ప్రియ భక్తుడు అనంతాచార్యులు ఈ ఆలయాలన్ని ప్రతిష్టించారు. 1843లో బిట్రీష్ ప్రభుత్వం హథీరాంజీ మఠానికి తిరుమల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన సమయంలో తిరుమల ఆలయంతో పాటు దాదాపు 26 స్థానిక ఆలయాలను అనుబంధంగా అప్పగించారు. అందులో గంగమ్మ ఆలయం కూడా ఉంది. అయితే టీటీడీ ఏర్పడిన తర్వాత జంతుబలులు జరిగే ఆలయం టీటీడీ ఆధీనంలో ఉండడం సరికాదనే ఉద్దేశంతో జాబితా నుంచి ఈ ఆలయాన్ని తొలగించారని చెబుతారు. అయినా శ్రీవారికి చెల్లెలుగా గంగమ్మని భావిస్తారు. అందుకే ఏటా తిరుమల ఆలయం నుంచి సారె సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. అప్పటి వరకు టీటీడీ పర్యవేక్షణలోనే.. 1843లో బ్రిటీష్ వారు టీటీడీ ఆలయ పర్యవేక్షణను హథీరాంజీ బావాకు అప్పగించారు.అప్పటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు శ్రీగోవిందరాజస్వామి ఆలయం, శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, కపిలతీర్థం ఆలయం ఇలా 26 ఆలయాల పర్యవేక్షణను హథీరాంజీ బావా చూసేవారు. ఇందులో శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయం కూడా ఉండేదని రికార్డులు ఉన్నాయి. అయితే బ్రిటీష్ వారు 1933లో టీటీడీ పాలక మండలి ఏర్పాటుతో తిరుమల శ్రీవారి ఆలయ పర్యవేక్షణ ఇచ్చారు. పాలక మండలి చేతికి పర్యవేక్షణాధికారం వచ్చాక టీటీడీ ఉప ఆలయాలలోనున్న శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఉన్న రికార్డులు మాయమయ్యాయి.అంటే తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయం టీటీడీ ఉప ఆలయమే అని గత చరిత్ర ఆధారం. గంగమ్మ దర్శనం తర్వాతే స్వామివారి దర్శనం కలియుగ వేంకటేశ్వరస్వామి చెల్లెలుగా పూజలందుకుంటున్న గంగమ్మను తొలుత దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకునేవారు. సుమారు 400 ఏళ్ల పూర్వం నుంచే ఈ సంప్రదాయం ఉండేది. అయిలే కాలక్రమేణా తిరుమలకు వెళ్లే దారులు మరలి ఈ సంప్రదాయం కనుమరుగైంది. గంగమ్మకు ఏటా జాతర సమయంలో టీటీడీ నుంచి సారె సమర్పిస్తారు. తిరుచానూరులో చక్రతీర్థం రోజున తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఏటా శ్ర్రీపద్మావతి అమ్మవారికి ఏనుగుపై పసుపు ముద్దను పంపేవారు. పసుపు ముద్ద తిరుమల నుంచి తిరుచానూరు చేరుకున్నాకే అమ్మవారి చక్రస్నానం జరిగే ఆచారం ఉంది. ఈ నేపథ్యంలో పసుపు ముద్ద తిరుచానూరుకు తీసుకెళ్లే మార్గమధ్యలో గంగమ్మ గుడి ముందు ఆపి గంగమ్మకు పూజలు చేసేవారు. గంగమ్మను దర్శించనున్న తొలి సీఎం జగన్ ప్రాచీన సంప్రదాయం కొనసాగింపునకు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్.జగన్మోహన్రెడ్డి తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకోనున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తొలిసారి గంగమ్మ ఆలయానికి రానుండడం ఇదే ప్రథమం. ప్రాచీన వైభవ వ్యాప్తికి ఎమ్మెల్యే భూమన కృషి ప్రాచీన చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ ఆలయ విశిష్టతను విశ్వవ్యాప్తి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విశేష కృషి చేస్తున్నారు. ఈ ఏడాది జానపద కళా ప్రదర్శనలతో గంగజాతర విశిష్టతను చాటారు. అలాగే తిరుపతి గంగమ్మకు సారె సంప్రదాయంలో స్థానిక సంస్థలు, అధికారులను సైతం భాగస్వాములను చేశారు. 400 ఏళ్ల క్రితం ఉన్న విధంగా గంగమ్మ దర్శనం తర్వాత శ్రీవారి దర్శనం ఆచారాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఈనెల 27వ తేదీ తిరుపతి గంగమ్మ ఆలయ దర్శనానికి ఆహ్వానించారు. ప్రాచీన ఆలయం తిరుపతి గ్రామదేవతగా అమ్మవారు పూజలందుకుంటున్నారు. ఏటా ఏడు రోజుల పాటు అమ్మవారి జాతరను వేడుగా నిర్వహిస్తారు. తెలంగాణలో సమ్మక్క–సారక్క జారతకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. పైడితల్లి అమ్మవారి జాతర 300 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. అయితే తిరుపతి తాతయ్యగుంట ఆలయానికి 900 ఏళ్ల చరిత్ర ఉందని ఆధారాలు చెబుతున్నాయి. వైష్ణవ భక్తుడైన తాతాచార్యులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్యగుంట అని పేరు ఉందని, ఇదే చెరువు గట్టుపై వెలియడంతో తిరుపతి గంగమ్మ కాలక్రమేణ శ్రీతాతయ్యగుంట గంగమ్మ అని ప్రాశస్తి చెందింది. నాటి నుంచే అశేష భక్తకోటి పూజలందుకుంటూ గంగమ్మ భక్తుల కొంగుబంగారంగా ఆలరారింది. తర్వాతనే దేశంలోని పలు గ్రామాల్లో గంగమ్మ ఆలయాలు వెలసి భక్తజనుల పూజలు అందుకోవడం ఆరంభమైంది. తాళ్లపాక అన్నమయ్య తిరుపతి గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించడంతో తాళ్లపాక గంగమ్మ అని పేరు కూడా వచ్చిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 18వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి తరిగొండ వెంగమాంబ ‘జలక్రీడావిలాసం’ యక్షగానంలో తాతయ్యగుంట గంగమ్మను ప్రస్తావించిందని చెబుతారు. -
గంగమ్మ ఆలయంలో చోరీ
గాండ్లపెంట : కోటూరులోని చింతమాను గంగమ్మ ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగినట్లు గ్రామస్తులు మాజీ ఎంపీటీసీ శ్రీరాములు, మాజీ సర్పంచ్ జయప్ప, క్రిష్ణ, నరసింహులు తదితరులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుండీలోని వెండి గొడుగులు, రెండు ముక్కుపుడకలు, మైకుసెట్ యాంప్లిఫైర్ తదితర వస్తువులు చోరీకి గురయ్యాయని, వీటి విలువ సుమారు రూ.50వేలు ఉంటుందని తెలిపారు. -
ముస్తాబాద్ చెరువుకు గండి: నిలిచిన రాకపోకలు
కరీంనగర్ : భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లాలోని ముస్తాబాద్ చెరువుకు మంగళవారం తెల్లవారుజామున గండి పడింది. దీంతో పోతుగల్ గ్రామంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద ప్రవాహానికి స్థానికంగా ఉన్న గంగమ్మ ఆలయం కొట్టుకుపోయింది. అంతేకాకుండా వందలాది ఎకరాల్లోని పంట నీటమునిగింది. ముస్తాబాద్ - సిద్ధిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
బోయకొండలో చోరీ
⇒ హుండీలో నగదు కాజేసిన దుండగుడు ⇒ ఇనుప చువ్వ సాయంతో నోట్లు వెలికితీత ⇒ సీసీ కెమెరాలకు పట్టుబడిన వైనం ⇒ ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది తొలగింపు బోయకొండ(చౌడేపల్లె): బోయకొండ గంగమ్మ ఆలయంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు చోరీ జరిగింది. పట్టపగలు ఒక వ్యక్తి ఇనుప చువ్వకు బబుల్గం అతికించి నోట్లు చోరీ చేశాడు. హుండీ అడుగు భాగాన వేసిన గోనె సంచి పైకి వచ్చి ఉండడంతో అనుమానం వచ్చిన ఆలయ ఈవో ఏకాంబరం, ఆలయ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డితో కలిసి మంగళవారం సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో హుండీలో నుంచి నోట్లు వెలికి తీస్తున్న దృశ్యం కనిపించడంతో రాత్రి విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని పిలిపించి మాట్లాడారు. ఘటన ఇలా జరిగింది.. సోమవారం ఉదయం 6.13 గంటలకు నల్లటి కోటు, తెల్లటి ప్యాంటు, తలకు క్యాప్ ధరించి ఓ వ్యక్తి ఆలయంలోకి వచ్చాడు. ఇనుప చువ్వకు బబుల్గం అతికించి, టార్చిలైటు సహాయంతో ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో నోట్లు బయటకు తీసి ప్యాంటు జేబులో పెడుతున్న దృశ్యం సీసీ కెమెరాలో బయటపడింది. గంటపాటు ఆ వ్యక్తి దర్జాగా నోట్లు వెలికితీస్తున్న ఫుటేజీలను పరిశీలించి అధికారులు, పాలకవర్గ సభ్యులు అవాక్కయ్యారు. సెక్యూరిటీపైనే అనుమానం.. ఆలయంలో 12 మంది సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారు. రెండు బ్యాచ్‌లుగా రోజు మార్చి రోజు విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం గుర్రప్ప, శ్రీనాథరెడ్డి, సుధాకర్‌రెడ్డి, సహదేవ, రమణ, రాజేంద్ర విధులకు హాజరైనట్లు రికార్డుల్లో ఉంది. వీరు సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం అర్చకులు, అధికారులు వచ్చే వరకు విధుల్లో ఉండాల్సి ఉంది. మిగిలిన ఐదుగురు వెళ్లిపోగా ఒక వ్యక్తి మాత్రమే ఆ సమయం వరకు అక్కడ విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారు ఎక్కడికెళ్లారనే అనుమానాలూ ఉన్నాయి. ఆలయ సెక్యూరిటీని ఔట్‌పోస్టులోని ఇన్చార్జి పర్యవేక్షించాల్సి ఉన్నా ఆ మేరకు ఎలాంటి ప్రయత్నమూ జరిగిన దాఖలాలు లేవు. ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది తొలగింపు.. బోయకొండ ఆలయంలో సోమవారం విధులకు హాజరైన ఆరుగురు సెక్యూరిటీ సిబ్బందిని తొలగిస్తున్నట్లు ఈవో ఏకాంబరం మంగళవారం తెలిపారు. చోరీ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈనెల ఐదో తేదీన హుండీ లెక్కింపులో రూ.38లక్షలు ఆదాయం వచ్చిందని తెలిపారు. గడిచిన 10 రోజులకు సంబంధించి హుండీలో లక్షల్లోనే డబ్బు ఉండి ఉంటుందని, ఇందులో ఏ మేరకు నగదు అపహరించారనే విషయం తెలియాల్సి ఉందని అన్నారు. -
వృద్ధురాలి దారుణ హత్య
పట్టపగలే కనకాద్రిపల్లెలో ఘటనదర్యాప్తు చేపట్టిన పోలీసులు కొలిమిగుండ్ల: పట్టపగలు ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. కొలిమిగుండ్ల మండల పరిధిలోని కనకాద్రిపల్లె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కనకాద్రిపల్లెకు చెందిన బోయలదిన్నె వెంకటలక్ష్మమ్మ(63) ప్రధాన రహదారి పక్కన ఇటీవలే కొత్తగా ఇల్లు నిర్మించుకుంది. నాలుగు నెలల క్రితం భర్త భూషన్న అనారోగ్యంతో మృతి చెందాడంతో ఆ ఇంట్లోనే జీవనాధారంగా బట్టలు,చెప్పుల దుకాణం నడుపుకుంటుంది. గురువారం ఉదయం ఒంటరిగా ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి అతి కిరాతకంగా గొంతు కోసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న సమయంలో ఈమె ఇంటి పక్కనే ఉన్న టీకొట్టుకు పాలు పోసేందుకు వచ్చిన మహిళ రక్తం మడుగులో ఆచేతనంగా పడి ఉన్న వెంకటలక్ష్మమ్మను గుర్తించి స్థానికుల తెలియజేసింది. వీరు పోలీసులకు సమాచారమివ్వడంతో కోవెలకుంట్ల సీఐ పీటీ కేశవరెడ్డి,ఎస్ఐ పులిశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గంగాదేవిపల్లె సమీపంలోని ఇగుడూరు గంగమ్మ ఆలయంలో పూజారిగా పని చేసే విషయంలో కొంత కాలం నుంచి సమీప బంధువులతో మృతురాలికి వివాదం నడుస్తోంది. ఈ విషయంలోనే అడ్డుతొలగించుకోవాలనే ఉద్దేశంతో వెంకటలక్ష్మమ్మను దారుణంగా హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా వారికి వివాహాలయ్యాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న వైఎస్ జగన్
పులివెందుల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పులివెందులలో పర్యటించారు. అచ్చువెల్లి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైడిపాలెం రిజర్వాయర్‌ను వైఎస్ జగన్ పరిశీలించారు. స్థానిక నాయకుడు లక్ష్మీనారాయణ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. -
అనంతపురం గంగమ్మ ఆలయంలో చోరీ
రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగమ్మ ఆలయంలో చోరీ జరిగింది. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం అనంతపురం గ్రామంలోని గంగమ్మ దేవాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. కొంతమంది దుండగులు ఆలయ ద్వారం పగలగొట్టి లోనికి ప్రవేశించి హుండీని దోచుకున్నారు. ఉదయం దేవాలయానికి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ ఈవోకు సమాచారం అందించారు. ఈవో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఆలయంలోని హుండీ ఆదాయాన్ని రెండు నెలలుగా లెక్కించలేదని, కానుకలు భారీగానే ఉండవచ్చని ఈవో తెలిపారు. -
కారప్పొడితో స్వామీజీకి అభిషేకం
వేలూరు(తమిళనాడు): వేలూరు సత్‌వచ్చారిలోని గంగమ్మ ఆలయం సమీపంలో ఓ స్వామీజీ కారం కలిపిన నీటితో అభిషేకం చేసుకుని స్థానికులను ఆశ్చర్యపరిచారు. సత్వచ్చారి గంగమ్మ ఆలయ సమీపంలోని ఓ తోటలో నాలుగు నెలలుగా ఓ స్వామీజీ నివసిస్తున్నాడు. ఆయన పేరు, వివరాలు ఎవరికీ తెలీవు. ప్రత్యంగరా దేవిని పూజించే స్వామీజీకి తమిళం, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ భాషలు వచ్చు. మంగళవారం ఉదయం ప్రపంచ శాంతి కోసం ఆయన కారంపొడి నీటితో అభిషేకం చేసుకోబోతున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. విషయం తెలుసుకున్న భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామీజీ ముందుగా చేపట్టిన ప్రత్యంగరా దేవి ప్రత్యేక పూజలను తిలకించారు. అనంతరం స్వామీజీ ఒక పెద్దపాత్రలో కూర్చున్నారు. భక్తులు 31 కిలోల కారం పొడిని నీటిలో కలిపి వాటిని స్వామీజీపై పోసి అనంతరం నీటితో అభిషేకం చేశారు. -
సోనియాకు సద్బుద్ధి ప్రసాదించాలని తెలుగుతల్లికి మొక్కులు
సాక్షి, తిరుపతి: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సద్బుద్ధి ప్రసాదిం చాలని గంగమ్మ వేయికళ్ల దుత్తలతో తెలుగుతల్లికి మొక్కు కున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తిరుపతి గంగమ్మ వేయికళ్ల దుత్తలతో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలతో కలిసి ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించారు. గంగమ్మ ఆలయం నుంచి తెలుగు త ల్లి విగ్రహం వరకు ర్యాలీ సాగింది. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని తెలుగు తల్లి విగ్రహానికి మొక్కి, దుత్తలను పగులగొట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ర్ట విభజనపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ఏడుకోట్ల మంది సీమాంధ్రులు అంగీకరించడం లేదని అన్నారు. పారిశ్రామికవేత్తల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం లోని పలు పథకాలకు ఆదాయం సమకూరుస్తున్న హైదరాబాద్ లాంటి నగరాన్ని తెలంగాణకు ఇస్తే, సీమాంధ్రలోని బడుగు వర్గాల వారికి ఏ విధంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నిం చారు. కృష్ణ, గోదావరి నదులపై ఆన కట్టలు కడితే, సీమాంధ్రులకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా కరువవుతాయని అన్నారు. విభజనకు ఆజ్యం పోసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నయవంచకుడని అన్నారు. సోనియాతో మిలాఖత్ అయ్యి వైఎస్.జగన్మోహన్రెడ్డిని దెబ్బ తీయడానికి చేపట్టిన కుట్రలో భాగంగానే రాష్ట్ర విభ జన చేపట్టినట్లు వివరించారు. ప్రకటనను వాపసు తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు మాట్లాడు తూ విభజన నిర్ణయం రాష్ట్రంలో పలు సమస్యలకు దారి తీసిం దన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనరు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనరు కుసుమ, ఎస్సీ సెల్ కన్వీనరు రాజేం ద్ర, ఎస్కే.బాబు, చెంచయ్య యాదవ్, తొండమనాటి వెంకటేష్, పునీత, గీత, పుష్పాచౌదరి, గౌరి, మాధవనాయుడు, ఎంవీఎస్.మణి, ఆదికేశవరెడ్డి, తాళ్లూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.