swamiji
-
సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్!
తిరుపతి కల్చరల్: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి సనాతన ధర్మాన్ని రక్షించాలని తిరుపతి సభలో హిందూ డిక్లరేషన్ ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తిరుమల క్షేత్రంలో ధర్మానికి విరుద్ధంగా సాగుతున్న విషయాలపై ఎందుకు నోరు మెదపటం లేదని పలువురు స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటే ఇదేనా అని నిలదీశారు. తిరుమలలో అపచారాలు, తిరుమల కొండకు సమీపంలో చేపడుతున్న ముంతాజ్ హోటల్ నిర్మాణాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీటీడీ పరిపాలనా భవనం ఎదుట శనివారం స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం ఫోటోలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించి గోవింద నామస్మరణలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీలు, హిందూ సంఘాల ప్రతినిధులు ఏమన్నారంటే..సనాతన ధర్మం రక్షణ అంటే ఇదేనా?తిరుమల శ్రీవారు తమ కులదైవమని సీఎం చంద్రబాబు ప్రకటిస్తే.. హిందూ డిక్లరేషన్ అంటూ పవన్‌కళ్యాణ్ సభపెట్టి సనాతన ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. చట్ట విరుద్ధంగా ముంతాజ్ హోటల్‌కు అనుమతులు ఇస్తూ దగా చేయడం దుర్మార్గం. చెప్పిందొకటి చేసేది మరొకటిగా కూటమి ప్రభుత్వ ధోరణి ఉంది. – శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, అధ్యక్షుడు, ఏపీ సాధు పరిషత్పవిత్రతకు భంగం కలిగిస్తే శంఖారావం పూరిస్తాంతిరుమల పవిత్రతకు భంగం కలిగించే పనులకు స్వస్తి చెప్పకపోతే గోవింద శంఖారావం పూరించి కూటమి ప్రభుత్వాన్ని పెకిలిస్తాం. సనాతన ధర్మం అంటూ ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల క్షేత్రంలో ధర్మ విరుద్ధ పనులు సాగుతున్నా ప్రశ్నించకపోవడం సిగ్గుచేటు. మందు, మాంసాహార విందుల సౌకర్యాలతో కూడిన ముంతాజ్ హోటల్ ఏర్పాటును హిందూ సమాజం వ్యతిరేకిస్తోంది. – తుమ్మా ఓంకార్, తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి అధ్యక్షుడురాజకీయం చేయడం దుర్మార్గంతిరుమలను రాజకీయ క్షేత్రంగా మార్చి ధర్మబద్ధతకు తూట్లు పొడవడం విడ్డూరం. సనాతన ధర్మం పేరుతో ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పవన్‌కళ్యాణ్ నేడు తిరుమలలో సనాతన ధర్మానికి వెన్నుపోటు పొడిచే కార్యక్రమాలు సాగుతున్నా మాట్లాడకపోవడం దారుణం. ముంతాజ్ హోటల్ నిర్మాణం చేపట్టడం హేయమైన చర్య. తిరుమలకు మాంసాన్ని తీసుకెళ్లి పవిత్రతను దెబ్బతీసినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరించడం చేతకానితనానికి నిదర్శనం. – శివానంద స్వామీజీ, ఏపీ సాధు పరిషత్ ప్రతినిధిహోటల్ అనుమతులు రద్దు చేయాలితిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా అలిపిరి సమీపంలో చట్టవిరుద్ధంగా చేపడుతున్న ముంతాజ్ హోటల్ అనుమతులును వెంటనే రద్దు చేయాలి. తిరుమలలో పవిత్రత దెబ్బతీసే కార్యక్రమాల పట్ల పటిష్ట చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం పరిరక్షణను విస్మరించడం శోచనీయం. సీఎం చంద్రబాబు తిరుమల పవిత్ర మంటగలుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం– విజయ భాస్కర్, హిందూ సంఘాల ప్రతినిధి, కర్ణాటకపుట్టగతులుండవుతిరుమల శ్రీవారితో చెలగాటాలాడితే పుట్టగతులుండవు. సనాతన ధర్మ పరిరక్షణ, తిరుమల ప్రక్షాళనే లక్ష్యమన్న కూటమి అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తిరుమల క్షేత్ర పవిత్రతను దెబ్బ తీస్తున్నారు. ముంతాజ్ హోటల్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. తిరుమలకు మాంసం తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. – సాధు మహరాజ్, శ్రీజ్ఞానపీఠం ప్రతినిధిధర్మరక్షణకు చర్యలు చేపట్టాలితిరుమలలో వరుసగా సాగుతున్న అపవిత్ర కార్యక్రమాలకు స్వస్తి పలికి సనాతన ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా చేపడుతున్న ముంతాజ్ హోటల్ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలి. భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు కొనసాగితే ఆందోళనలు చేపట్టక తప్పదు.– కిరణ్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు -
సజీవ సమాధికి స్వామీజీ యత్నం
మద్దూరు: ఓ స్వామీజీ ఐదురోజులు సమాధికి ప్రయత్నించగా.. విషయం తెలుసుకున్న పోలీసులు నిలువరించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనివట్లలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రెనివట్ల గ్రామానికి చెందిన సత్యానందస్వామి అలియాస్ హనుమంతు కొద్దిరోజులుగా వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడిగా చెలామణి అవుతున్నాడు. ఈయన భార్య ఏడాది క్రితం పొలంలో ఎద్దు పొడవడంతో మృతిచెందింది. దీంతో ఆమెకు పొలంలోనే సమాధి కట్టించి పూజిస్తున్నాడు.అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కొంతమందిని శిష్యులుగా చేసుకున్నాడు. శుక్రవారం అమావాస్య రోజున ‘తాను ఐదు రోజులు సమాధిలోకి వెళతానని.. బయట అఖండభజనలు చేయాలని’ భక్తులకు చెప్పి సమాధిలోకి వెళ్లాడు. ఆదివారం ఉదయం విషయం పోలీసులకు తెలియడంతో డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో అక్కడకు చేరుకొని సమాధిలో ఉన్న స్వామీజీని బయటకు రప్పించారు. అనంతరం డాక్టర్ స్వామీజీకి వైద్య పరీక్షలు చేయగా, ఆర్యోగం నిలకడగా ఉంది. కొన్నేళ్ల క్రితం స్వగృహంలోనే ఒక అమావాస్య రోజు హనుమంతు మౌనదీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే కర్ణాటక చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు వస్తుండటంతో సొంత పొలంలోనే జీవ సమాధి కోసం ఒక ఆలయం నిర్మించినట్టు గ్రామస్తులు చెప్పారు. -
వచ్చే ఉగాదికి ఘోర విపత్తు.. జోస్యం చెప్పిన కోడిమఠం స్వామి
దొడ్డబళ్లాపురం: దేశంలో 2024 ఉగాది నాటికి ఫెర దుర్ఘటన జరుగుతుందని కోడిమఠం స్వామి జోస్యం చెప్పారు. విపత్తుల గురించి ఆయన తరచ జోస్యాలు చెప్పడం తెలిసిందే. ఆదివారంనాడు హాసన్ జిల్లా అరసికెరె తాలకా హారనహళ్లిలోని కోడిమఠంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచానికి మూడు గండాలు ఉన్నాయని అన్నారు. ఒకటి రెండు దేశాలు కనుమరుగవుతాయని, జనం అకాల మృత్యువాత పడతారని చెప్పారు. 2024 ఉగాదిలోపు ముగ్గురు ప్రముఖ వ్యక్తులకు గండం ఉందని, పాలకులు ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ గండాలను తప్పించవచ్చన్నారు. ఆ గండాలేమిటో కాలం వచ్చినప్పుడు చెబుతానన్నారు. భారీవర్షాలు కురిసి పట్టణాలకు, నగరాలకు అపాయం ఉందన్నారు. పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలుతాయన్నారు. అందరూ ఆధ్యాతి్మక చింతన అలవరచుకోవాలన్నారు. -
లైంగిక వేధింపుల కేసులో పూర్ణానందకు షాక్
సాక్షి, విశాఖపట్నం: జ్ఞానానంద, రామానంద ఆశ్రమం (సాధు మఠం) ఆశ్రమం లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విశాఖ పొక్సో కోర్టులో పూర్ణానంద వేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ నెల మొదటి వారంలో జరిగిన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో ఇద్దరు బాధిత మైనర్ బాలికలూ పూర్ణానందను.. గుర్తు పట్టారు(మూడు సార్లు ). దీంతో.. బెయిల్ పిటిషన్‌ను పోక్సో కోర్టు డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. బెయిల్ కోసం పూర్ణానంద పోక్సో కోర్టును ఆశ్రయింగా.. ఈ కేసులో అన్ని ఆధారాలు పూర్ణానందకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ తరుణంలో బెయిల్ మంజూరు చేయడం ప్రమాదకరమని, పైగా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోక్సో స్పెషల్ పీపీ కరణం కృష్ణ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన పోక్సో కోర్టు.. పూర్ణానందకు బెయిల్ తిరస్కరించిది. చైల్డ్ వేల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణానంద సరస్వతి స్వామీజీ 14 మంది మైనర్ బాలికలతో పశువుల నిర్వహణ పనులు చేయిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో భయంతో అశ్రమం నుంచి వెళ్లిపోతానని ఏడవటంతో ఓ బాలిక(13) కాళ్లకు గొలుసులు కట్టి పనులు చేయిస్తుండేవాడు. ఈనెల 12న స్నానానికి వెళ్లేందుకు గొలుసులు తీయడంతో అక్కడ పనిచేసే ఒక మహిళ సహకారంతో బాలిక బయటకు పారిపోయి ఆటోలో రైల్వేస్టేషన్ వెళ్లి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలులో ఓ కుటుంబం సాయంతో కంకిపాడు చేరుకుని.. ఆపై సీడబ్ల్యూసీ సహకారంతో విజయవాడ దిశ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పూర్ణానంద వ్యవహారం వెలుగు చూసింది. -
అత్యాచారం కేసు: పూర్ణానంద రిమాండ్ పొడిగింపు
సాక్షి, విశాఖ: పూర్ణానంద అత్యాచారం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా పూర్ణానంద రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. ఇక, మైనర్లపై అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు రావడంతో దిశ పోలీసులు పూర్ణానందను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈనెల 17వ తేదీన దిశ పోలీసులు.. ఐడెంటిఫికేషన్ టెస్టు పెరేడ్‌ను నిర్వహించనున్నారు. కాగా, ఇద్దరు మైనర్లపై అత్యాచారం జరిగినట్టు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. మరోవైపు.. ఈ కేసులో దిశ పోలీసులు.. అన్ని సైంటిఫిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఇది కూడా చదవండి: పూర్ణానంద రిమాండ్ రిపోర్టు.. ‘అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు..’ -
లోక కళ్యాణార్థం స్వామీజీ జలావాసం
రాయచూరు రూరల్: దేశ సుభిక్షం, రైతుల సంక్షోభ నివారణ, లోక కళ్యాణార్థం ఓ స్వామీజీ 12 రోజుల క్రితం జలావాసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాలూకాలోని మలియాబాద్ రామలింగేశ్వరాలయం కొండ గుహలో తాలూకాలోని ఉడుంగల్, ఖానాపుర, మంగళవారపేట మఠాధిపతి బాల శివయోగి వీర సంగమేశ్వర శివాచార్య మహాస్వామీజీ 48 రోజుల పాటు నిరాహారంతో మౌనంగా జలావాసంతో నిత్య తపస్సులో నిమగ్నులయ్యారు. జలావాసం నిర్వహణ పూర్తి బాధ్యతలను సోమవారపేట హిరేమఠం మఠాధిపతి అభినవ రాచోటి వీర శివాచార్యులు, రాఘవేంద్ర, అయ్యప్పలు సహకరిస్తున్నారు. కాగా స్వామీజీ జలావాసం తిలకించడానికి కలబుర్గి, రాయచూరు, బళ్లారి జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. -
పూర్ణానంద రిమాండ్ రిపోర్టు.. ‘అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు..’
సాక్షి, విశాఖపట్నం: భక్తిపేరిట కళ్లబొల్లి కబుర్లు చెప్పిన పూర్ణానంద స్వామి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా, బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచారు. వచ్చే నెల 5వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పూర్ణానందను సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక, తాజాగా పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్టులో దిశ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. పోలీసులు రిపోర్ట్ ప్రకారం.. పూర్ణానంద అర్ధరాత్రి బాలికలను నిద్ర లేపేవాడు. బాలికలను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఏడాదిగా అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. పూర్ణానంద ఇద్దరు బాలికలను అత్యాచారం చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. బాలికలు గర్భం దాల్చకుండా పూర్ణానంద వారికి ట్యాబ్లెట్స్ ఇచ్చేవాడు. ఆశ్రమంలో మొత్తం ముగ్గురు బాలికలు, 9 మంది బాలురు ఉన్నారు. బాలికలపై అత్యాచారం జరిగినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వెల్లడైనట్టు తెలిపారు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో వారి బంధువులు ఆ బాలికను ఆశ్రమం నుంచి తీసుకొని వెళ్లారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. బీటెక్ విద్యార్థి మృతి -
పూర్ణానంద స్వామి చేష్టలు బయట పెట్టిన మైనర్ బాలిక
-
బాలికపై రెండేళ్లుగా స్వామీజీ అత్యాచారం!
(విశాఖ తూర్పు): అనాథ మైనర్ బాలికకు(15) అశ్రయం కల్పించిన నిర్వాహకుడే రెండేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటన అసల్యంగా వెలుగులోకి వచ్చింది. చైల్డ్ వేల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గొలనుగొండకు చెందిన బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో సమీపంలో ఉండే ఒక మహిళ బాలికను ప్రభుత్వ హాస్టల్లో ఉంచి చదివించేది. ఆ మహిళా అధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఉండటంతో బాలికను గత రెండేళ్ల క్రితం విశాఖలోని వెంకోజీపాలెం జాతీయ రహదారిని ఆనుకొని జ్ఞానానంద, రామానంద ఆశ్రమం (సాధు మఠం) చేర్పించింది. ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద సరస్వతి స్వామీజీ బాలికతో పాటు మరో 13 మంది మైనర్ బాలికలతో పశువుల నిర్వహణ పనులు చేయిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో భయంతో అశ్రమం నుంచి వెళ్లిపోతానని ఏడవటంతో బాలిక కాళ్లకు గొలుసులు కట్టి పనులు చేయిస్తుండేవాడు. ఈనెల 12న స్నానానికి వెళ్లేందుకు గొలుసులు తీయడంతో అక్కడ పనిచేసే ఒక మహిళ సహకారంతో బాలిక బయటకు పారిపోయి ఆటోలో రైల్వేస్టేషన్ వెళ్లి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలులో విశాఖ నుంచి విజయవాడ వస్తున్న ఒక కుటుంబం బాలికను చూసి వివరాలు అడిగి తెలుసుకుంది. తమతో పాటు కంకిపాడు తీసుకువెళ్లి కొన్ని రోజులు వాళ్ల ఇంట్లోనే ఉంచి సోమవారం కంకిపాడు పోలీసుల సహకారంతో విజయవాడలోని సీడబ్ల్యూసీ సభ్యులకు అప్పగించింది. వారు బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికపై జరుగుతున్న వరుస లైంగిక దాడులు తెలుసుకుని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అశ్రమం పేరుతో మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై బాలిక చేత దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. విజయవాడ పోలీసుల సమాచారం మేరకు ఎంవీపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆశ్రమానికి చేరుకొని కీచక స్వామీజీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఎంవీపీ సీఐ మాట్లాడుతూ విజయవాడలో జీరో ఎఫ్ఐఆర్ నమోదైందని, దీంతో పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. అయితే స్వామీజీని అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బాలిక మిస్సింగ్‌పై ఫిర్యాదు అసలు విషయాన్ని పక్కనపెట్టి సాధు ఆశ్రమం స్వామీజీ ఎంవీపీ పోలీసులను బోల్తాకొట్టించారు. ఏమీ తెలియనట్లు సాధు ఆశ్రమం నుంచి బాలిక అదృశ్యమైనట్లు ఈనెల 15న ఎంవీపీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆశ్రమం వద్ద గల సీసీ కెమెరాలు పరిశీలించినా బాలిక వివరాలు తెలియరాలేదు. -
రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పదన్న స్వామిజీలు
-
స్వామీజీ కార్యక్రమంలో భారీ చోరీ.. 36 మంది భక్తుల గోల్డ్ చైన్లు మాయం..
ముంబై: స్వయంప్రకటిత స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో భారీ చోరీ జరిగింది. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు మీరా రోడ్‌లోని సలసార్ సెంట్రల్ పార్కు గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ ఈవెంట్ నిర్వహించారు. స్వామీజీ ఆశీర్వాదం కోసం దాదాపు రెండు లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. ఆయితే నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో ఆదివారం సాయంత్రం ఇక్కడ దాదాపు తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. వేలమంది భక్తులు మధ్య తోపులాట జరిగి గందరగోళం నెలకొంది. సరిగ్గా ఈ సమయంలోనే భక్తుల మెడలో ఉన్న బంగారు గొలుసులు మాయమయ్యాయి. మొత్తం 36 మంది బాధితులు తమ బంగారు ఆభరణాలను ఎవరో దొంగిలించారని లబో దిబోమన్నారు. స్వామీజీ కార్యక్రమంలో ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన మెడలో మంగళసూత్రం కూడా పోయిందని ఓ మహిళా భక్తురాలు కన్నీటిపర్యంతమైంది. స్వామీజీ రోగాలను నయం చేస్తారని ఫోన్లో వీడియోలు చూసి ఇక్కడకు వెళ్లినట్లు చెప్పింది. తన రెండేళ్ల బిడ్డ ఆరోగ్యం బాగాలేదని, స్వామీజీ దగ్గరకు తీసుకెళ్తే నయం చేస్తారని కార్యక్రామానికి వచ్చినట్లు పేర్కొంది. కానీ తోపులాట జరిగి మంగళసూత్రం పోగొట్టుకోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతమైంది. కాగా.. కార్యక్రమంలో జరిగిన తోపులాటలో ఒక్కరు మాత్రమే గాయపడ్డారు. బంగారు ఆభరణాలు పోయినప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. శాంతాబెన్ మిథాలాల్ జైన్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కొన్ని మూఢనమ్మకాల వ్యతిరేక సంస్థలు వ్యతిరేకించాయి. ఈ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వొద్దని కోరుతూ పోలీసులకు శుక్రవారం మెమోరాండం కూడా సమర్పించాయి. చదవండి: నీట్‌గా స్కెచ్ వేశాడు.. నకిలీ పత్రాలతో బ్యాంకులోకి వెళ్లి -
కర్ణాటకలో సంకీర్ణం వస్తుందా? కోడిమఠం స్వామీజీ జోస్యం ఇదే
సాక్షి, బెంగళూరు: త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని, సంకీర్ణ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోను అధికారంలోకి రాదని కోడిమఠం స్వామీజీ జోస్యం చెప్పారు. విజయనగర జిల్లా హొసపేటెలో ఆయన మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల భవిష్యత్తును తెలియజేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని కొందరు చర్చించుకుంటున్న నేపథ్యంలో కోడిమఠం పీఠాధికారి డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర మహాస్వామీజీ భవిష్యత్ రాజకీయాల గురించి నర్మగర్భంగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇద్దరు గొప్ప వ్యక్తులు కనుమరుగవుతారన్నారు. ఉగాది అనంతరం గత ఏడాది కంటే మంచి వర్షాలు పడుతాయన్నారు. కరోనా వచ్చినా భయమేమీ లేదని, ప్రాణహాని ఉండదన్నారు. -
సింగపూర్ లో స్వామీజీల రచ్చ
-
అబ్బా..! ఎమ్మెల్యే ‘ఎంగిలి కూడు’ చేష్టలు వైరల్
మనసులో అవతలి వాళ్ల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. బహిరంగ వేదికల్లో మాత్రం లేనిపోని ప్రేమలు ఒలకబోయడం కొందరికి మాత్రమే సాధ్యం. అలాంటి ఘటనే ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అవతలివాళ్ల పట్ల, అదీ ప్రత్యేకించి దళితుల పట్ల తన సోదరభావం ఏపాటిదో చూపించే ప్రయత్నంలో.. ఓ ఎమ్మెల్యే చేసిన పని చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్.. ఓ దళిత స్వామిజీతో కలిసి తిండి పంచుకున్నారు. అది అలాంటి ఇలాంటి ఆహారం కాదు. ముందుగా స్వామిజీ నోట్లో పెట్టిన ఎమ్మెల్యే.. ఆయన నమిలిన తర్వాత బయటకు ఉమ్మించి.. తిరిగి అదే బయటకు తీసుకుని తన నోట్ల పెట్టుకుని మరి తిన్నాడు ఎమ్మెల్యే తిన్నాడు. దళిత వర్గానికి చెందిన స్వామి నారాయణ.. చామరాజ్‌పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ ఈ చేష్టలకు దిగారు. తమ మధ్య కుల వివక్షకు తావులేదని, పైగా తమ మద్య సోదరభావం ఏపాటిదో చెప్పేందుకు తాను ఈ పని చేసినట్లు బల్లగుద్ది మరీ ప్రకటించుకున్నాడాయన. ఈ ఘటన చూసి వెనక ఉన్న అనుచరులంతా చప్పట్లతో గా హాలును మారుమోగించారు. ఆదివారం చామరాజ్‌పేటలో జరిగిన ఓ కార్యక్రమంలో సదరు ఎమ్మెల్యే ఈ చేష్టలకు పాల్పడ్డాడు. #WATCH Bengaluru, Karnataka: In an attempt to set an example seemingly against caste discrimination, Congress Chamarajapete MLA BZ Zameer A Khan feeds Dalit community's Swami Narayana & then eats the same chewed food by making Narayana take it out from his mouth to feed him(22.5) pic.twitter.com/7XG0ZuyCRS ANI (@ANI) May 22, 2022 -
యువతిపై యాసిడ్ దాడి: ఆ క్లూ రాకుంటే దొరికేవాడు కాదేమో
బనశంకరి(బెంగళూరు): యువతిపై యాసిడ్ దాడికి పాల్పడి పోలీసు కాల్పుల్లో గాయపడిన నిందితుడు నాగేశ్ బెంగళూరులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు బాధిత యువతి కూడా ఆస్పత్రిలో క్రమంగా కోటుకుంటోంది. పరారీలోనున్న నాగేశ్ తిరువణ్నామలైలో రమణ మహర్షి ఆశ్రమంలో తలదాచుకోవడంతో ఆచూకీ తెలియక పోలీసులు తలకిందులయ్యారు. చివరకు స్థానిక ఓ విద్యార్థి సహాయంతో దుండగున్ని పట్టుకున్నారు. ఫోటో తీసి పంపితే కామాక్షిపాళ్య పోలీసులు తిరువణ్ణామలై ప్రభుత్వ బస్టాండు వద్ద నాగేశ్ కోసం వాంటెడ్ ప్రకటనలు అంటించి పలు ఫోన్ నంబర్లు ఇచ్చారు. అతన్ని ఆశ్రమంలో ధ్యానం చేస్తుండగా చూశానని ఒక విద్యార్థి పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాడు. అతని ఫోటోను కూడా రహస్యంగా తీసి పంపాడు. ఫోటో చూసి నాగేశ్ అని పోలీసులు గుర్తించారు. ఏఎస్ఐ రవికుమార్, పోలీసులు మారువేషంలో ఆశ్రమానికి వెళ్లి నాగేశ్ పక్కన కూర్చున్నాడు. తమిళంలో మీ పేరు అని అడిగారు. దీనికి అతను జవాబివ్వలేదు. పోలీసులు నాగేశ్ అని పిలవడంతో అతను తిరిగి చూశాడు. దీంతో నిర్బంధించి తరలించారు. క్లూ రాకపోయి ఉంటే అతడు ఇప్పట్లో దొరక్కపోయేవాడు. చదవండి: వివాహేతర సంబంధం.. వాకిలి ఊడుస్తుండగా ఇంట్లోకి పిలిచి.. -
దొంగ స్వామి: నీ కొడుకుకు ప్రాణగండం.. తప్పిస్తా, అందుకు నువ్వు..
సాక్షి,మరిపెడ రూరల్(వరంగల్): తాయత్తులు, పూజలు చేస్తానని ఓ దేశ గురువు పేరుతో దొంగ బాబా గ్రామస్తులను భయపెట్టి రూ.80వేలు వసూలు చేశాడు. అతనిపై అనుమానం వచ్చి కొందరు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగ గురువుగా బయటపడింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం గ్రామంలోకి ఈ నెల 25వ తేదీన దేశగురువు పేరుతో ఓ వ్యక్తి తన నలుగురు శిష్యువులతో కలిసి వచ్చాడు. (చదవండి: దొంగ స్వామి: నీ కొడుకుకు ప్రాణగండం.. తప్పిస్తా, అందుకు నువ్వు.. ) వసతి కోసం అక్కడి సర్పంచ్‌ను ఆశ్రయించగా పాఠశాలలో ఓ గదిని చూపించారు. తన శిష్యులతో కలిసి దేశ గురువు తన గుర్రంపై గ్రామంలో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలు నీళ్లు అరబోయడంతో పాటు కొబ్బరికాయలు కొట్టారు. ఈ క్రమంలో వితంతువుని పిలిచి నీ కొడుకుకు ప్రాణగండం ఉందని అది పోవాలంటే తాయత్తు కట్టాలని అందుకు రూ. 7 వేలు, పెండ్లి కావడం లేదని మరొకరి ఇంట్లో రూ.5 వేలు, ఆరోగ్య సమస్య అని మరో ఇంట్లో రూ.10 వేలు చొప్పున ఒక్కరోజే రూ.80 వేలు కాజేశాడు. బయట ఊరినుంచి వీరారం వచ్చిన ఓ వ్యక్తి దేశ గురువు నిజస్వరూపం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బయటపడ్డ నిజస్వరూపం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలానికి చెందిన బూడిగ జంగాలకు చెందిన యాకయ్యగా బాబాను గుర్తించారు. కొందరితో ముఠాగా ఏర్పడి ఓ గుర్రాన్ని రోజుకు రూ. వెయ్యి కిరాయికి తీసుకొచ్చి దేశ గురువుగా యాకయ్య అవతారమెత్తాడు. పలు గ్రామాలు తిరుగుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. వీరారం గ్రామ బాధితుల ఫిర్యాదు మేరకు యాకయ్య, తన అనుచరులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. చదవండి: కన్నీటి గాథ: ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా ఆ నాన్న అనాథే -
పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ స్వామీజీ
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): చిత్రదుర్గ మురుఘ రాజేంద్ర బృహమఠం డాక్టర్ శివమూర్తి మురుఘా గురువారం బెంగళూరులోని పునీత్ రాజ్‌కుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ మరణానంతరం ఆయనకు బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించారు. ప్రశస్తిని స్వీకరించటానికి రావాలని పునీత్ భార్య అశ్వినిని ఆహ్వానించారు. అభిమానుల అన్నదానం మైసూరు: హీరో పునీత్ రాజ్‌కుమార్ పుణ్య స్మరణగా టి.నరసిపుర తాలూకా బసవనహళ్ళిలో అభిమానులు, గ్రామస్తులు భారీఎత్తున అన్నదానం నిర్వహించారు. సుమారు 2 వేల మందికి మాంసాహారంతో కూడిన భోజనం వడ్డించారు. మంచే గౌడ అనే అభిమాని గుండు చేయించుకుని నివాళులు అర్పించారు. చదవండి: ఇతని పేరు చెబితే రాజకీయనేతలు, ప్రముఖ వ్యక్తులు హడలిపోతారు. -
యడ్డీని ఎవరూ టార్గెట్ చేయలేరు
సాక్షి, గంగావతి (కర్ణాటక): మాజీ సీఎం యడియూరప్పను టార్గెట్ చేసే శక్తి ఎవరికీ లేదని ఆయన కుమారుడు బీ.వై. విజయేంద్ర అన్నారు. ఆయన సింధగి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మార్గం మధ్యలో కొప్పళ గవిమఠాన్ని సందర్శించి గవిసిద్దేశ్వర స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్న అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సింధగి, హానగల్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. చంద్రశేఖర్ పాటిల్, కనకగిరి ఎమ్మెల్యే ధడేసూగూరు బసవరాజ్, అమరేష్ కరడి పాల్గొన్నారు. -
కరోనా విపత్తులో సీఎం జగన్ సేవలు భేష్
తుమకూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై స్ఫటికపురి మహా సంస్థాన మఠాధ్యక్షుడు నంజావదూత స్వామీజీ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా రోగులకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందిస్తున్నారని అభినందించారు. కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్‌లా కోవిడ్ రోగులకు ఉచిత చికిత్సనందించి వారి ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఆదివారం కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా తాలూకా పట్టనాయకనహళ్లిలో ఉన్న స్ఫటికపురి మహాసంస్థాన మఠంలో స్వామీజీ మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి వల్ల కర్ణాటకలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిరుపేదలు చికిత్స లభించక మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం ఏపీ అప్పుల్లో ఉన్నా అక్కడ సీఎం వైఎస్ జగన్ ఔదార్యంతో ఎంతో మంది కరోనాకు ఉచితంగా చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కర్ణాటకలో అన్ని ఆస్పత్రుల్లో కరోనాకు ఉచిత వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేశారు. -
సడెన్‌గా రజనీకి స్వామిజీ ఆశీస్సులు
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటికి హఠాత్తుగా ఓ స్వామీజీ ప్రవేశించి ఆశీస్సులు అందించి వెళ్లారు. ఆ స్వామీజీ పేరు నమోనారాయణస్వామి. రాజకీయ పార్టీ లేదన్న ప్రకటన తర్వాత రజనీ పోయెస్‌గార్డెన్‌లోని ఇంటికే పరిమితం అయ్యారు. అపోలో వైద్యుల సూచన మేరకు ఆయన పూర్తిగా విశ్రాంతిలో ఉన్నారు. ఆయన్ను కలిసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఈ పరిస్థితుల్లో శనివారం నమో నారాయణస్వామి రజనీ ఇంటికి వెళ్లారు. ఆయన్ను రజనీకాంత్, లతారజనీకాంత్ ఆహ్వానించారు. రజనీ,స్వామీజీ అరగంటకు పైగా మాట్లాడుకున్నారు. రజనీకి స్వామిజీ ఆశీస్సులు అందించి వెళ్లారు. ఇంటి నుంచి బయటకు వచ్చి స్వామీజీకి వీడ్కోలు పలికారు. రజనీని పరామర్శించేందుకు ఎవరికీ అనుమతి లేదని మక్కల్ మండ్రం వర్గాలు పేర్కొన్నాయి. స్వామీజీ వచ్చి వెళ్లడం, ఇందుకు తగ్గ ఫొటోలు బయటకు రావడం గమనార్హం. (చదవండి: అమెరికాకు తలైవా?) -
పెజావర స్వామీజీ అస్తమయం
సాక్షి, బెంగళూరు: దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరైన ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ(88) ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో 9 రోజులుగా మణిపాల్ లోని కేఎంసీ ఆస్పత్రిలో స్వామీజీ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం స్వామీజీ ఆరోగ్యం మరింత విషమించడంతో మఠానికి తీసుకుని వెళ్లారు. అనంతరం, ఉదయం 9.20 గంటల సమయంలో స్వామీజీ తుదిశ్వాస విడిచారు. స్వామీజీ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామీజీ భౌతిక కాయంపై కర్ణాటక సీఎం యెడియూరప్ప జాతీయ జెండా కప్పి నివాళులర్పించారు. పలువురు మంత్రులు, బీజేపీ, ఆరెస్సెస్ నేతలు స్వామీజీకి నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాల మధ్య బెంగళూరులోని విద్యాపీఠ ఆవరణలో అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. స్వామీజీ కోరిక మేరకు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఈ నెల 20న స్వామీజీని మణిపాల్‌లోని కేఎంసీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. శనివారం రాత్రి ఆయన శరీరంలోని కీలక అవయవాలు స్పందించడం ఆగిపోయింది. తుది శ్వాస మఠంలోనే విడవాలన్న స్వామీజీ కోరిక మేరకు ఆదివారం ఉదయం పెజావర మఠానికి తరలించారు. ప్రధాని సంతాపం స్వామీజీ మరణం పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ‘లక్షలాది ప్రజల హృదయాల్లో స్వామీజీ ధ్రువతారగా నిలిచి ఉంటారు. ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో ఎంతో కృషి చేశారు. ఓం శాంతి’ అని ట్వీట్ చేశారు. ఉడుపి నుంచి బెంగళూరుకు స్వామీజీ మరణవార్త విన్న అశేష భక్తులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ఉదయమే మఠానికి చేరుకున్నారు. భక్తుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉడుపిలోని అజ్జనగూడు మహాత్మాగాంధీ మైదానంలో ఉంచారు. తర్వాత హెలికాప్టర్లో బెంగళూరుకు తరలించారు. బసవనగుడిలోని నేషనల్ కాలేజీ మైదానంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. తర్వాత సంప్రదాయాల ప్రకారం పూర్ణ ప్రజ్ఞ విద్యాపీఠంలో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. మధ్వాచార్యుడు స్థాపించిన మఠం 800 ఏళ్ల క్రితం శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ ఆలయ బాధ్యతలను ఈ మఠాలు విడతల వారీగా పర్యవేక్షిస్తుంటాయి. పెజావర మఠ పెద్దల్లో విశ్వేశ స్వామీజీ 33వ వారు. 1931 ఏప్రిల్ 27న రామ కుంజలోని బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. 1938లో సన్యాసం స్వీకరించారు. హిందూజాతికి తీరని లోటు – స్వరూపానందేంద్ర సరస్వతి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ పరమపదించడం పట్ల విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశ్వేశతీర్థ మరణం హిందూజాతికి తీరని లోటన్నారు. హిందూ సమాజం గర్వించదగ్గ మత గురువుల్లో ఆయన ఒకరన్నారు. హిందూధర్మ పరిరక్షణకు విశ్వేశతీర్థ విశేష కృషి చేశారన్నారు. బెంగళూరులో పూర్ణప్రజ్ఞ విద్యా పీఠాన్ని ఏర్పాటు చేసి 63 ఏళ్లుగా వేదాంతంలో ఎంతోమందిని నిష్ణాతులను చేశారన్నారు. స్వామీజీ సేవలు చిరస్మరణీయం – ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి, అమరావతి: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలతో స్వామీజీ విశేష సేవలు అందించారని ఆయన పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి స్వామీజీ చేసిన నిరుపమాన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు. -
ఉడిపి స్వామీజీ శివైక్యం
-
పుస్తకాలు కదా మాట్లాడింది..!
అతను ఓ యువకుడు. ఆ నోటా ఈ నోటా విని ఆ గురువుగారి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడే ఉండి వైరాగ్యం, సన్న్యాసం గురించి తెలుసుకోవాలనుకున్నాడు యువకుడు. కానీ ఆ గురువుగారు ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని చెప్తూ ఉండేవారు. శిష్యుడు ఏదైతే తెలుసుకోవాలనుకున్నాడో అది తప్ప మిగిలినవి చెప్పసాగారు గురువుగారు. ఆయన చెప్పే విషయాలు అతనిని ఏమాత్రం ఆకట్టుకోలేదు. అవి అంత ప్రాధాన్యమైనవిగా కూడా అనిపించలేదు. దాంతో శిష్యుడికి గురువుగారి మీద ఒకింత కోపమొచ్చింది. నిరాశానిస్పృహలూ కలిగాయి. అప్పటికీ కొంత కాలం ఉండి ఇక లాభం లేదనుకుని అక్కడినుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఓ సంఘటన జరిగింది. ఆ తర్వాత అతను అక్కడినుంచి వెళ్ళనే లేదు. ఇంతకూ ఆ రోజు జరిగిన సంఘటన ఏమిటో చూద్దాం... ఆ రోజు మరొక యువకుడు ఆ గురువుగారి దగ్గరకు వచ్చాడు. అతను ఓ సాధువు. అక్కడున్న వారికి తన గురించి పరిచయం చేసుకున్న ఆ కొత్త సాధువు అందరితోనూ అవీ ఇవీ మాట్లాడుతూ వారి మాటలు వింటూ కొత్త కొత్త విషయాలను ఆసక్తికరంగా చెప్పసాగాడు. ఆధ్యాత్మిక అంశాలపై కనీసం రెండు గంటలపాటు ఆ యువసాధువు మాట్లాడాడు. అందరూ గుడ్లప్పగించి విన్నారు. గురువుగారు కళ్ళు మూసుకుని ఆ యువకుడి మాటలను వినసాగారు. అప్పటికే అక్కడున్న పాత శిష్యుడు ఆ కొత్త సాధువు మాటలు విని తానింతకాలమూ ఆశించింది ఇటువంటి విషయాలనే కదా అని మనసులో అనుకున్నాడు. గురువు అనే వాడు ఇలా ఉండాలని, ఆ కొత్త సాధువుతో వెళ్ళిపోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. అక్కడున్న వారందరూ అతని మాటలను ఎంతగానో మెచ్చుకున్నారు. తమకున్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఓ రెండు గంటల తర్వాత ఆ కొత్త సాధువు తన ప్రసంగం ఎలా ఉందని గురువుగారిని అడిగాడు ఒకింత గర్వంతో. గురువుగారు కళ్ళు తెరచి ‘‘నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడావు... నేను రెండు గంటలుగా చూస్తున్నాను. నువ్వేం మాట్లాడావు...’’ అని అన్నారు.‘‘అదేంటీ అలా అంటారు... అలాగైతే ఇప్పటి వరకూ మాట్లాడిందెవరని అనుకుంటున్నారు...’’ అని కొత్త సాధువు ప్రశ్నించాడు. ‘‘శాస్త్రాలు మాట్లాడాయి... నువ్వు చదువుకున్న పుస్తకాలు మాట్లాడాయి... నువ్వు నీ స్వీయానుభవం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు... అటువంటప్పుడు నీ ప్రసంగంపై నా అభిప్రాయం ఏం చెప్పగలను?’’ అని గురువుగారు ప్రశ్నించారు. ఎప్పటికైనా స్వీయానుభవమే నిజమైనది. దోహదపడేది కూడానూ. – యామిజాల జగదీశ్ -
నాడు ఆధ్యాత్మిక గురువు.. నేడు అనాథ
నిన్నమొన్నటి వరకూ ఆయనో స్వామీజీ.. ఒంటి నిండా కాషాయ వస్త్రాలు ధరించి గ్రామగ్రామాలు తిరుగుతూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు తన జీవితాన్ని ధారపోశారు. విధి వక్రీకరించి పక్షవాతం సోకి ఒక కాలు, ఒక చేయి పనిచేయకుండా పోయాయి. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కిందపడి కాలు విరిగి మంచాన పడ్డారు. ఆలనా.. పాలనా చూసేవారు లేక అనాథగా మారి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సాక్షి, నల్లమాడ (ప్రకాశం): చీరాలకు చెందిన ఓ స్వామీజీ 15 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా నల్లమాడ మండలానికి చేరుకున్నారు. ఎన్.ఎనుమలవారిపల్లి సమీపంలోని దేవరగుళ్ల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దీపారాధన చేస్తూ జ్యోతిస్వరూపానంద స్వామీజీ అలియాస్ చీరాల స్వామీజీగా మండలంలో గుర్తింపు పొందారు. చాలా ఏళ్లపాటు లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోనే ఉంటూ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ఆలయంలో తరచూ యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు కృషి చేశారు. పాతబత్తలపల్లి పంచాయతీలోని గ్రామాల్లోనే గాక నల్లమాడ మండల వ్యాప్తంగా ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా స్వామీజీ పాల్గొని ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవారు. కుటుంబ బంధాలు తెగి.. ఆరు దశాబ్దాలు పైబడిన వయసున్న స్వామీజీకి చీరాలలో భార్యాపిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే 15 సంవత్సరాల క్రితమే వారితో సంబంధాలు తెగిపోయి.. ఒంటరిగా ఇక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 1న స్వామీజీకి పక్షవాతం సోకింది. ఎడమ చేయి, కాలు చచ్చుబడ్డాయి. చికిత్స అనంతరం ఊతకర్ర సాయంతో నడిచేవాడు. నెల రోజుల క్రితం ఊతకర్ర సాయంతో నడుస్తున్న స్వామీజీ అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో అతని ఎడమకాలు విరిగింది. సహాయకులు లేక అనాథలా.. ప్రస్తుతం నడవలేని స్థితిలో మంచాన పడ్డారు. నా అనే వారు లేకపోవడంతో ఆలనాపాలనా కరువైంది. గ్రామస్తులెవరైనా ఇంత తెచ్చిపెడితే తినాలి. లేదంటే పస్తులే. అన్నపానీయాలతో పాటు వైద్యం అందక రోజురోజుకూ స్వామీజీ ఆరోగ్యం క్షీణిస్తోంది. చెండ్రాయునిపల్లి క్వార్టర్స్‌లోని ఓ గదిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లబుచ్చుతున్నాడు స్వామీజీ. ఆస్పత్రికి వెళ్లి చూపించుకుందామంటే సహాయకుడు లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తూ రోజులు లెక్కిస్తున్నారు. దాతలు, స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి తనకు చికిత్స అందించాలని ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన వారిని స్వామీజీ వేడుకుంటున్నారు. లేని పక్షంలో కారుణ్య మరణానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దాతలు ఎం.జ్యోతిస్వరూపానంద స్వామి, కదిరి ఎస్బీఐ అకౌంట్ నం.3559 549 9432 (ఐఎఫ్‌సీ కోడ్: ఎస్బీఐఎన్0000849)కు విరాళం పంపవచ్చు. -
శ్రీదర్గా పీఠాధిపతి సధురు స్వామీజీ ఇకలేరు
-
దాతీ మహరాజ్‌పై లైంగిక దాడి కేసు
సాక్షి, న్యూఢిల్లీ : స్వామీజీగా చెప్పుకునే దాతీ మహరాజ్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. ఈ కేసును సీబీఐకి బదలాయించిన ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. గతంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు విచారణను చేపట్టారు. దాతీ మహరాజ్‌తో పాటు ఆయన శిష్యులపై 25 ఏళ్ల మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేశారు. పదేళ్లుగా దాతీ మహరాజ్ వద్ద తాను శిష్యరికం చేశానని, అయితే ఆయనతో పాటు ఇద్దరు శిష్యులు తనపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం తాను రాజస్థాన్‌లోని తన స్వస్ధలానికి వెళ్లిపోయానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఓ మహిళా శిష్యురాలు స్వామీజీ గదిలోకి తనను బలవంతంగా తీసుకెళ్లిందని, తాను తిరస్కరించగా ఇతర శిష్యురాళ్లూ ఆయనతో గడిపారంటూ తనను లొంగదీసుకున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. స్వామీజీని, ఆయన సోదరులను అరెస్ట్ చేసి, రెండు ఆశ్రమాలను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో బాధితురాలు కోర్టును కోరారు. దాతీ మహరాజ్‌ను అరెస్ట్ చేయడంలో విఫలమైన పోలీసులను, దర్యాప్తు సంస్ధలను కోర్టు తీవ్రంగా మందలించింది. -
కర్ణాటక రాజకీయాలపై మఠాలు,స్వామీజీల ప్రభావం
-
మనశ్శాంతి లేదని.. స్వామీజీ ఆత్మహత్య!
సాక్షి, హావేరి: తాలూకాలోని హుల్లత్తి గ్రామ దింగాలేశ్వర శాఖ మఠం మహాలింగ స్వామిజీ (38) ఆత్మహత్య చేసున్నారు. అంతకుముందు ఆయన గదగ జిల్లా శిరహట్టి తాలూకాలోని బాలేహోసురుకు చెందిన దింగాలేశ్వర మఠంలో ఉండేవారు. కొన్ని నెలల క్రితమే స్వామిజీ దింగాలేశ్వర శాఖకు వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి మఠంలో ఎవరు లేని సమయం చూసి స్వామిజీ డెత్ నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం తెల్లవారు జామున మఠానికి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని హానగల్ పోలిసులకు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. డెత్‌నోట్‌లో తన మరణానికి ఎవరూ కారణం కాదని, గత కొంత కాలంగా తనకు మనశ్శాంతి లేదని, దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నాడు. తనను ఇదే మఠంలో సమాధి చేయాలని అందులో కోరాడు. -
శివ శివా.. శివలింగంపై కాళ్లా!
సాక్షి, బెంగళూరు: శివలింగంపై ఒక స్వామీజీ పాదాలు మోపి పూజలు చేయించుకున్న ఘటన కర్ణాటకలో సంచలనమైంది. ఆయన తీరుపై శైవ భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 5న బెంగళూరు శివారు రంగనబెట్ట సమీపంలో శాంతలింగేశ్వర మఠానికి చెందిన మరో శాఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా శివలింగానికి ప్రాణప్రతిష్ట చేసే సమయంలో మఠానికి చెందిన శాంతలింగేశ్వర స్వామి తన పాదాలను ఆ శివలింగంపై పెట్టగా, ఆయన శిష్యులు పూజలు చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏడాదిలో ఉగాది రోజు మాత్రమే మాట్లాడే శాంతలింగేశ్వర స్వామీజీ ఈ విషయమై తన శిష్యుల ద్వారా మీడియాకు వివరణ ఇప్పించారు. వీరశైవ విధానం ప్రకారమే పూజలు జరిగాయని చెప్పారు. -
82 ఏళ్ల స్వామీజీకి పుత్రభాగ్యం
సాక్షి, బెంగళూరు (కలబురీ): కర్ణాటకలో ఒక స్వామీజీకి 82 ఏళ్ల వయసులో పుత్రభాగ్యం కలిగింది. హైదరాబాద్– కర్ణాటక ప్రాంతం భక్తుల ఆరాధ్యదైవమైన కలబుర్గీలోని మహాదాసోహి శరణ బసవేశ్వర సంస్థాన పీఠాధిపతి శరణ బసప్ప అప్ప 82 ఏళ్లలో తండ్రయ్యారు. 48 ఏళ్ల రెండో భార్యకు రెండు రోజుల కిందట ముంబైలో మగపిల్లాడు జన్మించాడు. ఇకపై ఈ శిశువునే మఠానికి ఉత్తరాధికారిగా పరిగణిస్తారు. విషయం తెలిసిన వెంటనే మఠానికి చెందిన భక్తులు సంబరాలు చేసుకున్నారు. కాగా, శరణ బసప్ప అప్పకు ఇప్పటికే ఎనిమిది మంది కూతుర్లు ఉన్నారు. -
ప్రత్యేక యాగం కోసం ఇలా చేశాడు..!
వేలూరు: ప్రపంచం కొత్త కొత్త టెక్నాలజీతో రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. కానీ సమాజంలో మాత్రం మూఢనమ్మకాలు పోవటం లేదు . టెన్నాలజీ యుగంలో కూడా స్వామిజీలకు, బాబాలకు ఆధరణ మంచిగానే ఉంది. ప్రత్యేక యాగం కోసం చిన్నారిని బలి ఇచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని వేలూరు జిల్లా వానియంబాడిలోని స్వామిజీ మఠంలో చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన గ్రామస్తులలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. నరబలి ఇచ్చి నీటి తొట్టెలో వేశారంటూ స్థానికులు మఠాన్ని ధ్వంసం చేశారు. వివరలీవి.. వానియంబాడి తాలుకా మేల్ నిమ్మయంబట్టు గ్రామ సమీపంలో రవి అనే వ్యక్తి మఠం ఏర్పాటు చేసి పదేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఏడడుగుల నీటి తొట్టెను ఏర్పాటు చేసి అందులో తాబేలను పెంచుతున్నాడు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగం చేస్తుంటాడు. మఠానికి సమీపంలోనే మురుగన్ కుటుంబంతో ఉంటున్నాడు. మంగళవారం అతని కుమారుడు హరికేష్ అలియాస్ తులసి(2) కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు మఠంలో వెదకగా నీటి తొట్టెలో శవమై కనిపించాడు. సోమవారం రోజున పౌర్ణమి, చంద్ర గ్రహణం కావడంతో స్వామిజీ రవి ప్రత్యేక యాగం చేశాడని, ఆ సమయంలో బాలుడిని బలి ఇచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానించారు. కోపంతో గ్రామస్తులు మఠంలో ఉన్న స్వామిజీపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. మఠంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. గాయపడిన రవి అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. బాలుడిని బలి ఇచ్చాడంటూ రవిపై వానియంబాడి పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. -
ఆధ్యాత్మిక గురువుకే పంగనామాలు
హైదరాబాద్: ఆధ్యాత్మిక గురువుకే పంగనామాలు పెట్టింది. తన మాయమాటలతో స్వామి వాహానాన్నే స్వాహా చేసింది.. అడిగితే.. అదిగో.. అల్లదిగో.. అంటూ కాలాన్ని వెళ్లదీసుకొచ్చింది.. అనుమానం వచ్చిన స్వామీజీ అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు.. హతవిధి... ఏమిటిది అనుకుంటూ పోలీసులను ఆశ్రయించారు.. భక్తురాలిగా నమ్మించి స్వామీజీ వద్ద ఉన్న ఇన్నోవా వాహనంతో ఉడాయించిన ఆ కిలాడీ లేడీ కోసం ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లో నివసించే ఎ.వి.కృష్ణారావు అలియాస్ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి నివసిస్తుంటారు. ఆయన వద్దకు జె. అరుణారెడ్డి అనే మహిళ భక్తురాలిగా వస్తుండేది. అలా మహర్షి స్వామిజీకి నమ్మకంగా మారింది. గత మార్చి 20న మహర్షికి చెందిన ఇన్నోవా వాహనం టీఎస్ 09ఏక్యూ టీ/ఆర్ 2001 వెనక్కి తీస్తుండగా వాహనం అనుకోకుండా ప్రమాదానికి గురైంది. దీంతో వాహనం స్వల్పంగా దెబ్బతింది. అరుణారెడ్డి వాహనాన్ని రెండు రోజుల్లో బాగు చేయిస్తానని చెప్పి మహర్షిని నమ్మించి తనతోపాటు తీసుకెళ్లింది. అలా తీసుకెళ్లిన ఆమె వాహనం రిపేర్ పేరుతో వాహనాన్ని తన వద్దనే ఉంచుకొంది. మహర్షి ఎన్నిసార్లు అడిగినా మాయమాటలతో బోల్తా కొట్టించింది. రోజుకో మాట చెప్పి నమ్మిస్తున్న అరుణారెడ్డి మాటలపై అనుమానం వచ్చిన మహర్షి అసలు విషయం ఆరా తీయాగా ఆమె వాహానాన్ని వేరే వాళ్లకి తాకట్టు పెట్టినట్లు తెలిసింది. అరుణారెడ్డి కూడా ఆశ్రమానికి రాకుండా సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో అనుమానం వచ్చిన ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిఇలా ఉండగా రెండు రోజుల క్రితం అరుణారెడ్డి మల్కాజ్గిరి పోలీస్ స్టేసన్‌లో మోసం కేసులో అరెస్ట్ అయినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా నల్గొండలో, నారాయణగూడలో కూడా ఇలాంటి మోసం కేసులు ఆమెపై నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు పిటిషన్ వేసి ఆమెను అదుపులోకి తీసుకుంటామని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. అయితే మల్కాజీగిరి పోలీసులకంటే ముందుగానే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందినా పోలీసుల అలసత్వం కారణంగా మాయ లేడి దర్జాగా తప్పించుకొంది. ఇక్కడ పోలీసుల ఆలస్యం వల్ల ఆమె మరో మోసం చేసేందుకు యత్నించింది. ఈ క్రమంలోనే మల్కాజీగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో అరెస్ట్ కావడం గమనార్హం. -
మఠం ఆస్తులను అమ్ముకుంటున్న పీఠాధిపతి
-
పూజ చేస్తానని నమ్మించి 17 కాసుల బంగారం చోరీ
మూఢ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని మోసం కాకినాడ క్రైం : ఓ మహిళ మూఢ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని ఓ దొంగ స్వామి 17 కాసుల బంగారంతో ఉడాయించాడు. కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు కాకినాడ జగన్నాథపురం శివాలయం వీధికి చెందిన డెన్నీస్ ప్రశాంత్ ఆంటోని స్థానిక షిప్పింగ్ కంపెనీలో పని చేస్తూంటాడు. ఈమె భార్య రాజేశ్వరి గృహిణి. ఈనెల 10 వ తేదీ శనివారం పూసలు, ఫాన్సీ సరకులు అమ్ముతామంటూ ఇద్దరు మహిళలు రాజేశ్వరి ఇంటికొచ్చారు. ఈ సందర్భంగా కొన్ని పూసలు, ఇతర ఫాన్సీ వస్తువులను కొనుగోలు చేసింది. మీ ఇంట్లో పరిస్థితి బాగోలేదు. మీకు మనశ్శాంతి ఉండటం లేదు.. పూజలు చేస్తే అంతా మంచి కలుగుతుంది.. మాకు తెలిసున్న స్వామీజీ ఒకరున్నారు. ఆయన వచ్చి పూజలు చేస్తే అంతా శుభం కలుగుతుందని నమ్మించారు. 12వ తేదీన ఇంట్లో భర్త, ఎవరూ లేని సమయంలో ఇరవై నుంచి ముప్పయ్యేళ్ల వయసున్న ఓ వ్యక్తి సాధువు వేషంలో వచ్చి వారంతా చెప్పారు. పూజ చేస్తే అంతా బాగుంటుందని నమ్మించాడు. పూజ ప్రారంభించిన కొద్దిసేపటికి బంగారు వస్తువులను పూజలో పెట్టాలి. ఇందుకు స్టీల్ బాక్స్, బంగారు వస్తువులు కావాలని కోరాడు. దొంగస్వామి సూచించిన మేరకు ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను తీసుకువచ్చి స్టీల్ బాక్స్‌లో పెట్టింది. పూజకు పసుపు, కుంకుమ కావాలని, లోపలికెళ్లి తీసుకురావాలంటూ కోరాడు. రాజేశ్వరి లోపలికి వెళ్లి పసుపు, కుంకుమ తీసుకు వచ్చే లోపు అక్కడ పెట్టిన పెట్టె దాచి, తమ వెంట తెచ్చిన పెట్టెను పెట్టి దానిని దారంతో చుట్టాడు. కొద్ది సేపటికి పూజ పూర్తయ్యింది, రాత్రి పదిగంటల దాకా దాన్ని తెరవద్దని రాజేశ్వరి చేతిలో బాక్స్ పెట్టాడు. రాత్రి పదిగంటలకు బాక్స్ తెరచి చూడగా అందులో కేవలం ఒక రూపాయి బిళ్ల, గుప్పెడు బియ్యం ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయింది. జరిగిన మోసాన్ని గుర్తించిన రాజేశ్వరి మంగళవారం రాత్రి క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై శేషుకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 17 కాసుల బంగారం విలువ సుమారు రూ. 1.70 లక్షలు ఉంటుందన్నారు. -
11 రోజులు సమాధిలో..
సాక్షి, బళ్లారి(కర్ణాటక) : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11 రోజుల పాటు ఎలాంటి అన్నపానీయాలు తీసుకోకుండా సమాధిలోనే ఉండిపోయారు ఓ స్వామీజీ. అనంతరం ధ్యానముద్ర నుంచి మేల్కొని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివచ్చారు. ఈ సంఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లా చింతనపల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ఈ నెల 11న రాచోటేశ్వర అనే స్వామీజీ ధ్యానముద్రలో కూర్చొన్నారు. తర్వాత గ్రామస్తులు, భక్తులు కలిసి స్వామీజీ చుట్టూ రాళ్లతో సమాధి నిర్మించారు. గాలి, వెలుతురు లేకుండా ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం సమాధిని తొలగించారు. ఉజ్జయిని జగద్గురు మరుళు సిద్ధ దేశీ కేంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో యోగముద్రలో ఉన్న రాచోటేశ్వర స్వామీజీని ధ్యాన విముక్తుణ్ని చేయించారు. ధ్యానముద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వామీజీ మాట్లాడుతూ జనం సంతోషంగా ఉండాలని, వర్షాలు సమద్ధిగా వచ్చి పంటలు బాగా పండాలనే ఉద్దేశంతో 11 రోజుల పాటు ధ్యానం చేశానన్నారు. కాగా.. రాచోటేశ్వర స్వామీజీ గతంలో కూడా 41 రోజులు ధ్యానంలో ఉన్నారని భక్తులు తెలిపారు. -
దేశ ఔన్నత్యాన్ని చాటాలి
హిందూపురం టౌన్ : హిందువులు స్వాభిమానం, దేశభక్తిని పెంపొందించుకుని ప్రపంచ దేశాల్లో భారతదేశం ఔన్నత్యాన్ని చాటాలని తిరువణ్ణామలై శ్రీవత్స పీఠం స్వామీజీ శ్రీవాత్యల్స వాసవదత్త పేర్కొన్నారు. మంగళవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక సూగురు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద హిందూ ధర్మ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనానికి వైటీ శ్రీనివాసులు అధ్యక్షత వహించగా అతిథులుగా స్వామీజీ శ్రీవాత్యల్స వాసవదత్త, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సహాయ కార్యదర్శి రాఘవులు పాల్గొని ధర్మ ప్రభో దం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టి దేశ ప్రజల భద్రతను కాపాడాలన్నారు. సనాతన హిందూ ధర్మం, తల్లి, గోమాత, మాతృభూమి, గ్రంథాలు, మంది రాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు.∙హిం దూవుల ధర్మ సంసృ ్కతులపై, జీవన విలువలపై దాడులు జరుగుతున్నాయని, హిందువులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో చారుకీర్తి, డీఈ రమేష్, నవీన్‌కుమార్, విశ్వహిందూ పరిషత్ నాయకులు, హిందువులు పెద్దఎత్తున పాల్గొన్నారు. -
మేకువన్నె బాబా
చేతనబడి చూపు శూలం. రూపు రౌద్రం. మాట మంత్రం. చేత తంత్రం. పిడికిలితో పసుపు కుంకుమ తీసి ముఖం మీద కొట్టాడంటే... ప్రేతాత్మ పనైపోయినట్లే! దానికి చేతబడి జరిగినట్లే! వీధి ‘వైద్యులు’ చెవుల్లోంచి రాళ్లు తీసినట్లు.. ఈ భూతవైద్యుడు మన ఒంట్లోంచి మేకులు పీకుతాడు! ‘రోగం వదిలింది ఫో’ అంటాడు. రోగంతో పాటు రుపీసూ వదిలిస్తాడు. మనుషుల్లో మేక వన్నె పులులు ఉన్నట్లు... ఈయన మేకు వన్నె బాబా! రంగారెడ్డి జిల్లాలో మోమిన్ పేట గ్రామం. అది మండల కేంద్రం కూడా. ఆ ఊరికి రెండు కిలోమీటర్ల దూరాన పొలాల్లో ఉంది ఓ దేవాలయం. శక్తిస్వరూపిణి ఆలయానికి రోజూ పదుల కొద్దీ భక్తులు వస్తుంటారు. వారిలో నూటికి తొంభై మంది ఆ ఆలయంలో ఉన్న మంత్రగాడిని దర్శించుకోవడానికే వస్తుంటారు. పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో గుడి, పక్కనే మంత్రగాడి ఇల్లు. కనుచూపు మేరలో మనిషి ఆనవాలు ఉండదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే భయం లేకుండా ఆ కుటుంబం అక్కడ ఎలా నివసించగలుగుతోందని అక్కడికొచ్చే భక్తులకు ఆశ్చర్యం. మళ్లీ అంతలోనే ‘అంతటి శక్తులున్న స్వామీజీకి భయమెందుకుంటుంది?’ అని తమకు తాముగా సమాధానం చెప్పుకుంటారు. ‘అందుకేగా మరి... చేతబడులను తిప్పి కొట్టగలుగుతోంది’ అని మరికొందరు అంటారు. రౌద్రానికి ప్రతిరూపం ఆ రోజు కూడా భక్తుల సంభాషణ ఇలాగే కొనసాగుతోంది. ఇంతలో.. ‘ష్...’ అంటూ నోటి మీద వేలిని చూపుతూ మాట్లాడవద్దనే సంకేతాన్ని జారీ చేశాడు ఓ అనుచరుడు. తర్వాత స్వామీజీ ఉన్న గది తెర తొలగించాడు. స్వామీజీ పద్మాసన స్థితిలో కూర్చుని ఉన్నాడు. ముఖంలో ప్రసన్నత ఏ కోశానా లేదు. రౌద్రానికి ప్రతిరూపంగా ఉన్నాడు. అతడి ముందు పసుపు, కుంకుమలు రాశులుగా పోసి ఉన్నాయి. త్రిశూలాన్ని చేతిలోకి తీసుకుని గిరగిరా తిప్పుతున్నాడు. ఆవేశంతో ఊగుతున్నాడు. భక్తుల్లో ఎవరికీ నోరు పెగలడం లేదు. తాము వచ్చిన పని మర్చిపోయి మంత్రముగ్ధుల్లా చూస్తున్నారు. త్రిశూలం వచ్చి గుండెల్లో దిగుతుందేమోనన్నంత ఉత్కంఠత నెలకొంది. ఏడెనిమిది నిమిషాలు గడిచాక కొద్దిగా శాంతించాడు స్వామీజీ. ‘నీ కష్టం ఏమిటో చెప్పుకో...’ త్రిశూలాన్ని పక్కన ఉంచి ‘ఎందుకొచ్చారన్నట్లుగా’ భక్తుల ముఖాల్లోకి సూటిగా చూస్తున్నాడు. అనుచరుడు ఒక మహిళ దగ్గరకు వచ్చి లో గొంతుకతో ‘నీ కష్టం ఏమిటో చెప్పుకోమ్మా’ అని అన్నాడు. ఆమె కూర్చున్న చోట నుంచి లేచి కొద్దిగా ముందుకు వెళ్లి తాను తెచ్చిన కొబ్బరి కాయ, తాంబూలం, పూలు, అరటిపండ్లు, సాంబ్రాణి కడ్డీలు, కర్పూరం, దక్షిణగా కొంత డబ్బు స్వామి ఎదురుగా ఉన్న పళ్లెంలో పెట్టింది. ధైర్యం తెచ్చుకుని నోరు తెరిచింది... ‘రెణ్నెల్ల నుంచి మోకాళ్లు, నడుములు, మోచేతుల నొప్పులు, నిలబడలేను, నాలుగడుగులు కూడా వేయలేక పోతున్నాను. కాలు కదిలించాలన్నా, చేత్తో నీళ్ల చెంబు ఎత్తాలన్నా భయంగా ఉంటోంది’ అని చెప్పింది. మరి ఆమె వైద్యుడి దగ్గరకు వెళ్లకుండా భూతవైద్యుడి దగ్గరకు ఎందుకు వచ్చినట్లు..అనే సందేహం అక్కడెవరికీ రాలేదు. ఆ మేకులే ఈ మేకులు! అందరూ స్వామీజీ ఏం చెబుతాడోననే ఉత్కంఠతో చెవులు రిక్కించి వింటున్నారు. స్వామీజీ త్రిశూలాన్ని ఆమె మోకాళ్ల మీద, మోచేతుల మీద ఆన్చి కళ్లు మూసుకుని ఏదో జపించాడు. కళ్లు తెరిచాడు... ‘మీ ఊరికి పది మైళ్ల దూరాన ఉన్న వాళ్లెవరో మీకు చేతబడి చేసి పిండిబొమ్మలో మేకులు గుచ్చారు. ఆ మేకులే నీ మోకాళ్లలో దూరాయి’ అని ముగించాడు. ఆమె కళ్లలోని భయాన్ని చూసి... ‘నీకు అంతటి శత్రువులు ఎవరూ ఉండరు. నువ్వు లక్షణంగా ఉంటే చూడలేని నీ బంధువులే ఈ పని చేశారు’ అంటూ ముక్తాయింపునిచ్చేశాడు. ఆ మహిళ అయోమయం నుంచి తేరుకునే లోపు మరో భక్తుని పంపించాడు అనుచరుడు. కొంతసేపటికి లేచి వెళ్లబోతున్న ఆ అర వయ్యేళ్ల స్త్రీని ఆపి పక్కన కూర్చోబెట్టారు. ‘స్వామీజీ తీసేస్తాడట..’ ఒక్కొక్కరు ఒక్కో రకమైన కష్టం చెప్పుకుంటున్నారు. స్వామీజీ ఒకరికి నిమ్మకాయలను మంత్రించి ఇస్తున్నాడు. కొందరిని కొరడాతో కొడుతున్నాడు. కీళ్ల నొప్పులని వచ్చిన వారందరినీ ఒక చోట కూర్చోబెడుతున్నాడు అనుచరుడు. ‘ఒంట్లోకి దూరిన మేకులను స్వామీజీ చేత్తో తీసేస్తాట్ట’ గుసగుసగా చెప్పుకుంటున్నారు. చివరగా వీరికి (భూత) వైద్యం మొదలైంది. మేకుల్ని తీయడానికి ఉపక్రమించగానే స్వామీజీలో రౌద్రం తారస్థాయికి చేరింది. పసుపు, కుంకుమలను గుప్పెళ్లతో తీసి ఒంటి మీద చల్లుతున్నాడు. ప్రేతాత్మతో మాట్లాడుతున్నట్లు అభినయిస్తున్నాడు. మోచేతులను గట్టిగా పట్టుకుని మేకులను పళ్లతో లాగేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మేకు పళ్లకు దొరకనందుకు కోపంతో మనిషి ఊగిపోతున్నాడు. ఐదారు ప్రయత్నాల తర్వాత మోచేతి నుంచి ఒక మేకు తీసి చూపించాడు. అలా మూడు మేకులు బయటపడ్డాయి. అన్నీ ఒకేరోజు కాదు! ‘ఈ రోజుకు చాలు, మిగిలినవి వచ్చే వారం’ అని ముగించాడు స్వామీజీ. ఆమె నుంచి మేకుకు రెండు వందల చొప్పున ఆరువందలు వసూలు చేశాడు అనుచరుడు. అలా ఆమెకు వారానికి ఆరేడు వందల చొప్పున దాదాపుగా మూడు వేలు వదిలాయి. కానీ నొప్పులు తగ్గలేదు. వయసు రీత్యా, క్యాల్షియం లోపంతో ఎముకలు గుల్లబారడం, కీళ్ల అరుగుదలతో ఇలాంటి నొప్పులు వస్తుంటాయి. అలా బాధపడే వాళ్లు ఆ స్వామీజీ దగ్గరకు వస్తుంటారు. కొందరికి నొప్పులు రెండు- మూడు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతుంటాయి. స్వామీజీ నొప్పుల్ని మాయం చేశాడని వీళ్లు చేసే ప్రచారంతో మిగిలిన వాళ్లు ఆకర్షితులవుతుంటారు. తగ్గని వాళ్లు ప్రత్యామ్నాయంగా మరో భూతవైద్యుడినో, వైద్యుడినో వెతుక్కుంటూ ఈ సంగతి మర్చిపోతారు. కాస్త లాజిక్‌గా ఆలోచిస్తే చాలు... ఇలాంటి బాబాల మోసాలు ఇట్టే అర్థమైపోతాయి. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మేకులు ఎక్కడ ఉంటాయి? మేకుల్ని పసుపు కుంకుమలో దాస్తారు.ఎవరూ గమనించలేనంత నైపుణ్యంగా మేకులను వేళ్ల మధ్యకు తీసుకుని ఒంటిమీద పెట్టి నోటితో లాగినట్లు భ్రమింపచేస్తారు. దేహం లోపలి నుంచి ఇనుప మేకు బయటకు వస్తే ఆ మేరకు గాయమై రక్తం చిందాలి కదా అనే చిన్న తర్కాన్ని కూడా ఆలోచించరు భక్తులు. ఆలోచిస్తే ఇటువంటి వైద్యాలు కొనసాగవు. ఇలా ఛేదించాం మేము గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి ఆ అరవై ఏళ్ల మహిళ వచ్చింది. స్వామీజీలు చేసే ట్రిక్స్‌ని చేసి చూపిస్తుంటే ఆమె వెంటనే స్పందించింది. ‘మీరు ఓ నెల ముందు మా ఊరికి రాకపోతిరి’ అంటూ తనకు జరిగిన భూతవైద్యం గురించి, మేకుల బాబా మోసాన్ని చెప్పింది. దాంతో మేము కూడా భక్తుల్లాగే వెళ్లి అతడు మేకులను ఎక్కడ దాస్తున్నాడో, ఎలా తీస్తున్నాడో చూపించాం. అప్పటికే అక్కడ ఉన్న భక్తులు మమ్మల్ని గట్టిగా వ్యతిరేకించారు. మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పమనడంతో వాళ్లు కూడా తార్కికంగా ఆలోచించి సమాధానపడ్డారు. ఆ స్వామీజీని పోలీసులకు పట్టివ్వడానికి కూడా సహకరించారు. - టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ కాంగ్రెస్ నెట్వర్క్ -
చెవిలో మంత్రం
చెవిలో పూలు పెట్టడం విన్నారు కదా. ఈసారి చెవిలో మంత్రాలు ఊదడం గురించి వినండి. ఈ స్వామీజీకి జ్ఞానోదయం కన్నా.. కర్ణోదయమే ఎక్కువ. కర్ణోదయం అంటే? చదవండి. అర్థమౌతుంది. తోక బిట్టు ఏంటంటే... ఈసారి ఏ స్వామీజీ దగ్గరకు వెళ్లినా నోరు మూసుకుని ఉండండి. ఆ తర్వాత ఆయన నోరు విప్పడం కష్టమే. రాజేశ్వర్‌రావు ఇంట్లో పచార్లు చేస్తున్నాడు. ఆయన ఆలోచనలు కోర్టులో పచార్లు చేస్తున్నాయి! తను కోర్టు హాల్లోకి అడుగుపెట్టగానే అందరూ లేచి నిలబడతారు. సవినయంగా నమస్కరిస్తారు. సీట్లో తను ఆసీనుడైన తర్వాతనే వాళ్లు కూర్చుంటారు. మాట్లాడడానికి తన అనుమతి కోసం ఎదురుచూస్తారు. మాట్లాడే హక్కు ఉన్న దేశం మనది. అలాంటిది కోర్టులో తన అనుమతిలేకుండా ఎవరూ మాట్లాడకూడదు! మాట్లాడితే శిక్షించే అధికారం తనకు ఉంది. న్యాయమూర్తిగా రాజ్యాంగం తనకా హక్కును ఇచ్చింది. అయితే... ఈ గౌరవాలేవీ సర్వీస్ మేటర్స్లో నిత్యం తనకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేవి కావు... రాజేశ్వర్‌రావు ఆలోచనలకు ఫుల్స్టాప్ పడడం లేదు. చట్టాన్ని కంఠతా పట్టిన తనకు ఎలాంటి కేసులోనైనా న్యాయాన్ని సమంగా తూచడమే తెలుసు. కానీ వ్యక్తిగా తనకు న్యాయం జరిగేలా తీర్పు దొరికే సెక్షన్ మన పీనల్ కోడ్‌లోనే ఉండదు.. అనుకుంటూ రాకింగ్ చైర్లో కూర్చుని చేతికందేటంత దగ్గరగా ఉన్న షెల్ఫ్లోంచి ఇండియన్ పీనల్ కోడ్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో సెల్‌ఫోన్ మోగింది. ఆత్మీయుడైన స్నేహితుని నుంచి ఆ ఫోన్ కాల్. రాజేశ్వర్రావుకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడా స్నేహితుడు. వాదించే సహనం లేకపోయింది రాజేశ్వర్రావుకి. ‘సరే సుధాకర్, నీ ఇష్టం. అలాగే వస్తాను’ అని ఫోన్ పెట్టేశాడు. ఎక్కడికి వెళ్లాడు? హైదరాబాద్‌లోని ఎల్బి నగర్ మెయిన్ రోడ్డులో ఓ షో రూమ్. పక్కనే రోడ్డు. లోపలికి వెళ్తే సాయి నగర్ రెసిడెన్షియల్ కాలనీ. ఓ అపార్ట్మెంట్లో మూడవ అంతస్తులో ఫ్లాట్. కార్పొరేట్ ఆఫీసును తలపిస్తోంది. వచ్చిన వాళ్లంతా రిసెప్షన్లో పేరు నమోదు చేసుకుని టోకెన్ తీసుకోవాలి. తమ వంతు వచ్చే వరకు వెయిట్ చేయాలి. అలా వచ్చిన వాళ్లలో రాజేశ్వర్‌రావు, మిత్రులు కూడా ఉన్నారు. ఓ అరగంట తర్వాత ఆఫీస్ బాయ్ తమ నంబరు పిలవగానే అందరూ లోనికెళ్లారు. ఎ.సి గదిలో కర్టెన్లు కదులుతుంటే లావెండర్ ఫ్లేవర్ రూమ్ ఫ్రెషనర్ పిల్ల తెమ్మెరలా వ్యాపిస్తోంది. విశాలమైన టేక్ ఉడ్ టేబుల్‌కు అవతలి వైపున కూర్చుని ఉన్నాడా వ్యక్తి. చిరునవ్వుతో ఆహ్వానించి కుర్చీలు చూపించాడు. ఆ వ్యక్తి వస్త్రధారణ కొంత వింతగానూ, కొంత విచిత్రంగానూ అనిపిస్తోంది రాజేశ్వర్రావుకి. జుట్టు పెంచి తీరుగా దువ్వి భుజాల కిందకు వదిలేశాడు. గడ్డాన్ని పద్ధతిగా ట్రిమ్ చేశాడు. గాలికి రెపరెపలాడే కాసాయం పట్టు దుస్తులు ధరించాడు. ‘ఓం’ అనే అక్షరాలు ఉన్న కాశ్మీర్ శాలువా, వేళ్లకు రంగురంగు రాళ్లు పొదిగిన ఉంగరాలు. మణికట్టుకి రుద్రాక్షల దండ. దానిని రుద్రాక్షమాల అనవచ్చా, ఫ్యాన్సీ బ్రేస్లెట్ అనుకోవాలా! మెడలో బంగారులో పొదిగిన రుద్రాక్షల దండ పారదర్శకంగా ఉన్న పట్టు వస్త్రాలలోంచి తన ఉనికిని చాటుకుంటోంది. మరో చేతికి ఖరీదైన రిస్ట్ వాచ్. మోడరన్‌గా ఉన్నాడా, ట్రెడిషనల్‌గా ఉన్నాడా అర్థం కావడం లేదు. అక్కడేం జరిగింది? వీళ్లలా కూర్చోగానే రాజేశ్వర్‌రావు కళ్లలోకి చూస్తూ ‘నీ ఉద్యోగం ఫలానా కోర్టులోనే కదా! సర్వీస్ మ్యాటర్స్‌లో ట్రబుల్స్ సృష్టిస్తున్నది ఎవరో గ్రహించావా? అన్నట్లు గత ఏడాది నీకు ప్రమోషన్ రావాల్సింది, వచ్చినట్టే వచ్చి ఆగిపోయినట్లుంది రాజేశ్వర్రావ్’ అన్నాడు స్వామీజీ. రాజేశ్వర్‌రావు ఆశ్చర్యపోయాడు. ‘టేబుల్ మీద చెట్టు కొమ్మలాంటి స్టాండుకి వెళ్లాడుతున్న రుద్రాక్ష మాలను చేతిలోకి తీసుకున్నాడు స్వామీజీ. బొటనవేలు, మధ్య వేలి మధ్యలో ఉంచి చూపుడు వేలితో ఒక్కో రుద్రాక్షను కదిలిస్తూ... ‘గ్రహదోషం పోవడానికి పూజ చేయించుకో. ఈ ఏడాది ప్రమోషన్ ఖాయంగా అందుకుంటావు’ అన్నాడు సాలోచనగా శూన్యంలోకి చూస్తూ. రాజేశ్వర్రావుకి భూమి గిర్రున తిరుగుతున్నట్లయింది. కళ్ల ముందు చుక్కలు కనిపించాయి. అలాగే సుధాకర్‌నీ పేరుతో సంబోధించి అతడి కుటుంబ సమస్యను కూడా ప్రస్తావించాడు. రాజేశ్వర్రావుకి ఆశ్చర్యం, సంభ్రమం ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఇదెలా సాధ్యం! ఇదెలా సాధ్యం? ఏకకాలంలో ఆశ్చర్యం... సందేహం. అక్కడి నుంచి బయటికొచ్చిన వెంటనే తనకు తెలిసిన ఓ మిత్రుడికి ఫోన్ చేశాడు. ఆస్తిపూజలు, అష్టైశ్వర్యాలు! రాజేశ్వర్‌రావు అనుభవం ఇలా ఉంటే... కొందరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి హైటెక్ స్వామీజీని సంప్రదిస్తున్నారు. మరికొందరు ఆస్తి వివాదాల పరిష్కారం కోసం దర్శించుకుంటున్నారు. ఆరోగ్యప్రదాయిని పూజ, అష్టైశ్వర్య పూజ, సకల కార్యాభివృద్ధి వ్రతం... ఇలా రకరకాల పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు స్వామీజీ. ఆ స్వామీజీ మంత్రం వేస్తే ఆర్థిక సమస్యలు తీరిపోతాయనే ప్రచారం బాగా జరిగింది. అయితే అవేవీ ఆఫీసో, ఆశ్రమమో అర్థం కాని ఆ ఫ్లాట్‌లో జరగవు. భక్తుల ఇళ్లలోనూ జరగవు. ‘ఎక్కడ జరిపిస్తారో ఆ స్వామికైనా తెలుసో లేదో’ ఆవేశం ఆక్రోశం కలగలిసిన స్వరంతో ఓ మహిళ ఉడికిపోతోంది. కుటుంబ తగాదాను పరిష్కరిస్తానని ఆమె దగ్గర మూడు సార్లు పూజలకని 17 వేలు రాబట్టారు స్వామి ఆఫీస్ సిబ్బంది. ఆస్తి వివాదాన్ని చేత్తో తీసేసినట్లు తీసేస్తానని, అవతలి వారి మనసును ఇట్టే మార్చేసి మీకనుకూలంగా మలుస్తానని మరో పెద్దాయన దగ్గర ముప్ఫై వేలు రాబట్టారు. గుట్టు బట్టబయలు! సాయంత్రం ఆరున్నర. ఈవెనింగ్ వాక్ పూర్తి చేసుకుని గార్డెన్లో కుర్చీలో కూర్చుని పేపర్ తీశాడు రాజేశ్వర్‌రావు. ఉదయం చదవగా మిగిలిపోయిన వార్తల కోసం ఆయన కళ్లు వెతుకుతున్నాయి. మిత్రుడు సుధాకర్ నుంచి ఫోన్ కాల్. ‘ఎల్బీ నగర్లో మనం కలిసిన స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారట’. షాక్ తిన్నాడు రాజేశ్వర్‌రావు. ‘వారిదంతా ఒట్టి మోసమేనట. మనం టోకెన్ తీసుకుని రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నప్పుడు మనతో ఓ వ్యక్తి మాటలు కలిపాడు చూడు... అతడు కూడా స్వామీజీ ఏజెంటే. భక్తులలాగా టోకెన్లు తీసుకుని భక్తులతో కలిసి పోయి కూర్చుంటారు. తమకు తెలిసిన ఎవరో చెప్పగా వచ్చినట్లు, స్వామీజీ గురించి గొప్పగా ప్రమోట్ చేస్తారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నట్లు మాటలు కలుపుతారు. మనచేత మన పేరు, వివరాలు, మన సమస్య చెప్పిస్తారు. ఇదీ ఇక్కడ మోసం. నీకు గుర్తుందా... మనతో మాట్లాడిన వ్యక్తి మనకంటే ముందే లోపలికి స్వామీజీ దగ్గరకు వెళ్లాడు. మరి కనిపించలేదు. ఆ వెంటనే మనకు పిలుపు వచ్చింది. ఈ ఏజెంట్లకు విషయాన్ని రెండు-మూడు వాక్యాల్లో వివరించేటట్లు శిక్షణ కూడా ఇస్తారట...’ సుధాకర్ చెప్పుకుంటూ పోతున్నాడు. ‘అలాగా... నేను మళ్లీ ఫోన్ చేస్తాను సుధాకర్’ అని ఆ ఫోన్ కట్ చేసిన రాజేశ్వర్‌రావు వెంటనే జనవిజ్ఞాన వేదిక మిత్రునికి ఫోన్ చేశాడు. ‘నిజమే రాజేశ్వర్రావ్, ఆ రోజు మీరు ఫోన్ చేసి ఆ స్వామీజీ కలిసినట్లు చెబుతూ... మీ పేరు, ఎందుకు వచ్చారనే వివరాలు కచ్చితంగా చెప్పాడని, నిజంగానే దివ్యశక్తి ఏదైనా ఉందా అని ఆశ్చర్యపోతూ అడిగారు గుర్తుందా? అప్పటి నుంచి మేము మా దర్యాప్తు ప్రారంభించాం. దానికి ఇది క్లైమాక్స్’ అంటూ నవ్వేశాడాయన. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇన్పుట్స్: టి. రమేశ్, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (కథనంలో వ్యక్తుల పేర్లు మార్చాం.) మారువేషంలో వెళ్లి... జనవిజ్ఞాన వేదిక మిత్రులు నిర్వహించిన దర్యాప్తులో... ఇలా మోసపోయిన వారి జాబితా పెద్దదిగానే తయారైంది. సందేహాన్ని నిర్ధారించుకోవడానికి మారువేషంలో అక్కడికి వెళ్లారు. తర్వాత మిగిలిన కార్యకర్తల చేత నిఘా పెట్టించారు. భక్తుల పేర్లు, వారి సమస్యలను ఎలా రాబడుతున్నాడో తెలిసిపోయింది. వారిలో కొంతమంది కలిసి పోలీస్ కంప్లయింట్ ఇవ్వడంతో స్వామీజీ అరెస్టయ్యాడు. -
భం.. భం.. బాబా!
-
మహా సంగమం
-
కారప్పొడితో స్వామీజీకి అభిషేకం
వేలూరు(తమిళనాడు): వేలూరు సత్‌వచ్చారిలోని గంగమ్మ ఆలయం సమీపంలో ఓ స్వామీజీ కారం కలిపిన నీటితో అభిషేకం చేసుకుని స్థానికులను ఆశ్చర్యపరిచారు. సత్వచ్చారి గంగమ్మ ఆలయ సమీపంలోని ఓ తోటలో నాలుగు నెలలుగా ఓ స్వామీజీ నివసిస్తున్నాడు. ఆయన పేరు, వివరాలు ఎవరికీ తెలీవు. ప్రత్యంగరా దేవిని పూజించే స్వామీజీకి తమిళం, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ భాషలు వచ్చు. మంగళవారం ఉదయం ప్రపంచ శాంతి కోసం ఆయన కారంపొడి నీటితో అభిషేకం చేసుకోబోతున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. విషయం తెలుసుకున్న భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామీజీ ముందుగా చేపట్టిన ప్రత్యంగరా దేవి ప్రత్యేక పూజలను తిలకించారు. అనంతరం స్వామీజీ ఒక పెద్దపాత్రలో కూర్చున్నారు. భక్తులు 31 కిలోల కారం పొడిని నీటిలో కలిపి వాటిని స్వామీజీపై పోసి అనంతరం నీటితో అభిషేకం చేశారు. -
వామ్మో! 31 కిలోల కారం నీటితో అభిషేకం!!
వేలూరు(తమిళనాడు): వేలూరు సత్‌వచ్చారిలోని గంగమ్మ ఆలయం సమీపంలో ఒక స్వామీజీ 31 కిలోల కారంపొడి కలిపిన నీటితో అభిషేకం చేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సత్వచ్చారి గంగమ్మ ఆలయం వద్దకు 4 నెలల క్రితం ఈ స్వామీజీ వచ్చారు. అక్కడికి సమీపంలోని ఒక తోటలో ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు. ఈ స్వామీజీ పేరు, ఊరు ఎవరికీ తెలియదు. ఈ స్వామీజీ తమిళం, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో మాట్లాడుతారు. ఈ స్వామీజీ ప్రత్యంగరా దేవిని ప్రతి రోజూ పూజిస్తుంటారు. మంగళవారం ఉదయం ప్రపంచ శాంతి కోసం ఆయన పూజించే ప్రత్యంగరా దేవికి ప్రత్యేక పూజలు చేశారు.తన ఇంట్లోనే కారంపొడి నీటితో అభిషేకం చేయించుకోబోతున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. విషయం తెలుసుకున్న భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని తొలుత స్వామీజీ చేపట్టిన ప్రత్యంగరా దేవి ప్రత్యేక పూజలను తిలకించారు. అనంతరం స్వామీజీ ఒక అండా(పెద్దపాత్ర)లో కూర్చున్నారు. భక్తులు 31 కిలోల కారం పొడిని నీటిలో కలిపి వాటిని స్వామీజీపై పోసి అభిషేకం చేశారు. అనంతరం నీటితో కూడా స్వామివారికి అభిషేకం చేశారు. ** -
బాబా బ్లాక్ షీప్