
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): చిత్రదుర్గ మురుఘ రాజేంద్ర బృహమఠం డాక్టర్ శివమూర్తి మురుఘా గురువారం బెంగళూరులోని పునీత్ రాజ్‌కుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ మరణానంతరం ఆయనకు బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించారు. ప్రశస్తిని స్వీకరించటానికి రావాలని పునీత్ భార్య అశ్వినిని ఆహ్వానించారు.
అభిమానుల అన్నదానం
మైసూరు: హీరో పునీత్ రాజ్‌కుమార్ పుణ్య స్మరణగా టి.నరసిపుర తాలూకా బసవనహళ్ళిలో అభిమానులు, గ్రామస్తులు భారీఎత్తున అన్నదానం నిర్వహించారు. సుమారు 2 వేల మందికి మాంసాహారంతో కూడిన భోజనం వడ్డించారు. మంచే గౌడ అనే అభిమాని గుండు చేయించుకుని నివాళులు అర్పించారు.
చదవండి: ఇతని పేరు చెబితే రాజకీయనేతలు, ప్రముఖ వ్యక్తులు హడలిపోతారు.