లారీ, ఆటో ఢీ..పది మందికి గాయాలు | 10 injured in road accident,chittoor district | Sakshi
Sakshi News home page

లారీ, ఆటో ఢీ..పది మందికి గాయాలు

Published Fri, May 8 2015 10:34 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

10 injured in road accident,chittoor district

చిత్తూరు : చిత్తూరు జిల్లా సత్యవేడులో గంగమ్మ జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులంతా వరదయ్యపాలెం గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement