ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సద్బుద్ధి ప్రసాదిం చాలని గంగమ్మ వేయికళ్ల దుత్తలతో తెలుగుతల్లికి మొక్కు కున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
సాక్షి, తిరుపతి: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సద్బుద్ధి ప్రసాదిం చాలని గంగమ్మ వేయికళ్ల దుత్తలతో తెలుగుతల్లికి మొక్కు కున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తిరుపతి గంగమ్మ వేయికళ్ల దుత్తలతో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలతో కలిసి ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించారు. గంగమ్మ ఆలయం నుంచి తెలుగు త ల్లి విగ్రహం వరకు ర్యాలీ సాగింది. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని తెలుగు తల్లి విగ్రహానికి మొక్కి, దుత్తలను పగులగొట్టారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ర్ట విభజనపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ఏడుకోట్ల మంది సీమాంధ్రులు అంగీకరించడం లేదని అన్నారు. పారిశ్రామికవేత్తల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం లోని పలు పథకాలకు ఆదాయం సమకూరుస్తున్న హైదరాబాద్ లాంటి నగరాన్ని తెలంగాణకు ఇస్తే, సీమాంధ్రలోని బడుగు వర్గాల వారికి ఏ విధంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నిం చారు. కృష్ణ, గోదావరి నదులపై ఆన కట్టలు కడితే, సీమాంధ్రులకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా కరువవుతాయని అన్నారు.
విభజనకు ఆజ్యం పోసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నయవంచకుడని అన్నారు. సోనియాతో మిలాఖత్ అయ్యి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బ తీయడానికి చేపట్టిన కుట్రలో భాగంగానే రాష్ట్ర విభ జన చేపట్టినట్లు వివరించారు. ప్రకటనను వాపసు తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు మాట్లాడు తూ విభజన నిర్ణయం రాష్ట్రంలో పలు సమస్యలకు దారి తీసిం దన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనరు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనరు కుసుమ, ఎస్‌సీ సెల్ కన్వీనరు రాజేం ద్ర, ఎస్‌కే.బాబు, చెంచయ్య యాదవ్, తొండమనాటి వెంకటేష్, పునీత, గీత, పుష్పాచౌదరి, గౌరి, మాధవనాయుడు, ఎంవీఎస్.మణి, ఆదికేశవరెడ్డి, తాళ్లూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.