సాక్షి, విశాఖపట్నం: జ్ఞానానంద, రామానంద ఆశ్రమం (సాధు మఠం) ఆశ్రమం లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విశాఖ పొక్సో కోర్టులో పూర్ణానంద వేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది.
ఈ నెల మొదటి వారంలో జరిగిన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్లో ఇద్దరు బాధిత మైనర్ బాలికలూ పూర్ణానందను.. గుర్తు పట్టారు(మూడు సార్లు ). దీంతో.. బెయిల్ పిటిషన్‌ను పోక్సో కోర్టు డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది.
బెయిల్ కోసం పూర్ణానంద పోక్సో కోర్టును ఆశ్రయింగా.. ఈ కేసులో అన్ని ఆధారాలు పూర్ణానందకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ తరుణంలో బెయిల్ మంజూరు చేయడం ప్రమాదకరమని, పైగా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోక్సో స్పెషల్ పీపీ కరణం కృష్ణ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన పోక్సో కోర్టు.. పూర్ణానందకు బెయిల్ తిరస్కరించిది.
చైల్డ్ వేల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణానంద సరస్వతి స్వామీజీ 14 మంది మైనర్ బాలికలతో పశువుల నిర్వహణ పనులు చేయిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో భయంతో అశ్రమం నుంచి వెళ్లిపోతానని ఏడవటంతో ఓ బాలిక(13) కాళ్లకు గొలుసులు కట్టి పనులు చేయిస్తుండేవాడు. ఈనెల 12న స్నానానికి వెళ్లేందుకు గొలుసులు తీయడంతో అక్కడ పనిచేసే ఒక మహిళ సహకారంతో బాలిక బయటకు పారిపోయి ఆటోలో రైల్వేస్టేషన్ వెళ్లి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలులో ఓ కుటుంబం సాయంతో కంకిపాడు చేరుకుని.. ఆపై సీడబ్ల్యూసీ సహకారంతో విజయవాడ దిశ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పూర్ణానంద వ్యవహారం వెలుగు చూసింది.
Comments
Please login to add a commentAdd a comment