
తిరుపతి : చల్లంగా చూడు గంగమ్మ తల్లీ... అంటూ భక్తజనం శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించి ప్రణమిల్లి వేడుకున్నారు.

తిరుపతి గంగ జాతర తర్వాత ఐదు మంగళవారాలు గంగమ్మకు భక్తులు మరుపొంగళ్లు మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ

ఇందులో భాగంగా గంగ జాతర తర్వాత వచ్చిన నాలుగో మంగళవారం కావడంతో అమ్మవారికి పొంగళ్లు సమరి్పంచి మొక్కులు తీర్చుకున్నారు.

గంగమ్మ ఆలయంలో వేకువజాము నుంచే భక్తుల సందడి మొదలైంది

పొంగళ్లు నైవేద్యంగా అమ్మవారికి సమరి్పంచి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు

అమ్మవారి మూలవిరాట్టు విగ్రహానికి అభిషేకం చేశారు





అనంతరం నెమలి పింఛంతో సర్వాంగ సుందర అలంకరణలో గంగమ్మ తల్లిని కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కలిపించారు

మేయర్ డాక్టర్ శిరీష గంగమ్మ తల్లిని దర్శించుకుని పూజలు నిర్వహించారు









