Newly Married Couple Pays Tributes To Puneeth Rajkumar At Mysore: కొత్త దంపతులు పెళ్లి మండపంలోనే పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు శ్రద్ధాంజలి ఘటించి అభిమానాన్ని చాటుకున్నారు. మైసూరు సిద్ధార్థ నగరలోని కనక భవనంలో ఆదివారం మను కిరణ్, లావణ్య అనే నూతన జంట వివాహం జరిగింది. మూడుముళ్ల సంబరమయ్యాక అక్కడే పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలు వేసి నివాళి అర్పించారు. అతిథులు నూతన జంటని ఆశీర్వదించడంతో పాటు పునీత్‌కు శ్రద్దాంజలి ఘటించారు. అందరిలోనూ పెళ్లి సంతోషం కంటే పునీత్ దూరమయ్యాడన్న బాధ వ్యక్తమైంది.చదవండి: నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా?
పునీత్ అభిమాని ఆత్మహత్య
మైసూరు: పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని తట్టుకోలేక ఒక అభిమాని కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం మైసూరు జిల్లాలోని కేఆర్ నగర పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుడైన అశోక్ (40) పునీత్ లేడన్న నిజాన్ని భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
చదవండి: పునీత్ మరణం: లైవ్‌లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్
అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు
Comments
Please login to add a commentAdd a comment