
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా ఐదో రోజు ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ఉత్సవాల్లో భాగంగా కై కాల కులస్తులు మాతంగి వేషం ధరించి నగరంలో భక్తుల ఇంట పూజలు అందుకున్నారు.

మాతంగి అమ్మవారిని భక్తులు తమ ఇంటికి ఆహ్వానించి పూజలు చేసి హారతులు సమర్పించారు.

జాతర మొక్కుబడిలో భాగంగా వందలాది మంది వివిధ వేషధారణలతో నగరంలో సందడి చేశారు. గంగమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారి పాదాల చెంత ప్రణమిల్లి మొక్కులు చెల్లించుకున్నారు.

పెద్దసంఖ్యలో మహిళలు పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో గంగమ్మ ఆలయం కిక్కిరిసింది.






























































