Memorial House
-
గౌతంరెడ్డి లేరన్న విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: సీఎం జగన్
-
మనసుకి కష్టంగా ఉంది: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు: గౌతమ్ మన మధ్య లేడనే విషయం నమ్మడానికి మనసుకి కష్టంగా ఉందని, ఎంత చెప్పినా ఆయన లేని లోటు తీరనిదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ హాలులో సోమవారం జరిగిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం జగన్.. గౌతమ్ చిత్రపటానికి నివాళి అర్పించి అనంతరం ప్రసంగించారు. గౌతమ్‌రెడ్డి లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం అని, ప్రతీ అడుగులో గౌతం తనకు తోడుగా ఉండేవాడని సీఎం జగన్ అన్నారు. రాజమోహన్ గారికంటే గౌతమ్ ఆత్మీయత తనకు ఎక్కువగా అనిపించేదని, తన ప్రోత్సాహంతోనే గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో తనకు తోడుగా, స్నేహితుడిగా ఉండేవారన్నారు. వయసులో పెద్దవాడైనా.. ఆ గర్వం కనిపించేది కాదని, పైగా సోదర భావంతో మెలిగేవాడని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర పెట్టుబడుల కోసం ఎంతో తాపత్రయపడ్డాడని, చివరి క్షణం వరకూ రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డారని చెప్పారు. ఆ కుటుంబానికి తానే కాదు.. వైఎస్సార్సీపీ మొత్తం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు సీఎం జగన్. -
పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవం
Kannada Star Hero Darshan And Bad Experience At Puneeth Rajkumar Namana Samsmaran Sabha: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు కన్నడ సినీ పరిశ్రమ తరపున ‘పునీత్ నామన’ పేరుతో ఘనంగా సంస్మరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. నవంబర్ 16న బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో భారీగా ఈ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో పాటు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కర్ణాటక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కన్నడ సినీ పరిశ్రమకు సినీ ప్రముఖలు, నటీనటులతో పాటు తమిళ నటుడు శరత్ కుమార్, హీరో విశాల్‌తో తదితరులు హాజరయ్యారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా అలాగే టాలీవుడ్ నుంచి హీరో మంచు మనోజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వారంత పునీత్‌కు నివాళులు అర్పించి, ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతరం అయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు రావడంతో అక్కడ బందోబస్తు కూడా భారీగానే పెట్టారు. అయితే ఈ సభ ప్రాంగణం వెలుపల ఓ కన్నడ స్టార్ హీరోకి చేదు అనుభవం ఎదురైంది. శాండల్‌వుడ్ అంతా అభిమానంగా డి బాస్ అని పిలుకునే స్టార్ హీరో దర్శన్‌ను లోపలికి వెళ్లకుండా అక్కడి పోలీసులు అడ్డగించినట్లు సమాచారం. చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్ టాప్ స్టార్ హీరోలలో దర్శన్ కూడా ఒకరు. పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభకు దర్శన్ కొంచెం ఆలస్యంగా రావడంతో ఆయనను గేటు దగ్గర పోలీసులు ఆపినట్లు సమాచారం. ఆడిటోరియం ఫుల్ అయిపోవడంతో.. కూర్చోడానికి సీట్లు కూడా లేవని చెప్పి దర్శన్‌ను బయటే ఆపేపేశారట. తను లోపలికి వెళ్లి వెంటనే బయటికి వచ్చేస్తాని దర్శన్ చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదట. ఆ సమయంలో హీరో దర్శన్‌తో పాటు కొంతమంది ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారట. చాలా సేపు పోలీసులతో మాట్లాడిన అనంతరం ఉన్నతాధికారులు వచ్చి దర్శన్‌ను లోపలికి అనుమతించారట. చదవండి: మెగాస్టార్ రిక్వెస్ట్.. సినీ పరిశ్రమలోని వారికి 50 శాతం డిస్కౌంట్ కానీ లోపలికి వెళ్లినా కూర్చోవడానికి సీట్లు లేక సెకండ్ క్లాస్‌లో కాసేపు కూర్చున్నాడు. ఇక కార్యక్రమంలో దర్శన్ స్టేజ్‌పై మాట్లాడుతూ పునీత్ హఠ్మారణం తలచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో కొద్దిసేపు మాత్రమే దర్శన్ మాట్లాడి స్టేజ్‌పై నుంచి వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పునీత్ బదులుగా దేవుడు తనని తీసుకేళ్లినా బాగుండంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక విశాల్ సైతం పునీత్ చదివిస్తున్న 1800 పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని, ఇది తనకు అప్పగించాల్సిందిగా పునీత్ కుటుంబ సభ్యులను విజ్ఞప్తి చేశాడు. -
Puneeth Rajkumar: తీవ్ర భావోద్వేగానికి లోనైన నటుడు శరత్‌కుమార్
Sarathkumar Emotional Words About puneeth Rajkkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. పునీత్ మరణంతో కన్నడ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా మంగళవారం బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో పునీత్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్నతమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్..పునీత్‌ను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. 'పునీత్ బదులు నేను చనిపోయినా బాగుండేది. ఇదే వేదికపై రాజకుమార మూవీ 100రోజుల వేడుక జరిగింది. ఇప్పుడు పునీత్ శ్రద్ధాంజలి ఇక్కడే జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నా.. కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చింది' అంటూ కన్నీరు పెట్టుకున్నారు. కాగా 2017లో రాజకుమార సినిమాలో పునీత్‌కు తండ్రిగా నటించారు శరత్‌కుమార్. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మళ్లీ ఇప్పుడు పునీత్ చివరి సినిమా జేమ్స్లో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని తీవ్ర భావేద్వాగానికి లోనయ్యారు. -
బొజ్జా తారకం.. సామాజిక విప్లవకారుడు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: బొజ్జా తారకం గొప్ప సామాజిక విప్లవకారుడని, ఆయన కులాన్ని, వర్గాన్ని సమాన దృష్టితో చూశాడని ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బొజ్జా తారకం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జయధీర్ తిరుమల రావు మాట్లాడుతూ మానవ, పౌర హక్కులను రెండు కళ్లుగా చూసిన పోరాట యోధుడని కొనియాడారు. పివోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ బొజ్జా తారకం చుండూరు, కారంచేడు సంఘటనలను చాలెంజ్‌గా తీసుకొని బాధితుల తరఫున పోరాడారన్నారు. చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ కారంచేడు, నీరుడుకొండ, చుండూరు, వేంపెంట, లక్షి్మపేట బాధితులకు న్యాయం జరగడమంటే దోషులకు శిక్షలు పడటమేనని చాటారన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు జైన్ మల్లయ్య గుప్త మాట్లాడుతూ తారకం ఆశయ సాధన కోసం పని చేసినప్పడే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఈ సందర్భంగా బొజ్జా తారకం రాసిన పీడిత ప్రజల గొంతుక, వివేక్ రచించిన ఈతరం మార్గదర్శి, సృతి నవల, వివేకా కవితా సంపుటి పుస్తకాలను ఆవిష్కరించారు.