
సాక్షి, బెంగళూరు (కలబురీ): కర్ణాటకలో ఒక స్వామీజీకి 82 ఏళ్ల వయసులో పుత్రభాగ్యం కలిగింది. హైదరాబాద్– కర్ణాటక ప్రాంతం భక్తుల ఆరాధ్యదైవమైన కలబుర్గీలోని మహాదాసోహి శరణ బసవేశ్వర సంస్థాన పీఠాధిపతి శరణ బసప్ప అప్ప 82 ఏళ్లలో తండ్రయ్యారు. 48 ఏళ్ల రెండో భార్యకు రెండు రోజుల కిందట ముంబైలో మగపిల్లాడు జన్మించాడు.
ఇకపై ఈ శిశువునే మఠానికి ఉత్తరాధికారిగా పరిగణిస్తారు. విషయం తెలిసిన వెంటనే మఠానికి చెందిన భక్తులు సంబరాలు చేసుకున్నారు. కాగా, శరణ బసప్ప అప్పకు ఇప్పటికే ఎనిమిది మంది కూతుర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment