gangamma jatara
-
కనుమరుగవుతున్న గంగమ్మ జాతర పుష్పాతో మళ్లీ తెరపైకి
-
మాతంగి ఫైరింగ్.. పూనకాలు లోడింగ్
తిరుపతి కల్చరల్: పుష్ప–2 సినిమా రాయలసీమను ఊపేస్తోంది. అల్లు అర్జున్ మాతంగి గెటప్‌లో నటవిశ్వరూపాన్ని చూసిన వారంతా పూనకాలతో ఊగిపోతున్నారు. సినిమా మొత్తానికి హైలైట్ ఎపిసోడ్ తిరుపతి గంగమ్మ జాతరే. ఈ సన్నివేశంలో చీరకట్టి అమ్మవారి గెటప్‌లో కనిపించిన అల్లు అర్జున్‌ని చూసిన వారంతా నిజంగా అమ్మవారు పూనిందా అనిపించేంతలా నటించాడని ఫిదా అవుతున్నారు. మాతంగి వేషధారణలో అల్లు అర్జున్ ఫైట్ సీన్లు, పాటతో కలిపి 10 నుంచి 15 నిమిషాల పాటు కనిపించాడు. సినిమా రిలీజ్‌కు ముందే ఈ వేషధారణ అభిమానులను ఆకట్టుకుంది. సినిమా రిలీజ్‌తో ఈ సీన్లు మరింతగా ఆకట్టుకుంటున్నాయి. మళ్లీ క్లైమాక్స్‌లో అమ్మవారి వేషధారణ అబ్బురపరిచింది. ఈ సన్నివేశాలను చూసిన వారంతా తిరుపతి గంగమ్మను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మాతంగి వేషంలో భక్తుడు (ఫైల్ ఫొటో) జాతరలో లేడీ గెటప్ ఎందుకంటే.. తిరుపతి గంగమ్మ జాతరలో లేడీ గెటప్ ఎందుకు వేస్తారు? మగవాళ్లంతా చీరలెందుకు కట్టుకుంటారు? ఆడవాళ్లంతా మగరాయుడు అయిపోతారెందుకు? చిన్నారులు మీసకట్టు పెడతారు.. మరికొందరు అమ్మోరుగా.. రాక్షసులుగా అనేక గెటప్స్ ఈ జాతరలో కనిపిస్తాయి. ఇలాంటి వేషధారణలు గంగమ్మకు ఇష్టమట. అందుకే ఈ వేషధారణతో అమ్మను దర్శించుకుంటే చల్లని చూపు ప్రసరిస్తుందని, ఆమె కరుణా కటాక్షాలు లభిస్తాయని తిరుపతి గంగమ్మ భక్తుల విశ్వాసం.గంగమ్మ జాతర ఏటా మే నెలలో జరుగుతుంది. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా తిరుపతి వచ్చేస్తారు. వారం రోజులు వైభవంగా జరిగే జాతరలో వివిధ వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు. దీని వెనుక శతాబ్దాల నేపథ్యం ఉంది. రాయలసీమలో పాలెగాళ్ల రాజ్యం రోజుల్లో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరిగేవి. ఆ కామాంధుల బారినుంచి తప్పించుకోలేక మహిళలు చాలాకష్టాలు పడ్డారు. తిరుపతి సమీపంలోని అవిలాలలో కైకా వంశంలో పుట్టిన ఆడబిడ్డను దత్తత తీసుకున్న తిరుపతికి చెందిన వ్యక్తి ఆమెకు గంగమ్మ అని పేరు పెట్టాడు. తనపై కన్నేసిన పాలెగాడిని ఉగ్రరూపంతో సంహరించేందుకు గంగమ్మ వెంటాడగా.. భయపడి దాక్కున్న ఆ పాలెగాడిని బయటకు రప్పించేందుకు ఆమె వివిధ వేషధారణలతో తిరిగింది. బైరాగి, మాతంగి, చివరకు దొర వేషంలో వచ్చిన గంగమ్మను పోల్చుకోలేక పాలెగాడు బయటకు రాగా.. మాతంగి వేషధారణలో వచ్చిన గంగమ్మ అతడిని సంహరించి.. ఆ పాలెగాడి భార్యకు ధైర్యం చెబుతుంది. అప్పటి నుంచి గంగమ్మను శక్తి స్వరూపంగా భావించి ఏటా జాతర చేయడం ఆనవాయితీ. శ్రీవారి సోదరిగా.. తిరుపతిలో కొలువుతీరిన ఏడుగురు అక్కా చెల్లెళ్లలో గంగమ్మ ఒకరు. ఈమెను వేంకటేశ్వరస్వామి సోదరిగా భావించి పూజలు చేస్తారు. అందుకే టీటీడీ తరఫున గంగమ్మకు పట్టువ్రస్తాలు సమరి్పస్తారు. గంగమ్మ తల్లి తిరుపతి తొలి గ్రామదేవత. శ్రీవారి భక్తుడైన తాతయ్య గంగమ్మ తల్లి తాతయ్యగుంట వద్ద నెలకొలి్పన ఆలయానికి అత్యంత ప్రాచీన, చారిత్రక, విశిష్టత ఉంది. -
తిరుపతి : గంగమ్మకు మరుపొంగళ్లతో భక్తుల మొక్కులు (ఫొటోలు)
-
తిరుపతి : గంగమ్మకు మరు పొంగళ్లు సమర్పించిన భక్తులు (ఫొటోలు)
-
Gangamma Jatara Photos: విశ్వరూపంతో ముగిసిన తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
తిరుపతిలో వైభవంగా గంగమ్మ జాతర (ఫోటోలు)
-
Tataiahgunta Gangamma Jatara: వైభవంగా తాతయ్యగుంట గంగమ్మజాతర (ఫొటోలు)
-
వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
-
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన రోజా
-
వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..
-
గంగమ్మ జాతర : అమ్మా.. గంగమ్మ తల్లీ.. చల్లంగా చూడు (ఫొటోలు)
-
వైభవంగా గంగమ్మ జాతర..
-
ఘనంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
తిరుపతి గంగమ్మ జాతర తొలి రోజు బైరాగి వేషంతో భక్తుల సందడి (ఫొటోలు)
-
తిరుపతి : తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)
-
Allu Arjun Jatara Look Secret: పుష్పరాజ్ భీకర రూపం రహస్యం ఇదేనా?
పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పీక్కు చేరింది. ఈ మూవీకి జాతీయ ఉత్తమ అవార్డు గెలుచు కుని మరో మెట్టు ఎక్కాడు అల్లు అర్జున్. దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప 2: ది రూల్' పై అంచనాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే పుష్ప 2 సినిమా టీజర్లో అల్లు అర్జున్ నీలి రంగు చీర, నగలు, నిమ్మకాయ దండలతో వెరైటీ లుక్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీంతో అభిమాన హీరో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. 2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ ..ఈ మూవీలో లేడీ గెటప్‌తో కనిపించి అలరించాడు. తాజాగా పుష్ప-2 సినిమాలో కూడా అమ్మవారి భీకర రూపంతో ఫ్యాన్స్‌ని మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఎర్రచందనం, తిరుపతి జిల్లాలో కథ సాగుతుంది కనుక ఇది గంగమ్మ జాతర నేపథ్యమే ఈ లుక్అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటీ గంగమ్మ జాతర తెలుసుకుందాం రండి. తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలని భావిస్తారు. వారం రోజుల పాటు జరిగే గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గంగమ్మ జాతర విశిష్టత పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించి వేధించేవాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కోవడంతో అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసి, పాలెగాడిని అంత మొందించిందని భక్తుల విశ్వాసం. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేసుకుంటారు. ఈ జాతరలో తొలి రోజున బైరాగివేషం ,రెండోరోజు బండవేషం,మూడోరోజు తోటివేషం,నాలుగోరోజు దొరవేషం వేసుకుంటారు. నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి వేషం ధరిస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను (వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాళ్ళ వేషం వేస్తారు.మగవారు ఆడవేషం వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. పేరంటాలు వేషంలోఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్నితయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచిమట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. బన్నీ న్యూ లుక్ రహస్యం వీడాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు పుష్ప 2: ది రూల్ టీజర్‌కి రెస్పాన్స్ ఒక రేంజ్లో ఉంది. బన్నీ మాతంగి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘‘మరో బ్లాక్‌బస్టర్..బన్నీకి మరో జాతీయ అవార్డు పక్కా" అని కమెంట్ చేశారు. -
తుఫాన్ భయం సముద్రపు నీటితో గంగమ్మ జాతర
-
తిరుపతి : ఘనంగా తాతయ్య గుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
-
తిరుపతి గంగజాతర అమ్మవారి విశ్వరూప దర్శనం (ఫొటోలు)
-
తిరుపతి : ఘనంగా గంగమ్మ జాతర మహోత్సవాలు (ఫొటోలు)
-
తిరుపతి గంగమ్మను దర్శించుకున్న మంత్రి అంబటి రాంబాబు
-
తాత్యాగుంట గంగమ్మ జాతర వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర
-
గంగమ్మ జాతర: ‘పుష్ప-2’ అల్లు అర్జున్ గెటప్‌లో ఎంపీ గురుమూర్తి (ఫోటోలు)
-
Gangamma Jaatara: వేషధారణతో గంగమ్మను దర్శించుకున్న భక్తులు..(ఫొటోలు)