
రామమందిరం కేసులో స్వామికి చుక్కెదురు
అయోధ్యలో రామమందిరం నిర్మాణం విషయంలో సీనియర్ న్యాయవాది, బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది. అసలు ఈ కేసులో సుబ్రమణ్యం స్వామి ఒక పార్టీ అన్న విషయమే తమకు తెలియదని కోర్టు వ్యాఖ్యానించింది.
అంతేకాక.. అసలు ఈ కేసు దాఖలు చేయడానికి మీకున్న అర్హత (లోకస్ స్టాండీ) ఏంటని కూడా సుబ్రమణ్యం స్వామిని ప్రశ్నించింది. రామమందిరం కేసులో మీ పిటిషన్‌ను ఇప్పటికిప్పుడు విచారించేందుకు తమకు సమయం లేదని తేల్చిచెప్పింది. దాంతో రామమందిరం వివాదం గురించి కోర్టులో తన వాదనలను వినిపించేందుకు స్వామికి అవకాశం ప్రస్తుతానికి లేనట్లే.