
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటికి హఠాత్తుగా ఓ స్వామీజీ ప్రవేశించి ఆశీస్సులు అందించి వెళ్లారు. ఆ స్వామీజీ పేరు నమోనారాయణస్వామి. రాజకీయ పార్టీ లేదన్న ప్రకటన తర్వాత రజనీ పోయెస్‌గార్డెన్‌లోని ఇంటికే పరిమితం అయ్యారు. అపోలో వైద్యుల సూచన మేరకు ఆయన పూర్తిగా విశ్రాంతిలో ఉన్నారు. ఆయన్ను కలిసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఈ పరిస్థితుల్లో శనివారం నమో నారాయణస్వామి రజనీ ఇంటికి వెళ్లారు. ఆయన్ను రజనీకాంత్, లతారజనీకాంత్ ఆహ్వానించారు. రజనీ,స్వామీజీ అరగంటకు పైగా మాట్లాడుకున్నారు. రజనీకి స్వామిజీ ఆశీస్సులు అందించి వెళ్లారు. ఇంటి నుంచి బయటకు వచ్చి స్వామీజీకి వీడ్కోలు పలికారు. రజనీని పరామర్శించేందుకు ఎవరికీ అనుమతి లేదని మక్కల్ మండ్రం వర్గాలు పేర్కొన్నాయి. స్వామీజీ వచ్చి వెళ్లడం, ఇందుకు తగ్గ ఫొటోలు బయటకు రావడం గమనార్హం.
(చదవండి: అమెరికాకు తలైవా?)
Comments
Please login to add a commentAdd a comment