Goddess
-
ఎవరీ రాయంచ... పాలనురుగు అందంతో మెరిసిపోతోంది! (ఫోటోలు)
-
30 ఏళ్లకు తెరుచుకున్న ఉమా భగవతి ఆలయం
జమ్ముకశ్మీర్‌లోని ఉమా భగవతి దేవి ఆలయాన్ని 30 ఏళ్ల తరువాత తెరిచారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో ఆలయాన్ని తెరవడంతో పాటు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో గల షాంగస్ ప్రాంతంలో ఈ పురాతన ఆలయం ఉంది.మూడు దశాబ్దాల తర్వాత ఆలయంలోకి భక్తులు ప్రవేశించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన ఉమా దేవి విగ్రహాన్ని వేదమంత్రాల నడుమ గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఆలయ పునరుద్ధరణపై స్థానిక కశ్మీరీ పండిట్లు, ముస్లింలు సంతోషం వ్యక్తం చేశారు. స్థానికుడు గుల్జార్ అహ్మద్ మాట్లాడుతూ ‘మా పండిట్ సోదరులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. ఇన్నాళ్ల తర్వాత ఆలయంలో పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు.కశ్మీరీ పండిట్లు తెలిపిన వివరాల ప్రకారం 1990లో ఈ ఆలయం ధ్వంసమైంది. దీని వెనుక పలు కారణాలున్నాయి. 1990లలో ఉగ్రవాదులు అలజడి కారణంగా కశ్మీరీ పండిట్లు ఈ ప్రాంతం నుండి పారిపోయారు. 2019 తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదుల అలజడులు తగ్గాయి. ఈ నేపధ్యంలో గతంలో తీత్వాల్ వద్దనున్న మాతా శారదా ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు. యూటీ అడ్మినిస్ట్రేషన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద శ్రీనగర్‌లోని పలు దేవాలయాలతో సహా మతపరమైన ప్రదేశాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. -
సలార్ కాటేరమ్మ కథ తెలుసా?
ఒక బల్లెంతో వెనుకనుంచి వచ్చే శత్రువుల్ని పొడిచి.. ముందున్న వాళ్లను కత్తులతో చీల్చేసి.. ఇంతలో ‘‘కాటేరమ్మ రాలేదు కానీ, బదులుగా కొడుకుని పంపింది అమ్మ’’ అని డైలాగ్పడగానే.. అపరకాళిలా అవతారం కటౌట్లో ప్రభాస్ అబ్బో రోమాంఛితమైన ఆ సలార్ సీన్.. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. విజిల్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇంతకీ ఈ కాటేరమ్మ కథ గురించి తెలుసా? ద్రవిడ సంస్కృతి నుంచి ఉద్భవించి హిందూ ఆరాధన దైవంగా మారింది శ్రీ కాటేరీ దేవత. నమ్ముకున్నవాళ్లకు అండగా ఉంటూ.. దుష్ట సంహారం చేసే దేవతే ఈ అమ్మ. దక్షిణ భారత దేశంలో.. మరీ ముఖ్యంగా తమిళనాడులో కాటేరీ అమ్మన్‌గా, కర్ణాటకలో కాటేరమ్మగా Kateramma ఆలయాల్లో కొలువై పూజలు అందుకుంటోంది. పార్వతిదేవి మరో రూపంగా భావించే కాటేరమ్మను.. కలియుగంలో రోగాల్ని నయం చేసేందుకు వెలిసిన దేవతగా పూజిస్తున్నారు. కొన్నిచోట్ల ఊరికి కాపలా దేవతగా.. మరికొన్ని చోట్ల కులదేవతగా తరతరాల నుంచి కొలుస్తున్నారు. జానపద కథ ప్రచారం.. కైలాసంలో శివుడు నిద్రపోయే సమయంలో పార్వతి దేవి రోజూ రాత్రిళ్లు ఎటో వెళ్లిపోతుంటుంది. సూర్యోదయానికి ముందు తిరిగి కైలాసానికి చేరుతుంది. ఈ చర్యపై శివుడు పార్వతిని నిలదీస్తాడు. తన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతుందంటూ పార్వతి బాధపడుతుంది. ఒకరోజు కైలాసం అడవుల గుండా వెళ్తున్న ఆమెను శివుడు అనుసరిస్తాడు. హఠాత్తుగా కాళి రూపంలోకి మారిపోయి.. శవాలను తవ్వి బయటకు తీసి తినే యత్నం చేస్తుందామె. ఉగ్ర రూపంలో ఉన్న పార్వతిని నిలువరించేందుకు అడవి మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు. ఆమె అందులో పడిపోయి.. తన చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది. ఇకపై ఇలాంటి చేష్టలకు పాల్పడబోనని శివుడికి మాటిస్తుంది. భయంకరమైన ఈ రూపాన్ని ఆ గొయ్యిలోనే వదిలేసి, విధేయురాలైన భార్య.. పార్వతిదేవిగా వెంట వస్తానని శివుడికి చెబుతుంది. అలా విడిచిపెట్టిన ఆ శక్తి అవతారమే.. కాటేరీ దేవతగా చెబుతుంటారు. తనను నమ్ముకున్న వాళ్లను రక్షించే దయగల దేవతగా, సర్వరోగాల్ని నయం చేసే అమ్మవారిగా వందల ఏళ్ల నుంచి పూజలు అందుకుంటోంది కాటేరమ్మ. ఈ దేవతకు జాతరలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. దళిత కమ్యూనిటీలో మరోలా.. అయితే తమిళనాడు, కర్ణాటకలోని దళిత కమ్యూనిటీలు మాత్రం కాటేరమ్మను మరోలా విశ్వసిస్తాయి. శివుడి శాపం చేత ఆమె అడవుల్లో తిరుగుతుంటుందని.. ఈ కారణం చేతనే ఆమె ఉగ్రరూపంలో దర్శనం ఇస్తుందని చెబుతూ కాటేరమ్మను బలి దేవతగా కొలుస్తుంటారు. కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేప ఆకుల్ని భక్తులు పేర్కొంటారు. నిమ్మకాయలు, ఎర్ర పువ్వులతో పూజిస్తారు. జంతు బలిలో కోళ్లను, మేకల్నే కాకుండా పందుల్ని కూడా ఒక్కోసారి బలిస్తుంటారు. కుల దేవతగానూ కాటేరమ్మ దక్షిణ భారతంలో పూజలు అందుకుంటోంది. మద్రాసీ సంస్కృతిలో మద్యం, సిగరెట్లు సైతం సమర్పిస్తుంటారు. మరికొన్ని చోట్ల బలి లేకుండా ప్రసాదాలతో కొలుస్తారు. ఇదీ చదవండి: సలార్ మూవీ రివ్యూ శక్తివంతమైన దేవతగా.. కాటేరమ్మ.. అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. ఉగ్ర రూపంలోనే కాదు.. శాంత స్వరూపిణిగానూ పూజలు అందుకుంటోంది. నీలి రంగు లేదంటే నలుపు రంగు విగ్రహాల్ని.. ఎక్కువగా నాలుగు భుజాల దేవతగా.. ఒక్కో చేతిలో కత్తి, త్రిశూలం, తామర, గిన్నెతో రూపొందిస్తారు. మరికొన్ని చోట్ల అనేక భుజాలతో ఉగ్రరూపంలో ఏర్పాటు చేస్తారు. దక్షిణ రాష్ట్రాల్లోనే కాదు.. శ్రీలంకలోనూ కొన్ని తెగలు కాటేరమ్మను కొలుస్తారు. ట్రినిడాడ్, గుయానా, జమైకా, మారిషస్, సౌతాఫ్రికాలో స్థిరపడిన తమిళ కమ్యూనిటీ ప్రజల నుంచి కూడా పూజలు అందుకుంటోంది. కన్నడ ప్రజలు కాటేరమ్మగానే కాకుండా.. రక్త కాటేరమ్మగానూ కాటేరీ దేవి ఆరాధ్య దైవం. రోగాలు మాయం చేయడంతో పాటు దుష్టశక్తుల్ని వదిలిస్తుందని నమ్ముతారు. అలా కన్నడనాట శక్తివంతమైన దేవతగా పేరున్న కాటేరమ్మ రిఫరెన్స్‌ను ఇలా ప్రభాస్ ఫైట్ సీన్‌తో Salaar Kateramma Scene ప్రేక్షకులకు రుచిచూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ 'సలార్' మూవీ స్టిల్స్ -
అమ్మవారికి నిమ్మకాయ దండలెందుకు వేస్తారు?
అమ్మవారికి నిమ్మకాయల దండలెందుకు వేస్తారు? గుమ్మడి కాయను ఎందుకు బలి ఇస్తారు?..నిజానికి మాములు రోజుల్లోనే కాదు బోనాలప్పుడూ, కొన్ని ప్రత్యేక పండుగల్లో అమ్మవారికి బలిగా గుమ్మడికాయని సమర్పించడం, నిమ్మకాయల దండలు వేసి అర్చించడం వంటివి చేస్తాం . ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి ఎందుకు వేస్తారు ? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం అయ్యింది. మనమొకసారి పరిశీలిస్తే, లక్ష్మీ దేవికి , సరస్వతీ దేవికి ఇలాంటి నిమ్మకాయ దండాలు వేసే ఆచారం కనిపించదు . కానీ శక్తి ఆలయాల్లో, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది. శక్తి స్వరూపిణి అయినా అమ్మవారు రక్షణ బాధ్యత కలిగినది . నిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది. లయకారుని శక్తి కదా అమ్మవారు. కాలస్వరూపమై, దుష్టశక్తుల పాలిటి సింహస్వప్నం అయిన దేవికి తామస గుణం ఉంటుంది. దేవి సత్వ స్వరూపమే అయినా సంహార క్రియ నిర్వహించేప్పుడు తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుంది. ఆ దేవీ స్వరూపాలై గ్రామాలకి రక్షణగా కాపలా కాసే గ్రామ దేవతలు కూడా, రాత్రిపూట నగర సంచారం / గ్రామ సంచారం చేస్తూ, దుష్ట శిక్షణ చేస్తారు . అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు. శిరస్సుకి ప్రతిగానే ఈ కూష్మాండం.. "కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితాః ప్రణమామి తతస్సర్వ రూపిణం బలి రూపిణం". వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన దేవికి మాంసాహారం నిషిద్ధం కాదుగా ! రాజులు మాంసాహారాన్ని, బ్రాహ్మణులు సాత్విక ప్రవర్తనతో మెలిగేందుకు శాఖాహారాన్ని తీసుకుంటారు . మరి అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె ‘బలిప్రియ’. ఆ బలిగా మనం శిరస్సుని సమర్పించాలి. శిరస్సుకి ప్రతీక కూష్మాండం (గుమ్మడికాయ ). అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ‘ఓ బలిదానమా ! నా భాగ్యమువలన కూష్మాండ రూపంలో ఉన్నావు (గుమ్మిడికాయ రూపంలో ). అమ్మవారికి సంతోషాన్ని కలుగజేసి, నా ఆపదలను నశింపజేయి’. అని ప్రార్థిస్తూ గుమ్మడికాయని అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం సూచిస్తూ ఉంది. అదేవిధంగా నిమ్మకాయ దండలని సమర్పించడము కూడా ! రౌద్ర , తామస స్వరూపిణి అయిన దేవి, ఆమెకి ఇష్టమైన నిమ్మకాయల దండనీ, పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని స్వీకరించి, శాంతిస్తారని చెబుతారు. అందువలనే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు. కానీ ఈ సంప్రదాయాన్ని ఇళ్ళల్లో చేసుకొనే పూజల్లో వినియోగించకూడదని గుర్తుంచుకోవాలి . ఇందులో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకొనే పూజల్లో వాడకపోవడం మంచిది. ఇలా నిమ్మకాయల దండని కావాలనుకుంటే, మీరు తయారు చేసి, గుడిలో ఉన్న దేవతకి సమర్పించి, మీ పేరిట అర్చన చేయించుకొని, అక్కడ చేసిన అర్చనలో నుంచి నిమ్మకాయలు తెచ్చుకొని మీ ద్వారబంధానికి, వాహనానికి కట్టుకోండి. దానివలన దృష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. శత్రుపీడలు నివారించబడతాయి. అమ్మ రక్షణలో ఉన్నందువల్ల, దుష్ట శక్తులు దరి చేరకుండా ఉంటాయి . దుష్టశక్తుల పీడని నివారించడానికి వినియోగించే ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి. అంతేగానీ లక్ష్మీ దేవికి, సరస్వతి దేవికి ఈ ఆచారం వర్తించదు.!! (చదవండి: జంట అరటిపండ్లు తినకూడదా?.. దేవుడికి కూడా సమర్పించకూడదా?) -
నిప్పులపై 10 మీటర్లు నడిచిన బీజేపీ నేత.. వీడియో వైరల్!
భువనేశ్వర్: బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఒడిశాలోని పూరీ జిల్లాలో కొనసాగుతున్న ఝాము జాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామదేవత దులన్ అమ్మవారికి పాత్ర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి సంప్రదాయం ప్రకారం జాతరలో ఏర్పాటు చేసిన అగ్నిగుండంపై నడిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ‘ఈ రోజు, నేను పూరీ జిల్లాలోని సమంగ్ పంచాయితీకి చెందిన రెబాటి రామన్ గ్రామంలోని జాతరలో పాల్గొన్నాను. అగ్ని గుండం మీద నడిచి ఆమ్మవారి ఆశీర్వాదం పొందాను. ప్రజలు సుఖసంతోషాలతో తులతూగాలని వారి శ్రేయస్సు కోసం ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థించానని‘ ట్వీట్ చేశారు. ఝాము జాతరలో కోరికలు నెరవేరాలని అమ్మవారు దులన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు నిప్పుల మీద నడవడం ఆ ప్రాంత సంప్రదాయం. కాగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో చురుకుగా పాల్గొనడంతో పార్టీ సంబిత్ పాత్రను భాజపా జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో పూరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు కానీ బిజూ జనతాదళ్ (బిజెడి)కి చెందిన పినాకి మిశ్రా చేతిలో 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. शक्ति पूजा हमारी सनातन संस्कृति एवं परंपरा का अहम हिस्सा है, पुरी जिले के समंग पंचायत के रेबती रमण गांव में आयोजित यह दण्ड और झामू यात्रा इसी प्राचीन परंपरा का प्रतीक है। इस तीर्थयात्रा में अग्नि पर चलकर मां की पूजा-अर्चना एवं आशीर्वाद प्राप्त कर, खुद को धन्य अनुभव कर रहा हूँ।… pic.twitter.com/oTciqW61Gj — Sambit Patra (@sambitswaraj) April 11, 2023 -
విజయనగరం : వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
-
పిల్లి దేవత.. వాహనమూ మార్జాలమే..! ఆ ఊరు పేరు కూడా..
సాక్షి, హైదరాబాద్: పిల్లి అపశకునమనే భావన చాలామందిలో ఉంటుంది. పురాణాల్లోనూ పిల్లిని శుభసూచకంగా చూపిన దాఖలాలు లేవు. కానీ ఓ ఊళ్లో మాత్రం పిల్లినే దేవతగా పూజిస్తున్నారు. ఆ శివాలయంలో మార్జాలమాత ప్రత్యేక స్థానంలో కనిపిస్తోంది. ఆ దేవత వాహనం కూడా మార్జాలమే. విచిత్రమేంటంటే ఆ ఊరు పేరు కూడా ఈ పిల్లితో పుట్టిందే. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని బెక్కం.. శ్రీశైలం ముంపు గ్రామం. నేలబిల్కు, పెద్ద బిల్కులనే రెండు చిన్నగ్రామాలు కలిపి బెక్కంగా ఏర్పడింది. ఈ ఊళ్లో ఓ శివాలయం ఉంది. స్వామిని ‘బెక్కేశ్వరుడు’గా కొలుస్తున్నారు. ఈ గుడి గోడ గూటిలో ఓ పెద్ద శిల్పం ఉంది. పైన కుడి చేతితో తామరపుష్పాన్ని ధరించి, ఉత్కుటాసన భంగిమలో అమ్మవారి రూపం (పార్వతి?) ఉంది. ఆ శిల్పం దిగువన మార్జాల ముఖం, మానవ శరీరాకృతితో, మార్జాల వాహనధారిౖయె అర్ధ పద్మాసనంలో ఉన్న మరో అమ్మవారి రూపం ఉంది. పిల్లి ముఖం కలిగి ఉండటం, పిల్లి వాహనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆలయంలోని ఈ ప్రత్యేకతను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్యాంసుందర్, చంద్రశేఖర్ సోదరులు గుర్తించారని ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. పిల్లి పేరుతోనే ఊరు ‘పూర్వం ఆ గ్రామంలోని తాటివనంలో ఓ పుట్ట మీద ఆవు పాలు కురిపిస్తుంటే ఓ పిల్లి తాగుతూ ఉండేదని, దాన్ని గుర్తించి స్థానికులు అక్కడి పుట్టను తవ్వగా శివలింగం వెలుగుచూసిందని గాథ అక్కడ ప్రచారంలో ఉంది. కన్నడంలో పిల్లిని బెక్కగా పిలుస్తారు. ఆ పిల్లి పేరుమీదుగానే ఆ శివుడికి బెక్కేశ్వరుడని, గ్రామానికి బెక్కం అని పేరు పెట్టారన్నది స్థానికుల కథనం. ఈ ఆలయానికి 1065 జూలై11న కేతరస, రాజరసలనేవారు త్రైలోక్యమల్ల 1వ సోమేశ్వరుడి పాలన కాలంలో భూదానం చేసినట్టు శాసనం కూడా బయటపడింది. రాష్ట్రకూట శైలిలో నిర్మించిన ఇక్కడి త్రికూటాలయంలో లలాటబింబంగా గజలక్ష్మి ఉంది. ఓ గర్భాలయంలో ఛత్రాపరితల సమలింగం ఉండగా, ప్రతి గర్భాలయానికి ఎదురుగా వేర్వేరు కాలాలకు చెందిన నంది శిల్పాలున్నాయి.’ అని హరగోపాల్ పేర్కొన్నారు. -
భక్తుల కొంగుబంగారం.. ఇష్ట కామేశ్వరిదేవి
దట్టమైన అభయారణ్యంలో బండరాళ్ల మధ్య కుదుపులతో కూడిన ప్రయాణం. అనుక్షణం భయం, ఉత్కంఠ, ఆహ్లాదం, ఆనందం ఇవన్నీ కలగలపి చేసే యాత్రే ఇష్టకామేశ్వరీదేవి దర్శనయాత్ర. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంజివారిపల్లె బీట్ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన ఇష్టకామేశ్వరి దేవతను దర్శించుకోవాలంటే కొంచెం సాహసమే.. పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా): భారతదేశం మొత్తం మీద ఆ దేవి రూపాన్ని ఆ ఒక్క క్షేత్రంలో మాత్రమే దర్శించుకోగలం. అందుకే ఆ దేవి దర్శనం ఒక సాహసయాత్ర. దట్టమైన అభయారణ్యంలోని ఓ చిన్న గుహలో వెలసిన జగజ్జనని దర్శనంతో ఆ తల్లి మన ముందు సజీవంగా నిలిచిన అనుభూతినిస్తుంది. ఒకప్పుడు కేవలం కాపాలికులు, సిద్ధులు మాత్రమే సేవించిన మహామహన్విత ఇష్టకామేశ్వరిదేవి నేడు సామాన్య భక్తులు కూడా దర్శించుకోగలుగుతున్నారు. చెంచు గిరిజనుల నివాసాల మధ్య బండరాళ్లను పేర్చి కట్టిన చిన్న మండపానికి ముందు రేకుల షెడ్డుతో సాదాసీదాగా ఉంటుంది ఇష్టకామేశ్వరి దేవీ ఆలయం. జగద్గురువులు ఆదిశంకరాచార్యులతో పాటు ఎంతో మంది సిద్ధులు అమ్మవారిని దర్శించుకుని అక్కడే సాధన చేశారని పురాణాలు చెపుతున్నాయి. ప్రసిద్ధ శ్రీశైల పుణ్యక్షేత్రంలో కొద్దిమందికి మాత్రమే తెలిసిన మహాన్విత కేత్రం ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి ఆలయం కూడా ఒకటని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఎంత గొప్ప కోరికైనా ఈ అమ్మవారిని కోరుకుంటే తీరుతుందని పురాణాల్లో నానుడి. ఆకట్టుకునే అమ్మవారి స్వరూపం చతుర్భుజాలతో, రెండు చేతులలో తామర మొగ్గలు, మరో చేతిలో శివలింగం, మరో చేతితో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లుగా ఒక యోగినిలా అర్ధనిమీలిత నేత్రాలతో జ్ఞానముద్రలో ఉన్నట్లు ఎంతో కళాత్మకంగా కనబడుతుంది ఇష్టకామేశ్వరీ అమ్మవారు. భూగర్భంలోని ఓ చిన్న దేవాలయంలో కొలువుతీరి ఉంటుంది ఇష్టకామేశ్వదేవి. కిటికీ మాదిరిగా ఉండే చిన్న ముఖద్వారం ద్వారా మోకాళ్ల మీదుగా ఒక్కరొక్కరుగా లోనికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారి దర్శనానికి ముందు మార్గమధ్యంలో వెలసి వినాయకుడిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఇష్టకామేశ్వరి అమ్మవారికి పెరుగన్నం, పొంగళిని నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి, బ్రమరాంభాదేవి వెలసిన సమయంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారు ఇక్కడ వెలి«శారని స్థల పురాణాలు చెపుతున్నాయి. మానవకాంతను పోలిన అమ్మవారి నుదురు అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరి చేత స్వయంగా బొట్టు పెట్టించటం ఇక్కడ అనవాయితీ. అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు అమ్మవారి నుదురు రాతి విగ్రహం మాదిరిగా కాకుండా ఒక మానవ కాంత నుదుటిని తాకినట్లుగా మెత్తగా చర్మాన్ని తాకినట్లుగా ఉంటుందని భక్తులు పేర్కొంటున్నారు. భక్తులు ధర్మబద్ధంగా కోరే ఏ కోరికైనా అమ్మవారు తీరుస్తారని ప్రతీతి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు ఈదన్న పేర్కొంటున్నారు. అమ్మవారికి కొందరు భక్తులు చీర, సారెలను బహూకరిస్తారని అర్చకులు పేర్కొంటున్నారు. సాహసోపేతమైన దర్శనయాత్ర.. నల్లమల అభయారణ్యంలో వెలసిన ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శంచుకోవాలంటే కాస్తంత సాహసం చేయాల్సిందే. ఈ యాత్ర యావత్తూ వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే టైగర్ రిజర్వు అటవీ ప్రాంతం కావటంతో అటవీశాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. కొంతకాలంగా ఈ యాత్ర అటవీశాఖ అనుమతులతోనే సాగుతుంది. శ్రీశైలం సమీపంలో ఉన్న శిఖరం వద్ద నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. శిఖరం వద్ద అటవీశాఖ అధికారులు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి అలయానికి చేరుకోవటానికి టికెట్లు బుక్ చేసుకుంటారు. 5 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయానికి వెళ్లే ప్రతి వ్యక్తికి రూ.1000 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఒక్కో వాహనంలో కేవలం 8 మంది మాత్రమే వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి. అలా మొత్తంగా రోజుకు 15 జీపులు మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తారు. టికెట్లు తీసుకున్న అరగంట నుండే వాహనాలు ప్రారంభమవుతాయి. ఇలా కష్టసాధ్యమైన యాత్రను చేసే ప్రతి ఒక్కరూ తాము కోరిన కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, అవి తీరగానే తమ మొక్కులను తీర్చుకుంటుంటారు. -
గుంట గంగమ్మకు సారె సమర్పించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సాక్షి, తిరుపతి: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, లక్ష్మీ దంపతులు సారె సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి, అమ్మవారి ఆలయానికి విచ్చేసిన చెవిరెడ్డి దంపతులకు పాలక మండలి చైర్మన్ కట్టా గోపీ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఆయన సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర జరగడం చాలా సంతోషకరమని, గంగమ్మ తల్లి అమ్మవారి కృప అందరికీ కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెవిరెడ్డి చెప్పారు. తిరుపతి: బసవన్నకు ‘వీక్లీ ఆఫ్’.. ఎక్కడంటే? -
శివాలయంలో బౌద్ధ సంతాన దేవత విగ్రహం
సాక్షి, హైదరాబాద్: బౌద్ధంలో సంతాన దేవతగా పేర్కొనే హారీతి శిల్పాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక సమీపంలో దక్షిణ కాశీగా అభివర్ణించే రాఘవాపురం శివాలయంలో గుర్తించారు. 8 లేదా 9వ శతాబ్దం నాటిదని భావిస్తున్న ఈ విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, ఎల్లేటి చంటి, రవి గుర్తించారు. జైనం, బౌద్ధం, హైందవంలో ప్రత్యేకంగా సంతాన దేవతలను అర్చించే విధానం ఉంది. దీంతో విగ్రహం లక్షణాల ఆధారంగా చరిత్ర పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, బద్దెల రామచంద్రారెడ్డి, డాక్టర్ స్మితారెడ్డి, టి.మహేశ్ తదితరులతో సంప్రదించి బౌద్ధ సంతాన దేవత హారీతిగా గుర్తించినట్టు హరగోపాల్ వెల్లడించారు. చదవండి: Yadagirigutta: బలిపీఠానికి బంగారు తొడుగు పాకిస్థాన్‌లోని లాహోర్, అజంతా రెండో గుహ, ఒడిశాలోని లలితానగర్‌లో వెలుగు చూసిన హారీతి విగ్రహాలతో ఇది సరిపోలి ఉందని వెల్లడించారు. తలపై కిరీటం లేకుండా పెద్ద సిగ, మెడలో ముత్యాలహారం ఉన్నాయన్నారు. దేవత కుడి తొడమీద శిశువును కూర్చోబెట్టుకున్నట్టు ఉందని, ఎడమ చేతిలో మూలిక లాంటిది కనిపిస్తోందని పేర్కొన్నారు. జైనం రాకముందు 9వ శతాబ్దం దాకా బౌద్ధ నిర్మాణాలుండేవని తెలుస్తోందన్నారు. ఈ విగ్రహం వెలుగు చూసిన నేపథ్యంలో రాఘవాపురంలో హారీతిదేవికి ఆలయం ఉండేదని తెలుస్తోందని వివరించారు. ఆలయంలో ఇటీవల కొత్తగా అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు వెల్లడించారు. చదవండి: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు -
చేపల ఆశీస్సులు కూడా ఉండాలి: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
గుజరాత్: సముద్రపు చేపలను ఉద్దేశించి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన గుజరాత్లో మాట్లాడుతూ.. సముద్రపు చేపలు లక్ష్మీదేవికి చెల్లెళ్లుగా అభివర్ణించారు. సముద్రం అనేది లక్ష్మీదేవి జన్మించిన స్థలమని, ఆమె సముద్రపు పుత్రిక అని పేర్కొన్నారు. అయితే చేపలు కూడా సముద్రపు పుత్రికలని, అందుకే సముద్రపు చేపను లక్ష్మీదేవికి సోదరిగానే చూడాలని వ్యాఖ్యానించారు. లక్ష్మీదేవి అశీస్సులు ఉంటే సంపద కలుగుతుందని, అలాగే చేపల ఆశీస్సులు కూడా ఉండాలని తెలిపారు. చదవండి: ఇంత లావుగా ఉన్నావ్ పిల్లల్నెప్పుడు కంటావ్! ఈ లోకంలో ఉండలేను.. దేవుడు ఒకప్పుడు మత్స్య(చేప) రూపంలో కనిపించాడని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆధీనంలోని వాటర్‌బాడీలో చేపలు పట్టే మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు(కేసీసీ) ఇస్తామని తెలిపారు. అయితే వ్యవసాయదారులకు కేసీసీ ద్వారా ఇస్తున్న 4 శాతం వడ్డీ రేటు తగ్గింపు మాదిరిగా.. రాష్ట్రాలు కూడా మత్స్యకారులకు మరో నాలుగు శాతం వడ్డీ రేటును తగ్గించాలని కేంద్ర మంత్రి రూపాలా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో చేపలకు పవిత్ర హోదా ఇస్తారా? ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. -
మహిళలను దేవతకు ప్రతిరూపంగా భావించాలి
గోరఖ్‌పూర్: మహిళలను దేవతకు ప్రతిరూపంగా భావించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. దాంతో వారిపై నేరాలకు, అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయొచ్చని సూచించారు. ఆయన గురువారం గోరఖ్‌పూర్‌లో నవరాత్రుల సందర్భంగా మహార్నవమి పూజలో పాల్గొన్నారు. అంతకుముందు కన్యాపూజ చేశారు. బాలికల కాళ్లను స్వయంగా కడిగారు. పిల్లలకు భోజనం వడ్డించారు. మన బిడ్డలు, అక్కాచెల్లెమ్మలను దేవతల్లాగా పవిత్రంగా చూసుకోవాలని, గౌరవించాలని అన్నారు. మహిళల విద్య, ఆరోగ్యం, భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ఈ విషయంలో ప్రజలందరి సహకారం కావాలని కోరారు. మహిళల సంక్షేమం కోసం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. -
57 అడుగుల విగ్రహం.. 35 కేజీల మాస్క్
టోక్యో: కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి మాస్క్ తప్పనిసరి అయ్యింది. మాస్క్ ధరించకుండా బయటకు వెళ్తే జరిమానా విధిస్తున్నారు. మాస్క్ లేకపోతే ఎక్కడికి అనుమతించడం లేదు. మనుషులకు మాస్క్ సరే కానీ దేవుడి విగ్రహాలకు కూడా మాస్క్ పెట్టడం కొంత విడ్డూరంగా ఉంటుంది. అయితే అది కూడా చిన్నచితకా మాస్క్ కాదండోయే.. ఏకంగా 35 కేజీల భారీ మాస్క్ దేవతా విగ్రహానికి పెట్టారు. ఈ సంఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. జపాన్‌లో 57 మీటర్లు ఎత్తున్న బౌద్ధ మాత విగ్రహానికి భారీ మాస్క్ ధరింపజేశారు. 57 మీటర్ల ఎత్తు విగ్రహానికి 5.3 మీటర్ల పొడవు, 4.1 మీటర్ల వెడల్పు కలిగిన ‘35 కిలోలు’ బరువు ఉన్న మాస్కును బౌద్ధ మాతకు ధరింపజేశారు. అనంతరం కరోనా మహమ్మారి నుంచి తమను కాపాడాల్సిందిగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు జపాన్‌లోని కుషిమా ప్రిఫెక్చర్ ప్రాంతం వాసులు. 57 మీటర్ల ఎత్తున్న బౌద్ధ మాత విగ్రహాన్ని 33 సంవత్సరాల క్రితం నిర్మించారు. బోలుగా ఉండే ఈ విగ్రహం భుజం వరకు వలయాకారంలో మెట్లను ఏర్పాటు చేశారు. చిన్న బిడ్డను ఎత్తుకున్నట్లు ఉండే ఈ విగ్రహం వద్ద జనాలు తమ పిల్లలను కాపాడమని.. సుఖప్రసవాలు అయ్యేలా చూడమని వేడుకుంటారు. జపాన్ అంటేనే భూకంపాలకు నిలయంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈక్రమంలో గత ఫిబ్రవరిలో సంభవించిన భూకంపానికి బౌద్ధ మాత విగ్రహం పాక్షికంగా దెబ్బతింది. దీంతో విగ్రాహానికి మరమ్మత్తులు చేసిన అనంతరం ఈ భారీ మాస్కును తయారుచేసి బౌద్ధ మాతకు ధరింపజేసి..కరోనా నుంచి మా బిడ్డలను కాపాడు తల్లీ అంటూ ప్రార్థనలు చేశారు. చదవండి: వైరల్: మాస్క్ పెట్టుకున్నాడు.. మొహం వింతగా మారిపోయిందే! -
ఆన్లైన్ క్లాసులు: షాకైన అమ్మోరు తల్లి
లేడీ సూపర్ స్టార్ నయనతార ఆదిశక్తిగా కనిపిస్తున్న చిత్రం ముక్తి అమ్మాన్. ఎప్పుడూ అందం, అభినయంతో అలరించే ఆమె తొలిసారి దేవత పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఈ చిత్రం తెలుగులో అమ్మోరుతల్లిగా విడుదల కానుంది. ఎన్జె శరవణన్, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఇశారి కె గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశ్ సంగీతం సమకూర్చారు. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు. (ఫ్యాక్ట్ : నయన్-విఘ్నేశ్‌లకు కరోనా సోకిందా?) ఓ కుటుంబ కులదైవమైన ముక్కుపుడకల అమ్మవారు వారి ఎదుట ప్రత్యక్షమై ఎలాంటి వరాలు ఇచ్చారు? భక్తి పేరుతో మోసాలు చేసేవారిని అమ్మవారు ఏం చేశారు? అసలు అమ్మవారు భూమి మీదకు రావడానికి కారణమేంటి? ఆమె నిజంగా అమ్మవారేనా> అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో 'మీ జుట్టు ఎందకు నల్లగా లేకుండా ఫారిన్ అమ్మోరిలా గోధుమ రంగులో ఉందని ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకు అడ్డమైన నీళ్లతో అభిషేకాలు చేస్తే కలర్ మారదా? అని నయన్ కౌంటరిచ్చారు. మీ శక్తినుపయోగించి ఆన్లైన్ క్లాసులు రద్దు చేయమని ఓ భక్తురాలు కోరడంతో అమ్మోరు తల్లే షాకయ్యారు. వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 14న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. (నిలకడగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం) -
శక్తికి యుక్తిని జోడించి ముందుకు..
స్త్రీని దేవతగా పూజించే చోటే మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలి. దేవతను చేశారంటే శక్తిని గ్రహించి కాదు.. త్యాగ మంత్రంతో శక్తిని సంగ్రహించి బలహీనపర్చారని అర్థం. ఈ మాట చెప్పడానికి పండగను మించిన సందర్భం ఉండదనిపించింది. పైగా దసరా నవరాత్రులు మొదలయ్యే నెల ముందు హథ్రాస్ దారుణాన్ని చవి చూసిందీ దేశం. దాదాపు రెండు వారాల కిందట విజయవాడలో దివ్య హత్యనూ జీర్ణం చేసుకుంది. ఈ రెండు తాజా ఉదాహరణలు చాలు కదా.. ఈ పుణ్యభూమిలో స్త్రీ దేవత అని చెప్పడానికి. మళ్లీ ఇలాంటి సమయాలే మహిళలూ మనుషులే .. వాళ్లకూ హక్కులుంటాయి.. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం.. కుల, పురుషాహంకారాన్ని నిలువరించే యుక్తి, సమాన స్థాయి కోసం పోరాడే శక్తీ ఉంటాయని నిరూపిస్తాయి. ఆ లక్షణాలను కదా గౌరవించాలి.. ఆరాధించాలి.. స్ఫూర్తిగా తీసుకోవాలి! కుల, మత, జెండర్ వారీగా ఏలికలు జనాలను విడగొట్టి బలహీనపరుస్తుంటే.. అదే కుల, మత, జెండర్లను ఒక్కటి చేసుకుంటూ బలమైన శక్తిగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు మహిళలు. ఒక్క స్త్రీ సమస్యల మీదే కాదు.. మొత్తం ప్రజల హక్కులను కాపాడేందుకు! ఆ యోధులందరినీ పేరుపేరునా పరిచయం చేయాలనే ఉంది. స్థల పరిమితులను దృష్టిలో పెట్టుకొని తాజా పరిణామాల్లో సాహసాన్ని ప్రదర్శించిన శక్తుల గురించే ఉదహరించాల్సి వస్తోంది. ఆ ప్రయాణం హథ్రాస్ నుంచే మొదలు పెడదాం.. పందొమ్మి దేళ్ల దళిత అమ్మాయిని ఆ ఊరి ఠాకూర్ల సంతానం కొన్ని రోజులుగా వెంటపడుతూ.. వేధించారు. ఆ అమ్మాయి కుటుంబీకులు ఈ విషయం మీద ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదెవ్వరూ. చివరకు ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి.. ఆ నిజాన్ని బయటపెట్టకుండా నాలుక కోసి హింసించి చంపేశారు. ఈ ఠాకూర్ల కొడుకులను కడుపులో పెట్టుకునేందుకు పోలీసులు ఆ అమ్మాయి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేశారు.. తల్లిదండ్రులను రానివ్వకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు పెట్టి మరీ. ఆ చితి మంటలను ప్రత్యక్షంగా రిపోర్ట్ చేసి ఆ దురాగతాన్ని దేశానికి చూపించిన శక్తి పేరు తనూశ్రీ పాండే. ఇండియా టుడే జర్నలిస్ట్. ఆ ఊరి గుట్టును రట్టుచేసిన వారికి భూమ్మీద నూకల్లేకుండా చేస్తారు అక్కడి పెద్దలు ప్రభుత్వ మద్దతుతో. ఆ క్రూరత్వానికి భయపడలేదు తనూశ్రీ. నేరాన్ని ఫోకస్ చేసింది. బెదిరింపులను ఎదుర్కొంది. అయినా మైక్ పట్టుకొని ఆ ఊరి నడిబొడ్డున నిలబడ్డది.. నిజాన్ని కెమెరాకు పట్టించింది. బారికేడ్లను తోసేసుకొని బాధితురాలి ఇంటికి వెళ్లింది. బాధితురాలి తల్లిని గట్టిగా గుండెకు హత్తుకుంది. ఆ స్పర్శకు ఆ అమ్మలో గూడుకట్టుకున్న దుఃఖం వరదైంది. దేశాన్ని ముంచెత్తింది. అది ప్రళయంగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన ఊర్లోని అగ్రవర్ణాలన్నీ ఒక్కటయ్యాయి నిందితుల పక్షాన. పోలీసులను ఊరి చుట్టూ కంచెలా మార్చారు మీడియాను రానివ్వకుండా. ఈ దుష్పరిణామాన్ని బయటపెట్టింది ఇంకో శక్తే. పేరు ప్రతిమ మిశ్రా. పోలీసులు తోస్తున్నా.. ఊళ్లో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నా.. లెక్కచేయలేదు. ఎత్తి వ్యాన్‌లో కూర్చోబెడ్తున్నా వెనక్కి మళ్లలేదు. తదనంతర పరిస్థితులను కళ్లకుకడ్తూనే ఉంది. బాధితులకు న్యాయ సహాయం చేయడానికి ఇంకో శక్తీ నిలబడ్డది. పేరు సీమ కుష్వాహా. నిర్భయ కేసులో బాధితుల తరపున వాదించిన లాయర్. ఇప్పుడు హథ్రాస్ సంఘటనలోనూ న్యాయ దేవత కళ్లగంతలు విప్పే సాహసం చేయబోతోంది. ఈ చైతన్యాన్ని ఇదివరకే అందిపుచ్చుకున్న ప్రాంతాలున్నాయి. వాటిల్లో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. దళితుల, స్త్రీల హక్కుల సాధనలో అలుపెరగని పోరాటం చేస్తున్నవాళ్లున్నారు. వృత్తి బాధ్యతల్లో బిజీగా ఉన్నా ఈ సామాజిక బాధ్యతనూ నిర్వర్తిస్తున్నారు. సుజాత సూరెపల్లి, దీప్తి, కవితా పులి, స్వాతి వడ్లమూడి, చైతన్య పింగళి, భరణి చిత్రలేఖ, రమా సుందరి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ శక్తుల జాబితా పెద్దదే. కుల, పురుష దురహంకారంతో సామాజిక మాధ్యమాల్లో ఆడవాళ్ల మీద నోరుపారేసుకొని, లేబుల్ వేసిన మగవాళ్లు అమెరికాలో ఉన్నా వదిలిపెట్టలేదు. కుల,పురుష దురహంకార దాడులకు, హత్యలను నిలదీస్తున్నారు. ఈ వైపరీత్యాలను నిలువరించడానికి మాటలు, రాతలు, బొమ్మలు, చేతలు.. ఎవరికి తోచిన మార్గాన్ని వాళ్లు అనుసరిస్తున్నారు. స్త్రీ సమస్యల నుంచి రాజకీయ పరిణామాలు, ప్రకృతి వైపరీత్యాల దాకా అన్నిటికీ తమ గళాన్ని వినిపిస్తున్నారు. కలాన్ని అందిస్తున్నారు. జనాన్ని కదిలిస్తున్నారు. సహాయానికి వస్తున్నారు. వీళ్లకూ బెదిరింపులు, హెచ్చరికలూ వెళుతున్నాయి. ‘పర్సోనా నాన్ గ్రాటా’ కేటగరీ పరిగణనలూ ఉంటున్నాయి. లెక్కచేయట్లేదు. సోషల్ నెట్వర్క్ అకౌంట్స్ క్లోజ్ చేసుకోవట్లేదు. ధర్నాలు, నిరసనలు మానుకోవట్లేదు. శక్తికి యుక్తిని జోడించి ముందుకు కదులుతూనే ఉన్నారు. స్ఫూర్తిని పంచుతునే ఉన్నారు. మహిళలను దేవతలుగా పూజించడం మాని తోటి పౌరులుగా గుర్తించి, గౌరవించే సంస్కృతి కావాలి. ఆ శుభ ఘడియ వచ్చేవరకు శక్తుల పోరాటం ఆగదు. ఆ స్ఫూర్తి నవ రాత్రులకే పరిమితం కాదు, 365 రోజులూ కొనసాగుతూనే ఉంటుంది. -
ఇలా తొలిసారిగా కనిపిస్తోన్న నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార ఆదిశక్తిగా కనిపించనుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న "ముఖ్తి అమ్మాన్" చిత్రంలో ఆమె దేవత పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఇందులో పెద్ద పెద్ద ఆభరణాలు ధరించిన నయనతార ఓ చేతిలో త్రిశూలం పట్టుకుని ఎరుపు, ఆకుపచ్చ చీరలో ప్రకాశవంతంగా మెరిసిపోతోంది. అమ్మవారి అవతారమెత్తిన నయనతార ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమ్మవారిగా నయనతార సరిగ్గా సరిపోయిందంటూ ఆమె అభిమానులు పేర్కొంటున్నారు కాగా నయనతార ఇప్పటివరకు ఎన్నో పాత్రల్లో నటించింది కానీ, అమ్మవారిగా కనిపించడం మాత్రం ఇదే తొలిసారి. (అమ్మా.. లవ్ యూ.. నయన్ తల్లికి విఘ్నేశ్ శివన్ విషెస్) As always, humbled by all your love and support ❤️ Thank you for the phenomenal response for the first and second look of #MookuthiAmman .!!!🙏🙏🙏 pic.twitter.com/m1kROaPcgB — RJ Balaji (@RJ_Balaji) March 1, 2020 ఈ సినిమా గురించి దర్శకుడు ఆర్జే బాలాజీ మీడియాతో మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక చిత్రమేనని తెలిపారు. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన భక్తి చిత్రాల్లో ఉన్న అంశాలన్నీ ఇందులోనూ ఉంటాయని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఊర్వశి, స్మృతి వెంకట్, అజ ఘోష్ తదితరులు నటిస్తున్నారు. ఇశారి కె గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశ్ సంగీతం సమకూర్చారు. ఇదిలా వుండగా నయనతార, సమంత హీరోహీరోయిన్లుగా, విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో ‘కాదువాక్కుల రెండు కాదల్’ సినిమా తెరకెక్కనుంది. దీనికి నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నాడు. కాగా నయనతార లాక్‌డౌన్‌కు ముందు రజనీకాంత్ "దర్బార్" చిత్రంలో చివరిసారిగా కనిపించిన విషయం తెలిసిందే. (స్టార్ హీరోయిన్‌తో ఐదేళ్ల ప్రేమాయణం..!) #MookuthiAmman on spot 📸 pic.twitter.com/pwXGqsGbUw — Nayanthara✨ (@NayantharaU) June 4, 2020 pic.twitter.com/g216dypx8X — RJ Balaji (@RJ_Balaji) June 4, 2020 -
ఆలయ ద్వారం... అనంత శక్తి కేంద్రం
అనంతశక్తి సంపన్నుడైన భగవంతుని భక్తులు దర్శించుకోగలిగే మార్గం.. ఆలయద్వారం. ఈ ఆలయద్వారంలో ఒక్కో భాగానికీ పేరుంది. ఆ భాగంలో ఒక్కో దేవతకూ స్థానముంది. గుడివాకిలి గడపపై అష్టదళపద్మం ఉంటుంది. ఆ పద్మంలో ఎనిమిది మంది దేవతలుంటారు. ఇది దైవీశక్తికి ప్రతీక. ఈ అష్టదళపద్మాన్ని దాటి ఏ అసురశక్తులూ ఆలయంలోకి ప్రవేశించలేవు. ఈ పద్మం ఉన్న గడపను భువంగం అంటారు. భువంగుడు అనే దేవత దీనికి అధిదేవత. ద్వారపు పై భాగానికి పతంగం అని పేరు. పతంగుడు దీని అధిదేవత. భూమినుండి కిందికి ఉన్న ఏడులోకాలకూ భువంగుడు, భూమికి పైన ఉండే ఏడులోకాలకు పతంగుడూ ప్రతినిధులు. ఆయా లోకాల దేవతలు ఆ భాగాలనుండి దైవదర్శనం చేసుకుంటారు. ద్వారం దక్షిణశాఖ(కుడిపట్టె)కు యోగం అనీ, వామశాఖ(ఎడమపట్టె)కు భోగం అని పేర్లు. వీరు కుడివైపు నుండి దర్శనం చేసుకునే వారికి యోగాన్ని, ఎడమవైపు నుంచి దర్శనం చేసుకునే వారికి భోగాన్ని అనుగ్రహిస్తారు. అలాగే ద్వారం లోపల కుడివైపు గంగ, ఎడమవైపు యమున వంటి నదీదేవతలుంటారు. ద్వారం ఈ నదీదేవతల ఉనికితో పరమపవిత్రతను సంతరించుకుని ఈ ద్వారం గుండా దర్శించుకునే భక్తులను పవిత్రులను చేస్తుంది. ద్వారం పైభాగం మధ్యలో ద్వారలక్ష్మి, ఆమెకు కుడివైపు గణపతి, ఎడమవైపు సరస్వతీదేవి ఉంటారు. ద్వారం కింది భాగంలో కుడివైపు సూర్యుడు, ఎడమవైపుచంద్రుడు ఉంటారు. విష్ణ్వాలయంలో కూడా ద్వారం పైన లక్ష్మీదేవి, మరికొన్నిచోట్ల శయనించిన రంగనాథస్వామి రూపం దర్శనమిస్తుంది.నిజానికి ద్వారం పైభాగంలో ఆలయంలో కొలువైన దేవతావిగ్రహం ఉండాలని ప్రాసాదమండనం అనే శిల్పశాస్త్రం చెప్పింది. ఒకవేళ ఆలయం మూసి ఉన్నా ద్వారంపై ఉన్న దేవతను దర్శించుకొని భక్తులు తరించవచ్చు. గరుడ – హనుమ విగ్రహాలను, శంఖనిధి–పద్మనిధి విగ్రహాలను కూడా ద్వారానికి ఇరువైపులా ఉంచే సంప్రదాయం అక్కడక్కడా విష్ణ్వాలయాలలో ఉంది. వాకిలిలోనే కాక కవాటానికి అంటే తలుపులలో కూడా దేవతలు ఉంటారు. కుడితలుపుకు విమలుడు, ఎడమతలుపుకు సుబాహుడూ దేవతలు. ఈ తలుపులపై ఆయా దేవతా లీలారూపాలు, అవతారాలు, అష్టలక్ష్మీరూపాలు చెక్కి ఉంటాయి. అక్కడక్కడా చిరుగంటలు, కొన్నిచోట్ల తలుపులకు రంధ్రాలు కూడా ఉంటాయి. అర్గళం(గడియ)లో స్కందుడు, గడియపట్టికలలో సూర్యచంద్రులు, గడిపడే గుండ్రటి భాగంలో నవశక్తులు ఉంటారు. ఇంతటి శక్తిసంపన్నమైన ద్వారాన్ని దర్శించి భక్తులు అభీష్టాలను నెరవేర్చుకోవచ్చని ఆగమాలు చెబుతున్నాయి. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
ఆ తాంబూలం ఇలా నోట్లోపడిందా!
అమ్మవారి కబరీబంధం(జడ)లో ఎంత గొప్పదనం ఉందో తెలుసా....శ్యామశాస్త్రిగారు తన కీర్తనలో ‘అలమేలవేణీ కీరవాణీ, శ్రీ లలితే హిమాద్రిసుతే పాహిమాం..’’ అంటూ అదే అంటారు. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుందట. అమ్మవారు ఎప్పటిది? ఇవ్వాళ్టిదా, నిన్నటిదా ? ‘అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె/ద్దమ్మసురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మదన్నులో/నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మాయమ్మ...’ అంటారు పోతనగారు. మరి అంత వృద్ధురాలయిన తల్లి, కాలగతిలో ఇన్నేళ్ళ నుంచి ఉన్న తల్లి కదా! అమ్మ, ఎంత ముసల్దయి పోయి ఉండాలి? అమ్మ జుట్టు తెల్లగా ఉండాలి కదా! మరి నల్లగా ఉండడమేమిటి? అంటే – పిచ్చివాడా! కాలగతిలో శరీరాలలో వచ్చే మార్పులు మనకు కానీ, అమ్మ కన్యాకుమారి కదా. అందుకే పరమశివుడి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా ఆయన నిత్య యవ్వనుడంటారు. అమ్మవారు–నిత్య యవ్వనా మదశాలిని. తాంబూలం వేసుకుని పతివ్రతా లక్షణంతో పెద్ద కేశపాశంతో ఉంటుంది అమ్మ. దాన్ని దర్శనం చేస్తే ఇన్ని జన్మలనుంచి పేరుకు పోయిన అజ్ఞాన తిమిరాల్ని పోగొట్టగలిగిన భాస్కర దర్శనం కబరీబంధ దర్శనంగా కనపడుతుందట. అటువంటి దర్శనం చేసి నీ పాద సేవ చేయాలనే ఉత్తమమైన కోర్కెలు మాలో ప్రచోదనం చేసి వాటిని తీర్చే స్వరూపమున్న వరదే... హిమగిరి సుతే పాహిమాం... అమ్మా! అటువంటి నీలవేణి కలిగిన నా తల్లీ...నిన్ను శరణు వేడుతున్నాను.కీరవాణీ అని కూడా అంటున్నారు శ్యామశాస్త్రి గారు. అమ్మా! నీ పలుకెటువంటిదో తెలుసా! లలితా సహస్రనామంలో వ్యాసభగవానులంటారు...‘‘పక్కన సరస్వతీదేవి కూర్చుని వీణ వాయిస్తూ పరమశివుడి వైభవాన్ని కీర్తనగా ఆలపిస్తున్నదట. అమ్మవారు వింటూ వింటూ ఒక్కసారి ‘శెహభాష్’ అందట! అలా అనేటప్పటికి అమ్మవారి చెవులకున్న తాటంకాలు ఊగాయట.. అలా ఊగుతుంటే వాటి ప్రతిబింబాలు అద్దాల్లా మెరిసిపోతున్న అమ్మవారి చెక్కిళ్ళ మీద పడి ప్రతిఫలించాయట. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తుందేమో... నోరు ఎర్రగా ఉంటుంది. ‘శెహభాష్’ అనేటప్పటికి నోరు తెరుచుకుందట. ఈ ప్రపంచంలో వేదం నేర్చుకున్న మహాపురుషులందరూ అమ్మవారి దంతపంక్తిగా ఉన్నారట. ఎర్రటి నాలుక. ఆ తాంబూలం ఇలా నోట్లో పడిందా... మూకుడు మహాకవి అయిపోయాడు. కాళిదాసుగారి నాలుక మీద బీజాక్షరాలు రాసిన వెంటనే... ‘‘జయజననీ...సుధాసముద్రాంత హృద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాస ప్రియే... కృత్తివాస ప్రియే సర్వలోక ప్రియే...సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాథత్రికే సానుమత్పుత్రికే....’’... అంటూ ఆయన శ్యామలా దండకం చెప్పేసారు. అటువంటి వైభవాన్ని ఇవ్వగలిగిన తల్లీ...అటువంటి నీలవేణీ...అటువంటి కీరవాణీ... నువ్వు శెహభాష్ అనేటప్పటికి ఇంత కచ్చేరీ చేసిన సరస్వతీ దేవి ఉలిక్కిపడి..‘అమ్మో ! ఈవిడ శెహభాష్ అంటేనే ఇంత అందంగా అంది. ఈవిడే పాట పాడితేనా...అని భయపడి తన వీణ సర్దుకుని వెళ్ళిపోయిందట. అటువంటి వాక్కున్న దానివమ్మా! కీరవాణివి. చిలక పలుకులు ఎలా ఉంటాయో అటువంటి పలుకులు ఉన్నదానివి..అటువంటి నువ్వు ఒక్కసారి..‘‘ఒరే శ్యామశాస్త్రీ! బాగుందోయ్ నీ కీర్తన ’అన్నావనుకో అమ్మా, నా జన్మకెంత చరితార్థకత తల్లీ!’’ ఇదీ ఆయన ఆర్తి. -
‘అమ్మా! నన్ను కూడా...’
ఒక మహర్షి బీజాక్షర సంయుక్తమైన శ్లోకాన్ని అందించినట్లే శ్యామశాస్త్రి గారు కూడా తన కీర్తనల్లో అంతటి ప్రయత్నం చేసారు. ‘సుమేరు మధ్య వాసినీ వరదే పరదేవతా..’ –మధ్యమా స్వరూపంలో ఉన్న వాక్కుకు అధిష్ఠానమైన దేవతకు పరదేవత–అని పేరు, ‘సుమేరు మధ్య వాసిని, పరదేవత, హిమాద్రిసుతే’’ ..అది లోపల శ్యామశాస్తిగ్రారు దర్శనం చేస్తూ బయటికి వ్యక్తీకరించిన వైఖరీ వాక్కు. కనుక ఆ కీర్తనను మీ ఇంట్లో తెలిసి విన్నా, తెలియకుండా విన్నా ఆ వాక్కులోంచి శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాఙ్మయి అయి అమ్మవారి అనుగ్రహం వైఖరీ రూపంలో ఒక్కసారి శబ్ద బ్రహ్మంగా ఇల్లంతా వ్యాప్తి చెందుతుంది. అది మన జీవితాలలో ఎటువంటి సానుకూల మార్పులనయినా తీసుకురాగలదు. అదీ వాగ్గేయకారులు మనకు చేస్తున్న ఉపకారం.శంకరాచార్యులు ఎక్కడయినా ప్రార్థన చేస్తే...అది శంకరులు చేస్తున్నట్లు ఆయన పేరుతో ఉండదు. ‘అమ్మా ! నన్ను కూడా...’’ అంటారు. అంటే ఆ శ్లోకాన్ని తరువాత కాలంలో ఎవరయినా తెలిసి కానీ, తెలియక కానీ చదువుకుంటే, అది వారే ప్రార్థన చేస్తున్నట్లుగా భావించి, వారిపట్ల అమ్మవారి అనుగ్రహం ప్రసరించాలని అలా చేసారు. అందుకే వారు జగద్గురువులు అయ్యారు.అలాగే శ్యామశాస్తిగ్రారు కూడా ‘శ్యామకష్ణ సోదరీ గౌరీ పరమేశ్వరీ గిరిజా/అలమేలవేణీ కీరవాణీ, శ్రీ లలితే హేమాద్రిసుతే పాహిమాం..’’ అన్న కీర్తనలోకూడా ఆయన మనకు ఇటువంటి ఉపకారమే చేస్తున్నారు.‘అమ్మా! నీవెటువంటిదానివో తెలుసా ! సుమేరు మధ్య వాసినివి. నీలవేణి కలిగిన దానివి’ అంటే నల్లని జడ కలిగిన దానివి. కబరీబంధం(జడ) ఉన్నదానివి–అంటున్నారు. అమ్మవారి కబరీ బంధం మన కంటికి కనబడదు. అమ్మవారిని ఎదురుగుండా వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అమ్మవారి వెనక్కి వెడితే – కిరీటానికి మధ్యలో కొంచెం ఖాళీ ఉండి అందులో కబరీ బంధం ఇముడుతుంది. దానిని దర్శనం చేస్తే మన అజ్ఞానం పోతుంది.నల్లకలువల దండలా ఉండే నల్లటి జడ, నల్లటి అజ్ఞానాన్ని ఎలా పోగొడుతుంది ? అది తెలియాలంటే లలితా సహస్రనామంలోకి వెళ్ళాలంటారు. దేవతలను ఉపాసన చేసేటప్పడు కేశాది, పాదాది పర్యంతం(తల దగ్గర మొదలుపెట్టి పాదాల వరకు) చేయాలి. అదే పురుష స్వరూపాన్ని చేసినప్పుడు పాదాది, కేశాది పర్యంతం చేయాలి. కానీ లలితా సహస్రంలో ముందు తల చెప్పరు. ‘చతుర్బాహుసమన్విత’ అన్నారు. అలా చేతులతో ఎందుకు మొదలుపెట్టారో శ్యామశాస్తిగ్రారు ఆ రహస్యాన్ని ఆవిష్కరించారు.అమ్మవారు నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలు(చతుర్బాహు సమన్విత)పట్టుకుంది. రాగం కోర్కెను జయించాలి. పొద్దస్తమానం సంసార లంపటంతో కూడిన కోర్కెలు కోరుకోవడం కాదు. ‘అమ్మా ‘ నీ చరణ సేవ ఎన్నడు చేస్తానమ్మా!’ అన్న కోర్కె పుట్టాలి. అటువంటి కోర్కెలు కోరేటట్లుగా మనస్సును మార్చగలిగే స్థితిని ఇచ్చి వరాలిస్తుంది కనుక ‘వరదే’ అన్నారు. అమ్మవారి చేతిలో ఉన్న బాణాల ఆకర్షణ చేత–‘క్రోధాంకుశోజ్వల’...క్రోధాన్ని క్రోధంతో, కోరికను తిరస్కతితో గెలవబడితే– మనస్సునుండి అజ్ఞానం తొలగి కబరీబంధ దర్శనమవుతుంది. అందుకని చేతులు ముందుగా చెప్పి తరువాత తల చెబుతారు అమ్మవారికి. నీ పాద సేవ చేయాలనే కోర్కెలను మాలో కలిగించి వాటిని నువ్వే తీర్చే స్వరూపమున్న ‘వరదే’, ‘హిమగిరి సుతే’ పాహిమాం ! అంటున్నారు. -
జయహో రాజమ్మ తల్లీ...
ప్రతి సంవత్సరం ... మాఘమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం తొలి ఆదివారం వరకు ఐదు వారాలు... లక్షలాది మంది భక్తులు.... రాత్రంతా కటిక చీకట్లోనే జాగారం...విషకీటకాలు యథేచ్ఛగా సంచరించే ఆ తోటలో భక్తులెవ్వరినీ కనీసం చీమ కూడా కుట్టిన ఆనవాళ్లు లేవెన్నడూ. అంతేకాదు, వంటినిండా బంగారు ఆభరణాలతో ఉన్న మహిళలకు కూడా చిన్న సూది కూడా పోగొట్టుకున్న దాఖలాలు లేదెప్పుడూ . అమ్మను నమ్ముకుంటే ఆవంత అపకారం కూడా జరగదని భక్తుల నమ్మకం. అందుకే లక్షలాదిమంది భక్తులు అక్కడ ఉన్నా, కాపలాకు రక్షకభటులు రారు... శనివారం రాత్రి జాగారం చేసి, ఆదివారం ఉదయం స్నానాలు చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని భక్తి పారవశ్యంతో తిరుగు ప్రయాణం అవుతారు. అందుకే భక్తులు జయహో రాజమ్మ... జయహో రాజమ్మ అని దిక్కులు పిక్కటిల్లేలా పలుకుతుంటారు. శ్రీకాకుళం జిల్లా వత్సవలస రాజమ్మతల్లి సంబరాల్లో అమ్మవారి మహిమకు ఆనవాళ్లివి....స్థలపురాణం ప్రకారం... బొబ్బిలియుద్ధం జరగడానికి కొద్దిరోజుల ముందు... విజయనగర సామ్రాజ్యలక్ష్మి, పూసపాటి రాజుల ఆరాధ్యదేవత రాజరాజేశ్వరి విజయనగర రాజులలో చివరివాడైన పూసపాటి విజయరామరాయలుకు బాలిక రూపంలో కలలో కన్పించింది. త్వరలోనే జరగనున్న యుద్ధంలో మీ సామ్రాజ్యమంతా వేరే రాజ్యంలో కలవబోతుందని హెచ్చరించింది. నిద్రనుంచి మేలుకున్న ఆ చక్రవర్తి... తమను కాపాడలేని దేవతకు ఇక పూజలెందుకు దండగ... అంటూ అమ్మవారి విగ్రహాన్ని, ఇతర పరివార దేవతల విగ్రహాలను ఓ చెక్కపెట్టెలో పెట్టి తాళం వేసి సమీపంలోని ఓ నదిలో విడిచిపెట్టారట. ఆ పెట్టె నదిలో నుంచి కొట్టుకుని పోయి వత్సవలస సమీపంలో మైలపల్లి వంశస్తులైన కొందరు మత్స్యకారుల వలలో చిక్కింది. ఆ జాలర్లు పెట్టెను తెరిచే ప్రయత్నం చేశారు. ఇంతలో వారికి ‘నేను ఓ శక్తిని... నన్ను కొలుస్తామంటేనే పెట్టె మూత తెరవండి.. లేదంటే అలానే సముద్రంలోనే కలిపేయండి’ అని ఓ చిన్న బాలిక స్వరం వినిపించింది. ఆ వాణిని విన్న జాలర్లు ‘అమ్మా! మాకే జీవనం కష్టంగా ఉంది... ఇక నిన్ను ఎలా కొలవాలో చెప్పమని కోరగా ‘ముందు నన్ను తీసుకుని వెళ్లి, మీ ఇంటిలో పెట్టండి.. నన్ను సందర్శించేందుకు భక్తులే ఇక్కడికే వస్తూంటారు... ప్రతి ఏడాది ఆ సంఖ్య పెరుగుతుండేలా చేస్తాను. నన్ను నమ్మితే చాలు... ఏదైనా చేస్తా’ అని అభయం ఇచ్చింది అమ్మ. దాంతో జాలరులు ఆ మూర్తులను ఇప్పటికి ఏడుతరాల కిందట ఉన్న ఓ పూరింట్లోపెట్టి, పూజించడం ప్రారంభించారు. అమ్మవారి మహిమతో వారందరికీ అన్నీ శుభాలే జరుగుతుండడం, పట్టిందల్లా బంగారం అవుతుండడంత భక్తులు తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. అది మొదలు ప్రతి ఏటా లక్షలాది భక్తులు వచ్చి అమ్మను సందర్శించుకుని మొక్కులు మొక్కుకోవడం, అవి తీర్చుకునేందుకు మరుసటి ఏడాది తిరిగి వస్తుండడంతో అది జాతరగా మారింది. రాజరాజేశ్వరి నుంచి రాజమ్మతల్లిగా... నిరక్షరాస్యులుగా ఉన్న జాలర్లు రాజరాజేశ్వరి మాతను రాజమ్మ అని పిలుస్తూండేవారు. తమ కుటుంబంలో పుట్టిన సంతానం తొలి తల కొప్పు(పుట్టు వెంట్రుకలు)ను అక్కడే సమర్పిస్తారు. ముడుపులు చెల్లించుకొని అక్కడే భోజనం చేసి తిరుగుప్రయాణం చేస్తారు... మకర సంక్రాంతి తర్వాత వత్సవలసకు... వందల సంవత్సరాలుగా భక్తుల ఇలవేల్పుగా ఉంటున్న రాజమ్మతల్లి మకరసంక్రాంతి నుంచి తమ ప్రధాన భక్తులుగా భావించిన వత్సవలస మైలపల్లి (జాలర్లు) స్వగృహాలకు చేరుకుంటుంది. తాను దొరికిన మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మైలపల్లి వంశస్తులకు దర్శనమిస్తూ భక్తుల కోర్కెలను నెరవేరుస్తుందని నమ్మకం. అలా మాఘమాసంలోని శని, ఆదివారాల్లో వచ్చిన భక్తులతో ఉత్సవం మాదిరిగా శోభిల్లుతుంది వాతావరణం. రౌద్ర రూపం నుంచి సాత్వికం.... మకర సంక్రాంతి తరువాత వచ్చిన రాజమ్మ తల్లి మాఘ మాసంలో 5 వారాలు లేదా 4 వారాలు పాటు ఇక్కడ రౌద్ర రూపంలో భక్తుల నుంచి ముడుపులు స్వీకరిస్తుంది. అనంతరం మరో 15 రోజులు (ఫాల్గుణంలోని కొన్ని రోజులు) మైలపల్లి ఇళ్లవద్దే ఉండి ఫాల్గుణ శుద్ధ దశమి నుంచి భక్తులు ఉన్న గ్రామాలు, పట్టణాల్లో సంచరిస్తూ మనల్ని కాపాడుతుంటుందని నమ్ముతుంటారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలోని ( కాకుళం, విజయనగరం, విశాఖపట్నం) ప్రతి గ్రామంలో అమ్మవారికి భక్తులుంటారు. వీరంతా ఇక్కడికి ప్రతి ఏటా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు... మొక్కులిలా... కుటుంబంలోని సభ్యులందరూ శనివారం సాయంత్రానికి వత్సవలస చేరుకుంటారు. రాత్రంతా జాగరణ చేసి ఆదివారం అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. రాత్రి జాగరణ చేసిన వారికి అనారోగ్యం దరి చేరదని విశ్వాసం. ఏడాది పొడవునా అమ్మవారిని స్మరించుకొని సంతానం కలిగితే ముడుపు చెల్లించుకుంటానని మొక్కుతుంటారు. ఆ క్రమంలో కోళ్లు, గొర్రెపిల్లలు, బంగారం, బియ్యం, వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, ధనం, చిన్నారుల తల వెంట్రుకలు... ఇలా అన్నీ చెల్లిస్తామని మొక్కడం... ఆ మేరకు ఆదివారం ఉదయాన్నే చెల్లించడం ఆనవాయితీ. కోరిన కోర్కెలు తీర్చే తల్లి... సంతాన రాజమ్మగా... ఉత్సవంలో పాల్గొని భక్తితో అమ్మవారిని కొలిస్తే పిల్లలు కలగని దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుందని నమ్మకం. దాసుడు వేషధారి సమయంలో మంగళ వాయిద్యాల నడుమ భూలోకమ్మ గుడికి వెళ్తున్న సమయంలో దంపతులు భక్తితో మొక్కుకుంటే సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతుంటారు. రుప్ప వెంకట శ్రీనివాస్, సాక్షి, గార, శ్రీకాకుళం జిల్లా తరతరాలుగా మా ఇలవేల్పు.. విజయనగరం రాజులు కొలుచుకునే సామ్రాజ్యలక్ష్మి రాజరాజశ్వేరి మా సమీపంలో సముద్రంలో దొరకడం, తరతరాలుగా మావంశస్తులు అమ్మని కొలవడం జరుగుతోంది. అమ్మని నమ్ముకున్న భక్తులు ప్రతీ ఏటా తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇప్పటివరకు 5 వారాల్లో ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోలేదంటే అమ్మవారి మహిమను నమ్మి తీరాల్సిందే కదా! మైలపిల్లి శ్రీనివాసదాసు, వత్సవలస -
వరం ఫలితం
మనిషికి సంబంధించిన వాటికంటే, ఆదాము అనుయాయులు ఇతర స్వభావాలతో పుట్టడం జరుగుతూంటుంది. ఎవరో ఒకరు మీకు ఆ వృక్ష, జంతు జాలాలు ప్రత్యేకంగా గుర్తుచేస్తుంటారు. ఒకసారి ఓ పూజారి మహిళ కడుపున మనిషిగా జన్మించాడు. కానీ అతను చూడ్డానికి కాకి, దాతుర, కాక్టస్లకు జన్మించినవాడిలా ఉన్నాడు. తమ పిల్లవాడే అయినప్పటికీ వాడి వికృతచేష్టలకు భయపడి తల్లిదండ్రులు పిల్లవాడిని అమ్మవారి గుడికి పంపించారు, అక్కడ ఆమె కరుణతో మార్పు వస్తుందని. కానీ ప్రతీరోజు కాక్టస్కు పాలు, వెన్న పెట్టినా, అది కాక్టసే కదా. ఈ బ్రాహ్మణుడు చందనం ఎంత రాసుకుంటాడో, జపమాలతో అంత ధ్యానం చేస్తాడు. దేవీపూజ చేస్తాడు. భంగ్, గంజాయి తీసుకుంటాడు. పగలు, రాత్రీ అతని కళ్లు కాగడాల్లా ఎర్రగా ఉంటాయి. బండ పెదవులు, పచ్చని పలువరస పొట్టవరకూ గడ్డం, జుత్తు మేటవేసి పక్షి గూడులా ఉంటుంది. పైకి కట్టబడి ఉంటుంది. పొడవాటి మెడ, శరీరమంతా ఎలుగుకిలా జుత్తు.అదృష్టవశాత్తూ, ఈ బ్రాహ్మణుడి భార్య ఎంతో సాదాసీదా మనిషి. భయస్తురాలు. కానీ అతను కొట్టాలనిపించినపుడల్లా కొడుతూంటాడు, అదో రోజూవారీ కార్యక్రమంలాగా. ఆమె కూడా భర్త చేత తన్నులు తినడం కుటుంబ జీవితంలో భాగంగా భావిస్తుంది. వండటానికి ఏమీ లేనపుడు ఆమె ఎంతో ఆందోళనపడుతుంది. ఆ సమయంలో దేవతకు అర్చనగా పెట్టేది చాలా స్వల్పం. దీంతో బతుకుడు కష్టం. పైగా ఇటువంటి బ్రాహ్మణుడితో ఆమెకు దైవభక్తి రెండింతలయింది. అర్చనలు రోజు రోజుకీ తగ్గిపోయాయి. గుడిలో అమ్మవారికీ ఆందోళన పట్టుకుంది.ఒకరోజు రాత్రి భోజనం తర్వాత కాస్తంత గంజాయి లాగించి నిద్రకి ఉపక్రమిస్తూ భార్యతో ‘‘మన అమ్మవారు చాలా తక్కువస్థాయి మనిషి. పూజారే యింత దరిద్రంలో వుంటే ఈ దేవతను ఎవరు మాత్రం పూజిస్తారు?’’ అన్నాడతను. రోజూ ఈ పూజా పునస్కారాలతో ఏమి ప్రయోజనం లేదు. గుడికి వెళ్లి దేవతతోపాటు తగలబడదామనిపిస్తోంది. ఇహ కొన్ని రోజులు వేచి చూస్తా, ఆ తర్వాత నువ్వే చూద్దువు... ఆమెకు బుద్ధి చెబుతాను’’ అన్నాడు.‘‘నన్ను అలా వదిలేసి వెళ్ళకండి’’ ఈ లోకంలో భర్త లేకుండా ఒంటరిగా ఎలా బతకగలను?’’ అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.‘‘ఓహ్! ఆ సంగతి ఆలోచించనేలేదు. నయం పైకి చెప్పావు. మంచిది.’’మంచం మీద కూర్చున్నాడు. అతని భార్య వచ్చి ‘‘ఇలా జరగకుండా ఉండాల్సింది! నన్నింకా తన్నకుండానే ఎలా నిద్ర పోతారు?’’ అంది.ఇప్పుడు పిల్లాడిలా ఆ బ్రాహ్మణుడు తనను తాను మర్చిపోయి ఒకటి లేదా రెండుసార్లు నవ్వాడు. నవ్వడం అనేది అతని పెదవుల మీదికి వచ్చినప్పటి నుంచీ, దాని జ్ఞాపకం అతనికి అంతగా లేదు. భార్య మాట వినగానే, మొదటిసారిగా పెదవులపై చిర్నవ్వు మెరిసింది.‘‘నీకు విశ్రాంతి కావాలంటే నేను తన్నాలా? నీకు ఆశ్చర్యం కలగవచ్చుగానీ, నేను మనిషిగా భావించినప్పుడు మాత్రమే నిన్ను కొడుతూంటాను. మనకి పిల్లలు ఉంటే, వాళ్లనీ కొట్టేవాడిని. ఇప్పటినుంచీ ఎవరిపైనా చెయ్యెత్తితే, అది ఆ దేవత మెడమీదే. ఒక గొడ్డలి సంపాదించి వెళ్లి ఆ దేవత విగ్రహాన్ని ముక్కలు చేస్తాను. అంతా తగలబెడతాను, లోపల ఉండి పోయి. ప్రశాంతంగా మరణిస్తాను, చూడు. ఒకవేళ నేను మర్చిపోతే నాకు గుర్తుచెయ్యి. మర్చిపోకు. రాబోయే పౌర్ణమిని అలా వట్టిగా పోనీయద్దు.’’కాలం విస్ఫోటాన్ని సైతం పట్టించుకోదు. ఈ పిసినారి, పిచ్చిబ్రాహ్మణుడిని పట్టించుకుంటుందా? పగలు, రాత్రి కాలచ్రకంలో అలా సహజసిద్ధంగా కదలిపోతున్నాయి. చివరగా పౌర్ణమి రానే వచ్చింది. దేవత ఆగ్రహించింది. ఆ పిచ్చాడు ఏం చేయబోతున్నాడో చెప్పనయినా చెప్పలేదు! ఒక్కక్షణం నమ్మకస్తుడి విశ్వాసం సన్నగిల్లితే ఆమె పేరు జపించేవారు ఒక్కరయినా మిగలరు. పౌర్ణమి ముందు రోజు రాత్రి ఆమె తన భర్తకి ప్రమాణాన్ని గుర్తుచేసింది.అతను కోపగించుకున్నాడు, వెర్రెత్తిపోయాడు, ‘‘బుద్ధిహీనురాలా! మంచి నిద్రలోకి వెళ్లే సమయంలోనా చెప్పేది? రేపు ఉదయాన్నే మొదటగా చెప్పు!’’ అన్నాడు.మర్నాడు ఉదయం ఆ బ్రాహ్మణుడు గుడికి వెళుతోండగా, అతని భార్య వేరే పనుల్లోపడి అతనికి గుర్తుచేయడం మర్చిపోయింది. దీంతో అతనికి మరింత కోపం వచ్చింది. ‘‘ఎన్నిసార్లు చెప్పాను. నాకు గుర్తుచేయమని, అయినా నువ్వు మర్చిపోయావ్! నేను యివాళ ఎవరి దగ్గర్నుంచయినా ఓ సుత్తిని తెద్దామనుకున్నాను. చెక్కలు కొట్టడానికి.’’గుడిలో అమ్మవారు ఆలోచనలో పడింది. హారతుల మీద దృష్టి పెట్టలేకపోతోంది. ఆమెకు ఈ బ్రాహ్మణుడి సంగతి బాగా తెలుసు. అతడిని శాంత పరిచేందుకు ఏదో ఆలోచన చేయాలి. అదే మంచిదనిపించింది.సూర్యాస్తమయ సమయానికి బ్రాహ్మణుడు ఆ రోజుకు చివరగా పూజచేస్తున్నాడు. అమ్మవారు విగ్రహం నుంచి వచ్చి ప్రత్యక్షమయింది. తలనించి పాదాల వరకూ ఎంతో విలువయిన వజ్రవైడూర్యాలతో మెరిసిపోతోంది. గర్భగుడి అంతా వేయి దీపాల వెలుగుగా ఉంది. బ్రాహ్మణుడు తల ఎత్తి చూశాడు. తన పక్కనున్న ఒకే ఒక్క భక్తుడు, అదో మహా అదృష్టంగా భావించాడు. ఆమె అంది, ‘‘కుమారా! ఇన్నాళ్లూ నిన్ను పరీక్షిస్తున్నాను. మరి కొంతకాలం వేచి ఉన్నట్లయితే. నీకు ఏకంగా ఇంద్రుని సింహాసనమే లభించేది. కానీ, ముందే నువ్వు సహనం కోల్పోయావు. అయినా ఫరవాలేదు, నువ్వు ఏది అడిగితే అది ప్రసాదిస్తాను’’ అన్నది.అతను భయపడకుండా అడిగాడు, ‘‘నేను ముందే చనిపోతే ఏమవుతుంది?’’ అని.ఆమె నవ్వింది.‘‘అది జరగకుండా చూస్తాను. దివ్యరాజ్యంలో రవ్వంత ఆలస్యం కారణంగా నీ జన్మ చాలా ఆలస్యం జరిగింది.’’ఆమె వచ్చినంత వేగంగా మాయమయితే ఏమవుతుంది? ఏమీ ఉండదు. అందువల్ల అతను చాలా కచ్చితంగా, ‘‘నీ నగలన్నీ నాకివ్వు. మనిద్దరం చాలా ప్రశాంతంగా జీవించొచ్చు.’’ అన్నాడు.‘‘కానీ ఆభరణాలు లేకుండా నేను ఉండకూడదు. మానవులకు దేవతల ఆభరణాలు ఉపయోగపడవు. మీరు తాకితే అవి మట్టిగా మారిపోతాయి.’’‘‘అందుకనా, నేను ఏది అడిగితే అది యిస్తానన్నావు? నాకు కావలసినదే నేను అడిగాను. అయినా, నా యిబ్బందులు నీ నుంచీ దాచలేను. నువ్వు నిజంగా నాకు వరం యివ్వదలిస్తే ఇచ్చేయ్. నీకిష్టమైనది ఇవ్వదలచుకున్నదయినా సరే, యివ్వు.’’ఎంత ధైర్యం! ఆమె అతికష్టం మీద కోపం అణచుకుంది. ఈ భక్తుడి గురించీ ఆమెకు బాగా తెలుసు. సుఖసంతోషాలతో వున్నవాడెవడూ యింత నిర్లక్ష్యంతో ఉండడు. కానీ ఈ బ్రాహ్మణుడు ఎంత భోగాన్ని రుచి చూసినా, చాలా సున్నితమయినవాడు! కనుక ఆమె చింతించనవసరం లేదు. ఇటువంటివాడే చుట్టూ ఉన్నవారంతా అసహ్యంగా కనిపించడానికి ముక్కు కోసేసుకోగలడు. అంచేత అతనికి ఆవేశం కలిగించే వరం యివ్వాలి. చుట్టపక్కల వారందరికీ మరింత వరాలివ్వాలి. అది అతనికి ఈరష్య కలిగిస్తుంది. ఆమె అన్నది, ‘‘ఇన్నాళ్లు నన్ను పూజిస్తున్నావు. అయినా నీ మనసు స్వచ్ఛంగా మారలేదు. నీ హృదయంలోని ఆ అగ్నిని చల్లార్చుకో. అది రేగినప్పుడల్లా యితరులకు సహాయం చెయ్యి.’’సలహా వినడంతో అతను నీరసపడ్డాడు.‘‘ఇదేం మాట? అంతా నాకు ముందే తెలుసు. బోధన చేయడం ఆపి నాకు ఒక్క వరం యివ్వు.’’‘‘నువ్వు నిజంగా కోట్లలో ఒక్కడివి. నీ మొండితనం ఎంతో నచ్చింది. ఆ మూర్ఖులతో నాకు ప్రయోజనం లేదు. ఎప్పుడూ ఏడుస్తూ, అడుక్కు తింటూంటారు. ఇక్కడ నీ ఆసక్తిని నువ్వు పట్టించుకోలేవు. ఇప్పటినుంచీ నీ బాగోగులు నేను చూసుకుంటాను.’’‘‘చాలా సంతోషం. ఇంత గొప్ప ఆలోచనతో పోవడానికి యింత కాలం పట్టిందా?’’అమ్మవారు దయతో నవ్వి, ‘‘నీకిచ్చు వరం వంటిది యింతవరకూ ఎవరికీ లభించలేదు. నీతోపాటు యితరులకూ ఎంతో లబ్ధి కలుగుతుంది.’’‘‘యితరులూ లబ్ధిపొందుతారా? అంతకంటే దారుణం మరోటి ఉంటుందా? ఇలాంటి వరంతో ప్రయోజనం లేదు.’’‘‘ఒకదాని తర్వాత ఒకటి యిలా అనేక కష్టాలు జీవితమంతా అనుభవిస్తున్నావు. కోపగించుకుంటే ప్రయోజనం లేదు. వెళ్లు. ఇవాళ్టి నుంచీ నువ్వు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది.’’‘‘దీన్ని వరం అంటావా? శాపం కన్నా దారుణం! నీవు ఇచ్చిన ఈ వరంతో పోలిస్తే నా దారుణమయిన జీవితమే వేయి రెట్లు నయం. తెలివిలేని నీ వరాన్ని వెనక్కి తీసుకో, నన్ను వదిలేయ్’’ అన్నాడు.అతను ఆ మాట అనగానే ఆమ్మవారు కనిపించినంత వేగంగా ఆశ్చర్యంగా మాయమయింది. ఆలోచనలో పడ్డాడు. ఇంటికి వెళ్లి ఈ సంగతి తన భార్యతో చెప్పాలనుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత అమ్మవారు ఒక వరాన్ని యిచ్చింది.’’అతనికి ఎంతో ఆనందంగా ఉంది. అతను గుడి నుంచీ యింటికి వెళ్లాడు. గుమ్మంలో అతని భార్య వేచి ఉంది. ‘‘ఏమయింది? ఏమిటా తొందర?’’ గాబరాతో అడిగింది.బ్రాహ్మణుడు తనకు అమ్మవారు వరం యివ్వడం గురించీ అంతా పూసగుచ్చినట్టు వివరంగా చెప్పాడు ఇన్నాళ్లూ ఆమె పడ్డ కష్టాలు కష్టాలు కాదన్నంతగా అయింది. ఆమె ఆనందానికి అంతేలేదు. అతనితో అంది, ‘‘నాకు తెలుసు పూజల్లో యిన్నాళ్లు గడిపిన సమయమంతా వృ«థాపోదని.’’‘‘గొప్ప ఫలమా? ఏమంటున్నావు? నేను ఏదో పొందితే అది యితరులకు అంతకు రెండింతలు లభిస్తుంది. ఇంతకంటే దారుణ శాపం విని ఉండవ్. నువ్వుగాని భంగు తాగావా?’’‘‘మహిళగా నేను మీకు సలహానిచ్చే అర్హత లేకపోవచ్చు. కానీ, నిజానికి యితరులకు మనకంటే రెండింతలు లాభిస్తే నష్టమేమిటి? ఇన్నాళ్లూ ఎన్నో కష్టాలను భరించాం. మనం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం. సౌఖ్యమేమిటో మనకూ తెలుస్తుంది. యిక మీ యిష్టం. దాన్ని గురించి ఆందోళన చెందాల్సిందేముంది? మీ నిరాశతో నా అదృష్టాన్ని కాదనుకుంటాను. మీరు నాకు ఈ చిన్న ఆనందపు మెరుపు ఎందుకు ప్రసాదించలేదు?’’‘‘నువ్వు చెప్పింది సబబే. అదెలా పనిచేస్తుందో చూద్దాం.. ఏమయినప్పటికీ అమ్మవారు మనకు మార్పు తేవడానికి వరం యిచ్చిందేమో?’’ అన్నాడు సాలోచనగా.కానీ మొదటగా ఏమి కోరుకోవాలి? హఠాత్తుగా అతనికి తన పగిలి పోయిన పైపు, ఖాళీ గంజాపాత్ర గుర్తుకు వచ్చాయి. ‘‘అమ్మా, నువ్విచ్చిన వరమే నిజమైతే, నాకు ఓ కొత్త పైపు, గంజాతో నిండిన పాత్రనీ ప్రసాదించు’’ అన్నాడు.అతని పెదవుల నుంచి మాట బయటకు వచ్చిందో లేదో, కోరిన బహుమతులు ప్రత్యక్షమయ్యాయి. అవి చూసినవారు ఆశ్చర్యంతో బొమ్మల్లా ఉండిపోయారు. ఇంత సులభంగా ప్రతీ కోరికా తీరితే, వారి ఆనందానికి అంతేదీ! గంజాను పైప్ నిండా కుక్కి దాన్ని అంటించడానికి అతని భార్య నిప్పుకణిక తెచ్చింది. తర్వాత ఏం కోరుకోవాలో ఆలోచిస్తున్నాడు. జీవితమంతా వాళ్లు నానా కష్టాలూ పడ్డారు. ఇప్పుడు మంచిది ఏది అడగాలి? ఇదా లేక అదా, అదా లేక ఇదా? మనసు ముడి వీడటం లేదు. కోరడానికి అనేకం ఆలోచించాడు. భార్యను సంతోష పెట్టడానికి పిండి, ఉప్పు, సుగంధద్రవ్యాలు, వంటచెరకు కావాలి. ఒక నిమిషం కొన్ని వస్తువుల గురించి అడుగుతాడు. మరుక్షణం అవి అతని ముందుంటున్నాయి.భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యంలో తలమునకలవుతున్నారు. పొయ్యి వెలిగించడానికి అతని భార్య పరిగెట్టుకెళ్లింది. ఎందుకు సందేహించడం? అతను ఎంత ఆనందంగా ఉన్నాడో అంతగా యిబ్బందిపడుతున్నాడు. అతని చుట్టుపక్కలవారు రెండింతలు పొందుతున్నారు. అదేం తప్పుకాదే.బ్రాహ్మణుడి భార్య తన భర్తకి భోజనం పెట్టి తాను తినడానికి కూర్చుంది. సంతృప్తిగా భోజనం చేయడం కంటే ఆనందం మరోటి ఉండదు. బ్రాహ్మణుడు తన జీవితంలో మొదటిసారి సంతృప్తిగా భోజనం చేశాడు. కానీ అది విచారపరిచింది. తన భార్య దగ్గరికి వెళ్లి ‘‘నాకో పని చేసిపెడతావా?’’ అని అడిగాడు.‘‘నీ మాటను ఎప్పుడన్నా కాదన్నానా? ఇంత హఠాత్తుగా అడిగారు?’’‘‘కాదంటే, నేనే సమాధానం చెబుతాను. ఊళ్లోకి వెళ్లు. ప్రతీ యింటా మనకంటే రెండింతలు ఉన్నదీ లేనిదీ చూసిరా.’’‘‘ఇతరుల సంగతి మనకెందుకు? మనం యిప్పుడు చిన్న దీపందివ్వె కోసమయినా యితరులను అడుక్కోనక్కర్లేదు. అంతేగాదు ప్రతీవారు మీ వల్లనే ఎంతో సమృద్ధులవుతున్నారు. మనకంటే తక్కువేమీ అభివృద్ధి చెందడంలేదు!’’ఆమె యిల్లు చేరేసరికి ఆమె భర్త విచారంతో కూచోనున్నాడు. ఆమె రాక తెలిసి తలెత్తి, ‘‘నిజమేనా? మనకంటే వాళ్లంతా రెండింతలు పొందారా?’’ అడిగాడు.పూజారి భార్య అవునని చెప్పగానే, అతనికి చెవుల్లో తుపాకులు పేల్చినట్లయింది. అతనికి తెలియనివాటి గురించి అతనికి దిగులు లేదు, కానీ, తన గ్రామంలో ప్రజలంతా పొందుతున్నవాటి గురించి అమితాశ్చర్యపడ్డాడు. కనీసం ఒక్కరైనా కృతజ్ఞతలు చెప్పలేదు. దుర్మార్గులు ఒక మాట అనలేదు. ఇటువంటి ద్రోహులకు సహాయపడటం పాపం అనుకున్నాడు. పిచ్చెత్తిపోయాడు. మంచంమీద పడిపోయాడు. అతని భార్య అతని చేతులు, కాళ్లూ రుద్దడం ఆరంభించింది.కొంతసేపటికి అతన్ని ఇలా శాంతపరిచింది, ‘‘ఏమీ లేనివాని కోసం ఎందుకు అంతగా బాధపడతారు. లోకం కాలిపోని, మనకేంటి?’’ అంది.‘‘అంత సులభంగా అందరినీ అలా వెళ్లనిస్తాను? అదే నిజంగా జరిగితే, నేను నిశ్చింతగా ఉంటాను.’’‘‘శ్వాస ఉన్నంతకాలమే ఈ లోకం ఉండేది. నీ గురించీ జాగ్రత్తపడు. మిగతావన్నీ సక్రమమవుతాయి. అద్దంలో చూడు. ఎంత ఆరోగ్యంగా ఉండేవాడివి. నా కళ్ల ముందే చిక్కి శల్యమయ్యావు. ముందు ఆరోగ్యంగా తయారవు. తర్వాత నువ్వు ఏం చెయ్యదల్చుకుంటే అది చేద్దువుగానీ. జీడిపప్పు, పాలు తీసుకురా నీకు పాయసం, లడ్డూ, హల్వా చేస్తాను రాత్రి భోజనంలోకి.’’ఆమె అడిగింది‘‘నా చేతులతో నేనే వీటిని వండాలా? నాకు మంచి పెనం, వెండి గిన్నెలు కావాలి.’’ అని.ఆశ్చర్యంగా బ్రాహ్మణుడు జాబితాలో పెనం, గిన్నెలు వేపు చూశాడు. వంటసామగ్రి ఆమె ఎదుట క్షణంలో ప్రత్యక్షమయ్యాయి. ఆమె హల్వా చేయడానికి యిక ఆట్టే సమయం పట్టలేదు.బ్రాహ్మణుడు నోరారా వేడి వేడి హల్వా తిన్నాడు. తర్వాత తన భార్యవంక చూసి, ‘‘నేను కలగంటున్నానా? కళ్లు తెరిచే ఉన్నాయా? నన్ను సరిగా చూసి చెప్పు.’’‘‘ముందు నువ్వే చెప్పు, తెరిచే ఉన్నాయా?’’‘‘అవును. విప్పారి ఉన్నాయి. ఇవాళ మన సొంత పొయ్యి మీదే హల్వా చేసుకున్నాం. నిన్నటి వరకూ ఊహించనివన్నీ ఇవాళ మన కళ్లతో చూస్తున్నాం.’’వాళ్లకి తెలీకుండానే, ఆనందం అనుభవించాలన్న కోరిక బలంగా కలిగింది. ఇవాళ్టివరకూ కష్టాలు అనుభవించారు. భరించలేని నష్టాలు భరించారు. ఇప్పుడు వీలయినంత ఆనందాన్ని ఆశిస్తున్నారు. మిగతా లోకమంతా తొలగిపోయింది.తెలవారుతోంది. నక్షత్రాలతోటి చీకటి నేలపైకి దిగుతోంది. పక్షులు కిలకిలా రావం, పాటతో అందెలసవ్వడి చేస్తోన్నాయి. అద్భుతం, నక్షత్రాలు ఆగి చూస్తున్నాయి! అలాంటి పల్చటి చీకటి తెర! చల్లని చిరుగాలి లోకం ఆహ్లాదం కలిగిస్తోంది. లోకం ఎంత బావుందో చూడ్డానికి యిపుడు! ‘‘మనకు కొన్ని ఆవులు, ఎద్దులు ఉంటే ఎలా ఉంటుంది? కోరుకున్నప్పుడల్లా పెరుగు, మీగడ ఉంటుంది.’’‘‘ఇలాంటి వరంతో చిన్నవాటిని కోరడమెందుకు? మనం అనుకున్నంత హాయిగా ఉండవచ్చు.’’హఠాత్తుగా బ్రాహ్మణుడి మనసులో ఓ ఆలోచన మెరిసింది. ‘‘అసలు అమ్మవారిపైనే ఓ తమాషా చేస్తే ఎలా వుంటుందంటావ్? ఇంటికి కావలసిన చిన్న చిన్నవాటిని ఎలాగూ ఇస్తుందనుకో. కానీ నిజంగా మనం ఎంతో ఘనమైనదే కోరితే? చేతులు జోడించి కోరుకున్నాడు, ‘‘ఓ తల్లీ, నా మాట ప్రకారం మహిమాన్వితవే అయితే, బంగారు భవంతి కావాలన్న నా కోరిక తీర్చు. అందుకు సరిపడా బంగారు వస్తుపరికరాలు అమర్చు.’’ఆ మాటలు అతని నోటనుండి వచ్చిన తక్షణమే ఓ అద్భుత బంగారు భవంతి అతని చుట్టూ వచ్చేసింది. సరిగా నవారు లేని తుక్కి మంచం బంగారంగా మారిపోయింది! అతను లేచి కూచున్నాడు, అమితాశ్చర్యపోయాడు, నోటమాటరాలేదు. ఆవుపేడ అలికిన బలహీనమైన గోడలు మంచి పసుపు ఛాయలోకి మారాయి. కళ్లు నులుముకుని మరీ చూశాడు. దుర్లభమయిన తన కోరిక నిజంగానే నిజమయినదా? పక్కనే అతని భార్య నిలబడింది, ఆశ్చర్యంతో నోటమాటరావడం లేదు. ఇదేమి లీల.అతని భార్య బంగారు దీపం వెలిగించింది. అతను భార్యతో అన్నాడు, ‘‘మనం అసలు నేరుగా ఈ భవంతినే కోరుకొని ఉండాల్సింది! ఉప్పు, వంటనూనె రెండింతలయ్యుండేవి, కానీ ఆమె ఇలాంటి రెండు బంగారు భవంతులు కల్పించడం చూడాలనుంది’’. దేవతకి ఈ కరుణ ఇరవయ్యేళ్ల క్రితమే కలిగి ఉంటే అతని జీవితం ఎంతో బాగుండేది. కానీ ఇపుడు వాళ్లు ఈ అద్భుత భవంతిలో ఎన్నాళ్లు సుఖంగా జీవించాలి? తన భార్యతో అన్నాడు, ‘‘నువ్వు ముసలిదానివయ్యావు. ఇలాంటి భవంతిలో ఉండే వ్యక్తి ఎంతో ఆరోగ్యంగా, యవ్వనంతో ఉండాలి.’’‘‘నువ్వు నాకంటే ఘోరంగా వున్నావ్. నా గురించి ఆందోళనపడకు. నేను నీకంటే ముందే ఈ లోకాన్ని విడిచివెళ్లాలన్నదే నాకోరిక. బంగారుభవంతిని నా కళ్లతో చూశాను, ఇంతకంటే నాకింకేమి కావాలి? ఒక్క ఆలోచన.. అమ్మవారు మనల్ని యవ్వనంలోకి తీసికెళ్లలేదా?’’‘‘అరే, నిజమే, ఎందుకు తీసికెళ్లలేదు? నా మనసుకు ఏమయింది! పోనీలే, ఆలస్యమైనా ఫరవాలేదు. ’’అతను అడిగిన మరుక్షణం వారిద్దరినీ అమ్మవారు యవ్వనవంతుల్ని చేసింది. వారి యవ్వనం తిరిగివచ్చింది. ఇలాంటి లీలను కనీసం కలలోనైనా ఎవరూ ఊహించరు. కానీ ఇద్దరూ మళ్లీ యవ్వనంలోకి వచ్చారు! రెప్పపాటు కాలంలో ఆ అద్భుత రాత్రి గడచిపోయింది.మర్నాడు తెల్లవారుతుండగానే బ్రాహ్మణుడు నిద్రలేచాడు. ‘‘ఇవాళ్టిలా సూర్యుడు ఎన్నడయినా సరికొత్తగా ఉదయిస్తాడా?’’ అతను ఆశ్చర్యపోయాడు.అతను బంగారు మెట్లు ఎక్కి బంగారు మేడ మీదకి వచ్చాడు. చుట్టూరా అంతటా బంగారు భవంతులే. లెక్కలేనన్ని సూర్యులు ఉదయించినట్టుంది. అసూయతో అతని హృదయం మండిపోయింది. ఇతరులకు తన వల్ల ఎంతో మంచి జరుగుతుందని, ఎంతో ఆనందంగా ఉన్నారన్న ఆలోచనే అతనికి మింగుడు పడదు. ఇంత కంటే ప్రారబ్ధం ఉంటుందా?అతనో ప్రమాదకర చిట్టడవిలో ఇరుక్కున్నాడు. అతని హృదయంలో మంటలు మరింత పెరిగాయి, సూర్యుడిని సైతం కాల్చివేసేంతగా ఎదిగాయి. సహజసిద్ధమయిన అతనిలోని జంతువులు.. నక్క, కాకి, పులి, పాము అన్నీ క్రూరంగా తిరుగుతున్నాయి. రేబిస్ వచ్చిన కుక్కలా అరుస్తూ గుండ్రంగా తిరుగుతూన్నాడు.‘ ‘నా కళ్లలో ఒకటి గుడ్డిదే కాని! ఓ చెవి చిల్లుపడనీ! అంతులేని లోతు బావి నా భవంతి మధ్యలో పడని!’’ అన్నాడు.ఆ మాటలు అతని నోటినుండి రాగానే అతని భార్య గట్టిగా బాధతో అరిచింది. ‘‘భగవంతుడా, ఏం జరుగుతోంది? మా అద్భుత భవనం కనుమరుగవుతుందా? ఎదుగుతున్న సూర్యుడు భూమిలోకి పడిపోతాడా?’’ఏం జరుగుతోందో అతనికి అర్థమయింది. పరుగు పరుగున బంగారు మెట్లు దిగి భార్య వద్దకి వచ్చాడు. ఆమె తన ముందున్న గోడను పట్టుకుని ముందుకు వెళ్లబోయింది. అప్పుడే వచ్చిన బ్రాహ్మణుడు ‘‘ఆగు, అక్కడే ఆగిపో! ఒక్క అడుగు ముందుకేస్తే పెద్దగొయ్యి ఉంది నీముందు!’’ అంటూ గట్టిగా అరిచాడు. కానీ ఆమెకి అతని మాట వినపడలేదు. అలా ముందుకు కదిలింది. ఆమెను పట్టుకోవడానికి గెంతాడు. కింద ఎక్కడో పడిన శబ్దం వినపడింది. ఆమె అతన్ని వదిలిపోయింది. ఆ తరువాత అతను ఇరవై నాలుగు కోసుల దూరం వరకూ ప్రతీ ఇల్లూ, ప్రతీ గ్రామం తిరిగాడు. అతను ఏ గ్రామానికి వెళ్లినా అతను ఒక్క కంటితోనే చూడగలుగుతున్నాడు, ప్రజలు ఒకరి తర్వాత ఒకరు ఆ బావుల్లో పడుతున్నారు. అంతానికి ఆట్టే కాలం పట్టలేదు. అతను దయ్యంలా అరిచాడు. మృత్యువు వొడిలోకి దారి తీయించిన తన రెండు బంగారు భవంతులపట్ల ఎంతో సంతసించాడు!ఇప్పుడు తాను అన్ని బంగారు భవంతులకు ఏకైక యజమాని. కాదని ఎదిరించడానికి ఎవరూ లేరు. రోజుకో కొత్తభవంతిలో నిద్రబోతున్నాడు. అతనికిలా రెండేసి పొందడానికి ఇపుడు ఇక ఎవరూ లేరు. అమ్మవారు అతనికి వరం ఇచ్చి ప్రయోజనమేమిటి? వరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అతనికి బాగా తెలుసు. కనుక అమ్మవారిచ్చిన వరమూ చివరికి పోయింది. ఆనందంతో ఎగిరి గంతేశాడు, చేతులు పైకెత్తి తన ఒక్క కంటితో బంగారు భవంతులను చూసుకున్నాడు. కానీ అతని అత్యంత ఆనందకర సమయాన్ని చూసేందుకే ఎవరూ లేకపోవడం చాలా దురదృష్టకరం.‘చౌబోలీ అండ్ అదర్స్టోరీస్’ నుంచి మూలం : విజయదన్ దెత (రాజస్థాన్) అనువాదం: టి. లలితప్రసాద్ -
ఈగ వాలింది
నాన్న నిస్సత్తువగా నులక మంచం మీద పడుకుని వున్నాడు. అతని చేతిమీద ఈగ వాలింది. అప్రయత్నంగా తోలేడు. నాన్న...నా చిన్నప్పుడు వూరు అతని మాట కోసం ఎదురుచూసేది. అతడు మా చుట్టుప్రక్కల గ్రామాలకు ఒకే ఒక్క చిత్రకారుడు. అతడు ‘వూ’ కొట్టేడంటే ఆ ఇంటిగోడమీద బొమ్మ తయారైపోయినట్టే. వూరు పండుగ జరుపుకోవాలంటే నాన్న గోడల మీద బొమ్మవేయాల్సిందే. బొమ్మ వెయ్యడానికి దీసరి ముహూర్తం చూసేవాడు. ఆ ముహూర్తానికే కొండమొదులుకెళ్ళి జేగురు మట్టి సేకరించి బొమ్మ మొదలుపెట్టేవాడు. ‘‘దేనికి నానా?’’ అని అడిగేవాడిని‘‘ఇంటిగోడ మీద ఈ జేగురెక్కాల’’ అనేవాడు. ‘‘అదే దేనికి?’’ తిరిగి ప్రశ్నించేవాడిని. ‘‘జేగురు రంగు దేవతల కోసం’’అనేవాడు. తవ్వుతున్న మట్టి వైపు చూసేవాడిని. నిజంగానే దాన్ని చూస్తుంటే ఎర్రబడిన దేవత కళ్ళులా కనిపించేది. ఇంటిగోడమీద వున్న జేగురు బొమ్మ నా కళ్ళముందు నిలబడేది. ‘‘ఈ రంగు దేవతలకిష్టమైన రంగు’’ అనేవాడు. జేగురు ఎరుపు దేవతల రౌద్రానికి గుర్తు. ఎర్రజేగురుకి గెడ్డలోని చెలమ నీళ్ళే కలిపి రంగుతేవాలి. ‘‘తేకపోతే?’’ అడిగేవాడిని‘‘ఆ రంగు రాదు... దేవతలు శాంతించరు... శలమనీళ్ళైతేనే చల్లగా వుంటాయి, దేవతలూ మనల్ని చల్లగా చూస్తార’నేవాడు. పెరటిలోని ఆనప పాదు కిందకెళ్ళి బాగా ఎండిపోయిన ఆనపతుంబని కిందికి దించేవాడు. అది కొన్నాళ్ళకి బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని కాల్చేవాడు. ‘‘ఎందుకు నానా?’’ అడిగేవాడిని ‘‘ఇది మసి సేసి నల్లరంగు సెయ్యాల’’ అనే వాడు. ఒక్కోసారి వరిగడ్డిని కూడా కాల్చి ఆ మసిని నల్లరంగు కోసం వాడేవాడు. ‘‘ఇదే ఎందుకు?’’ అని అడిగేవాడిని. ‘‘నలుపంటే పంటలు పండకపోవడం. చేనుమీద దయ్యాలు తిరిగాయని అర్ధం’’ అనేవాడు. ‘ఇంటిగోడ మీద నల్లరంగు లేకపోతే పంటలు పండవు. పండినా పీడ వదలదు’కలిపిన పెతీ రంగూ జాగర్తగ కలపాల. నేకపోతే ఆ రంగు పండదు. పండకపోతే ఆ ఇంటికి నష్టం జరగొచ్చు.గోడమీదవేసిన బొమ్మల్లో మరొక రంగు తెలుపు. వరిబియ్యం గానీ కొర్రబియ్యం గానీ స్వయంగా రోకలిలో దంచి పిండి చేసేవాడు. పిండిలో వేడి నీళ్ళు కలిపి తెలుపుని కలుపుకునేవాడు. చలిరోజులు ముదిరే నాటికి బొమ్మలు గీయడం మొదలయ్యేది వూర్లో. చుక్కల పండుగ, కందికొత్తలూ,ఆగం పండుగ సమయాల్లో కొత్త బొమ్మలు మొలుచుకొచ్చేవి కొందరిళ్ళలో. నాన్న చేతిలో తయారయిన ఆ రంగులు నాకు అత్యంత ఆకర్షణీయంగా వుండేవి. గోడమీద జంతువులు ఒక దిక్కున... మొక్కలు మరోదిక్కున...దేవతలు మరోదిక్కున. శ్రమిస్తున్న మనుషులు మధ్యలో. ఎవరు ఏ దిక్కున వుండాలో నిర్ణయించేదిదీసరి. ఆవిధంగానే నాన్న చేతిలోంచి బొమ్మ రూపుదిద్దుకునేది. నాన్న కొండ పనులు చేసుకుంటూనే వూర్లో అన్ని ఇళ్ళకూ బొమ్మలు గీసేవాడు. బొమ్మ గీసినందుకు సంతోషంగా ఎంతో కొంత నగదు ముట్టజెప్పేవాళ్ళు. తొలి రోజుల్లో తీసుకునేవాడు కాదు గానీ, అందరూ ఇస్తూ వుండడంతో ఆ డబ్బుని తీసుకునేవాడు. చేతినిండా పనితో మనిషీ నిండుగా వుండేవాడు. అతని బొమ్మ ఇంటిలో వుండాల్సిందేనని పొరుగూరు వాళ్ళూ నాన్నని తీసుకువెళ్ళి వేయించుకునే వాళ్ళు. ఆ బొమ్మ...శాంతినిస్తుంది ఇంటికి. కాపాడుతుందని నమ్మకం.కానీ...ఈ రోజు?ఆ బొమ్మ లేదు గోడమీద. ఆ గోడ మట్టినొదిలి సిమెంటు ధరించింది. మిద్దిల్లు రేకిళ్ళుగా మారి స్లాబిల్లుగా రూపాంతరం చెందింది. తెల్ల సున్నం గోడగా వున్నన్నాళ్ళూ జేగురు మాత్రమే బొమ్మగా నిలిచి వుండింది. మరికొన్నాళ్ళకు అదీమాయమైపోయింది. ఈ రోజు నాన్న నిస్సత్తువగా పడుకునివున్నాడు నులక మంచమ్మీద. ఈగ వాలితే తోలుకున్నాడు. నాన్న పులిమిన రంగులు నాచేతికంటాయి. స్కూల్లో టీచర్ చెప్పిన బొమ్మ చిటికెలో తయారైపోయేది కాగితమ్మీద. డ్రాయింగ్ పోటీల్లో స్కూలు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బహుమతులు గెలుచుకున్నా కడుపునిండడానికి అవి సరిపోవని కొద్ది రోజులకే తెలిసిపోయింది. ఓ రోజు నాన్న స్కూలుకి దిగబెడుతూ ‘బొమ్మలు బతుకు పెట్టవురా! సక్కగ సదువుకో’ అనడం నాకు గుర్తుంది. సర్టిఫికేట్లు చేత బట్టుకునిఐటీడీయే ముందు గ్రీవెన్స్ లైన్లో నిలబడ్డాను కాలేజీ చదువులు పూర్తయ్యాక. ఆ కొన్ని రోజులకి బొమ్మలే కాదు చదువు కూడా బతుకు పెట్టదని తెలిసిపోయింది. ఐటీడీయే చుట్టూ తిరిగితే యూత్ ట్రైనింగ్ సెంటర్లో చేరమని సలహా ఇచ్చేరు పీవో గారు. అక్కడ చేరాక తెలిసింది. వాళ్ళు ఇచ్చే శిక్షణ నాకు చాలా కష్టమైనదని. ఎలక్ట్రిక్ వైరింగ్, సెల్‌ఫోన్ రిపేరింగ్, హోటల్‌మేనేజ్‌మెంట్ లాంటి పనులు... ఏవీ నాకు సరిపడనివి... చేతకానివి. అవి నేర్చుకున్నా వాటిమీదే బతకాలంటే పెట్టుబడి కావాలి. మామూలు పెట్టుబడి కాదు. పోటీలో నిలబడగలిగే పెట్టుబడి కావాలి. అది లేకుండా నిలబడాలంటే నాకు సాధ్యం కాలేదు. అందుకే తిరిగి వూరు చేరాను. వూరు ఖాళీగా కనిపించింది. ఉపాధి పనులు చాలక ఇంకా డబ్బులు సంపాదించడం కోసం వూరొదిలి చెన్నై, బెంగుళూరు లాంటి మహా నగరాలకు వలసపోయిన వాళ్ళతో వూరు మరింత నిశ్శబ్దాన్ని సంతరించుకున్నది. అప్పుడే... వూరిలో పెళ్ళి కవుర్లకని నాగయ్య బావ ఎదురయ్యేడు. ‘‘బావా! ఇంటి కడ మీ చెల్లి పెల్లి గదా ఇంటి గోడ మీద బోర్డు రాయవా?’’ అని అడిగేడు కార్డు చేతిలొ పెడుతూ. ‘‘ఎందుకు రానూ? బోర్డుకి ఎంతిస్తావైతే?’’ అన్నాను ఇగటమాడుతున్నట్టే‘‘నీనెప్పుడేనా ఒట్టిన పని చేయించుకున్నానా సెప్మి? నువ్వింత అను. ఇచ్చెస్తను’’ అని ఆ ఇంటి అరుగు గోడమీద ఎగురుతున్న జంట పక్షులు... ఇరువైపులా చెట్లు... మధ్యలో పారుతున్న గెడ్డ బొమ్మ వేస్తూ ‘పార్వతి వెడ్స్ చిరు’ అని రాసేను. దానికి ‘మండంగి వారి పెళ్ళి పిలుపు’ అని కాప్షన్ ఇచ్చాను.ఆ బొమ్మకి వూర్లో వాళ్ళు అందరూ మెచ్చుకుని ‘మరేమైతే... దీని కోసం ఎవుడికో పిలిసి డబ్బులు తగలెయ్యడమేలా?’ అని వూర్లో ఎవరి పెళ్లైనా ఆ ఇంటి గోడ మీద బోర్డు నేనే రాసేవాడిని. దానికోసం మార్కెట్లో దొరికే వార్నీస్సే వాడే వాడిని. ఆ కొన్నాళ్ళకు ఎలిమెంటరీ బడి గోడల మీద చిన్న చిన్న బొమ్మలు అక్షరమాల, ఎక్కాల వరసలు రాయమంటే రాసేను. అప్పుడప్పుడూ గూడేల్లో కొత్తగా కట్టిన గుడి, చర్చీల్లో కూడ బొమ్మలు వెయ్యడానికి వెళ్ళేవాడిని. శివపార్వతులూ, సరస్వతీదేవి, యేసుక్రీస్తు... ఏదైనా. వాటర్ కలరో... వార్నీసో వాళ్ళేది కోరుకుంటే దానితో వేసేవాడిని. దానితో చుట్టు ప్రక్కల వూరోళ్ళందరూ ‘బొమ్మల గవరయ్యా!’ అని ప్రేమగా పిలిచేవాళ్ళు. ఆ పిలుపు నాకూ ఆనందాన్నిచ్చేది. సరదా అనిపించేది. ఆ సరదా నాకు ఎన్ని రోజులో నిలవలేదు.వూర్లో ఓ రజస్వల ఫంక్షనైతే బోర్డు రాయడానికి నన్ను పిలవలేదు. భోజనాలకి వెళ్ళినపుడు చూసేను. ఆ అమ్మాయి నిలువెత్తు ఫోటో... రకరకాల పోజుల్లో అందంగా నిలబడి వుంది ఫ్లెక్సీ రూపంలో. ‘‘ఎలగుందివోయ్ దద్దా?’’ అని అడిగేడు అది చేయించిన సుబ్బారావు దద్ద దాన్నే చూస్తూ నిలబడివున్న నా వెనక చేయి వేస్తూ.‘‘మరెందుకూ నీకు ఇబ్బంది పెట్టడం... తొందరగైపోద్ది గదాని నీకు పిల్లేదువోయ్.. ఏటనుకోకు’’ అన్నాడు. ఇంటికొచ్చి మంచమ్మీద కూర్చున్నాను. మంచం పక్కనే నా పెయింటింగ్ సామాన్లు పెట్టుకున్న పెట్టి. అప్రయత్నంగా దాని వైపు చూసేను.దానిమీద ఈగ వాలింది. తోలాలనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. ఎంత అదిలిస్తున్నా అది వాలుతూనే వుంది. ‘క్లిక్’ మని శబ్దం వినపడ్డంతో అటు చూసేను. పెళ్ళిఫొటోలు తీస్తున్నాడు కురపాం సుధ.కేమెరా మీద ఎండ పడకుండా పేపరు అడ్డు పట్టుకోమన్నాడు. పట్టుకున్నాను. ఆ సాయంత్రం అతనితోనే నడిచి వెళ్ళేను స్టుడియోకి. ఆ వెళ్ళడం రోజూ అలవాటైపోయింది. అక్కడికి రోజూ రమ్మన్నాడుసాయంగా వుండడానికి. అలా వెళ్ళిన నేను కంప్యూటర్ ముందు కూర్చుని చిప్‌లోని ఫోటోలను లోడ్ చేసి ప్రింట్ ఇవ్వడం నేర్చుకున్నాను. అక్కడితో ఆగిపోకుండా ఫోటోషాప్ కూడా నేర్చుకున్నాను. అది మొదలు, స్టుడియో సుధర్శనతో ప్రోగ్రాములకి వెళ్ళడం ఫోటోలు తీయడం లాంటి పనులకు కూడా అప్పగించేవాడు. ఆక్రమంలోనే ఫోటో షాప్ నేర్చుకున్నాను. స్టుడియోలో పనులన్నీ చేయగల సామర్ధ్యం సంపాదించేను. ఇంటర్నెట్ కూడా వుండడంతో ఆ పనులూ అప్పజెప్పేవాడు. కొన్ని రోజుల తర్వాత అతను వూరు మారిపోయేడు. అక్కడ ఇంతకన్నా పెద్ద షాపింగ్ మాల్ బిజినెస్ కోసంఓనరు వెళ్లిపోవడంతో అక్కడ కూడా తనలాంటి వాళ్ళు అవసరముంటుందని ‘నేనూ వచ్చేస్తాను సార్!’ అన్నాను. దానికతను ‘నువ్వాపని చెయ్యలేవ’ని సున్నితంగా తిరస్కరించేడు. ఏమి చెయ్యాలో తెలీలేదు. స్టుడియో షిఫ్టింగ్ సమయంలో నాకొక కొత్త ఐడియా వచ్చింది. పాత కెమేరాలని ఒక డొక్కులో దాచి పెడుతున్నాడు ఓనరు. ‘‘సార్! నాకో సాయం చెయ్యండి’’ అన్నాను. ఏమిటన్నట్టు చూసేడు ఓనరు. ‘‘నేనెలాగా మీ కొత్త షాపులో పనికి పనికి రాను. మీ పాత కెమేరా ఒకటి ఇప్పించండి’’ అన్నాను. ‘‘ఒరేయ్! ఇది చాలా కాస్ట్లీ కెమేరారా’’ అన్నాడు. ఇవ్వడం కుదరదన్నట్టు. బ్రతిమాలేను.‘‘సాయం చెయ్యండి. మీ రుణముంచుకోను’ ఆ రేటుని ఇన్స్టాల్మెంట్ల మీద తీర్చుకుంటాను’’ అన్నాను. మొదట్లో ఒప్పుకోకపోయినా... కాసేపటికి ఒప్పుకున్నాడు. అనుకున్నది సాధించాననే గర్వంతో తొలి రోజుల్లో చాలా వేగంగా పనులు చేయడం ఆరంభించాను. కొన్ని రోజులాగి ఒక కొత్త కేమెరా కొనుక్కోవచ్చని ఊహతో వున్నాను. కానీ... పెళ్ళి ఫోటోలు తీయడం... కరిజ్మా ఆల్బవ్ు చేయించి ఇవ్వడం... ఆధార్, రేషన్ కార్డులకి కూడా పాస్ఫోటోస్ తీయడం కూడా చేసేను. వూర్లో అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు రావడంతో ఆ పని కూడ కాస్త తగ్గింది. అందరూ వాట్సప్ ల్లో లైవ్ కవరేజీల్లో బిజీ అయిపోయేరు. ఇన్స్టాల్మెంట్లు తీరేసరికి... నా కెమేరా మీద కూడా ఈగ వాలింది. దాన్ని తోలుతూ అలిసిపోయాను గానీ, అది వాలడం మానలేదు. అలిసిన కళ్ళను మూసి నిదురలోకి జారిపోయేను. కళ్ళు తెరిచి చూస్తే... ఎదురుగా డిగ్రీ చదువుతున్న కొడుకు... సంతు.‘‘నానా! బయల్దేరుతున్నూ...’’ అని బేగ్ సర్దుకుంటున్నాడు. దిగులేసింది వాడిని చూసి, వాడి భవిష్యత్తుని తలచుకొని. నాలాగా పని చేయలేడు. సదువున్నోడని ఉజ్జోగం గేరంటీ లేదు. ఎందుకంటే ఆడి కన్నా ఎక్కువ సదివినోలు బోల్డుమంది వున్నారు వూర్లో. హాష్టల్లో వుండి కాలేజీ కెల్తున్నోడు. కరుసుల కేటి సేస్తున్నాడో! మొన్న సంతలో అమ్మిన పనసకాయల డబ్బులు తీసి వాడి చేతిలో పెట్టేను. నులక మంచమ్మీద కూర్చుని బూటు తాడు కట్టేసి నిలబడ్డాడు. అడ్డంగా తల వూపి ‘‘ఒద్దు నీదగ్గరే వుంచు’’ అని పేంట్ ఎనకజోబీ నుంచి పర్సు తీసి ఐదొందల కాగితం తీసి నా చేతిలెట్టేడు. ఆశ్చర్యపోయేను. నాకు తెలిసి ఈమద్దిన కూలికెల్లలేదు సంతు. ఉపాదిహామీ డబ్బులు రాలేదు. పెరట్లో పనస కాయలు తప్ప ఏదీ సంతలో అమ్మలేదు. అదే అడిగాను...‘‘ఎక్కడివిరా డబ్బులు?’’ నా గొంతులో కంగారునీ, అనుమానాల్నీ దూరం చేస్తూ చెప్పేడు. ‘‘నువ్వేమీ గాబర పడిపోకు నానా... నీనేమీ తప్పు చేయలేదు’’ అని మంచమ్మీదకూర్చున్నాడు.‘‘పగలు కాలేజీ కెల్లినా... రాత్రి పనికెల్తున్నాను’’ అన్నాడు బేగు వీపుకి దోపుకుంటూ. ‘‘ఏం పనిరా?’’ నా అనుమానాలు తీరలేదు. ‘‘పుట్టీ పని. రాత్రంతా రంగులేయడమే’’ అని బయల్దేరేడు పచ్చకాగితం నా చేతిలో పెడుతూ. వూరు దాటి కొండ మలుపు తిరుగుతున్న వాడు రాత్రికి రంగులు వేస్తున్న వాడిలా కనిపించేడు. కానీ... మరుక్షణమే భయమేసింది. ఆ రాత్రి మీద ఈగ వాలితే?!?అలా మొదలైన నా పనితనం మొదట్లో బాగానే సాగింది. ఇష్టమైన పని. లాభం కాకపోయినా పెళ్ళిళ్ళకి బోర్డులు మాత్రమే రాసే నేను కొన్నాళ్ళకి ఆ పని కూడా లేకుండా అయిపోయాను. దానికి కారణం ఫ్లెక్సి. గీసిన బొమ్మ కన్నా కంప్యూటర్ బొమ్మ ఆకర్షణీయంగా కనిపించడంతో ఆ పనీ నా చేతి నుండి జారిపోయింది. - మల్లిపురం జగదీశ్ -
ఆ శక్తి ఏమిటో గుర్తించాడు
రెక్కాడితేగాని డొక్కాడని ఒక కూలివాడు ఉండేవాడు. రాళ్లు కొట్టి రోళ్లను తయారు చేసే ఒక ఆసామి దగ్గర ఇతను రోజుకూలి చేస్తుండేవాడు. ఈ పని చేసి చేసి అతడికి విసుగెత్తింది. నా జీవితంలో మార్పు కావాలి అనుకున్నాడు. ఇందుకు తన శక్తి చాలదని ఏ శక్తో తోడు కావాలని తలచాడు. ఏదో ఒక శక్తిని ప్రసన్నం చేసుకుంటే తన జీవితం బాగు పడుతుందని భావించాడు. ఆ ఆలోచన వచ్చిందే తడువు అతను పర్వత శిఖరం మీదకు చేరుకున్నాడు. అక్కడ కొలువై ఉన్న దేవతను తన కోర్కెను తీర్చవలసిందిగా ప్రాధేయపడుతూ పదే పదే చేతులు జోడించసాగాడు. అయితే ఆమె ఎంతకూ బదులివ్వకపోవడంతో మరికాస్తా పెద్ద దేవతను ఆరాధిస్తే బాగుంటుందనుకున్నాడు. ఈ దేవత కన్నా పెద్ద దేవత ఎవరా అని ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తే సూర్యుడు కనిపించాడు. ప్రత్యక్షదైవం సూర్యుడే కాబట్టి సూర్యుణ్ణి ఆరాధిస్తే బాగుంటుందనుకున్నాడు. అంతే! సూర్యారాధన మొదలు పెట్టాడు. పొద్దుగూకులూ అదే ధ్యాస అతనికి. కొండమీది ఫలవృక్షాల నుంచి కొన్ని పండ్లు కోసుకు తిని ఆకలి తీర్చుకోవడం, అక్కడే ఉన్న నీటికుంటలో స్నానం చేయడం, సూర్యుణ్ణి ధ్యానం చేయడం, నిద్ర వస్తే ఏ చెట్టు కిందనో, కొండగుహలోనో పడుకోవడం.... ఇవే అతని నిత్యకృత్యాలు. సూర్యుడు ఏనాటికైనా కరుణిస్తే తన జీవితం మారిపోతుందని ఎదురు చూసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు సూర్యుణ్ణి మేఘాలు కప్పివేయడంతో సూర్యుడు కనిపించకుండా పోయాడు. దాంతో సూర్యుడి కంటే మేఘాలే గొప్పవనుకుని సూర్యారాధన మాని వేసి, మేఘాలను ప్రార్థించసాగాడు. కొద్దికాలంలోనే మేఘాలు పర్వతాలను ఢీకొని అక్కడే అంతమౌతున్నాయి కాబట్టి పర్వతాలే గొప్పవని తోచింది. అందువల్ల పర్వతాలను ప్రార్థించసాగాడు. ఈ క్రమంలో రోజూ తన పలుగు దెబ్బకే పర్వతాలు పగిలిపోతున్నాయి కాబట్టి తానే వాటి కంటే బలం గలవాడినన్న సంగతి స్ఫురణకొచ్చింది. వెంటనే అతని ఆలోచనా విధానం మారింది. అందరికన్నా తానే శక్తిమంతుడినని తోచి తన స్వశక్తినే నమ్ముకోవడం మొదలు పెట్టాడు. చూస్తుండగానే అతను ఎన్నో అద్భుతాలు చేయగలిగాడు. అందరికన్నా గొప్పవాడు కాగలిగాడు. మనిషి శక్తి అతనిలోనే ఉంటుంది. దానిని అతను తనంతట తానైనా గుర్తించగలగాలి లేదంటే ఇతరులెవరైనా గుర్తించి దానిని వెలికి తీయాలి. అప్పుడు అతను తనకు తానే సాటి అవుతాడు. - డి.వి.ఆర్. -
జాతి వైరానికి దూరం..ఆ అమ్మతనం
సాక్షి, గూడెంకొత్తవీధి (పాడేరు) : సృష్టిలో అమ్మతనానికి మించిన దైవం మరొకటి లేదు. అనంతకోటి జీవరాశుల్లో జాతి వైరం సహజం. కుక్కకు కోడికి పడదు. కోడికీ పిల్లికి పడదు. ఇలా ఒక్కో జాతివైరం ప్రకృతి సహజంగా ఉంటుంది. ఇందులో ప్రేమాభిమానాలకు తావుండదు. జీకేవీధి మండలంలో సప్పర్ల గ్రామంలో అబ్బాస్ అనే వ్యక్తి ఇంట్లో మేక పిల్లను పెంచుతున్నాడు. తన ఇంటిలో ఒక శునకం ఉంది. మేకకు రెండు పిల్లలు జన్మించాయి. ఐతే ఇటీవల మేక అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో రెండు మేక పిల్లలు అనాథలయ్యాయి. దీంతో తన ఇంటిలో ఉన్న కుక్క, మేక పిల్లలకు పాలిచ్చింది. మేక పిల్లలు కుక్క పాలు తాగుతున్నాయి. -
కాన్పూర్‌లోని ఓ గోదాంలో అగ్ని ప్రమాదం