సాక్షి, తిరుపతి జిల్లా: యలమంద ఘటన బాలిక తండ్రి మీడియా ముందుకు వచ్చారు. తాను ఎవరి మీద కేసు పెట్టలేదని స్పష్టం చేశారు. తమ కుమార్తెపై దాడి జరిగిందని మేమే స్వయంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పిలిచామని.. ఆయనపై కేసు పెట్టాలని పోలీసులకు తాను చెప్పలేదంటూ బాధితురాలి తండ్రి స్పష్టం చేశారు. నా బిడ్డకు సాయం చేయడానికి వచ్చినవారిపై ఎలా కేసు పెడతాను.? చిన్నారిపై దాడి చేసిన వారికి శిక్ష పడాలి కోరాను. నేను చదువుకోలేదు.. పోలీసులు చెప్పిన చోట సంతకం మాత్రమే చేశా’ అని బాలిక తండ్రి తెలిపారు. మా బిడ్డపై అన్యాయం జరిగిందని సహాయం చేయడానికి వచ్చిన వారిపై నేను ఎలా కేసు పెడుతానంటూ బాలిక తండ్రి ప్రశ్నించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు: భూమన
రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో యలమంద ఘటన నిదర్శనం. ప్రతి పక్ష పార్టీ నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తుల్ని, వ్యవస్థల్ని భయబ్రాంతులకు గురి చేసే యత్నం చేస్తున్నారు బాధిత కుటుంబానికి రక్షణగా వెళ్లిన వారిని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనేది స్పష్టమైంది. బాధిత కుటుంబం పిలిస్తే వెళ్లిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు
టీడీపీ అనుకూల కిరణ్ పత్రికలో లైంగికదాడి జరిగిందని ప్రచురించారు, వారి మీద ఎందుకు కేసు పెట్టలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై పోక్సో, అట్రాసిటీ మరో 11 కేసులు పెట్టారు. సీఎం చంద్రబాబు తప్పు చేసిన వారిని విడిచి పెట్టి.. తప్పు చేయని వారిని శిక్షిస్తున్నారు. ఈ ఒక్క ఘటనతో రాష్ట్రానికి ఏ సందేశం ఇవ్వదలచుకున్నారు’’ అంటూ చంద్రబాబును భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు.
ఇదీ చదవండి: పరామర్శకు వెళితే.. చెవిరెడ్డిపై పోక్సో కేసు
Comments
Please login to add a commentAdd a comment