పూజ చేసి జలావాసంలో నిమగ్నులైన స్వామీజీ
రాయచూరు రూరల్: దేశ సుభిక్షం, రైతుల సంక్షోభ నివారణ, లోక కళ్యాణార్థం ఓ స్వామీజీ 12 రోజుల క్రితం జలావాసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాలూకాలోని మలియాబాద్ రామలింగేశ్వరాలయం కొండ గుహలో తాలూకాలోని ఉడుంగల్, ఖానాపుర, మంగళవారపేట మఠాధిపతి బాల శివయోగి వీర సంగమేశ్వర శివాచార్య మహాస్వామీజీ 48 రోజుల పాటు నిరాహారంతో మౌనంగా జలావాసంతో నిత్య తపస్సులో నిమగ్నులయ్యారు.
జలావాసం నిర్వహణ పూర్తి బాధ్యతలను సోమవారపేట హిరేమఠం మఠాధిపతి అభినవ రాచోటి వీర శివాచార్యులు, రాఘవేంద్ర, అయ్యప్పలు సహకరిస్తున్నారు. కాగా స్వామీజీ జలావాసం తిలకించడానికి కలబుర్గి, రాయచూరు, బళ్లారి జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment