గుంట గంగమ్మకు సారె సమర్పించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి | Chevireddy Bhaskar Reddy Presented Saare Goddess Thathaya Gunta Gangamma | Sakshi
Sakshi News home page

గుంట గంగమ్మకు సారె సమర్పించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

Published Sun, May 15 2022 1:12 PM | Last Updated on Sun, May 15 2022 3:02 PM

Chevireddy Bhaskar Reddy Presented Saare Goddess Thathaya Gunta Gangamma - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, లక్ష్మీ దంపతులు సారె సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి, అమ్మవారి ఆలయానికి విచ్చేసిన చెవిరెడ్డి దంపతులకు పాలక మండలి చైర్మన్ కట్టా గోపీ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఆయన సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర జరగడం చాలా సంతోషకరమని, గంగమ్మ తల్లి అమ్మవారి కృప అందరికీ కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెవిరెడ్డి చెప్పారు.
తిరుపతి: బసవన్నకు ‘వీక్లీ ఆఫ్‌’.. ఎక్కడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement