గాండ్లపెంట : కోటూరులోని చింతమాను గంగమ్మ ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగినట్లు గ్రామస్తులు మాజీ ఎంపీటీసీ శ్రీరాములు, మాజీ సర్పంచ్ జయప్ప, క్రిష్ణ, నరసింహులు తదితరులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుండీలోని వెండి గొడుగులు, రెండు ముక్కుపుడకలు, మైకుసెట్ యాంప్లిఫైర్ తదితర వస్తువులు చోరీకి గురయ్యాయని, వీటి విలువ సుమారు రూ.50వేలు ఉంటుందని తెలిపారు.