
తిరుపతి :‘గంగమ్మా.. చల్లంగా చూడమ్మా’ అంటూ భక్తులు ప్రణమిల్లారు. వేషాలు వేసి, జంతుబలులిచ్చి, నైవేద్యాలు సమర్పించి, అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

స్థానిక తాతయ్యగుంట గంగమ్మకు మరు పొంగళ్లు పెట్టి ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి తేలారు

గంగజాతర తర్వాత వచ్చిన తొలి మంగళవారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి పోటెత్తారు.

జాతరలో వేషాల మొక్కులు చెల్లించని భక్తులు గంగవేషాలు ధరించి ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారి పాదాల వద్ద ప్రణమిల్లి మొక్కులు చెల్లించారు.

















