రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్ | QR Code Scam To Loot Devotees In Ram Mandir Name | Sakshi
Sakshi News home page

రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్.. వీహెచ్‌పీ అలర్ట్

Published Sun, Dec 31 2023 4:34 PM | Last Updated on Sun, Dec 31 2023 4:47 PM

QR Code Scam To Loot Devotees In Ram Mandir Name - Sakshi

లక్నో: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం పేరిట దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. మందిర నిర్మాణానికి భక్తుల నుంచి విరాళాలు వసూలు చేస్తున్నామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో నకిలీ క్యూఆర్ కోడ్‌లు వెలుగులోకి వచ్చాయి. వీటిని గుర్తించిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఈ కుంభకోణానికి గురికావద్దని ప్రజలను కోరింది.  

 శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్య పేరిట ఓ సోషల్ మీడియా పేజ్‌ను దుండగులు క్రియేట్ చేశారు. ఇందులో పోస్టు చేసిన క్యూఆర్ కోడ్‌తో రామ మందిర నిర్మాణం పేరుతో నిధులను అందించమని వినియోగదారులను కోరుతున్నట్లు  గుర్తించామని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. ప్రజలు ఈ మోసానికి గురికావద్దని కోరారు. 

"మీకు చేతనైనంత విరాళం ఇవ్వండి. డైరీలో మీ పేరు, నంబర్ నమోదు చేయబడుతుంది. ఆలయం పూర్తయిన తర్వాత, మీ అందరినీ అయోధ్యకు ఆహ్వానిస్తారు. నేను ఉన్నాను. అయోధ్యలోనే ఉన్నాను." అని రామాలయం పేరుతో విరాళాలు కోరిన వ్యక్తి కోరాడు. దీనిపై స్పందించిన వీహెచ్‌పీ.. ఇలాంటి మోసాల్లో బాధితులు కావద్దని ప్రజలకు తెలిపారు. 

ఇదీ చదవండి: Ayodhya Airport: అయోధ్య విమానాశ్రయం విశేషాలివే
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement