
Kannada Star Hero Darshan And Bad Experience At Puneeth Rajkumar Namana Samsmaran Sabha: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు కన్నడ సినీ పరిశ్రమ తరపున ‘పునీత్ నామన’ పేరుతో ఘనంగా సంస్మరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. నవంబర్ 16న బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో భారీగా ఈ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో పాటు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కర్ణాటక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కన్నడ సినీ పరిశ్రమకు సినీ ప్రముఖలు, నటీనటులతో పాటు తమిళ నటుడు శరత్ కుమార్, హీరో విశాల్‌తో తదితరులు హాజరయ్యారు.
చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా
అలాగే టాలీవుడ్ నుంచి హీరో మంచు మనోజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వారంత పునీత్‌కు నివాళులు అర్పించి, ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతరం అయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు రావడంతో అక్కడ బందోబస్తు కూడా భారీగానే పెట్టారు. అయితే ఈ సభ ప్రాంగణం వెలుపల ఓ కన్నడ స్టార్ హీరోకి చేదు అనుభవం ఎదురైంది. శాండల్‌వుడ్ అంతా అభిమానంగా డి బాస్ అని పిలుకునే స్టార్ హీరో దర్శన్‌ను లోపలికి వెళ్లకుండా అక్కడి పోలీసులు అడ్డగించినట్లు సమాచారం.
చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్
టాప్ స్టార్ హీరోలలో దర్శన్ కూడా ఒకరు. పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభకు దర్శన్ కొంచెం ఆలస్యంగా రావడంతో ఆయనను గేటు దగ్గర పోలీసులు ఆపినట్లు సమాచారం. ఆడిటోరియం ఫుల్ అయిపోవడంతో.. కూర్చోడానికి సీట్లు కూడా లేవని చెప్పి దర్శన్‌ను బయటే ఆపేపేశారట. తను లోపలికి వెళ్లి వెంటనే బయటికి వచ్చేస్తాని దర్శన్ చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదట. ఆ సమయంలో హీరో దర్శన్‌తో పాటు కొంతమంది ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారట. చాలా సేపు పోలీసులతో మాట్లాడిన అనంతరం ఉన్నతాధికారులు వచ్చి దర్శన్‌ను లోపలికి అనుమతించారట.
చదవండి: మెగాస్టార్ రిక్వెస్ట్.. సినీ పరిశ్రమలోని వారికి 50 శాతం డిస్కౌంట్
కానీ లోపలికి వెళ్లినా కూర్చోవడానికి సీట్లు లేక సెకండ్ క్లాస్‌లో కాసేపు కూర్చున్నాడు. ఇక కార్యక్రమంలో దర్శన్ స్టేజ్‌పై మాట్లాడుతూ పునీత్ హఠ్మారణం తలచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో కొద్దిసేపు మాత్రమే దర్శన్ మాట్లాడి స్టేజ్‌పై నుంచి వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పునీత్ బదులుగా దేవుడు తనని తీసుకేళ్లినా బాగుండంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక విశాల్ సైతం పునీత్ చదివిస్తున్న 1800 పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని, ఇది తనకు అప్పగించాల్సిందిగా పునీత్ కుటుంబ సభ్యులను విజ్ఞప్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment