రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగమ్మ ఆలయంలో చోరీ జరిగింది. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం అనంతపురం గ్రామంలోని గంగమ్మ దేవాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. కొంతమంది దుండగులు ఆలయ ద్వారం పగలగొట్టి లోనికి ప్రవేశించి హుండీని దోచుకున్నారు.
ఉదయం దేవాలయానికి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ ఈవోకు సమాచారం అందించారు. ఈవో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఆలయంలోని హుండీ ఆదాయాన్ని రెండు నెలలుగా లెక్కించలేదని, కానుకలు భారీగానే ఉండవచ్చని ఈవో తెలిపారు.
అనంతపురం గంగమ్మ ఆలయంలో చోరీ
Published Wed, May 20 2015 8:30 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM
Advertisement
Advertisement