
Sarathkumar Emotional Words About puneeth Rajkkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. పునీత్ మరణంతో కన్నడ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా మంగళవారం బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో పునీత్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సభలో పాల్గొన్నతమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్..పునీత్‌ను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. 'పునీత్ బదులు నేను చనిపోయినా బాగుండేది. ఇదే వేదికపై రాజకుమార మూవీ 100రోజుల వేడుక జరిగింది. ఇప్పుడు పునీత్ శ్రద్ధాంజలి ఇక్కడే జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నా.. కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చింది' అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
కాగా 2017లో రాజకుమార సినిమాలో పునీత్‌కు తండ్రిగా నటించారు శరత్‌కుమార్. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మళ్లీ ఇప్పుడు పునీత్ చివరి సినిమా జేమ్స్‌లో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని తీవ్ర భావేద్వాగానికి లోనయ్యారు.