Physical harassment
-
లైంగిక వేధింపుల కేసులో పూర్ణానందకు షాక్
సాక్షి, విశాఖపట్నం: జ్ఞానానంద, రామానంద ఆశ్రమం (సాధు మఠం) ఆశ్రమం లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విశాఖ పొక్సో కోర్టులో పూర్ణానంద వేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ నెల మొదటి వారంలో జరిగిన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో ఇద్దరు బాధిత మైనర్ బాలికలూ పూర్ణానందను.. గుర్తు పట్టారు(మూడు సార్లు ). దీంతో.. బెయిల్ పిటిషన్‌ను పోక్సో కోర్టు డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. బెయిల్ కోసం పూర్ణానంద పోక్సో కోర్టును ఆశ్రయింగా.. ఈ కేసులో అన్ని ఆధారాలు పూర్ణానందకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ తరుణంలో బెయిల్ మంజూరు చేయడం ప్రమాదకరమని, పైగా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోక్సో స్పెషల్ పీపీ కరణం కృష్ణ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన పోక్సో కోర్టు.. పూర్ణానందకు బెయిల్ తిరస్కరించిది. చైల్డ్ వేల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణానంద సరస్వతి స్వామీజీ 14 మంది మైనర్ బాలికలతో పశువుల నిర్వహణ పనులు చేయిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో భయంతో అశ్రమం నుంచి వెళ్లిపోతానని ఏడవటంతో ఓ బాలిక(13) కాళ్లకు గొలుసులు కట్టి పనులు చేయిస్తుండేవాడు. ఈనెల 12న స్నానానికి వెళ్లేందుకు గొలుసులు తీయడంతో అక్కడ పనిచేసే ఒక మహిళ సహకారంతో బాలిక బయటకు పారిపోయి ఆటోలో రైల్వేస్టేషన్ వెళ్లి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. రైలులో ఓ కుటుంబం సాయంతో కంకిపాడు చేరుకుని.. ఆపై సీడబ్ల్యూసీ సహకారంతో విజయవాడ దిశ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పూర్ణానంద వ్యవహారం వెలుగు చూసింది. -
బ్రిజ్ భూషణ్‌పై సంచలన నిందారోపణలు
బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై సంచలన నిందారోపణలు వెలుగులోకి వచ్చాయి. మహిళా అథ్లెట్లను అసభ్యంగా తాకుతూ.. లైంగికంగా వేధించినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఒకవైపు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా.. ఆ ఎఫ్ఐఆర్ కాపీల్లో సారాంశం ఇప్పుడు బయటకు వచ్చింది. మొత్తం ఏడుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీ కన్నౌట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో కిందటి నెలలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. అందులో ఆరుగురి ఫిర్యాదుతో ఒక ఎఫ్ఐఆర్, మైనర్ తండ్రి ఫిర్యాదు మేరకు మరో ఎఫ్ఐఆర్ను పోలీసులు ఫైల్ చేశారు. ఏప్రిల్ 21వ తేదీన ఫిర్యాదులు అందగా.. వారం తర్వాత వాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. दरिया अब तेरी ख़ैर नहीं, बूँदो ने बग़ावत कर ली है नादां ना समझ रे बुज़दिल, लहरों ने बग़ावत कर ली है, हम परवाने हैं मौत समाँ, मरने का किसको ख़ौफ़ यहाँ रे तलवार तुझे झुकना होगा, गर्दन ने बग़ावत कर ली है॥ pic.twitter.com/a5AYDkjCBu — Vinesh Phogat (@Phogat_Vinesh) May 29, 2023 ఇక ఎఫ్ఐఆర్లో.. బ్రిజ్‌పై రెజ్లర్ల ఫిర్యాదు మేరకు సంచలన నిందారోపణలను పోలీసులు చేర్చారు. శ్వాస పరీక్ష పేరిట అభ్యంతరకరంగా తాకడంతో పాటు, వాళ్లను ఇష్టానుసారం పట్టుకోవడం, వ్యక్తిగత ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టడం, లైంగిక కోరికలు తీర్చమని ఒత్తిడి చేయడం, టోర్నమెంట్లలో గాయాలు అయినప్పుడు ఆ ఖర్చులు ఫెడరేషన్ భరిస్తుందని ఆశజూపి వాళ్లను లోబర్చుకునే ప్రయత్నం చేయడం, కోచ్‌గానీ.. డైటీషియన్గానీ ఆమోదించని ఆహారం అందించడం, అన్నింటికీ మించి మైనర్ వెంటపడడంతో పాటు ఆమెను లైంగికంగా తాకుతూ వేధించడం లాంటి నిందారోపణలను ఎఫ్ఐఆర్లో చేర్చారు. कभी सोचा नहीं था कुश्ती की रिंग में लड़ते लड़ते एक दिन इंसाफ़ के लिए ऐसे सड़कों पर भी लड़ना पड़ेगा…. देश की बेटियाँ बहुत मज़बूत हैं, जब विदेश में मेडल जीत सकती हैं तो अपने देश में इंसाफ़ की लड़ाई भी जीतके ही मानेंगी। #WrestlerProtest pic.twitter.com/eTHzERBUwb — Sakshee Malikkh (@SakshiMalik) May 28, 2023 ‘‘ఆరోజు(ఫలానా తేదీ..) నేను శిక్షణలో భాగంగా మ్యాట్ మీద పడుకుని ఉన్నాను. నిందితుడు(బ్రిజ్) నా దగ్గరకు వచ్చాడు. అతని ప్రవర్తన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ టైంలో నా కోచ్ అక్కడ లేరు. నా అనుమతి లేకుండా నా టీషర్ట్‌ను లాగేశాడు. నా ఛాతీపై చెయ్యి వేశాడు. ఆ చెయ్యిని అలాగే కడుపు మీదకు పోనిచ్చి.. నా శ్వాసను పరీక్షిస్తున్న వంకతో నన్ను వేధించాడు’’ అని అవార్డు సాధించిన ఓ రెజ్లర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగతా ఆరుగురి ఫిర్యాదులన్నీ దాదాపు పైతరహాలో ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ ఆరోపణలన్నింటినీ మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నాడు. ఆరోపణల్లో ఒక్కటి రుజువైనా.. తనను తాను ఉరి తీసుకుంటానని బుధవారం స్టేట్మెంట్ ఇచ్చాడాయన. అలాగే.. రెజ్లర్ల దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని కోర్టుకు సమర్పించాలని, నేరం రుజువైతే శిక్షను తాను అభవిస్తానని అంటున్నాడు. 🙏 pic.twitter.com/4LzKaVTYo4 — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) May 30, 2023 ఇదీ చదవండి: బీజేపీలో ఉన్నానంటే ఉన్నా.. అంతే! -
ప్రియుడి స్నేహితుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
సాక్షి, చెన్నై: భర్త, ఇద్దరు పిల్లలను వదిలి ప్రియుడితో పరారైన మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన కీలక మలుపు తిరిగింది. ప్రియుడి స్నేహితుడు లైంగిక వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. ఈ నెల 29వ తేదీ తిరువళ్లూరు జిల్లా పెద్దకుప్పం కంబర్ వీధిలోని ఓ ఇంట్లో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. మృతిపై తిరువళ్లూరు టౌన్ ఇన్స్పెక్టర్ పద్మశ్రీ బబ్బి విచారణ చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మృతి చెందిన మహిళ చోళవరం సమీపంలోని ఎరుమై వెట్టిపాళయం గ్రామానికి చెందిన బాబు భార్య అముదగా గుర్తించారు. బాబు పాఠశాల వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. వీరికి జయశ్రీ, కిషోర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రియుడితో పరార్ కొంత కాలం పాటు సజావుగా సాగిన బాబు కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అముద అదే ప్రాంతానికి చెందిన జ్యోతీశ్వరన్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనంతరం భర్త పిల్లలను వదిలి అతనితో పరారైంది. రెండేళ్లు ప్రియుడితో సహజీవనం చేసిన తరువాత పెద్దలు పంచాయతీ చేసి అముదను భర్త చెంతకు చేర్చారు. కొంత కాలం భర్తతోనే ఉన్న అముద మళ్లీ ప్రియుడితో పరారై అనుమానస్పద రీతిలో మృతి చెందింది. చదవండి: బైక్‌పై డ్రాప్ చేస్తామని తీసుకెళ్లి.. యువతిపై లైంగిక దాడి ప్రియుడి స్నేహితుడు వేధింపులు భరించలేక అముదతో సహజీవనం చేస్తున్న జ్యోతీశ్వరన్కు అంతకు ముందే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతరం మనస్సు మార్చుకుని భార్య పిల్లల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయంపై అముద జ్యోతిశ్వరన్తో వాగ్వాదానికి దిగింది. నిన్ను నమ్మి భర్త పిల్లలను వదిలి వచ్చానని, ఇప్పుడు తనను నడిరోడ్డుపై వదిలేస్తే ఎక్కడికి వెళ్లాలని నిలదీసింది. జ్యోతీశ్వరన్ అముదను తిరువళ్లూరులోని ఇంట్లో వదిలిపెట్టి భార్య పిల్లల వద్దకు వెళ్లిపోయాడు. వారం రోజులుగా ఒంటరిగా ఉంటున్న అముదను జ్యోతీశ్వరన్ స్నేహితుడు శివప్రకాష్ లైంగిక వేధింపులకు గురి చేసినట్లు గుర్తించారు. తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి పెంచడంతోనే ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆత్మహత్యకు కారణమైన జ్యోతీశ్వరన్, శివప్రకాష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!!
Bindeshwar Rai Foundation Teaches Taekwondo And Painting To Girls: మెండైన ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి? దాడికి పాల్పడిన వారిని మట్టికరిపించాలి. ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి? సమాజానికి కరదీపికగా ఉండాలి.ఆడపిల్లల్ని ఇలా తీర్చిదిద్దుతోంది పూనమ్ రాయ్. పూనమ్ రాయ్ అది 1997, ఫిబ్రవరి 2. పూనమ్ రాయ్ జీవితంలో మరచిపోలేని రోజు. మరిచిపోలేని రోజు అనడం కంటే మరపుకు రాని విషాదానికి గురి చేసిన రోజు అనడమే కరెక్ట్. ఆమె జీవితాన్ని అచేతనంగా మార్చి వేసిన దుర్దినం అది. అలాంటి అచేతన స్థితి నుంచి తనను తాను చైతన్యవంతం చేసుకుంది. అంతేకాదు... ఇప్పుడామె వేలాది మంది ఆడపిల్లల్ని చైతన్యవంతం చేసి ధీరవనితలుగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉంది. ఇప్పటికే మూడు వేల మందికి తైక్వాండోలో శిక్షణ ఇప్పించింది. ఈ మహిళా జాగృతోద్యమ కాగడా వెలుగుతూనే ఉండాలని, తన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు ఉంటుందని, తన తర్వాత ఈ జ్యోతిని అందుకునే మరో చెయ్యి తప్పకుండా వస్తుందని ఆత్మవిశ్వాసంతో చెబుతోందామె. ఆడపిల్ల తండ్రి బీహార్‌లోని వైశాలిలో పుట్టింది పూనమ్ రాయ్. తండ్రి పీడబ్యుడీలో ఇంజనీర్, తల్లి గృహిణి. ఇంట్లో ఏ విధమైన వివక్ష లేకుండా సోదరులిద్దరితో కలిసి పెరిగింది పూనమ్. బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి పెయింటింగ్ లో ఆనర్స్ చేసింది. తండ్రి ఉద్యోగరీత్యా వాళ్ల కుటుంబం వారణాసికి మారాల్సి వచ్చింది. ఆ వెంటనే ఆమెకు వారణాసికి చెందిన అబ్బాయితో పెళ్లయింది. బీహార్, యూపీల్లో ఆడపిల్లల తండ్రి అంటే వియ్యంకుల ఆధిపత్యానికి తలవంచాల్సిందే. నేటికీ పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు అన్నింటికీ తలవంచుతుంటారు. పూనమ్ పెళ్లి విషయంలోనూ అంతే జరిగింది. వరుడు మణిపాల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేశాడని చెప్పి పెళ్లి చేశారు. పెళ్లి సందర్భంగా భారీగా లాంఛనాలు పుచ్చుకున్నారు. పూనమ్‌కి తన భర్త ఇంటర్ కూడా పూర్తి చేయలేదనే ఓ చేదునిజం పెళ్లయిన రెండు వారాలకు తెలిసింది. పైగా ఆమెకు భర్త, అత్తమామల నుంచి సరైన ఆదరణ లభించలేదు. చదవండి: అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! మానసిక, భౌతిక వేధింపులు మొదలయ్యాయి. ఓ రోజు... 1997, ఫిబ్రవరి 2వ తేదీన పూనమ్ భర్త రకరకాలుగా దూషిస్తూ ఆమె మరణిస్తే మరో పెళ్లి చేసుకుంటానంటూ, ఆమెను బాల్కనీలో నుంచి కిందకు తోసేశాడు. ఆమెకు ఆ రోజు ఆ పడిపోవడం మాత్రమే తెలుసు. కోమా నుంచి తిరిగి స్పృహ వచ్చేటప్పటికి ఆరు నెలలు గడిచిపోయాయి. స్పృహ వచ్చిన తర్వాత తెలిసిన విషయం... తాను ఇక ఎప్పటికీ నడవలేదని. శరాఘాతం వంటి ఆ వాస్తవం ఆమెను కుంగదీసింది. అయితే... సోదరులు, తల్లిదండ్రుల ప్రేమ, క్రమం తప్పని ఫిజియోథెరపీతో ఆమె లేచి నిలబడడం, వాకర్ సహాయంతో నడవడం సాధ్యమైంది. పూనమ్‌లో ధైర్యం ప్రోది చేసుకోవడం మొదలైంది. ఇంతలో వాళ్ల నాన్నగారు కాలం చేశారు. ఆమె మానసికంగా కదలిపోయిందాక్షణంలో. ‘‘బాల్యంలో అందరినీ తండ్రి చేయి పట్టుకుని నడిపిస్తాడు. కానీ మా నాన్న నలభై ఏళ్ల వయసులో నన్ను రోజూ చేయి పట్టుకుని నడిపించాడు. కొండంత అండగా ఉన్న నాన్న పోయారు. నా గతంతోపాటు నాన్న జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. నన్ను మామూలు మనిషిని చేయడానికి ఆయన పడిన తపన నన్ను హెచ్చరించసాగింది. మా నాన్నలాగ ప్రతి ఆడపిల్లనూ కంటిపాపలా చూసుకునే తండ్రి ఉంటే సమాజం ఎంత అందంగా ఉంటుందో కదా అనిపించేది. ఆడపిల్ల తనకు ఎదురైన సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన నాకు చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో ఆడపిల్లలను చైతన్యవంతం చేయాలనుకున్నాను. స్వీయ రక్షణలో ప్రాథమిక శిక్షణ కూడా తీసుకున్నాను. నాన్న జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవడం కోసం ఆయన పేరుతో బిందేశ్వరీ రాయ్ ఫౌండేషన్‌ను స్థాపించాను. ‘వారణాసి తైక్వాండో అసోసియేషన్’తో కలిసి పని చేస్తున్నాను. ఇప్పటికీ ఆడపిల్లలకు చదువుకు ఖర్చు చేయడానికే ముందు వెనుకలు ఆలోచించే తల్లిదండ్రులున్న సమాజం మనది. వాళ్ల స్వీయరక్షణ కోసం ఫీజులు కట్టాలంటే ముందుకు రారు. అందుకోసం నేను ఉచితంగా తైక్వాండో శిక్షణ ఇప్పించే ఏర్పాటు చేశాను. మా దగ్గర శిక్షణ తీసుకున్న మూడు వేల మందిలో ఇరవై మందికి పైగా జాతీయస్థాయి టోర్నమెంట్లలో పాల్గొన్నారు. భయం పోయింది తైక్వాండో నేర్చుకున్న తర్వాత ఆడపిల్లల్లో వచ్చిన మార్పు చూసి చాలా సంతోషంగా ఉంది. స్కూలుకు, కాలేజ్‌కి వెళ్లే దారిలో ఆకతాయిలు ఏడిపిస్తే వీళ్లు మార్షల్ ఆర్ట్‌కు పని చెప్తున్నారు. దాంతో తైక్వాండో నేర్చుకున్న పిల్లలను ఒకమాట అనడానికి ఆకతాయిలు కూడా సందేహిస్తున్నారు. ఈ పరిణామంతో మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని పేరెంట్స్ కూడా ముందుకు వస్తున్నారు. వారంలో మూడు రోజులు తైక్వాండో, మరో మూడు రోజులు పెయింటింగ్ లో శిక్షణ ఇస్తున్నాం. మా పిల్లలు వేసిన ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఆయనకు బహూకరించాం. అలాగే బేటీ బచావో, బేటీ పఢావో అంశంతో తల్లి కడుపులో రూపుదిద్దుకున్నప్పటి నుంచి చివరి వరకు సాగే ఆడబిడ్డ జీవిత ప్రయాణాన్ని 648 బొమ్మలతో చిత్రిస్తున్నాం’’ అని చెప్పింది పూనమ్‌రాయ్. చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో.. -
కోవిడ్ వచ్చిందని పెళ్లయిన నాలుగు రోజులకే తరిమేశాడు..
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విశాల్ నెహ్రియా వేధిస్తున్నా డంటూ ఆయన భార్య ఓషిన్ శర్మ ఆరోపించారు. గురువారం అతడు మూడు పర్యాయాలు తనపై చేయిచేసుకున్నాడని పేర్కొన్నారు. విశాల్ నెహ్రియా తనను పలుమార్లు శారీరకంగా, మానసికంగా హింసించాడని ఆరోపిస్తూ ఓషిన్ శర్మ శనివారం పోస్టు చేసిన 11 నిమిషాల నిడివి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంగ్రా జిల్లా నగ్రోటా సురియన్ బ్లాక్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తున్న ఓషిన్ శర్మకు, ధర్మశాల ఎమ్మెల్యే విశాల్ నెహ్రియాతో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. తనకు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో పెళ్లయిన నాలుగు రోజులకే భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అందులో తెలిపారు. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్నట్లు చెప్పారు. నెహ్రియాతో తనకు కాలేజీ రోజుల నుంచే పరిచయముందనీ, అయితే, తనను కొడుతుండటంతో అప్పట్లోనే అతడితో తెగదెంపులు చేసుకున్నట్లు ఆ వీడియోలో ఆమె పేర్కొన్నారు. నెహ్రియా 2019లో ధర్మశాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక వివాహ ప్రస్తావన తేగా, అతడు మారి ఉంటాడని భావించినట్లు తెలిపారు. పెళ్లికి ముందు, ఫిబ్రవరిలో చండీగఢ్‌లోని ఓ హోటల్లో అతడు తనను దారుణంగా కొట్టాడని, అత్తింటి వారు బతిమాలడంతో పెళ్లికి అంగీకరించి నట్లు చెప్పారు. కాగా, అత్తింటి వారు కూడా అదనంగా కట్నం తేవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలపై విశాల్ నెహ్రియా స్పందించలేదు. -
ప్రాంక్ వీడియోలంటూ.. లైంగిక వేధింపులు
ముంబై: కరోనా వైరస్ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నకిలీ వార్తలు, ప్రాంక్ వీడియోలు వ్యాపింపచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనల సంఖ్య పెరుగుతోంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలపై లైంగికంగా వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ముఖేశ్ గుప్తా 2008లో పదో తరగతి టాపర్. అతను విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రాంక్ వీడియోలు చేస్తున్నానని చెప్పి.. మైనర్ బాలికల శరీరాలను తాకుతూ, అసభ్యకమైన కామెంట్లు చేస్తూ వీడియోలు తీశాడు. ఆ ప్రాంక్ వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. సుమారు 17 యూట్యూబ్ చానెళ్లు, ఫేస్బుక్ అకౌంట్లలో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలను అప్లోడ్ చేసి సూమారు రూ. 2 కోట్లు సంపాదించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాంక్ వీడియో తీస్తున్న సమయంలో తమతో అసభ్యంగా మాట్లాడుతూ, లైంగికంగా వేధించాడని కొంతమంది యవతులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా నిందితుడు ముఖేశ్ అప్లోడ్ చేసిన ప్రాంక్ వీడియోలను తొలగించాలని యూట్యూబ్‌ను కోరినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ భరంబారే తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ కారుతో బీభత్సం.. -
‘న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా’
పంజగుట్ట: పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయిన భర్తను వెంటనే నగరానికి రప్పించి తనకు న్యాయం చేయాలని ఓ యువతి కోరింది. లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన బాధితురాలు సంగెపు ప్రశాంతి సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఓ మ్యాట్రీమొని ద్వారా యూకేలో ఉద్యోగం చేస్తున్న శ్రవణ్‌తో పరిచయం ఏర్పడి ఒకరినొకరు ఇష్టపడ్డామని చెప్పింది. అయితే, శ్రవణ్ తమ తల్లిదండ్రులకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి, యూకె నుంచి నగరానికి వచ్చి గతేడాది ఆగస్టు 8న వరంగల్ జిల్లాలోని ఎర్రగట్టు ఆలయంలో పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. అనంతరం ఎల్బీ నగర్‌లోని శ్రవణ్ ఇంటికి వెళ్లగా రెండు రోజులు బాగానే చూసుకున్నారని, తర్వాత తనను మానసిక, శారీరక వేధింపులకు గురి చేశారని తెలిపింది. ఆ తర్వాత తనను పుట్టింటికి పంపించి, శ్రవణ్‌కు తనపై లేనిపోనివి చెప్పి యూకెకు పంపేశారని ప్రశాంతి పేర్కొంది. అనంతరం తాను అత్తగారింటికి, శ్రవణ్‌కు ఫోన్ చేస్తే స్పందించలేదని, ఇంటికి వెళ్తే తిట్టి పంపేశారని, భర్త శ్రవణ్ కూడా ఫోన్ చేసి దిక్కున్న చోట చెప్పుకోమని తిట్టాడని తెలిపింది. తాను వరంగల్ మట్టెవాడ పోలీసులను, వరంగల్ పోలీసులను కలిసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తాను పోలీసులపై తీవ్ర ఒత్తిడితేగా 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, కాని ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని బాధితురాలు పేర్కొంది. వెంటనే తన భర్తను తన వద్దకు రప్పించాలని, తనను వేధించిన వారిని శిక్షించాలని కోరింది. తనకు న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.