కారప్పొడితో స్వామీజీకి అభిషేకం | Swamiji with the anointing of karappodi | Sakshi
Sakshi News home page

కారప్పొడితో స్వామీజీకి అభిషేకం

Published Wed, Sep 24 2014 8:38 AM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM

కారప్పొడితో స్వామీజీకి అభిషేకం - Sakshi

కారప్పొడితో స్వామీజీకి అభిషేకం

వేలూరు(తమిళనాడు): వేలూరు సత్‌వచ్చారిలోని గంగమ్మ ఆలయం సమీపంలో ఓ స్వామీజీ కారం కలిపిన నీటితో అభిషేకం చేసుకుని స్థానికులను ఆశ్చర్యపరిచారు. సత్‌వచ్చారి గంగమ్మ ఆలయ సమీపంలోని ఓ తోటలో నాలుగు నెలలుగా ఓ స్వామీజీ నివసిస్తున్నాడు. ఆయన పేరు, వివరాలు ఎవరికీ తెలీవు. ప్రత్యంగరా దేవిని పూజించే స్వామీజీకి తమిళం, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ భాషలు వచ్చు.

మంగళవారం ఉదయం ప్రపంచ శాంతి కోసం ఆయన కారంపొడి నీటితో అభిషేకం చేసుకోబోతున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. విషయం తెలుసుకున్న భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామీజీ ముందుగా చేపట్టిన ప్రత్యంగరా దేవి ప్రత్యేక పూజలను తిలకించారు. అనంతరం స్వామీజీ ఒక పెద్దపాత్రలో కూర్చున్నారు. భక్తులు 31 కిలోల కారం పొడిని నీటిలో కలిపి వాటిని స్వామీజీపై పోసి అనంతరం నీటితో అభిషేకం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement