ram mandir issue
-
రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్
లక్నో: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం పేరిట దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. మందిర నిర్మాణానికి భక్తుల నుంచి విరాళాలు వసూలు చేస్తున్నామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో నకిలీ క్యూఆర్ కోడ్లు వెలుగులోకి వచ్చాయి. వీటిని గుర్తించిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఈ కుంభకోణానికి గురికావద్దని ప్రజలను కోరింది. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్య పేరిట ఓ సోషల్ మీడియా పేజ్‌ను దుండగులు క్రియేట్ చేశారు. ఇందులో పోస్టు చేసిన క్యూఆర్ కోడ్‌తో రామ మందిర నిర్మాణం పేరుతో నిధులను అందించమని వినియోగదారులను కోరుతున్నట్లు గుర్తించామని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. ప్రజలు ఈ మోసానికి గురికావద్దని కోరారు. "మీకు చేతనైనంత విరాళం ఇవ్వండి. డైరీలో మీ పేరు, నంబర్ నమోదు చేయబడుతుంది. ఆలయం పూర్తయిన తర్వాత, మీ అందరినీ అయోధ్యకు ఆహ్వానిస్తారు. నేను ఉన్నాను. అయోధ్యలోనే ఉన్నాను." అని రామాలయం పేరుతో విరాళాలు కోరిన వ్యక్తి కోరాడు. దీనిపై స్పందించిన వీహెచ్‌పీ.. ఇలాంటి మోసాల్లో బాధితులు కావద్దని ప్రజలకు తెలిపారు. ఇదీ చదవండి: Ayodhya Airport: అయోధ్య విమానాశ్రయం విశేషాలివే -
రామమందిరంపై అమిత్ షా బిగ్ అనౌన్స్మెంట్
పాకూర్: అయోధ్యలో రామమందిరం అంశంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. నాలుగు నెలల్లో అయోధ్యలో రామమందిరం కడతామని ఆయన వెల్లడించారు. సోమవారం జార్ఖండ్ పాకూర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రదేశంలో రామమందిర నిర్మాణానికి వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు గత నెల 9న సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ‘సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక, నాలుగు నెలల్లో ఆకాశాన్ని తాకే రామమందిరాన్ని అయోధ్యలో నిర్మిస్తాం’ అని షా పేర్కొన్నారు. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద భూవివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. రివ్యూ పిటిషన్లకు సరైన ప్రాతిపదిక లేదని, రివ్యూ పిటిషన్లన్నింటినీ పరిశీలించిన తర్వాత వీటిని కొట్టివేయాలని నిర్ణయం తీసుకున్నామని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. -
ఆర్ఎస్ఎస్ అధినేతతో అమిత్ చర్చలు
అహ్మదాబాద్: రామ మందిర నిర్మాణం విషయమై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తదితరులతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా భేటీ అయ్యారు. రాజస్తాన్ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని ఆర్ష విద్యామందిర్‌లో రెండు రోజులపాటు జరిగిన హిందూ ఆచార్య సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్‌తోపాటు సాధువులు పాల్గొన్నారు. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఆలయం నిర్మించే విషయంలో వేర్వేరు పరిష్కారాలను ఈ సమావేశంలో చర్చించినట్లు పాల్గొన్న నాయకులు తెలిపారు. ప్రధాని మోదీ పదవీ కాలం ముగిసేలోగా అంటే, మే 2019కు ముందుగానే రామాలయ నిర్మాణం చేపట్టాలనే మెజారిటీ అభిప్రాయం ఈ సభలో వ్యక్తమయిందని సమాచారం. అయోధ్యలో మందిరం నిర్మించటం ఖాయమని ఈ సందర్భంగా అమిత్‌షా వారికి హామీ ఇచ్చారు. జనవరిలో సుప్రీంకోర్టులో అయోధ్య అంశం విచారణకు రానున్న విషయాన్ని కూడా వారితో అమిత్‌షా చర్చించారు. వచ్చే రెండు లేక మూడు నెలల్లో బీజేపీ ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు జోథ్‌పూర్‌కు చెందిన ఆచార్య సత్‌గిరి మహారాజ్ తెలిపారు. ఆలయ నిర్మాణ స్థలాన్ని పొందే విషయంలో అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి విలేకరులకు తెలిపారు. అయితే, సుప్రీంకోర్టులో విచారణ ఎప్పుడు ప్రారంభమయ్యేదీ తెలియదన్నారు. రామాలయం విషయంలో హిందూ సంస్థలతో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్న ఎన్డీఏలోని కీలక భాగస్వామ్య పార్టీ బీజేపీ ఆలయం కోసం చట్టంపై ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు. -
ఆలయం కాదు, ప్రశాంత జీవితం కావాలి!
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య ఓ ఆధ్యాత్మిక నగరం. అయితే అది ఒక్క హిందువులకే కాదు బౌద్ధులు, జైనులు, సిక్కులు, ముస్లింలు, పలు రకాల ఫకీర్లకు కూడా. ఒక్క క్రైస్తవులకు మినహా అన్ని మతాల వారికి ఈ ఆధ్యాత్మిక నగరంలో ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఏ మతం వారు వారి వారి ప్రార్థనా మందిరాలకు వెళతారు. దర్గాలకు మాత్రం ముస్లింలతోపాటు హిందువులూ వెళతారు. నగరంలో రెండు ప్రముఖ సిక్కుల గురుద్వారాలు, పలు జైన మందిరాలు, అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. అవద్ నవాబులకు అధికారిక చిహ్నమైన మత్స్యానికి కూడా మందిరాలు ఉన్నాయి. నౌగాజియా పీర్తోపాటు చిన్న చిన్న దర్గాలు ఉన్నాయి. ఆర్చా రాజు నిర్మించిన 19వ శతాబ్దం నాటి రామాలయంతోపాటు హనుమాన్ గఢీ కూడా ఉంది. రామాలయం కన్నా హనుమాన్ గఢీకే భక్తుల తాకిడి ఎక్కువ. అప్పుడప్పుడు వీచే సుడి గాలులు తప్పా ఎప్పుడూ ప్రశాంత వాతావరణం కనిపించే అయోధ్యలో 26 ఏళ్ల క్రితం అలజడి రేగింది. 1992, డిసెంబర్ 6వ తేదీన బీజేపీ నాయకుల ప్రసంగాల మధ్య హిందూ కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు. పర్యవసానంగా దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో రెండువేలకు మందికిపైగా అమాయకులు మరణించిన విషయం తెల్సిందే. అప్పటివరకు దేశ, విదేశీ పర్యాటకులతో కిటకిటలాడిన అయోధ్య నగరంలో కొన్నేళ్లపాటు శ్మశాన నిశబ్దం నెలకొంది. పౌరజీవనం స్తంభించిపోయింది. చిన్నా, చితక వ్యాపారులు పొట్ట పట్టుకొని పరాయి ప్రాంతానికి తరలిపోయారు. ప్రస్తుతం అయోధ్యలో ఉన్న మొత్తం జనాభా 55 వేలు. ‘రామ మందిరం అంశం నా వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అది రాజకీయ నాయకులకు లాభం చేకూర్చింది తప్ప, నాతోపాటు అయోధ్య వాసులెవరికీ ఎలాంటి లాభం చేకూర్చలేక పోయింది. ఆ రోజున బాబ్రీ మసీదు కూల్చివేతకు కుట్ర పన్నిన వాడిలో నేను ఒకడినే కాకుండా జనాన్ని రెచ్చగొట్టిన వారిలో కూడా నేను ఉన్నాను’ అని అయోధ్యలో 1980 దశకం నుంచి నగల వ్యాపారం చేస్తున్న మాజీ శివసేన కార్యకర్త బగేలు ప్రసాద్ సోని తెలిపారు. తన వ్యాపారం దెబ్బతినగానే తాను శివసేనకు రాజీనామా చేశానని ఆయన చెప్పారు. చాలాకాలం తర్వాత అయోధ్యకు పర్యాటకులు రావడం ప్రారంభమైందని, అయితే 1992కు ముందున్నంతగా లేదని అయోధ్యలో అతిపెద్ద వ్యాపారవేత్తయిన అంజనీ గార్గ్ తెలిపారు. అతి పెద్ద రామాలయం వచ్చాక మళ్లీ వ్యాపారం పుంజుకుంటుందని తనతోపాటు స్థానిక వ్యాపారులు ఆశించారని ఆయన చెప్పారు. ఇప్పటికైనా మందిరాన్ని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించగా ఇరువర్గాల సమ్మతితో శాంతియుతంగా నిర్మిస్తే అభ్యంతరం లేదని అన్నారు. బీజేపీ నాలుగున్నర ఏళ్లపాటు అధికారంలో ఉన్నా రామాలయాన్ని నిర్మించలేకపోయిందని, రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్లీ మందిరం మాటెత్తుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం అయోధ్యలో ముస్లింలు, హిందువులు కలిసికట్టుగా జీవిస్తున్నారని, మళ్లీ మందిరం అంశాన్ని లేవనెత్తి వారి మధ్య చిచ్చు పెట్టరాదని ప్రియాంక యాదవ్ అనే స్కూలు టీచరు వ్యాఖ్యానించారు. మధ్య తరగతి, శ్రామిక, కార్మిక వర్గాలు ఘర్షణలు జరుగుతాయన్న భయంతో రామాలయాన్ని కోరుకోవడం లేదు. వారిలో చాలా మంది ఈ విషయమై మీడియాతో మాట్లాడేందుకు కూడా నిరాకరించారు. వ్యాపారం మరింత పుంజుకుంటుందన్న ఆశతో వ్యాపారులు అతి పెద్ద రామ మందిరాన్ని నిర్మించాలని కోరుకుంటున్నారు. అది కూడా శాంతియుతంగా జరగాలని అంటున్నారు. బాబ్రీ కూల్చివేత వార్షిక దినం సందర్భంగా అయోధ్య నగరమంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా పెద్దగా వీధుల్లో తిరగడం లేదు. -
‘మందిర్‌పై బీజేపీకి పేటెంట్ లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : రామ మందిరంపై బీజేపీకి పేటెంట్ లేదని కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత ఉమా భారతి అన్నారు. అయోథ్యలో ఆలయ నిర్మాణం కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అయోథ్య సందర్శించి మందిర నిర్మాణం కోసం పట్టుబట్టడాన్ని ఆమె సమర్ధించారు. ఉద్ధవ్ థాకరే ప్రయత్నాలను తాను సమర్ధిస్తానని, రాముడు అందరివాడనీ, అయోథ్యలో మందిర నిర్మాణం కోసం ఎస్పీ, బీఎస్పీ, అకలీదళ్ సహా అసదుద్దీన్ ఓవైసీ, ఆజం ఖాన్‌తో పాటు ప్రతిఒక్కరూ బాసటగా నిలవాలని కోరారు. కాగా,ఈ వారాంతంలో అయోథ్యను సందర్శించిన ఉద్దవ్ థాకరే రామాలయ నిర్మాణం తక్షణమే చేపట్టాలని ఆదివారం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలతో చెలగాటం వద్దని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌కు హితవు పలికారు. మరోవైపు మందిర నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్డినెన్స్ తీసుకురావాలని సంఘ్ పరివార్ నేతలు మోదీ సర్కార్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. -
మందిర్ ఎన్నికల అంశం కాదన్న మహా సీఎం
సాక్షి, ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని, అయితే ఇది తమ పార్టీ ఎన్నికల అంశం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. రామమందిర నిర్మాణాన్ని బీజేపీ ఎన్నడూ స్వార్ధరాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టలేదన్నారు. మందిర నిర్మాణంపై ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ఆయన గతంలోనూ ఇలా కోరారని, రానున్న ఎన్నికలతో దీనికి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో చట్టం చేయడం లేదా కోర్టు తీర్పు వంటి రెండు మార్గాల ద్వారానే మందిర నిర్మాణం చేపట్టవచ్చన్నారు. సోమనాథ్ దేవాలయం విషయంలో ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిన విషయాన్ని ఫడ్నవీస్ ప్రస్తావించారు. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా చట్టం తీసుకురావడానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడం సమస్యగా ఆయన చెప్పుకొచ్చారు. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదన్న సంగతి గుర్తెరగాలన్నారు. మందిర నిర్మాణంపై సుప్రీం కోర్టు సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసం తమకుందన్నారు. -
‘రామ మందిర నిర్మాణానికి ఇదే సరైన సమయం’
ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్ : మరో నాలుగు నెలల్లోపు రామమందిరం నిర్మాణం చేపట్టకపోతే దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు విశ్వ హిందూ పరిశత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తోగాడియా. రామ మందిర నిర్మాణం, గో రక్షణ వంటి అంశాల కోసం పని చేయడానికి బుధవారం ఫైజాబాద్‌లో ‘అంతరాష్ట్రీయ హిందు పరిషత్’ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరతామని బీజేపీ ప్రజలకు హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాట మార్చి రామ మందిర నిర్మాణ అంశాన్ని సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందంటున్నారు. ఇలా మాటా మార్చడం పార్టీకే మంచిది కాదని తోగాడియా హెచ్చరించారు. ‘అక్టోబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలి. అలా చేయని పక్షంలో దేశంలోని హిందువులందరూ రోడ్లపైకి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తార’ని హెచ్చరించారు తోగాడియా. అంతేకాక ‘ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మసీదులను సందర్శించడానికి తీరిక ఉంటుంది. కానీ అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని దర్శించడానికి మాత్రం తీరిక లేదు. మోదీ ఇలా మసీదులను సందర్శిస్తూ హిందువుల మనో భావాలను దెబ్బతీస్తున్నార’ని తొగడియా విమర్శించారు. ‘ఎందుకు మోదీ రామ మందిరం నిర్మాణం విషయంలో నిర్ణయం తీసుకోలేక పోతున్నారని’ ప్రశ్నించారు. ‘నేను బీజేపీకి ఒక్కటే చెప్పదల్చుకున్నాను. రామ మందిర నిర్మాణానికి ఇదే సరైన సమయం. దేశంలో ఉన్న కోట్లాది హిందువుల మనోభావాలను మనం గౌరవించాలి. రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తే అది నిజంగా మన పార్టీకి చాలా గొప్ప విజయం అవుతుంది అన్నారు తోగాడియా. అయితే తోగాడియా వ్యాఖ్యల గురించి మాజీ బీజేపీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు వినయ్ కటియార్ ‘రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వీహెచ్‌పీకి ధన్యవాదాలు. రామ మందిర నిర్మాణం గురించి సుప్రీంకోర్టు 2019 నాటికి తన నిర్ణయాన్ని తెలపకపోతే అప్పుడు మోదీనే మందిర నిర్మాణానికి సంబంధించి పార్లమెంటులో చట్టం చేస్తార’ని తెలిపారు. -
రామ్ మందిర్‌ను కూల్చింది వాళ్లు కాదు
- పాల్గర్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు ముంబాయి: అయోధ్యలోని రామ్ మందిర్‌ను ధ్వంసం చేసింది భారత దేశంలో ఉన్న ముస్లింలు కాదని రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. అయోధ్య వివాదం కేసు మళ్లీ కోర్టులో విచారణకు వచ్చిన సమయంలో భగవత్ ఈ విధంగా అయోమయ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఉన్న ముస్లింలు ఈ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేయరని అన్నారు. భారతీయులను విడగొట్టేందుకే ఈ విధమైన దాడులకు విదేశీయులు పాల్పడ్డారని చెప్పారు. పాల్గర్ జిల్లాకు పక్కనే ఉన్న దహానులో జరిగిన విరాట్ హిందూ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామమందిర్‌ను నిర్మించడం భారత జాతి కర్తవ్యమని పేర్కొన్నారు. అలాగే అయోధ్యలో ధ్వంసమైన రామమందిర్‌ను తిరిగి అదే స్థానంలో పునర్మించే బాధ్యత మనపై ఉందని అన్నారు. దాని కోసం ఎంత పోరాటానికైనా సిద్ధమన్నారు. రామ మందిరాన్ని పునర్మించకపోతే, మన సంస్కృతి సంప్రదాయాల మూలాలు తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. రామ మందిర్‌ను యథాస్థానంలో పునర్మిస్తామని ఘంటాపథంగా చెప్పారు. ఈ రోజు మనం స్వతంత్రులమని, ధ్వంసమైన రామ మందిరాన్ని పునర్మించుకునే హక్కు మనకు ఉందని అన్నారు. ఇవి కేవలం దేవాలయాలు మాత్రమే కాదని, మన ఐడెంటిటీకి గుర్తులని చెప్పారు. దశాబ్దాలకు పైగా నడుస్తున్న రామ జన్మభూమి-బాబ్రి మసీదు వివాదం కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వేసిన 13 అప్పీళ్లు ప్రస్తుతం సుప్రీంలో విచారణకు వచ్చాయి. అలాగే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న కుల ప్రాతిపదిక హింసకు ప్రతిపక్షాలను బాధ్యులను చేస్తూ విమర్శలు సంధించారు. గత ఎన్నికల్లో ఓడిపోయి ఖాళీగా కూర్చున్నవారే ఈవిధమైన కుల హింసకు, కుల ఘర్షణలకు ప్రేరేపిస్తున్నారని మోహన్ భగవత్ విమర్శించారు. -
రవిశంకర్‌పై విరుచుకుపడ్డ ఒవైసీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌పై ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రామ మందిర నిర్మాణం జరగకపోతే భారత్ మరో సిరియా అవుతుందని రవిశంకర్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రవిశంకర్ పై కేసు నమోదు చేయాలని ఒవైసీ డిమాండ్ చేస్తున్నారు. ‘రాజ్యాంగంపై ఆయనకు(రవిశంకర్‌ను ఉద్దేశించి) గౌరవం లేదు. అలాంటప్పుడు చట్టాన్ని ఎలా నమ్ముతారు. ఆయనకు ఆయనే చట్టంగా ఫీలయిపోతున్నారు. ఆయన చెప్పిందే అందరూ వినాలని కోరుకుంటున్నారు. ఆయన మధ్యవర్తిలా అనిపించటం లేదు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లకు పురిగొల్పాలని చూస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ ఎందుకు స్పందించటం లేదు. వారికి భయమేస్తే చెప్పండి రవిశంకర్‌పై నేనే ఫిర్యాదు చేస్తా. ’ అంటూ మండిపడ్డారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే వివాదాస్పద స్థల వివాదంలో తీర్పు ఇవ్వాల్సిందిగా ఒవైసీ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. నా మాటలు వక్రీకరించారు : రవిశంకర్ బరేలీ : రామ మందిర నిర్మాణం చేపట్టకపోతే భారత్ మరో సిరియాగా మారుతుందంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తగా ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ‘నేను ఇచ్చింది హెచ్చరిక కాదు. ముందస్తుగా జాగ్రత్త సూచన మాత్రమే చేశాను’ అని ఆయన తెలిపారు. పరిష్కారం చూపకపోతే భారత్ లో అలాంటి పరిస్థితులు కనిపిస్తాయన్న కోణంలోనే తాను అలా మాట్లాడానని, ఆ మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. -
సుప్రీం వద్దన్నా మందిర్ తథ్యం
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అయోధ్య అంశం మళ్లీ తెరపైకి తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. రామమందిర నిర్మాణంపై బీజేపీ దూకుడు కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం చేపడతామని ఆ పార్టీ నేత తపన్ భౌమిక్ అన్నారు. వివాదాస్పద స్థలంలోనే రామాలయ నిర్మాణం జరిగేలా పార్టీ ఎంపీలు పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేలా చొరవ చూపాలన్నారు. సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా మందిరం నిర్మించేలా చూస్తామన్నారు. దేశంలోని కోట్లాది హిందువులు రామాలయ నిర్మాణం జరిగేలా చూస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. -
‘అయోధ్య’పై వక్ఫ్, అఖాడా ఏకాభిప్రాయం
అలహాబాద్: అయోధ్యలో రామ మందిరం వివాదంపై అఖిల భారతీయ అఖాడా పరిషత్, యూపీ షియా వక్ఫ్‌బోర్డు మధ్య ఓ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేయగానే, ఆ వివరాలను సుప్రీంకోర్టుకు తెలపనున్నారు. ‘అయోధ్య లేదా ఫైజాబాద్‌లో మసీదు నిర్మించకూడదనే ఏకాభిప్రాయానికి వచ్చాం. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఏదేనీ ఇతర ప్రాంతంలో మసీదు నిర్మాణానికి మేం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం’ అని షియా వక్ఫ్‌బోర్డు చీఫ్ వసీం రిజ్వీ చెప్పారు. -
వచ్చే దీపావళికి రామ మందిరం పూర్తి!
సాక్షి, న్యూఢిల్లీ : రామ జన్మభూమి.. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరం కట్టి తీరతామని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ప్రకటించారు. త్వరలో ఆటంకాలన్నీ తొలగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన... వచ్చే దీపావళి నాటికి గుడి నిర్మాణం పూర్తి చేసి తీరతామని చెబుతున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘సుప్రీంలో ప్రస్తుతం రివ్యూ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. అది పూర్తవ్వగానే రామ మందిర నిర్మాణ పనులు మొదలుపెడతాం. వచ్చే ఆగష్టు నుంచి పనులు మొదలుపెట్టి 3-4 నాలుగు నెలల్లో పూర్తి చేసి దీపావళి నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాం’ అని అన్నారు. కాగా, డిసెంబర్ 5న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో ఇరు వర్గాలు తుది వాదనలు వినిపించనున్నారు. ఆ మరుసటిరోజు అంటే డిసెంబర్ 6 నాటికి బాబ్రీ కూల్చివేత ఘటన జరిగి సరిగ్గా 26 ఏళ్లు పూర్తవుతుండటం విశేషం. స్వామి వాదన ఏంటంటే... ఆ కాలంలో మొగలు చక్రవర్తి బాబర్ స్వాధీనంలో ఉండటంతో ఆ స్థలం తమకు చెందించే అని ముస్లిం నేతలు వాదిస్తున్నారు. కానీ, అలహాబాద్ హైకోర్టు దానిని తోసిపుచ్చింది. అదే సమయంలో నేను లేవనెత్తిన అంశంపై కూడా వారి నుంచి సమాధానం రావటం లేదు. అది స్థిరాస్థి హక్కు అని వారు(ముస్లిం సంఘాలు) అంటున్నారు. కాబట్టి అదొక సాధారణ హక్కు అవుతుంది. కానీ, రామ జన్మభూమిపై హిందువులకు ప్రాథమిక హక్కు ఉందని న్యాయస్థానం గత తీర్పులో స్పష్టం చేసింది. ఆ లెక్కన్న వారు గెలిచే అవకాశాలు లేనే లేవన్నది స్పష్టమవుతోంది అని స్వామి చెబుతున్నారు మరోవైపు ఆలయ నిర్మాణానికి తమకేం అభ్యంతరం లేదని.. కాకపోతే వివాదాస్పద స్థలానికి సహేతుక దూరంలో మసీదు నిర్మించాలంటూ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఓ ప్రతిపాదనను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
రామమందిరం కేసులో స్వామికి చుక్కెదురు
-
రామమందిరం కేసులో స్వామికి చుక్కెదురు
అయోధ్యలో రామమందిరం నిర్మాణం విషయంలో సీనియర్ న్యాయవాది, బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది. అసలు ఈ కేసులో సుబ్రమణ్యం స్వామి ఒక పార్టీ అన్న విషయమే తమకు తెలియదని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాక.. అసలు ఈ కేసు దాఖలు చేయడానికి మీకున్న అర్హత (లోకస్ స్టాండీ) ఏంటని కూడా సుబ్రమణ్యం స్వామిని ప్రశ్నించింది. రామమందిరం కేసులో మీ పిటిషన్‌ను ఇప్పటికిప్పుడు విచారించేందుకు తమకు సమయం లేదని తేల్చిచెప్పింది. దాంతో రామమందిరం వివాదం గురించి కోర్టులో తన వాదనలను వినిపించేందుకు స్వామికి అవకాశం ప్రస్తుతానికి లేనట్లే. -
మళ్లీ తెరపైకి రామ్ మందిర్ పాలిటిక్స్